Bramhasri Samavedam Shanmukha Sarma
త్రిలోకాలలో,
త్రికాలాలలో, అవస్థాత్రయంలో, స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయంలో, అకార ఉకార
మకారత్మక ప్రణవంలో, ఋగ్యజుస్సామాత్మక త్రయీ(వేద) విద్యలో, గార్హపత్య
ఆహవనీయ దక్షిణాగ్నులలో, త్రిమూర్తులలో, త్రిశక్తులలో వ్యాపించిన
శివచైతన్యమే శ్రీ బాలా మహా త్రిపుర సుందరీ...
కరడుకట్టిన అఙ్యానమనే భండాసురుని సమ్హరించిన చైతన్య స్వరూపిణి!
భండునితో యుద్ధ సందర్భములో ఆ రాక్షసుని సేనలకు జగదంబ లలితాంబ పలు రూపాలతో ఎదురుకొన్నది!
స్యామ(మంత్రిణి), వారాహి( దండిని) మొదలు అయిన రూపాలతో విశుక్ర, విషంగాది భండ సహచరుల్ని సమ్హరించింది.
ఆ సమయములో భండపుత్రులు విజృభించినప్పుడు, అమ్మవారి హృదయం నుండి బాలా మహా త్రిపుర సుందరిదేవి ఆవిర్భవించింది,ఆ దనుజుల్ని పరిమార్చింది.
అమ్మవారి హృదయంలోని దయ, ఇచ్చా, ఙనాది శక్తులే బాల త్రిపుర సుందరి. ఇది దివ్య స్వరూపం.
శ్రీ కృష్ణోపాసనలో బాలకృష్ణుని ఆరధన ఎలాంటిదో, శ్రీ విద్యోపాసనలో బాలా మహా త్రిపుర సుందరి సమర్చన అటువంటిది.
సర్వ బ్రహ్మాండనాయకి అయిన జగదంబిక మనకు అందుబాటలోకి ఒదిగి వచినట్లుగా బాలా రూపములో అవతరించింది.
అమ్మ హృదయంలోని వాత్సల్యము, కారుణ్యము మూర్తిభవించి బాలంబికగా ప్రభవించినది ఎమొ !
అరుణ కిరణ జాలై రంచితాశవకాశా
విధృత జపపటీకా పుస్తకభీతి హస్తా
ఇతరకరవరాఢ్యా ఫుల్లకల్హార సంస్థా
నివసతు హృది బాల నిత్య కల్యాణ శీలా
ఇది అమ్మ రూప లావణ్యము !
శ్రీ మాత్రే నమః