Tuesday 22 November 2011

వృక్షో రక్షతి రక్షితః .


                     వృక్షో రక్షతి రక్షితః .

పద్మమహాపురానం ఇరువైఎడవ అధ్యాయములో  అగస్త్య మహా ముని  అంపశయ్యపైనున్న భీష్మునితో వృక్ష స్తాపనవిధి గురించి తెలిపినారు.నేటి కాలం లో  పెరుగుతున్న కాలుష్య నివారణకు, వాస్తు దోష నివారణకు,

జాతకం లోని  గ్రహ దోష నివారణకు  వృక్ష స్థాపన అద్భుతమైనది.

రుద్రం లో కుడా  నమో వ్రుక్షేభ్యో ..వ్రుక్షపతిభ్యస్చ ఓనమో నమో అని స్తుతి వున్నది.

లలిత సహస్రనామాలలో కదంబ ,,దాడిమీ అనగా దానిమ్మ ,ఇత్యాది వృక్షాల ప్రస్తావన వున్నది అంటే  వృక్షాల ప్రాశస్త్యం  ఎంత గొప్పది.  శనీశ్వర సహస్రనామాలలో  శమిపత్రప్రియాయైనమః అని శమి  వృక్ష ప్రస్తావన వుండి. వనదుర్గ వుపాసన  ప్రాశస్త్యం గురించి  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుకదా!

దశపుత్ర సమం వృక్షం అని ఆర్యోక్తి . విషయం పూర్తి నిడివి టైపు చేయలేక వ్రాయలేకపోతున్నాను.అయతే ఒక చిన్న మనవి.....---ఎక్కడైనా  పెద్ద పెద్ద దేవాలయములలో  దేవతావ్రుక్షాలైన  మారేడు,,రావి,,మామిడి,,జమ్మి,,తులసి,,శ్వేతార్క,,కదంబ,,ఇత్యాది వృక్షాలను నాటండి.



ఏదైనా ఒక మంచిపని చేసినా చెడ్డపని చేసినా అందు చత్వారి సమభాగినః..నలుగురికి నాలుగు భాగాలు వుంటై.మొక్క నాటిన వారికీ ,,నాటమని చెప్పినవారికి,, సహాయం చేసినవారికి ,, ఆమోదించి మొక్క ని పెంచినవారికి అందరూ ఒక మంచి వృక్షస్తాపన యగ్జ్నం చేసినట్లు.తదుపరి పొస్ట్ లో మరిన్ని విషయాలు తెలిపి ప్రయత్నం చేస్తాను.


గురువు చెప్పినది చేయండి.గురువుగారు చేసినది చేయకండి.


కలౌ పంచవర్ష సహస్రాణి  అపన్డితా సు పూజితః ...సు పండితా న పూజితః  జాయతే వర్ణ సంకరహ..

పై వాక్యం చిన్నపుడు ఎవరో పెద్దవారు చెపుతుంటే విన్నాను.ఈ వాళ రోజులలో  మని మైండ్స్ అయ్యి మహామంత్రాలు , బీజాక్షర ప్రయోగాలూ పుస్తక పరిగ్జానం తో అందరూ చేస్తున్నారు. కాని ఇది ఏ మాత్రం సరి అయినది కాదు.పండితులు చెప్పే సత్య ప్రవచనాలు చేదుగా వున్నా ఆరోగ్యకరమైనవి.

అపన్డితులు చెప్పే ప్రవచనాలు తియ్యాగావున్న అనారోగ్యం కలిగిస్తాయి

నిన్న ఒకరు ఖడ్గమాల చేస్తున్నాము అని ఫోన్ చేసారు ...శ్రీ విద్యోపాసన లో వున్నతమైన దేవతల వుపాసనకి ముందు వెనుక చాలా మెట్లు వున్నై. ఇష్టం వచ్చినట్లు అన్ని మంత్రాలు చేయగుఉడదు.. ఈ మంత్రం చేస్తున్న వారిని నేను ఎవరు చేయమన్నారని అడిగాను  . ఒక గురువుగారు తిట్టి    మరి చేయవద్దు అన్నారుట.

