Monday 30 September 2013

దేవీ నవరాత్రులు( 5-10-13 నుండి 13-10-13 వరకు)

భక్తి సమాచారం
దేవీ నవరాత్రులు( 5-10-13 నుండి 13-10-13 వరకు)

శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే

అమ్మవారి అలంకరణలు….

1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి – శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి

2వ రోజు – ఆశ్వయుజ విదియ – శ్రీ బాలా త్రిపురసుందరీదేవి

3వ రోజు – ఆశ్వయుజ తదియ – శ్రీ గాయత్రి దేవి

4వ రోజు – ఆశ్వయుజ చవితి – శ్రీ అన్నపూర్ణా దేవి

5వ రోజు – ఆశ్వయుజ పంచమి – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి

6వ రోజు – ఆశ్వయుజ షష్టి – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి

7వ రోజు – ఆశ్వయుజ సప్తమి – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి

8వ రోజు – ఆశ్వయుజ అష్టమి – శ్రీ దుర్గా దేవి – దుర్గాష్టమి

9వ రోజు – ఆశ్వయుజ మహానవమి – శ్రీ మహిషాసురమర్దిని – మహార్నవమి

10వ రోజు – ఆశ్వయుజ దసమి – శ్రీ రాజరాజేశ్వరి – విజయదశిమి

http://rajachandraphotos.blogspot.in/2013/03/meenakshi-amman-temple-madurai.html

Friday 27 September 2013

సాయంసంధ్య

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు
మాములుగా అందరు రోజు అంటే రాత్రి పగలు కలిపి ఒకరోజు అనుకుంటారు. కాని పగలు రాత్రి కానీ సమయం ఒకటి వుంది. అదే సాయంసంధ్య. ఇది 4-6 మధ్య కాలం. రెండు గంటల సమయం. దీనికి పగలు రాత్రికి సంబంధం లేదు.

మానవుడి జీవితం 100ఏళ్ళు అనుకుంటారు అందరు. కాని 100 ఏళ్ళలో ప్రతి నిత్యం ఈ రెండు గంటలు కూడా చేరిస్తే ఎంత వస్తుందో అదే అసలు వయస్సు అని మహాభారతం శాంతి, అనుశాసనిక పర్వాలలో తెలియచేయబడింది. అంటే రోజులో 22 గంటలు ఒకరోజు 2 గంటలు ఇంకో భాగం.. 2 X 12 = 24గంటలు. ఇంచుమించుగా 90ఏళ్ళు మాత్రమే కలియుగంలో మానవుడి అసలు వయస్సు అని శాస్త్రం చెపుతుంది. ఇది పంచమవేదం. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం ఈ నాలుగు వేదాల సారం మహాభారతం.
ఇలాంటి ఎన్నో మనకి తెలియని విషయాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం మహాభారతం లాంటి పంచామవేదాన్ని చదవండి. 4 వేదాల సారం దాదాపు 80% ఈ ఒక్క గ్రంధంలో ఉంది.

Thursday 26 September 2013

జ్యోతిష పరంగా దీని సంకేతం ఏమిటంటే కుంభ రాశి సృష్టి యొక్క పుట్టుక స్థానం. ఏమీ లేనట్లు కనిపిస్తూ అన్నీ ఉన్న పరాతత్త్వం నిక్షిప్తముగా కుంభ రాశి నుండి వెలువడి సృష్టి ఆవిర్భావం జరిగిందని వేదము తెలిసిన పెద్దలు చెప్తారు. అది దివ్యత్వమునకు ప్రతీక. సృష్టి మొదట అంతటా జలములే ఉన్నవి వాని నుండి బ్రహ్మ ఉద్భవించి ఆయన నుండి సకల దేవతలూ సమస్త సృష్టి విచ్చుకున్నది / దిగివచ్చినది . అటువంటి శుభ పరిణామాలు జరగాలి అని కుంభంలో కలశ జలములను ఉంచి దేవతా ఆహ్వానము చేసి దానిని స్వాగతముగా చెప్తారు. కుంభ రాశికి ఎదురుగా ఉండేది సింహ రాశి, కాబట్టి స్వాగతం పొందుతున్న వారు సింహంవంటి వారు అని చెప్పకనే చెప్పినట్లు. ఇంకొక ఆంతర్యం - దేవతలే స్వాగతము చెప్పాలంటే వచ్చేవారు నడిచే బ్రహ్మమే అయి వుండాలి. అందుకే పైన వేరొక సోదరులు చెప్పినట్లుగా, ఇది సామాన్యులకు ఇవ్వరు, బ్రహ్మవిదులైన మహాత్ములకు తప్ప. ఇంకొక అర్థం ఏమిటంటే - మీ ద్వారా ఇంత శుభంకరమైన విషయము (బ్రహ్మ గారు చేసిన సృష్టి వంటిది) సకల శ్రేయోదాయకముగా భావములు, మాటలు, పనుల యందు ఇక్కడ ఆవిష్కరింపబడుగాక అని అట్టి స్వాగతమునకు భావము. అట్టి స్వాగతము పొందుతున్న వారు కూడా తదేక దృష్టితో బ్రహ్మమునే సర్వత్ర దర్శనము చేస్తూ ఉండటం చేత వారి ద్వారా కూడా ఆ బ్రహ్మమే వ్యక్తమై అక్కడి వారికి శ్రేయస్సు జరుగుతుంది. ఇది వేదసాంప్రదాయము !
జ్యోతిష పరంగా దీని సంకేతం ఏమిటంటే కుంభ రాశి సృష్టి యొక్క పుట్టుక స్థానం. ఏమీ లేనట్లు కనిపిస్తూ అన్నీ ఉన్న పరాతత్త్వం నిక్షిప్తముగా కుంభ రాశి నుండి వెలువడి సృష్టి ఆవిర్భావం జరిగిందని వేదము తెలిసిన పెద్దలు చెప్తారు. అది దివ్యత్వమునకు ప్రతీక. సృష్టి మొదట అంతటా జలములే ఉన్నవి వాని నుండి బ్రహ్మ ఉద్భవించి ఆయన నుండి సకల దేవతలూ సమస్త సృష్టి విచ్చుకున్నది / దిగివచ్చినది . అటువంటి శుభ పరిణామాలు జరగాలి అని కుంభంలో కలశ జలములను ఉంచి దేవతా ఆహ్వానము చేసి దానిని స్వాగతముగా చెప్తారు. కుంభ రాశికి ఎదురుగా ఉండేది సింహ రాశి, కాబట్టి స్వాగతం పొందుతున్న వారు సింహంవంటి వారు అని చెప్పకనే చెప్పినట్లు. ఇంకొక ఆంతర్యం - దేవతలే స్వాగతము చెప్పాలంటే వచ్చేవారు నడిచే బ్రహ్మమే అయి వుండాలి. అందుకే పైన వేరొక సోదరులు చెప్పినట్లుగా, ఇది సామాన్యులకు ఇవ్వరు, బ్రహ్మవిదులైన మహాత్ములకు తప్ప. ఇంకొక అర్థం ఏమిటంటే - మీ ద్వారా ఇంత శుభంకరమైన విషయము (బ్రహ్మ గారు చేసిన సృష్టి వంటిది) సకల శ్రేయోదాయకముగా భావములు, మాటలు, పనుల యందు ఇక్కడ ఆవిష్కరింపబడుగాక అని అట్టి స్వాగతమునకు భావము. అట్టి స్వాగతము పొందుతున్న వారు కూడా తదేక దృష్టితో బ్రహ్మమునే సర్వత్ర దర్శనము చేస్తూ ఉండటం చేత వారి ద్వారా కూడా ఆ బ్రహ్మమే వ్యక్తమై అక్కడి వారికి శ్రేయస్సు జరుగుతుంది. ఇది వేదసాంప్రదాయము !

