http://www.lokahitham.net/2012/01/blog-post_16.html
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని నిద్ర లేచిన వెంటనే త్రాగుట వలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.
రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని నిద్ర లేచిన వెంటనే త్రాగుట వలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.
ప్రాతఃకాలమున జలపానము : నిద్రించే ముందు రాత్రి రాగి పాత్రలో నీటిని సుమారు 800 మీ.లీ. వరకు నిల్వ ఉంచవలయును. ఆ నీటిని మరునాటి ఉదయం నిద్ర లేచిన వెంటనే త్రాగవలయును. ఇటుల చేయుటవలన మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు.
ముక్కు రంధ్రములను నీటిని పీల్చి శుభ్రము చేయుట |
వ్యాయామము : ఆరోగ్య పరిరక్షణకై ప్రతిరోజూ తేలికగా బలము ననుసరించి వ్యాయామం చేయవలయును. శరీరమునకు ఆయాసం కలిగించు పనిని వ్యాయామమందురు. అన్ని ఋతువుల యందును అర్థ బలముగా వ్యాయామం చేయవలయును. అర్థ బలమనగా నోటి ద్వారా వాయువు బయటకు వెడలు అవస్థ. నుదురు, చంకలు, కాళ్ళు, చేతుల యందు చెమట పుట్టిన అర్థబలమని తెలుసుకుని వ్యాయామం ఆపివేయాలి. అంతకంటే ఎక్కువగా వ్యాయామం చేయరాదు. వ్యాయామం నిమిత్తం ఆయా వ్యక్తుల ఆరోగ్యాన్ననుసరించి సూర్యనమస్కారములు, యోగాసనములు, వేగముగా నడచుట లేక ఆటలు ఆడుట మొదలైనవి చేయవచ్చును.
సూర్యనమస్కారములు |
అభ్యంగము : అభ్యంగమనగా శరీరమంతటా తైల మర్దన చేయుట. తైల మర్దన వలన శరీరమునందలి అన్ని అవయవములు చైతన్యవంతమగును. కండరములకు బలము కలుగును. నాడీ మండలము ఉత్తేజితమగును. రక్త ప్రసరణ బాగుగా జరుగును. చర్మకాంతి, సౌందర్యము పెరుగును. శరీరము తేలికగానగును. వాత వ్యాధులను రానివ్వదు. శరీర పటుత్వము పెరిగి పుష్టి, ఆయుష్షు పెరుగును. చక్కటి నిదుర కలిగించును.
ఆరోగ్యమును కోరువారు ప్రతిరోజూ ఉదయం కాలకృత్యముల తరువాత తైలమర్దన చేసుకొనుట మంచిది. చేతుల చివరి నుండి భుజముల వరకు, అటులే కాళ్ళు చివరి నుండి తొడల భాగము వరకు, కీళ్లలో గుండ్రముగా, ఛాతీపై ఎక్కువ వత్తిడి లేక మృదువుగా, వెన్నెముక పైనుండి క్రిందకు మరల క్రింది నుండి పైకి మర్దన క్రియ చేయవలయును. ప్రతిరోజూ కుదరక పోయినచో కనీసం వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాధులు రావు.
- దినచర్య మిగిలిన భాగం వచ్చే సంచికలో..
డా.పి.బి.ఏ.వేంకటాచార్య
డా.పి.బి.ఏ.వేంకటాచార్య