కానీ ఎవరో  మొబైల్ సర్వీసెస్ పురోహితులు  చేయమన్నరుట.



నేను చేయవద్దు అనే చెప్పాను.

.మంత్ర భాగం లో పురానోక్తం , వేదోక్తం అని రెండు రకములు వున్నై.

వేదోక్త  పూజలన్ని యగ్జ్నోపవితం అధికారం కల్గి నిత్య సంధ్యావందనం చేయు బ్రామ్హన, వైశ్యులకు మిగిలినవారికి పురానోక్త విధాన పూజలు.

అయినా కలౌ ద్విజేతర ధన్యః అని వ్యాసుల వారు చెప్పినట్లుగా  ద్విజులకు కృతయుగ ధర్మాలు. మిగిలినవారికి తేలికైన ధర్మాలు.కాబట్టి బ్రాహ్మణులే చేయాలా మనం చేయకూడదా  అనే వితండం వద్దు.స్తోత్రములు ,,నామ జపం కలియుగం లో గొప్పవి. నామజప సుప్రితాయైనామః అని లలితా సహస్రనామములలో  వున్నది.శరీరంలోని డేభైరెండు వేల నాడులను నవరందాల గుండా   మంత్ర శక్తి ద్వారా వుద్దిపనం చెందించి చైతన్య పరిచి నామజపం ద్వారా తరించవచ్చు.

ఒక్కొక్క అక్షరం పలకటం ద్వారా శరీరంలోని ఒక్కొక్కనాడి కదులుతుంది ,తద్వారా శరీరం జాగ్రుతమవుతుంది.కాబట్టి మన తెలుగు లిపి లోని అక్షరాలని అక్షరమాత్రుకలు అన్నారు.  చిన్న విత్తనం లో ఒక పెద్ద  మర్రి చెట్టు దాగి వున్నట్లుగా  ఒక బీజాక్షరం లో అనత శక్తి దాగివుంది. శక్తి ని  భరించే వుపాధి వుండాలి.అది కేవలం ఒక్క గురువు ద్వారా మాత్రమే సంప్రాప్తిస్తుంది.కాబట్టి గురువు చెప్పినది మాత్రమే చేయండి. సొంత తెలివితేటలు వద్దు. ఒకసారి శంకరభగవత్పాదులు బాగా దాహం వేసి కల్లుతాగారుట,,,,అది చూసి శిష్యులు  మహదానందంగా కల్లు తాగుతున్నరుట.వెంటనే శంకరభగవత్పాదులు గ్రహించి  నాయనలారా నాకు ఇంకా దాహం తీరలేదు  అంటూ దగ్గరలో ని ఒక కొలిమిలోని మరుగుతున్న సీసం తాగారుట . వెంటనే శిష్యులు  భగవత్పాదుల కాలామిదపడి  క్షమాపణ అడిగి తమ అజ్ఞానానికి సిగ్గుపద్దరుత. కాబట్టి గురువు చెప్పినది చేయండి.గురువుగారు చేసినది చేయకండి.


Thursday 17 November 2011

panchavati

SIGNIFICANCE :

[ 'PANCHA' - Five, 'VATI' - Trees]
This combination of trees was mentioned in "The Ramayana". When Rama along with Sita and Lakshmana took on to the 14 years of 'Vanavasa', halt a night at Muni Bharadwaja Ashram. Then he advised Rama to find a place where all these five trees exist together to make a place to live. So as per his suggestion they later make a 'Parnashala' amidst these trees. So where ever all these five exist together, Rama too resides there.
BENEFITS :

Breeze from these trees -Gives out more oxygen.
-Very Cool
-All have medicinal values
-Brings good health
Powerful vibrations -Wards off evil forces
-Gives right way of thinking
-Clarity of thought
Fruit bearing -So naturally attracts many birds and other insects
PLANTS :
S.No.Botanical name
Common name
1.Ficus bengalensisBanyan
2.Ficus religiosaPeepal
3.Ficus glomerataFig
4.Aegle marmelosBilva
5.Emblica officionalisAmla


1. Ficus bengalensis - Vata / Marri / Banyan
Tree Leaves with Figs
2. Ficus relegiosa : Ashwatha / Raavi / Peepal
LeavesFruit
3. Ficus racemosa : Oudumbara / Medi / Cluster Fig
Trunk with figRipe Figs
4. Saraca asoka : Sita asoka
TreeFlower
5.Aegle marmelos : Bilva / Maredu
LeavesFruit

Wednesday 16 November 2011

ఇంగ్లీషు అక్షరాల ద్వారా సంఖ్యను తెలుసుకునే విధానం:1 2 3 4 5 6 7 8
A B C D E U O F
I K G M H V Z P
J R L T N W
Q S X

పైన తెలిపిన అక్షరాలను పరిశీలించి వాటికి సంబంధించిన సంఖ్యలను వేసి కూడగా 2+1+4+1+5=13 వాటిని మరలా కూడగా 1+3= 4... అంటే నాలుగో సంఖ్యవారు అవుతారన్నమాట.
ఇదే విధంగా... R O H I N I... ( 2 7 5 1 5 1)
2+7+5+1+5+1= 21= 2+1= 3... అంటే మూడవ సంఖ్యవారు అవుతారు.

నక్షత్రాలను బట్టి సంఖ్యను కనుగొనటం:
మన నక్షత్రాలు 27. అంటే 2+7= 9. ఎవరైనా ఈ 27 నక్షత్రాల యందు మాత్రమే జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి కొన్ని అక్షరములు కలవు. కాబట్టి ప్రతి మానవుడు ఏదో ఒక నక్షత్రానికి సంబంధించినవారై ఉంటారు. ఉదాహరణకు: రామారావు అనే పేరుగలవారి మొదటి అక్షరము 'రా'. అంటే... పేరు యందు మొదటి అక్షరాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ 'రా' అనే అక్షరము చిత్తా నక్షత్రానికి సంబంధించినది. అంటే ఈ పేరు గలవారు చిత్తా నక్షత్రముగలవారై ఉంటారు. అశ్వనీ నక్షత్రము మొదలు చిత్తా నక్షత్రము 14వది అవుతుంది. అంటే... వీరు 1+4= 5వ సంఖ్యవారు అవుతారు.

మరో ఉదాహరణ: ఏసుపాదం అనే పేరుగలవారు కృత్తిక నక్షత్రంవారై ఉంటారు. కృత్తిక నందు 'ఏ' అనే అక్షరం ఉండటం వల్ల, ఆ నక్షత్రం మూడవ స్థానంలో ఉన్నది కావున వారు 3వ సంఖ్యవారై ఉంటారు. ఇలాగే వారములను బట్టి కూడా మనం ఏ సంఖ్యవారో గ్రహించవచ్చు. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం... రవి అంటే ఆదివారం(1), చంద్రునికి సోమవారం(2), కుజునికి మంగళవారం (9); బుధునికి బుధవారం (5); గురునికి గురువారం (3); శుక్రునికి శుక్రవారం (6); శనికి శనివారం (8); సంఖ్యలు వస్తాయి. కేతువు ఛాయా గ్రహాలు కనుక రవికి 4వ సంఖ్య (అంటే రాహువు) అదనంగానూ వచ్చుచున్నారు. మొత్తం 9 సంఖ్యలు, 9 గ్రహాలు, 7 వారాలకు 9 సంఖ్యలు ఇవ్వబడింది.