Monday 23 September 2013

శుక్లాం భరదరం- తెల్లని వస్త్రములతో
విష్ణుం - అంతటా వ్యాపించిన వాడై
శశివర్ణం - చంద్రుని వంటి ప్రకాశం కలవాడై
చతుర్భుజం - నాలుగు భుజములు(చేతులు) కలవాడై
ప్రసన్న వదనం - ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని
ధ్యాయేత్ - ధ్యానించుచున్నాము
ఆగజానన పద్మార్హం- నాయకత్వం లేని మాకు
గజానన మహర్నిశం - నాయకుడివై మమ్ములను నడిపించు
అనేకదం తం బక్తానమ్- కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో
ఏకదంతం ఉపాస్మహే- ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము

Thursday 19 September 2013

మహాలయ పక్ష ప్రా||


Brahmasri Chaganti Koteswara Rao Garu. 
  • తేది 20/9/2013: మహాలయ పక్ష ప్రా||

    భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. ఈ పక్షం రోజులు అనగా రేపటి నుంచి నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ ఈ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.

    ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఈ మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

    కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే | యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితౄణాం తన్మహాలయం ||151||
    బ్రాహ్మణేభ్యో విశిష్టేభ్యోయాచేతధనధాన్యకం | పతితే భ్యోనగృహ్ణీయాత్‌ ధనధాన్యంకదాచన ||152||
    బ్రాహ్మణేభ్యోనలభ్యేత యదిధాన్యధనాదికం | యాచేతక్షత్రియ శ్రేష్ఠాత్‌ మహాలయ చికీర్షయా ||153||
    దాతారశ్చేన్నభూపాలావైశ్యేభ్యో೭పిచయాచయేత్‌ | వైశ్యా అపిహిదాతారోయదిలోకే న నంతివై ||154||
    దద్యాద్ఛాద్రవదేమాసే గోగ్రాసరిపతృత్నప్తయే | అథవారోదనం కుర్యాత్‌ బహిర్నగ్గత్యకాననే ||155||
    పాణిభ్యాముదరం స్వీయం ఆహత్యాశ్రూణివర్తయన్‌ | తేష్వరణ్యప్రదేశేషు ఉచ్చైరేవంవదేన్నరః ||156||
    శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ | అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్‌ || 157 ||
    ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః | కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై || 158 ||
    భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే | అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం || 159 ||
    క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః | దరిద్రోరోదనం కుర్యాత్‌ ఏవంకాననభూమిషు || 160 ||
    తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః | హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః || 161 ||
    మహాలయార్ధేవిప్రౌఘే భుక్తేతృప్తిర్యథా భవేత్‌ | గోగ్రాసారణ్యరుదితైః పితృతృప్తిస్తథా భవేత్‌ || 162 ||

    మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి (151) ధనదాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడుకూడా పతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. (158) భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. (159) మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాన, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)

    --- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..


యజ్ఞోపవీతము నందు 9 పోగులేమిటి?

యజ్ఞోపవీతము తొమ్మిది పోగుల్లో తొమ్మిది దేవతలు ఉంటారు. బ్రహ్మ , అగ్ని, అనంతుడు, చంద్రుడు, పిత్రు దేవతలు, ప్రజా పతి
వాయువు, సూర్యుడు , సర్వ దేవతలు నివశిస్తారు.

రేపటి నుండి మహాలయా పక్షాలు.సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 4 దాకా

Jaji Sarma
రేపటి నుండి మహాలయా పక్షాలు.సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 4 దాకా

వీలుగా ఉంటే ఇవి పాటించండి. వీలుపడకపోతే ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, " నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి' అని మనస్సులో ప్రార్ధన చేయండి. ఇది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శాస్త్ర ప్రకారం ఇచ్చిన ప్రత్యామ్నాయ విధి.

శక్తి గలవారు ఈ విషయాలు గమనించి మహాలయా పక్షమున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించేదారు గాక! ఈ విషయాలు వివిధ పత్రికలలో నుండి సేకరించినవి.

ఈ పక్షం పితృపక్షం
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

తండ్రి జీవించి, తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షంలో వచ్చే నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లీతండ్రీ ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలని ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడా చేయలేనివారు హిరణ్యశ్రాద్ధం చేయాలి. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృఋణం తీర్చుకునేందుకు అవకాశం ఇదే!

దీనికి సంబంధించినఐతిహ్యం ఉంది
దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.

స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ‘‘కర్ణా! నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు గానీ, కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’’అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. చిత్రం! ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆర్తి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు.

