Tuesday 15 October 2013

8 రకాల వివాహాలు భారతీయ సంప్రదాయాలలో ఉన్నాయి

8 రకాల వివాహాలు భారతీయ సంప్రదాయాలలో ఉన్నాయి......

1.బ్రహ్మ వివాహం : వేదం చదివి, సదాచారము కలిగిన సచ్ఛీలవంతునికి వస్త్ర భూషనాదులచేత అలంకరించి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు.

2.దైవ వివాహం : జ్యోతిష్టోమాదియజ్ఞాలను చెసే సందర్భములో,ఆక్రతు విధానాన్ని చేయించిన ఋత్విజుని (యజ్ఞంలో రుత్విక్‌‌కు) అలంకరించి తమ కన్యనిచ్చి కన్యాదానం చేయుటను దైవ వివాహము అని చెపుతారు.

3.అర్ష (అర్షం) వివాహం : గోమిధునాన్ని(రెండు గోవులను) వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెపుతారు.

4.ప్రాజాపత్య వివాహం : గృహస్థాశ్రమాన్ని విడవననీ, సంతానాన్ని పొందుతాని వరునిచేత ప్రమాణము చేయించి (మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని) వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.

5.అసుర వివాహం : వరుడు (జ్ఞానులు) .... కన్యకు , కన్యకు సంబంధిన పెద్దలకు , ఆమె తల్లిదండ్రులకు , శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా పేర్కొంటారు.

6.గాంధర్వ వివాహం : వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా పెద్దల ప్రమేయము లేకుండా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెపుతారు.

7.రాక్షస వివాహం : బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి కన్య తల్లిదంద్రులు , బంధువుల అంగీకారము లేకుండా వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటున్నారు.

8.పైశాచ వివాహం : నిద్రిస్తున్న లేదా మత్తులో ఉన్నఆత్మరక్షణచేసుకోలేని స్త్రీని తల్లిదండ్రులకు గాని బంధువులకు కాని తెలియకుండా.. రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే దాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు.