Friday 25 October 2013

మహా శివునుకి "త్రిపురాంతక" అని పేరు ఎలా వచ్చింది?

Brahmasri Chaganti Koteswara Rao Garu.


మహా శివునుకి "త్రిపురాంతక" అని పేరు ఎలా వచ్చింది?
.......................................................................
రాక్షస జాతికి చెందిన తారకాక్ష, విద్యున్మలి,కమలాక్ష ముగ్గురు రాక్షసులు బ్రహ్మ దేవుని కోసం ఘోర తపస్సు చేసి, వరాలు పొందుతారు.
ఆ వరాలు ఫలితంగా ఒకొక్క రాక్షసుడు ఒకొక్క లోహాలలో దాగి ఉంటారు.
తారకాక్ష బంగారములోని, విద్యున్మలి వెండి లోని, కమలాక్ష సీసము లోని ప్రవేశించి మానవులని, దేవతలని భయబ్రాంతులని చేస్తూ, విద్వాంసం సృష్టిస్తారు.
దేవతలు అందరూ మహా శివునికి తమ ఆవేదలని వ్యక్తం చేస్తూ, శరణం కోరుతారు . ఆ ముగ్గురి రాక్షసులని అంత మొందించడానికి పరమ శివుడికి దేవతలందరూ సహాయాన్ని అందిస్తారు.
1) మేరు పర్వతం మరియు ఓంకారములు "బాణము" గా మారతాయి.
2)భూమి మరియు ఇతర దేవతలు "రధము" గా మారతారు.
3)నాలుగు వేదాలు "నాలుగు గుర్రాలు"గా మారుతాయి.
4)బ్రహ్మ రధ సారిధి గా తన సేవలు అందిస్తారు.
5) వాసుకి సర్పము విల్లుకి తాడుగా మారుతుంది.
6)మహా విష్ణువు బాణముగా(Arrow ) గా మారుతారు.
7) సూర్యుడు, చంద్రుడు రధ చక్రములుగా(wheels ) మారుతారు.
వీరి అందరి సహాయముతో పరమ శివుడు ముగ్గురు రాక్షసులని సంహరించడం వలన "త్రిపురాంతక" అని పేరు వచ్చింది.