మహాలయ అమావాస్య: ఈ పక్షంలో చివరి రోజైన నేడు ఇంతకు ముందు చెప్పినట్లు ఈపక్షమంతా అన్నిరోజులు లేదా పితృదేవతలు మరణించిన తిథినాడు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధవిధులను నిర్వర్తించడానికి కుదరనివారు కనీసం ఈ ఒక్కరోజయినా చేయడం విధాయకమని శాస్త్రగ్రంథాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ 20నుంచి ప్రారంభమైన మహాలయ పక్షం వచ్చేనెల అంటే అక్టోబర్ 4న మహాలయ అమావాస్యతో ముగుస్తోంది. ఈలోగా ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్నసంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం, ఇప్పటి వరకు ఆ అలవాటు లేనివారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు దక్షిణ తాంబూలాదులతో విప్రులకు స్వయంపాకం సమర్పించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతోకాలంగా తీరని కోరికలు తప్పక నెరవేరతాయని పురాణోక్తి.

ఎప్పుడో మరణించిన పితృదేవతలకు తర్పణలు వదలడం, వారి పేరుమీద అన్నదానాలు నిర్వర్తించడం కొందరికి చాదస్తంగా తోచవచ్చు. లౌకికంగా ఆలోచిద్దాం. ఈలోకంలో అన్నార్తులు ఎందరో ఉన్నారు. వారిని పిలిచి, చనిపోయిన మన పెద్దల పేరు మీద పట్టెడన్నం పెట్టామనుకోండి, వారికి ఆకలి బాధ తీరుతుంది. మనకి కూడా కనీసం ఒకరి కడుపు నింపామన్న తృప్తి మిగులుతుంది. అందుకే గతించిన పెద్దలను తలచుకుని వారి పేరిట అన్నదానం చేస్తే వారికి కడుపు, మనకు మనసు నిండుతాయి.

భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు. అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. పక్షం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ పితృ దేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్ర వచనం.

ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృ దేవతలు ఏ తిథినాడు మృతి చెందారో అదే తిథినాడు శ్రాద్ధం నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ఈ పదిహేను రోజులూ నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి.

మాతాపితృ వర్జితులైన వారు ఈ పక్షంలో తప్పక పితృ కర్మలు చేయాలి. ప్రతీ సంవత్సరం చేసే శ్రాద్ధ్దం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం. పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడా అన్న శ్రాద్ధం చేయలేనివారు హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఏమీ చేయలేనివారు పితృ దేవతలనుద్దేశించి కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రం చెప్తోంది.

ఉత్తరాయణం దేవతల కాలం గనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృకాలం గనుక అశుభమని పూర్వీకుల విశ్వాసం. అంతేకాక ఆషాఢంలో వచ్చే కర్కోటక సంక్రమణ నుంచే ప్రారంభమయ్యే దక్షిణాయనం వానలు, బురద, చిమ్మచీకటితో భయంకరమవుతుంది. అశుభమనిపిస్తే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అందులో భాద్రపద మాసమంతా జలమయంగా కనిపిస్తుంది. ఇదే ఒక మహా వినాశనం అనుకోవడంలో ఆశ్చర్యం అంతకంటే లేదు. కావున ఈ పక్షంలో అందరికీ శ్రాద్ధ తర్పణములు చేయాలని శ్రాద్ధాలతో వారిని సంతృప్తి పరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు. అంతేకాక ఆషాఢం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితురులు చాలా కష్టపడుతుంటారు. కాబట్టి మహాలయ పక్షంలో ప్రతిరోజూ శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టారు.

