Monday 28 October 2013

దూర్వాంకుర (గరిక)

భక్తి సమాచారం

దూర్వాంకుర (గరిక)
పూర్వం సంయమినీ పురంలో ఒక మహోత్సవం జరుగుతోంది. ఆ ఉత్స వాన్ని చూడడానికి సర్వదేవతలు, గంధర్వులు అందరూ వచ్చారు. ఆ సభలో తిలోత్తమ నా ట్యం చేస్తోంది. ఇంతలో ఆమె పైట కొంగు జారుతుంది. ఆమె కుచ సౌందర్యాన్ని చూసి యముడు తిలోత్తమను కామించి, సిగ్గును విడిచి ఆమెను కౌగిలించుకోడానికి ప్రయత్ని స్తాడు. ఆ ఫలితంగా సభలో అభాసుపాలవు తాడు. నవ్వులపాలైన యముడు తలవంచు కొని సభ నుండి బయటకు వెళ్ళిపోతున్నప్పు డు అతని రేతస్సు స్ఖలితమై భూమిపై పడు తుంది. స్ఖలితమైన ఆ రేతస్సు నుండి జ్వాలా మాలలతో మండుతోన్న వికృత రూడుడైన పురషుడొకడు జన్మిస్తాడు. అతనికి భయంకర మైన కోరలున్నాయి.

అతడు పెద్ద పెద్ద అరుపు లతో మూడు లోకాలను భయపెట్ట సాగాడు. భూమండలాన్ని దహింపజేస్తూ, వాడి జటలు ఆకాశాన్ని తాకుతూ, వాడి భయంకర అరుపు లతో మూడు లోకాల వారి మనస్సులు భ్రాంతి పడునట్లు చేయసాగాడు. అపుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, అతడ్ని శర ణువేడతారు. విష్ణుమూర్తి వారినందరినీ తీసుకొ ని గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేస్తారు.

శ్లో నమో విఘ్నస్వరూపాయ నమస్తే విఘ్నహారిణే
నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్నమోస్తుతే
శ్లో నమో దేవాయ మహతే నమస్తే జగదారయే నమః కృపానిధే
తుభ్యం జగత్పాలన హేతవే - నమస్తే పూఠ్ణతమసే
శ్లో నమస్తే వేదవిదుషే నమస్తే వేదకారిణే
కిమన్యం శరణం యామః కోమనః స్వాధ్భయాపహః
‘‘విఘ్నస్వరూపుడవు, విఘ్నాలను హరించేవాడవు, సర్వస్వరూపుడవు, సర్వసాక్షి అయిన హే పార్వతీనందనా, నీకివే మా ప్రణామాలు. దేవాది దేవుడవు, జగత్తుకు మూలమైన వాడవు, జగత్తు సవ్యంగా నడపడానికి హేతువైన వాడవు, సంపూర్ణ తమోరూపుడవైన హే గణనాథ! నీకు ఇవే మా వందనాలు. సర్వసంహార కారకుడవు, భక్తవరదుడవు, సర్వదావు, సర్వులకు శరణ్యమైన వాడవు, నీ భుక్తుల సర్వ కోర్కెలను తీర్చేవాడవు అయిన నీకు నమస్కారాలు, వేదవేత్తవు, వేదకర్తవు అయిన నిన్ను వదిలి ఇంకెవర్ని మేము శరణువేడుట? ప్రభూ! మా భయాన్ని నువ్వు తప్ప ఇంకెవరు పోగొట్టగలరు? మా అందరికీ మరణం సమీపిస్తే నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు స్వామీ?’’ అంటూ దేవతలందరూ గణపతిని ప్రార్ధిస్తారు.

అపుడు పద్మం వంటి నేత్రాలతో, కోటి సూర్యుల తేజస్సుతో, మల్లె పువ్వు
ల కంటే తెల్లనైన పలువరుసలతో, శంఖం వంటి కంఠంతో, నానాలంకా
రాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొ ని దేవతలకు దర్శనమిస్తాడు గణపతి. ప్రభువుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. తరువాత జయజయ ధ్వానాలు పలుకుతారు.
‘‘దేవతలారా! అనలాసురుని భయం వల్ల స్వకర్మలను వీడివున్న మిమ్మ ల్ని రక్షించడానికే నేను అవతరించాను. ఆ దుష్ట రాక్షసుడి చూడడంతో టే మీరంతా నన్ను ప్రేరేపించండి. ఆ ఉత్సాహంలో నేనువాడ్ని వధించ గలను’’ అంటూ స్వామివారు దేవతల కభయమిస్తారు.

ఈలోగా అనలాసురుడు దశదిక్కుల్నీ దహింపజేస్తూ భూలోకానికి వచ్చి కోలాహలం సృష్టిస్తాడు. అతని చూడడంతోటే మునులంతా పరు గులు తీస్తూ బాలకుడి రూపంలో నున్న గణపతిని కూడా పారిపొమ్మని లేకపోతే ఆ క్రూర రాక్షసుడు వేధించగలడంటూ అజ్ఞానంతో చెబుతా రు. జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ తత్త్వం పూర్తిగా ఋషులకు కూడా అవగతం కాకపోవడం వల్లనే ఆ క్రూరుడు తమ స్వామినేమైనా చేస్తాడే మోనన్న భయంతో స్వామి వారి పట్ల అతిశయించిన ప్రేమతోను, ఆజ్ఞా నంతోను గణనాథుని పారిపొమ్మని సలహానిస్తారు.

వారి మాటల్ని విన్న గణపతి చలించకుండా హిమాలయ పర్వతంవలె తన శరీరాన్ని పెంచి, అక్కడే నిలబడతాడు. ఋషులు, దేవతలు మాత్రం స్వా మి వారిని వదిలివేసి దూరంగా పారిపోతారు. పర్వతంలా కదలకుండా, అడ్డంగా నిలబడి వున్న బాల గణపతి మీదకు కాలాగ్నిలా మండిపడుతూ అనలాసురుడు వస్తాడు. ఆ సమయంలో పర్వతాల తోను, కారడవులతోను నిండివున్న భూమి వణు కుతుంది. ఆకాశంలో మేఘ గర్జనల వం టి పెద్ద పెద్ద ధ్వనులు ప్రా రంభమవుతా యి. ఆ శబ్దాలకు చెట్లు కొమ్మలపై వున్న పక్షులు నేల కూ లిపోయాతాయి. ఈ హడావుడిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియ డం లేదు. అప్పుడు బాలగణపతి తన యోగమాయాబలంతో అనలాసు రుడ్ని పట్టుకొని మ్రింగి వేస్తాడు.

అనలాసురుడు తన కడుపులోనికి కనుక వెళ్ళితే సమస్త భవనాలు దగ్ధమవుతాయని తలచి స్వామి వారు వాడిని తన కంఠంలోనే నిలుపుకొం టారు. తరువాత తాపాన్ని ఉపశమనం చేయడం కోసం ఇంద్రుడు చంద్రక ళను స్వామి వారికి ప్రసాదిస్తాడు. అప్పటి నుండి స్వామి వారు ఫాలచం ద్రుడయ్యారు. సిద్ధి, బుద్ది అనే మానవ కన్యల్ని సృష్టించి స్వామి వారికి ప్రసాదిస్తాడు. వారిని అలింగనం చేసుకోవడం వలన స్వామి వారి తాపం కొంతవరకు శాంతిస్తుంది. తరువాత విష్ణువు కమలాలను స్వా మి వారికి ప్రసాదిస్తాడు