Saturday 7 January 2012

 కేయురాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వల

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా

వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
...
క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం!!

పురుషులకు (వ్యక్తులకు) అలంకారమును లేక శోభ నిచ్చేవి భుజ బంధనములు, చంద్రుని వలె ప్రకాశించు హారములు, పరిశుద్ధుని చేసే స్నానములు, సుగంధపు పూతలు, పువ్వులు, తలపై నుండు కేశ సంపద కావు. ఇటువంటి అలంకారాలు ఎప్పటికైనా మలినమవుతాయి. కాని ఎల్లప్పుడూ సంస్కారవంతమును ఇచ్చే పలుకు/మాట, అది ఒక్కటైనా చాలు అదే వారికి మంచి ఆభరణం

Monday 2 January 2012

ఇతిహాసమంటే

ఇతిహాసమంటే
ధర్మార్ధ కామ మోక్షాణాముపదేశ సమన్వితం
పూర్వావృత్త కథాయుక్త మితిహాసం ప్రచక్ష్యతే
ధర్మార్ధకామమోక్షములు అనే చతుర్విధ పురుషార్ధములు, ఉపదేశములు, పూర్వవృత్తాంత కథలు తో కూడినది ఇతిహాసము.


http://www.sgspanchangam.in/