పితురులను తృప్తి పరచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఇది. స్వర్గుస్తులైన మాతాపితురుల కోసం ప్రతీవారు ఈ పక్షాలలో పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు.భాద్రపద పూర్ణిమతో అరంభమైన పితృపక్షం, మహాలయ పక్షమం ఆమాసపు అమావాస్యతో ముగుస్తుంది. పితృదేవతల పూజకు ఉద్దిష్టమైనది. సాధారణ శ్రాద్ధదినం వ్యక్తులకు సంబంధించింది. రోమను జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృదేవతల పూజకు నిర్దిష్టమై ఉండేది. ఆనాడు వారు రోమునగరం దగ్గర గల కొండలలో ఒక కొండ మీద పెద్ద గొయ్యి తవ్వేవారు. తండ్రులు భూమి క్రింద వుంటారని వారి నమ్మిక. కావుననే గోతుల్లో బలి అన్నం వుంచే ఆచారం వారు అవలంబించారు. వివాహాలు కానీ, వ్యాపారం కానీ చేయడానికి అది అశుభ రోజని వారి నమ్మకం. మనలో కూడా ఈ రోజుల్లో శుభ కార్యాలు జరపరు. మన శాస్త్రాల్లో ఒక్క ఏడాదిలో చేయవలసినవి తొంభై ఆరు శ్రాద్ధాలని చెప్ప బడింది. ఆ తొంభైఆరు శ్రాద్ధాల్లోనూ ఈ పితృపక్షం ముఖ్యం. శ్రాద్ధదినం రోజు కర్మ చేసేవాడు శ్రాద్ధం పూర్తి అయ్యే వరకు ఉపవసిస్తాడు.
తండ్రి బ్రతికి వుండగా తల్లిని కోలుపోయినవాడు భాద్రపద కృష్ణ పక్ష నవమినాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఇది చేయడానికి సుమారు ఒక గంట సమయం పడుతుంది. ఆ సందర్భంలో మూడు పిండాలు దానం చేయబడతాయి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసేవాని పితామహికి. ఒకవేళ ఆమె సజీవురాలై వుంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి.
తండ్రికి చేసే శ్రాద్ధ కర్మ భూమి మీద ధావళి పరుచుకుంటారు. దాని మీద దక్షిణ ముఖంగా కూర్చుంటారు. పట్టుగుడ్డపోచ ఉత్తరీయంగా చేసుకుంటాడు. అది ఒక అంగుళం వెడల్పూ, యజ్ఞోపవీతమంత పొడుగూ ఉంటుంది. యజమానికి దగ్గరగా పురోహితుడు కూర్చుంటాడు. పురోహితుడు యజమానికి దర్భ ఇస్తాడు. దానిని యజమాని తన వెంట్రుకకు ముడివేసుకుంటాడు. కూర్చుండే ధావళీ మీద ఒక దర్భను ఉంచుకుంటాడు. దర్భతో చేసిన ఉంగరం తన అనామికకు పెట్టుకుంటాడు. దర్భతో చేసిన ఆ ఉంగరమే యజ్ఞోపవీతానికి ఒకటి, పైన చెప్పిన ఉత్తరీయానికి ఒకటి కట్టుకుంటాడు. తరువాత పురోహితుడు శ్రాద్ధ కర్మ ప్రారంభిస్తాడు. యజమానికి ఎదురుగా అయిదు అరిటి ఆకులు పరుస్తాడు. రాగి డబ్బు, దర్భ పుల్ల, ఇతర వస్తువులు వుంచుతాడు. ఐదు విస్తళ్లనూ ఆఘ్రాణించడానికి ఐదు గురు పితృదేవుళ్లు వస్తారు. మొదట వచ్చేవాడు యజమాని తండ్రి, అతని తాత, ముత్తాతలు, తల్లి పూర్వీకులకు ఒక ఆకు ఇట్లే ఇతర ఆకులు. మూడు విస్తళ్లు కూడా వేస్తారు. అందులో ఒకటి విష్ణుపాదమనేది విష్ణువు కొరకు. మిగతారెండూ విశ్వదేవుల కొరకు. ఆరోజు వంటకాల్లో 'ఖిర్‌పూరీ' అనే వంట ప్రధానమైనది. దర్భగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే పైన చెప్పిన ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్దపిండాలు. ఈ పిండాల పక్కని చిన్న పిండాలు. మరికొన్ని ధర్మపిండాలు.
వీటిని అన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీద మంత్ర పుష్పాంజలి. ఆ సమయంలో ఇంటిలొ అందరూ మగవారూ, ఆడవారూ పితృదేవుల గౌరవార్థం అంజలి బద్ధులై తలలు వంచుకుని మంత్ర పుష్పాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత అగ్ని ఆరాధన. రాగిబిందెలో అగ్నిని వుంచి పూజిస్తారు. తరువాత నైవేద్యం తీసుకుని వెళ్లి ఇంటికి వెలుపల ఆరు బైట కాకి తినడం కోసం నేలమీద వేస్తారు.
కాకి ఈ నైవేద్యాన్ని ఎంత తొందరగా ముట్టుకుంటే పితృదేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారన్న మాట. ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన తమ వంశీకుణ్ణి పితృదేవతలు శపిస్తారట. అవిసెచెట్టు ఆకులు పువ్వులే కాకుండా, తామరాకులు, తామర పువ్వులు, నల్ల నవ్వులు, యవల(బార్లీ) ఈ కర్మలో ఉపయోగిస్తారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధకర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రలు భావిస్తారు. ఈ రోజు యథావిధిగా శ్రాద్ధకర్మ చేయడానికి వీలుకాని వారు తర్పణం వదలడంతో తృప్తిపడతారు. తర్పణానికి పిండాలు అవసరం లేదు. తిలాంజలితో సరి.
మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది.
శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.
మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.
‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’ నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.
మహాలయము అనగా గొప్ప వినాశనము లేక చావు అని అర్థము. భాద్రపద కృష్ణ పక్షంలో హిందువులు తమతమ పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. అన్ని వర్ణముల వారు తిలతర్పణం చేస్తారు. ఈ పక్షమునందు ఇది వరకు తిల తర్పణములచే పూజింపకుండినట్టు పితృదేవతలకు తర్పణము చేయవలెనని భవిష్యత్పురాణంలో ఉంది. దేవతా పూజలతో పాటూ పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం భాద్రపద మాసం. ఈ మాసంలోని శుక్ల పక్షం దేవతా పూజలకు కృష్ణపక్షం పితృదేవతలకు ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలోని కృష్ణపక్షానికి ‘పితృపక్షం’ లేక మహాలయ పక్షం అని అంటారు. పితృదేవతలకు అత్యంత ఇష్టమైన ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్దవిధులను నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం మంచిది. అందువల్ల గయలో శ్రాద్ధకర్మలను చేసిన ఫలం కలుగుతుంది.
శాస్త్ర విధి ప్రకారం మనిషి పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. సమస్త ప్రాణులకై కొంత అన్నం కేటాయించడం భూతయజ్ఞం. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఇవ్వడం మనుష్య యజ్ఞం. పితురులకు తర్పణం ఇచ్చే శ్రాద్ధకర్మే పితృయజ్ఞం. హోమాదులు దేవయజ్ఞం సమాజానికి మార్గదర్శనం చేయటం అధ్యాపన బ్రహ్మయజ్ఞం. ఈ ఐదు మహాయజ్ఞాలో పితృయజ్ఞానికే విశేష స్థానం ఉంది. సాధారణంగా శ్రాద్ధం అంటే ఆబ్దికాలు చేయడం. సాధారణం శ్రాద్ధ దినం ఆయా మరణించిన వ్యక్తులకు సంబంధించినది. కాగా మహాలయ పక్షం సామూహిక పితృపూజలను చేయడానికి ఉద్దేశించబడినది. ఒకవేళ రోజూ వీలుకాకపోతే తమ పితృదేవతలు ఏ దినం మృతిచెందారో, మహాలయపక్షంలోని ఆ తిథినాడు శ్రాద్ధకర్మలను చేయాలి. ఈ రోజున శ్రాద్ధకర్మలు చేయడానికి వీలుపడని వ్యక్తులు తర్పణం వదలడం తృప్తి పడుతుంటారు. పితృదేవతల రుణంనుండి విముక్తి లభించడం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం చేసే త్యాగం విలువకట్టలేనిది. అందుచేత పితృదేవతల శ్రాద్ధకర్మ మానవ ధర్మంగా అవసరం. పితృపక్షాల్లో వారిని స్మరించి, ఆరాధించటం మన సంప్రదాయం, దీనివల్ల సుఖ సమృద్ధి, సంతోషం కలుగుతాయి. తమ పితురుల తిథి సరిగా తెలియకపోతే వారి పేరుమీద అమావాస్యరోజున తర్పణం వదలాలి. భాద్రపద బహుళ పాడ్యమినుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది.
మహాలయనాడు అన్నదానం చేస్తే తండ్రి ముత్తాతలకే కాక వారి సంరక్షకులైన శ్రీ మహావిష్ణువులకుకూడా చేరుతాయి. ఈ మహాలయ పక్షానికి ఒక విశేషత ఉంది. వారి వారి జ్ఞాత, బంధువులందరికీ అర్ఘ్యాదులు పిండోదకాలు సమర్పిస్తారు. మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞ్ఫలం దక్కుతుంది. స్వర్గస్తులైన మాతా పితురులకోసం ప్రతివారూ మహాలయ పక్షంలో విదించబడ్డ విధి కర్మలను ఆచరించి తద్వారా శ్రేయస్సు పొందుతారు. ప్రతియేడూ చేసే శ్రాద్ధకం కన్నా ఈ మహాలయ పక్షాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. కనీసం చివరిరోజైనా మహాలయ అమావాస్య రోజైన శ్రాద్ధం పెట్టాలి. ఆ ఒక్కరోజుకూడా అన్నశ్రాద్ధం పెట్టకపోతే హిరణ్యశ్రాద్ధం చేయాలి.
‘హేమాద్రి’ అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి చేయలేని నిష్ట దరిద్రుడు, ఒక పెద్ద ఆరణ్యంలోకి వెళ్లి, ముళ్ల కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలెనని చెప్తాడు. మహాలయ పక్షంలోని చివరి తిథి అయినా ‘అమావాస్య’ నాడైనా పితృతర్పణాదులు విడుచుట మంచిది. ఈ మహాలయ పక్షంలోని శ్రాద్ధకర్మను గురించి స్కాంద పురాణంలోని నాగరఖండలోనూ, మహాభారతంలోనూ వివరించబడింది.