ఎవ్వరికైనా పుట్టిన వారం తెలిసినచో... ఆ వారం చూసుకుని, ఆ సంఖ్యవారుగా చూసుకోవచ్చు. ఉదా: సోమవారం జననం అనుకోండి... చంద్రుడు అధిపతి 2వ సంఖ్యవారుగానూ, శుక్రవారం జననం అయినచో 6వ సంఖ్యవారుగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం బాగా పరీక్షించినట్లయితే ఒకటవ సంఖ్య గలవారు 4వ సంఖ్య గలవారిపై ఇష్టం, ప్రేమగలవారుగా ఉంటారు. అలాగే 2వ సంఖ్యవారు 7వ సంఖ్యవారిపై ఆదరాభిమానాలు అధికంగా ఉండగలవు.


దత్తాత్రేయఃవజ్రకవచమ్

అథ వజ్రకవచమ్

ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః | భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః ||

కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః | జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ ||
నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః | జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః ||
కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ | సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ ||
స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః | జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః ||
కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః | యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః ||
పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః | హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః ||
డకారాదిఫకారాంత దశారసరసీరుహే | నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు ||
వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ | కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు ||
బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః | జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు ||
సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు | వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః ||
మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ | పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః ||
జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః | సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః ||
చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు | మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు ||
అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ | శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః ||
మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు | కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః ||
బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ | గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు ||
భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ | ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః ||
సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః | పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ ||
ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః | యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ ||
వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు | కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః ||
ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః | రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః ||

Tuesday 15 November 2011


పెరటి చెట్లు ......వాటిలో ఔషధవిలువలు

తులసి
తులసి ఆకులు, బీజాలు, వేర్లను మందుగా వాడుకోవచ్చు తులసితో స్వరసం (జ్యూస్), చూర్ణం, కషాయాలు తయారుచేస్తారు మనకు సాధారణంగా కృష్ణతులసి, శ్వేతతులసి రకాలు లభిస్తాయి ఆకలి పుట్టడానికి, ఆహారం జీర్ణం కావడానికి, విరేచనం సాఫీగా అవటానికి ఉపయోగపడుతుంది దగ్గుని పోగొడుతుంది క్రిమిహరం, దుర్గంధనాశకం కఫాన్ని హరిస్తుంది మూత్రం సాఫీగా అవుతుంది ఎలర్జీలను, చర్మరోగాలను తగ్గిస్తుంది జ్వరాలను తగ్గిస్తుంది, నివారిస్తుంది.

మారేడు

మారేడుకు ‘శ్రీఫలం’ అనే పేరు కూడా ఉంది. దీని వేరు, బెరడు, ఆకులను మందుగా వాడతారు దీని ఆకుల స్వరసం సేవిస్తే ఆకలి పుట్టి, జీర్ణక్రియ బాగుపడుతుంది ఎక్కడైనా దెబ్బలు తగిలి రక్తస్రావం జరుగుతుంటే వెంటనే దాన్ని అరికడుతుంది దీనివేరు, బెరడులను కషాయంలా కాచుకుని వాడుకోవచ్చు శరీరం మీద ఎక్కడైనా వాచినట్టు ఉంటే వాటిని పోగొట్టే లక్షణం మారేడులో ఉంది జ్వరాలను తగ్గిస్తుంది అలసిపోయినప్పుడు ఈ ఫలాన్ని సేవిస్తే తక్షణమే శక్తి వస్తుంది జిగట విరేచనాల (డిసెంట్రీ) ను తగ్గిస్తుంది బాగా పండిన పండుతో లేహ్యం, పానకం (షర్బత్) తయారుచేస్తారు.

