Tuesday, 15 October 2013

ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?
ఒకరోజు కొంతమంది మునులు కొందరు కలిసి కోరికలని జయించాలి ( అంటే నాశనంచేయాలని) అని ఒక యజ్ఞం చేయాలనీ నిశ్చయించారు! యజ్ఞం మొదలు పెడుతుంటే ఒక మహనీయుడు అక్కడికి వచ్చి స్వామి మీ అందరుకలిసి ఏదో యజ్ఞం చేస్తున్నట్టువున్నారు.. ఏమా యజ్ఞం? అని అడిగాడు! దానికి మునీశ్వరులు మేము కోరికని జయించాలని యజ్ఞం తలపెట్టాం అని చెప్పేసరికి, అతను పక పక నవ్వాడు.. అది చూసి మునీశ్వరులు ఎంటా నవ్వు? ఎవరు నువ్వు? అని నిలదీశారు! మీరు ఎవరిని జయించాలని అనుకుంటున్నారో ఆ కోరికని నేనే!
ఓరి పిచ్చి మానవుల్లారా! ఎలా జయిస్తారు? కావాలి అనేది నేనే, వద్దు అనేది నేనే! అవును అనేది నేనే, కాదు అనేది నేనే! జయించేది నేనే, ఓడించేది నేనే! మీరు ఏమి చేయాలన్నా నేనే, కూడదు అన్నా నేనే! మీరు తినాలనుకున్న, పడుకోవలనుకున్నా! అంతెందుకు కోరికని జయించాలి అనుకోవడం కుడా కోరికే! కాబట్టి కోరికని చంపాలనుకోవడం కాదు! కోరికని అదుపులో పెట్టండి! ఇంద్రియ నిగ్రహం పాటించండి, జిహ్వాచాపల్యం అదుపులో ఉంచుకోండి! అన్ని కోరికలు అదుపులోకి వస్తాయి!
ఒక చెడ్డవాడిని అదుపుచేయాలంటే వాడిని చంపనవసరంలేదు! వాడి చుట్టూ ఉన్న స్నేహితులని పరిస్తితుల్ని విడతీయండి! ఒంటరివాడైపోతాడు ! అప్పుడు మీ అదుపులోకి వస్తాడు! ఇది తెలివైనవాళ్ళ పని! అంతే కాని కనపడిన వాటిని అన్ని కావాలని కోరుకుంటే వచ్చేది సంతోషం కాదు దుఖం, సర్వనాశనం! కాబట్టి కోరికని అదుపుచేస్తే సంతోషం వద్దు వద్దు అన్నా వస్తుంది!