Wednesday 18 September 2013

శ్రీలక్ష్మీ ప్రాప్త్యార్థ గణేశస్తుతి

శ్రీలక్ష్మీ ప్రాప్త్యార్థ గణేశస్తుతి
ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే !
దుష్టదారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే !!
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోప శోభితమ్ !
అర్థచన్ద్రధరం దేవం విఘ్న వ్యూహ
వినాశనమ్ !!
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రః హేరంబాయ
నమో నమః
సర్వసిద్ధి ప్రదో సిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవః
చిన్తితార్థ ప్రదస్త్వం సతతం మోదక ప్రియః
సిన్దూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయకః
ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్న
ముచ్యతి !!
ముద్గల పురాణోక్త
గణేశన్యాసం
దక్షిణ హస్తే వక్రతుండాయ నమః
వామహస్తే శూర్ప కర్ణాయ నమః
ఓష్ఠే విఘ్నేశాయ నమః
సంపుటే గజాననాయ నమః
దక్షిణ పాదే లంబోదరాయ నమః
వామపాదే ఏకదంతాయ నమః
చిబుకే బ్రాహ్మణస్పతయే నమః
దక్షిణ నాసికాయాం వినాయకాయ నమః
వామనాసికాయాం జ్యేష్ఠరాజయ నమః
దక్షిణ నేత్రే కపిలాయ నమః
వామనేత్రే కపిలాయ నమః
దక్షిణ కర్ణే ధరణీ ధరాయ నమః
వామకర్ణే ఆశాపూరకాయ నమః
నాభే మహూదరాయ నమః
హృదయే ధూమ్రకేతవే నమః
లలాటే మయూరేశాయ నమః
దక్షిణ బాహౌ స్వానన్ద వాస కారకాయ నమః
వామబహౌ సచ్చిత సుఖధామ్నే నమః

Friday 13 September 2013

వినాయక చవితి : పాల తాళికలు ఎలా చేయాలి?

హిందూ హిందుత్వం


వినాయక చవితి : పాల తాళికలు ఎలా చేయాలి?

వినాయకుని పాలతాళికలు ఉండ్రాళ్ళు అంటే
ప్రీతికరం. పండ్లు, తీపి పదార్థాలనే
విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెడతారు. అలాంటి వాటిలో
పాల తాళికలు కూడా వున్నాయి. మరి పాల
తాళికలు ఎలా చేయాలో చూద్దామా..
కావాల్సిన పదార్థాలు :
బియ్యం పిండి : ఒకటిన్నర కప్పు,
చక్కెర : రెండు కప్పులు,
పాలు : అరలీటర్,
జీడిపప్పు, ఎండుద్రాక్ష : 50 గ్రాములు
యాలకుల పొడి : రెండు చెంచాలు,
పచ్చి కొబ్బరి తురుము : కప్పు
నెయ్యి : ఐదు చెంచాలు.
తయారీ విధానం : ముందుగా వెడల్పాటి పాన్లో
కప్పు నీళ్ళు మరిగించాలి. అందులో పిండి
గట్టిపడకుండా కలిపాలి. కిందకు దించేసి చల్లారిన
తరువాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని
సన్నని నూడుల్స్ మాదిరిగా చేసుకోవాలి. ఇలా
అన్నింటిని చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
(వీటినే తాళికలు అంటారు).
మరో గిన్నెలో పాలు మరగించాలి. ఇందులో పిండితో
చేసుకున్న తాళికలను ఉడికించాలి. బాణలిలో నెయ్యి
కరిగించి అందులో ఎండుద్రాక్ష,
జీడిపప్పు పలుకులను వేయించి పాలల్లో వేయాలి.
కొబ్బరి తరుము, చక్కెర, యాలకుల పొడి వేయాలి. బాగా
కలిపిన తరువాత దింపేయాలి. అంతే పాల తాళికలు రెడీ..

శ్రీ మహా గణపతిని ప్రతిరోజూ గరిక పత్రంతో పూజ చేస్తే..!?