ఉసిరిక (ఆమలకీ)

షడ్రసాలలోనూ లవణరసం (ఉప్పు) మినహా మిగిలిన ఐదురసాలూ (మధుర, అమ్ల, తిక్త, కటు, కషాయ) ఉసిరికలో ఉంటాయి చ్యవనప్రాశ లేహ్యంలో ఇది ప్రధాన ద్రవ్యం ఇది ముసలితనాన్ని (వార్థక్యాన్ని) దూరం చేసి, శరీర సౌష్ఠవాన్ని పదిలపరుస్తుంది. జీవనకాలాన్ని పెంచుతుంది వయసుతో సంబంధం లేకుండా ప్రతివారు రోజుకి ఒక ఉసిరికాయను జీవితాంతం తింటే పైప్రయోజనాలను స్వంతం చేసుకున్నట్లే ఆకలిని పెంచుతుంది. దప్పికను పోగొడుతుంది. రక్తాన్ని పెంచుతుంది కామలాహరం (జాండిస్‌ను తగ్గిస్తుంది) ధీశక్తిని, మానసికశక్తిని పెంచుతుంది కడుపులోని పురుగుల్ని నాశనం చేస్తుంది మూలవ్యాధిని పోగొడుతుంది రక్తపిత్తం (రక్తం కారటం, హెమరేజ్) అనే వికారాన్ని తగ్గిస్తుంది కడుపులోని అల్సర్లు, వాయువు, వాంతి, మూర్ఛ, ఎక్కిళ్లు, గొంతుబొంగురుపోవడం - ఈ సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది జ్వరహరం. ప్రమేహరోగాల్ని పోగొడుతుంది కామశక్తిని, శుక్రవృద్ధిని పెంచుతుంది దీన్ని గుజ్జుతో తింటే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది పిక్కతీసిన ఉసిరికాయ ముక్కల్ని ఎండబెట్టి, పొడిచేసి (ఆమలకీ చూర్ణం) కూడా వాడుకోవచ్చు. కార్తీక మాసంలో ఉసిరికాయల పంట మొదలవుతుంది. పక్వమైన ఆమలకీ ఫలాల్లో మాత్రమే ఔషధవిలువలు ఉంటాయి. (హైబ్రీడురకం అంత మంచిది కాదు).

మామిడి (ఆమ్ర)

పిందె... కషాయరసం (వగరు), కాయ... ఆమ్లరసం (పులుపు), పండు... మధురరసం (తీపి) దీని బెరడు, ఆకులు, పువ్వులను... కషాయంలా కాచి తాగితే కఫం తగ్గుతుంది. గొంతులో మంటను పోగొడుతుంది. విరేచనాలు తగ్గుతాయి చక్కగా పక్వమైన పండు హృద్యం, వృష్యం(శుక్రవర్థకం). చర్మకాంతికరం, బల్యం, వాతహరం మృదువిరేచనం మామిడి ఒరుగులు (ఎండబెట్టి తయారుచేస్తారు) మలబంధాన్ని పోగొడతాయి మామిడితాండ్ర (ఆమ్రావర్తం) రుచిని కలిగిస్తుంది. దప్పికను (తృష్ణ), వాంతులను తగ్గిస్తుంది. పుష్టికరం జీడి (ఆమ్రబీజం) ని ఎండబెట్టి పొడిచేసి సేవిస్తే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట (అమ్లపిత్తము) తగ్గుతాయి. స్త్రీలలో తెల్లబట్ట (శ్వేతప్రదర) వికారం పోతుంది ఆమ్రపల్లవం (లేతమామిడిచిగురు) కషాయం సేవిస్తే స్వరభంగం, వమనం, అతిసారం తగ్గుతాయి ఆమ్రపత్రాల (పెద్ద లేక లేత ఆకులు) కు సూక్ష్మాంగక్రిములను ఆకర్షించి, నశింపచేసే గుణం ఉంది. పూర్తిగా పక్వం కాని పండు వల్ల అజీర్ణం, మలబంధం వంటి వికారాలు కలుగుతాయి.


