Brahmasri Chaganti Koteswara RAO
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః
జిహ్వాగ్రే మిత్ర బాన్ధవాః
జిహ్వాగ్రే బన్దన ప్రాప్తిః
జిహ్వాగ్రే మరణం ధ్రువం
జిహ్వా అంటే నాలుక. అగ్రే అంటే కొన. నాలుక కొనయందే మన మాటలు ఉంటాయి.
అసలు మాటలు అంటే పదాలతో సమకూరుతాయి ....అవి అక్షర స్వరూపాలు...వాగ్దేవతలు..వాటిని ఎన్నడు తప్పుగా వినియోగించకుడదు.
మంచి మాటలు వలన సంపదలు సమకూరుతు ఉంటాయి.
స్నేహితులు ఏర్పడుతు ఉంటారు.
బంధువులు దగ్గర అవుతు ఉంటారు. చేడు మాటల వలన ఇవన్ని దూరము అవుతు ఉంటాయి.
కష్టాలు కలుగుతాయి. చెడు మాటలు వలన చెడు జరుగుతుంది.
కనుక సర్వత్రా, సర్వదా మంచి మాటలు మాట్లాడటానికి మాత్రమే నాలుకను ఉపయోగించాలి.
మిత్రలాభంలో లఘుపతనకం అనే కాకి మంచి మాటలతో హిరణ్యకుడు అనే ఎలుకను మిత్రునిగా చెసుకుంది. ధర్మ రాజు మంచితనం తో, వినయముగా మాట్లడి, సూర్యుడిని ప్రార్థించి అక్షయ పాత్రను సంపాదించాడు. అర్జునుడు కృష్ణుడుని ప్రార్థించి రథ సారధిగా చేసుకుని విజయం పొందాడు. శిశుపాలుడు కృష్ణుని దూషించి మరణం తెచ్చుకున్నాడు...ఇంకా ఇలాగ ఎన్నో ఉధాహరణలు!
మనకి దెవుడు ఈ మాట్లదే శక్తిని ప్రసాదించింది..నాలుగు మంచి మాటలు పలకమని....
ఎప్పుడు మంచి మాత్రమే పలికే ప్రయత్నముతో, గురువులు చెప్పే వాక్యములు విని ఆచరణలో పెట్టదానికి ప్రయత్నిద్దాము !