హిందూ హిందుత్వం


శ్రీ మహా గణపతిని ప్రతిరోజూ గరిక పత్రంతో
పూజ చేస్తే..!?
గణపతికి ప్రతిరోజూ గరికతో పూజ
చేసుకుంటూ వస్తే శనైశ్చరుని వలన కలిగే
ఈతిబాధలు, సమస్యల నుంచి బయటపడతారు.
శనిభగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే
ఏలినాటి శని, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి. గరిక
పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత
బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న
పనులు త్వరగా అనుకూలమవుతాయి.
గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే
మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది.
దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య
ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి
గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల
కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. గరికతో చేసిన
అంజనాన్ని ప్రతిరోజూ ధరిస్తే అన్ని
పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే
దేహంలోని సమస్త వ్యాధులు నయం అవుతాయి.

వినాయకుని అలంకారాలు, నామాలు ఏంటో తెలుసా?

హిందూ హిందుత్వం
వినాయకుని అలంకారాలు, నామాలు ఏంటో
తెలుసా?

వినాయకుని అలంకారాలు..
* స్వర్ణాభరణాలంకృత గణపతి
* విశ్వరూప గణపతి
* సింధూరాలంకృత గణపతి
* హరిద్రా (పసుపు) గణపతి
* రక్తవర్ణ గణపతి
* పుష్పాలంకృత గణపతి
* చందనాలంకృత గణపతి
* రజతాలంకృత గణపతి
* భస్మాలంకృత గణపతి
* మూల గణపతి.
గణపతి నవరాత్రుల్లో ఈ వరసని పాటిస్తారు.
వినాయకుని నామాలు...
1. తెలుగు భారతం ప్రకారం : హేరంబ, గణనాయక,
గణేశ
2. పద్మపురాణం ప్రకారం : ద్వైమాతుర, లంబోదర,
గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి
3. వేదాల ప్రకారం : బ్రహ్మణస్పతి, కవి,
జ్యేష్ఠరాజు, కవీనాం కవి.
4. సంగీత శాస్త్రం ప్రకారం : పిళ్ళారి, శ్రీ గణనాథ,
కరివదన, లకుమికర (లక్ష్మీకరుజడు),
అంబాసుత, సిద్ధి వినాయక.
5. పూజప్రకారం : సుముఖ, ఏకదంత, గణకర్ణిక,
వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష,
పాలచంద్ర, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ,
స్కందపూర్వజ (లంబోదర, వక్రతుండ, కపిల,
హేరంబ అనేవి కూడా ఉన్నా ఇవి పద్మ పురాణం,
తెలుగు భారతం అనే వాటిలో ఉన్నాయి).

Thursday 12 September 2013

Hello there!!...

Are you planning to get rid of some extra fats from your body?...

Here are 10 Foods That Burn Fat

1. Oats : Its not only tastes great but also reduces your hunger. Oats contains fiber which helps and stabilizes the levels of cholesterol.

2. Eggs : Eggs are the rich sources of proteins and low in calories. Eggs helps us to build the muscles and develops the good cholesterol.

3. Apples : Apples are enriched with powerful antioxidants and other supplements. Most importantly it contains Pectin which helps to reduce the fat cells in the body.

4. Green Chillies : Green chillies contains Capsaicin which helps to develop the body growth cells and burns the calories in quick time.

5. Garlic : Garlic contains Allicin which has anti-bacterial properties helps us to reduce the fat and removes the bad cholesterol.

6. Honey : Honey is the best one to burn fat. Add honey in warm water and take it daily in the early morning.

7. Green Tea : Green Tea is the most effective one which helps you to lose weight. It contains Antioxidants which helps and stabilizes our body weight.Take daily 2 cups of tea for a better results.

8. Wheat Grass : It boosts our metabolism and helps to reduce the fat.

9. Tomatoes : Tomatoes helps us to burn the fat in quick time. It also helps us to stay away from cancer. So Take tomatoes in your diet regularly.

10. Dark Chocolate : Dark chocolate contains Flavonoids, anti-inflammatory properties which helps to reduce the cholesterol levels in the blood. It boost the growth of serotonin in the blood and also burns the fat.

Like Useful info for more pics
Follow us on twitter : https://twitter.com/usefulinfo4u

Tuesday 10 September 2013

సప్తఋషి ధ్యాన శ్లోకములు :

Brahmasri Chaganti Koteswara Rao Garu.
సప్తఋషి ధ్యాన శ్లోకములు :

కశ్యప ఋషి : కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః||

అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||
ఓం అనసూయా సహిత అత్రయేనమః||

భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||
ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః||

విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||
ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః||

గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||
ఓం అహల్యా సహిత గౌతమాయనమః||

జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్| దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి : శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్| బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః||

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||

సప్తఋషిభ్యో నమః

ఋషి పంచమి (9/10/2013 Tuesday)

Brahmasri Chaganti Koteswara Rao Garu.
ఋషి పంచమి (9/10/2013 Tuesday)

భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

ఆ మర్నాటి షష్ఠిని సూర్యషష్ఠిగా వ్యవహరిస్తారు. ఆరోజున సూర్యుని ఆరాధిస్తే మంచిదని నమ్మిక. అష్టమినాడు కొన్ని ప్రాంతాల స్త్రీలు కేదారవ్రతం చేస్తారు. ఇక దశమినాడు విష్ణుభక్తులు దశావతార వ్రతం ఆచరిస్తారు. నారాయణుడు వామనుడిగా అవతరించిన దినం భాద్రపద శుద్ధ ద్వాదశి. ఆరోజున శ్రవణా నక్షత్రం కూడా వస్తే మరింత ప్రశస్తం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఈరోజున పాలకడలిపై మహాలక్ష్మీసమేతుడై శేష తల్పశాయిగా కొలువైన శ్రీమహావిష్ణువును పూజించడం ఆచారం. తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలిగి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Sunday 8 September 2013

బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఎలా నాశనం చేశారు?

Hindu Nava Nirman Samithi

బ్రిటీష్ వాళ్ళు భారతీయ విద్యా వ్యవస్థను, భారతీయ సమాజాన్ని ఎలా నాశనం చేశారు?