 

*చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, గొంతునొప్పి పోవాలంటే పావుస్పూను మిరియాలపొడిని తేనెతో కలిపి వారం రోజులు తీసుకోవాలి.
*వేడి నీటిలో పసుపుపొడి వేసుకుని ఆవిరిపడితే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.
*శరీరంలో వేడి చేయడం వల్ల వచ్చే జలుబు పోవాలంటే కొబ్బరి నీరు తాగాలి.

*అలాగే పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ వేసుకుని తినడం వల్ల దగ్గు తగ్గుతుంది.
*తేనెలో అల్లం కలుపుకుని రోజుకు మూడు, నాలుగు సార్లు తింటే దగ్గు మాయమవుతుంది.
*వేడి నీటిలో అల్లం ముక్కలు ఉడకపెట్టి కొద్దిగా చక్కెర వేసుకుని వడకట్టుకుని వేడిగా తాగితే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది

Saturday 12 November 2011

Thursday 10 November 2011

సత్యం వద | ధర్మం చర | సత్యాన్న ప్రమదితవ్యమ్ |
ధర్మాన్న ప్రమదితవ్యమ్ | కుశలాన్న ప్రమదితవ్యమ్ |
భూత్యై న ప్రమదితవ్యమ్ | స్వాధ్యాయప్రవచనాభ్యాం న ప్రమదితవ్యమ్ |
దేవ పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యమ్ |
మాతృదేవో భవ | పితృదేవో భవ | అతిథిదేవో భవ | ఆచార్యదేవో భవ |
- శీక్షావల్లి, తైత్తిరీయ ఉపనిషద్
- కృష్ణ యజుర్వేదః

Always speak the truth and follow the dharma (righteousness). Hold on to truth and dharma. Hold on to welfare activities. Acquire wealth legitimately. Hold on to self-study and teaching. Hold on to the worship and rituals of God, parents and ancestors. Look upon your Mother, Father, Teacher and Guest as living Gods.
- excerpt from Sheeksha Valli, Taittiriya Upanishad
- by Krishna Yajur Veda

  • నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
    అండనే బంటు నిద్ర - అదియు నొకటే |
    మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
    చండాలుడుండేటి సరిభూమి యొకటే ||
    బ్రహ్మ మొకటే పర బ్రహ్మ మొకటే ||
    - అన్నమయ్య కీర్తన: తందనానా అహి
    - అన్నమయ్య
     
    The sleep that a king gets is one and the same as that a servent gets. The floor or the earth that a learned scholar steps on is one and the same as that a person from lower caste steps on. The consciousness in everyone is one and the same and there is only one divine consciousness.
    - excerpt from Annamayya Keerthana - Tandanana Ahi (in Telugu)
    - by Annamayya





  • నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
    ఙ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే |
    జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||
    - దక్షిణామూర్థి స్తోత్రం
    - ఆది శంకరాచార్య

    Like the light emanating from a lamp, kept in a pot with many holes, goes out in all directions, similarly the wisdom in the person goes out through the openings in the body, such as mouth, ears, eyes, etc. And when that person realizes that 'I know myself', this whole universe shines after Him alone, who shines in the consciousness as the knower. Salutation to the God facing the south, who is the greatest teacher.
    - excerpt from Dakshina Murthy Stotram
    - by Adi Shankaracharya




  • న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
    న మంత్రో న తీర్ధం న వేదా న యఙ్ఞః |
    అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
    చిదానంద రూపః శివోహం శివోహమ్ ||
    - నిర్వాణ షట్కం
    - ఆది శంకరాచార్య




  • శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
    సర్వఙ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ |
    స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత
    శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే ||

    Oh Lord of maha Lakshmi! You are an ocean of mercy. You pervade all universes. You are the witness to all things happenings and You are aware of everything. You are omnipotent. You are the ultimate and residual entity of everything. You come to the rescue of those, who call out to You in their states of utter helplessness. You serve as the boon-granting PaarijAthA tree to those, who surrender themselves at Your sacred feet.
    - excerpt from Sree Venkateswara Prapatti
    - by Prathivadhi Bayankaram Anna Vedanthachari