Thursday 3 October 2013

విఘ్నోయం కాలః - కాలమే విఘ్నం (ఉపనిషద్వాక్యం)

విఘ్నోయం కాలః - కాలమే విఘ్నం (ఉపనిషద్వాక్యం) 

Bramhasri Samavedam Shanmukha Sarma

అనుకూలతను కలిగించే కాలరూప ఈశ్వర చైతన్యమే విఘ్నేశ్వరుడు. మంచి పనులకు విఘ్నాలను తొలగించి,


 చెడు పనులకు విఘ్నాలను కలిగించే విఘ్న నియామకుడు 'వి-నాయకుడు'. అనుకున్నదానికి విఘ్నం 

ఏర్పడినప్పుడు, తాత్కాలికంగా 'అయ్యో' అనిపించినా, అటుపై కొన్నాళ్ళకు ఆ విఘ్నం మేలుకే జరిగిందని 

తెలియవచ్చు. ఒకనికి అనుకోని విఘ్నమేర్పడి ఎక్కవలసిన బస్సో, ట్రెయినో, విమానమో తప్పిపోవచ్చు. 

రువాత ఆ వాహనానికి ప్రమాదం జరిగిందని వార్త తెలిస్తే, ఆ వాహనాన్ని ఎక్కకుండా ఆపిన విఘ్నం 

వరమయ్యిందని అర్థమవుతుంది. అలా అశుభానికి విఘ్నం కలిగించి, శుభాలకు విఘ్నాలను తొలగించే స్వామి 

వినాయక ప్రభువు.


మహాగణపతి నవరాత్రుల పర్వం చేస్తాం. నవసంఖ్య పూర్ణత్వ సంకేతం గనుక, ఒక దేవతాశక్తిని పూర్ణంగా 


గ్రహించేందుకే ఈ తొమ్మిదినాళ్ళ ఉత్సవాలు

.
వినాయకునిగా, గణపతిగా, ఏకదంతునిగా, వక్రదంతునిగా పలు నామాలతో పూజలందే గజాననుడు ఆబాల 


గోపాలానికీ ఆదరపాత్రుడు. విఘ్న సంహారానికి అవతరించిన పరబ్రహ్మయే గణపతి. సృష్టికి పూర్వమే బ్రహ్మకు 

విఘ్నాలను తొలగించింది. ఆ ప్రణవ తేజమే, అటు తరువాత పార్వతీ పరమేశ్వరుల పుత్రునిగా ఆవిర్భవించింది

.
శివ శక్తుల సమైక్య తత్త్వం, ప్రకృతీ పురుషుల ఏకత్వం, వినాయక మూర్తిలో ద్యోతకం. శరీరం తల్లి 


సమకూర్చినది, 

గజ శిరస్సు తండ్రి అమర్చినది. ఇలా ఈ రెండింటి కూర్పు శివశక్త్యాత్మకతత్త్వం. నర శరీరం జగత్తుకు సంకేతం, 

గజ శిరస్సు పరమేశ్వర తేజస్సుకు ప్రతీక.


"కంఠోర్ధ్వంతు పరబ్రహ్మా-కంఠాధస్తు జగన్మయః!



ఈశ్వర జ్ఞానం (శిరస్సు)తో, నడిచే జగం..ఈ రెండూ కలసిన విశ్వరూపమే వినాయక స్వరూపం. "ప్రణవ స్వరూప





వక్రతుండం వాతాపి గణపతిం' అని ముత్తుస్వామి దీక్షితుల కృతి. విశ్వమే అనేక గణాలతో కూడిన మహాగణం.


 విశ్వనాయకుడే మహాగణపతి. మన శరీరంలో కూడా ఇంద్రియ గణాలు, ఉపగణాలు, గుణగణాలు ఎన్ని ఉన్నా-

అంతా కలిపి ఒకే 'నేను' అనే ఆత్మచైతన్యం ఉంది. ఇది అందరిలో వ్యాపించిన అంతర్యామి తత్త్వమే. ఈ తత్త్వమే 

మన భిన్న ఇంద్రియాలకు 'నేను' అనే ఐక్యతనిచ్చి ఆపాదమస్తకమూ ప్రకాశిస్తోంది. ఇదే 'పతి'.


ఇలా గణపతి ఆరాధనలో ఎన్నెన్నో తాత్త్విక మర్మాలు దాగి ఉన్నాయి. బీజం మొలకెత్తి ఫలం లభించే దాకా అన్ని


 విఘ్నాలను తొలగించే అనుగ్రహ స్వరూపుడు గణనాధుడు. అన్ని గణాలను శాసించే వాడు కనుక, ఈయనను 

ఆరాధించే వారికి అన్నిటా అనుకూలమే.