( స్వర్గీయ రాజీవ్ దీక్షిత్(Social activist, Bharat Swabhiman Andolan) ఉపన్యాసం నుండి అనువాదం )

భారతీయ సంస్కృతిని నాశనం చేయుటకు మెకౌలే అనే వ్యక్తిని భారతదేశానికి పంపించారు. మెకౌలే భారతదేశానికి వచ్చిన తరువాత ఒక సర్వే నిర్వహించాడు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే భారతదేశ సంస్కృతి, విద్యా వ్యవస్థ ఇక్కడ ఉండే గురుకుల పాఠశాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారతదేశంలో ఉండే పాఠశాలలను/స్కూళ్ళను అప్పుడు గురుకులాలు అని పిలిచేవారు. 1835 లో మెకౌలే ఆదేశాల మీదగా 1500 మంది ఆఫీసర్లు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, దేని మీద ఆధారపడి ఉంది అని సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే భారతదేశం మొత్తం విద్యా వ్యవస్థ గురుకులాలలో ఆశ్రమ పద్దతిలో జరుగుతుంది. ఈ పాఠశాలలో ఏమేమి భోదిస్తున్నారు అని కూడా సర్వే చేశారు. ఆ సర్వేలో ఒక భాగాన్ని చూడండి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో !

బ్రిటీషు సర్వే రిపోర్ట్ ప్రకారం 1835 లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక లక్ష 50 వేల కాలేజీలు/కళాశాలలు ఉండేవి. నేను అప్పటి బ్రిటీషు లాండ్ రెవెన్యూ రికార్డ్స్ను భారతీయ లైబ్రరీ ఆఫీసును నుండి తీసుకుని చూశాను. వాటిని ఎందుకు చూశాను అంటే 1853/1840 లో మద్రాస్ ప్రెసిడెన్సీ మొత్తం మీద పల్లెటూళ్ళు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవడానికి. కాబట్టి మొత్తం 1 లక్ష 57 వేల పల్లెటూళ్ళు మరియు ఒక లక్ష 50 వేల కాలేజీలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయి. అంటే సరాసరి చూసుకుంటే ప్రతీ ఊర్లో ఒక కాలేజీ ఉండేది. దాన్ని బ్రిటీషు పరిభాషలో చెప్పాలి అంటే Higher learning institutes అంటే చిన్న చిన్న పాఠశాలు కాదు. స్కూళ్ళ విషయానికి వస్తే ప్రతి ఊర్లో రెండు మూడు ఉండేవి. ఈ 1 లక్ష 50 వేల కాలేజీలలో ఏం భొదిస్తున్నారు అని బ్రిటీషు వారు చేసిన సర్వే ప్రకారం వీటిలో 1500 శస్త్ర చికిత్స/సర్జరీ కాలేజీలు. ఇవి కేవలం మద్రాస్ ప్రెసిడెన్సీలోనివి మాత్రమే భారత దేశం మొత్తం కాదు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీ కాలేజీలలో చదువుకునే వారు మంగల జాతి వారు. బ్రిటీషు వారి పుణ్యమా అంటు మన దేశంలో ఒక తప్పుడు ప్రచారం ఉంది. అది ఏమిటంటే శూద్రులను పై కులాలవారు చదువుకోనివ్వలేదు అని. మన దేశం లో ఒక మంగల వాడు సర్జన్ అయినప్పుడు తక్కువ జాతి వారు చదువుకోకపోవడం అసంభవం ! బ్రిటీషు వారి సర్వే ప్రకారం ఆ కాలేజీలలో 70% శూద్రులు, 30% మంది బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు విద్యను అభ్యసించేవారు.

ఆ రిపోర్ట్ లోని ఇంకొక విషయం ఏమిటంటే భారతదేశంలో ఉండే శూద్ర జాతి వారి చేతిలో గొప్ప టెక్నాలజీ/విజ్ఞానం ఉండేది. ఇది నా రెపోర్ట్ కాదు బ్రిటీషు వారి రిపోర్ట్. ఇప్పుడు కూడ మీరు మద్రాసు కు వెళ్ళి చూస్తే "పెరియార్" అనే జాతివారు ఉంటారు. వారు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. బ్రిటీషు వారి సర్వే ప్రకారం మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండే 2200/2300 Architect /భవన నిర్మాణ కాలేజీలలో ఉపాధ్యాయులు/ఆచార్యులు ఆ పెరియార్ జాతి వారే. అక్కడ వాస్తు కళ, భవన నిర్మాణం గురించి చదువుకున్నది పెరియార్ జాతి వారే. దక్షిణ భారతదేశం లో మనం చూసే ఆలయాలు మీనాక్షిపురం, మదురై వంటివి అన్నీ పెరియార్లు కట్టించినవే. నిర్మాణం పరంగా చూసినా, డిజైన్ పరంగా చూసినా అటువంటి ఆలయాలను మనం ఉత్తర భారతదేశంలో చూడలేము. వాటన్నిటిని పెరియార్లు కట్టించేవారు. పెరియార్లు అనబడే వారి పని మందిర నిర్మాణం. కాని 1890 తరువాత బ్రిటీషు వారు పెరియార్లను నాశనం చేశారు. ఎ. ఓ. హ్యూం అనే ఆఫిసర్ మద్రాస్ ప్రెసిడెన్సీ కి కలెక్టరుగా ఉండేవాడు. ఆ అదికారంతో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి ఒక చట్టాన్ని సృష్టించాడు. అప్పటిదాకా మందిర నిర్మాణం పెరియార్లు చేశారు కాని ఎ. ఓ. హ్యూం చట్టం ప్రకారం పెరియార్లు మందిర నిర్మాణం చేయకూడదు. ఒకవేళ చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. అలా పెరియార్లను మందిర నిర్మాణం చేయకుండా అపేశాడు. ఫలితంగా పెరియార్ జాతి వారు తక్కువ అవుతూ వచ్చారు. బ్రిటీషు వాళ్ళు భారతీయ సమాజాన్ని అలా విభజించారు.

-(స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసం నుండి అనువాదం )

Video link: http://www.youtube.com/watch?v=rcUaUfesoRE


Saturday 7 September 2013

Finally Good News For Diabetes.

A woman (65) was diabetic for the last 20+ years
and
was taking insulin
twice a day.
She used the enclosed homemade medicine for a fortnight and
now she is absolutely free of diabetes and taking all her food as normal
including sweets.

The doctors have advised her to stop insulin and any other blood sugar controlling drugs.
I request you all please circulate the email below to as many people as you
can and let them take maximum benefit from it.

AS RECEIVED :
DR. TONY ALMEIDA
( Bombay Kidney Speciality expert )
made the extensive experiments with perseverance and patience and discovered a
successful treatment for diabetes.
Now a days a lot of people, old men &
women in particular suffer a lot due to Diabetes.

Ingredients:
1 - Wheat 100 gm
2 - Gum(of tree) (gondh) 100 gm
3 - Barley 100 gm
4 - Black Seeds (kalunji) 100 gm

Method of Preparation :
Put all the above ingredients in 5 cups of water.
Boil it for 10 minutes and put off the fire.
Allow it to cool down by itself.
When it has become cold, filter out the
seeds and preserve water in a glass jug or bottle.

How to use it?
Take one small cup of this water every day early morning when your stomach is empty.
Continue this for 7 days.
Next week repeat the same but on alternate days. With these 2 weeks of
treatment you will wonder to see that you have become normal and can eat
normal food without problem.

Note:
A request is to spread this to as many as possible so that others can
also take benefit out of it.

SINCE THESE ARE ALL NATURAL INGREDIENTS,
TAKING THEM IS NOT HARMFUL.
SO THOSE WHO ARE SCEPTICAL ABOUT THIS TREATMENT
MAY STILL TRY IT WITHOUT ANY HARM.
This is working.


Disclaimer :
This article is not a substitute to medical treatment. Consult your doctor before starting any health procedure

వినాయక చవితి

http://www.brahmanabandhu.com/ebooks.html

http://www.brahmanabandhu.com/E-BOOKS/Vratakalpam2013%20Website.pdf
వినాయక చవితి నాడు పార్థివ గణపతిని ఆరాధించాలి. పార్థివ లింగార్చన వలే పార్థివ విఘ్నేశ్వర పూజ శ్రేష్ఠం. నీటిలో కరగగలిగే పొలాల మట్టితో, బంకమట్టితో గణేశ ప్రతిమ చేయాలి. ఈ ఆకృతి కూడా పాశాంకుశ, వరద అభయ (లేదా - మోదకం, దంతం) కలిగిన నాలుగు చేతుల గణపతినే చేయాలి. ఏనుగు మోముతో ఉన్న ఈ లంబోదర ప్రతిమను గణపతి నామాన్ని పలుకుతూ భక్తితో తయారుచేయాలి. కొన్న మూర్తిని అయితే గణేశ నామంతో అభిమంత్రించాలి. పర్యావరణానికి ముప్పు కలిగించే పద్ధతులు హిందూశాస్త్రాలు అంగీకరించవు.
గణపతికి దుర్వాంకురాల పూజ ప్రీతి. రెండు దూర్వాల చొప్పున పడి నామాలు పలికి చివరికి ఒక దూర్వాన్ని సమర్పించడం ఒక విధానం. గరికలు పన్నెండు అంగుళాల పొడవుతో ఉంటే మంచిది. పాపనాశానానికీ, అభీష్ట సిద్దికీ గరిక పూజకు మించిన అద్భుత విధానం లేదు.
శుద్ధ చవితిని వరదా చవితి అనీ,కృష్ణ పక్ష చవితిని సంకట హర చతుర్ధి అని అంటారు. అభీష్టాలను సిద్ధింప జేయటానికివరదా చవితి, కష్టాలను తొలగించడానికి సంకటహర చవితి. శుక్లపక్ష(వరద) చవితి తిథులలో భాద్రపద శుక్లాష్టమి విశిష్టం. సంకటహర చతుర్థిలలో మాఘ బహుళ చవితి ముఖ్యం. మధ్యాహ్నం వెల చవితి ఉన్న రోజుననే వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) ఆచరించాలి. - అని శాస్త్ర నియమం. మనస్సును నియంత్రించి ఉన్నతిని సాదిమ్పజేసే దేవత గణపతి. మనస్సుకి సంకేతమైన చంద్రుని చూసేవారు, గణపతిని ఆరాధించితే నీలాపనిందలు దూరమౌతాయంటారు. పరబ్రహ్మ తత్త్వమే గణపతి. ఆ తత్త్వ దృష్టితో కూడిన మనస్సు అజ్ఞానాన్ని అధిగమిస్తుందని - ఈ ఆనవాయితీలోని అంతరార్థం.
గణేశార్చనలో తెల్ల జిల్లేడు, ఎర్ర మందారం, శమీ పత్రం కూడా ప్రసిద్ధి. శమీ(జమ్మి) పత్రం ఏమాత్రం సమర్పించినా అద్భుత ఫలాలు జ్లభిస్తాయని గణేశ పురాణం చెబుతోంది. వైదిక యజ్ఞాలలో 21 సంఖ్య సంపూర్ణత్వానికి ప్రతీక. అందుకే యజ్ఞేశ్వరుడైన గణపతికి 21 సంఖ్య ప్రీతి. ఏకవింశతి పాత్ర పూజ, 21 సంఖ్యతో నివేదనలు హేరంబునకు ప్రత్యేకం.
మధ్యాహ్నం వేళ చవితి ఉన్న రోజుననే వినాయక చవితి (భాద్రపద శుద్ధ చవితి) ఆచరించాలి - అని శాస్త్ర నియమం. మనస్సును నియంత్రించి ఉన్నతిని సాది౦పజేసే దేవత గణపతి. మనస్సుకి సంకేతమైన చంద్రుని చూసేవారు, గణపతిని ఆరాధించితే నీలాపనిందలు దూరమౌతాయంటారు. పరబ్రహ్మ తత్త్వమే గణపతి. ఆ తత్త్వ దృష్టితో కూడిన మనస్సు అజ్ఞానాన్ని అధిగమిస్తుందని - ఈ ఆనవాయితీలోని అంతరార్థం.

                                                                                                                       Bramhasri Samavedam Shanmukha Sarma

Thursday 5 September 2013

భాద్రపదమాసం

Brahmasri Chaganti Koteswara RAO


చాంద్ర మానం ప్రకారం, ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేక ఉత్తరభాద్ర నక్షత్రం ఉండటం వల్ల ఇది భాద్రపదమాసం అయ్యింది. దేవతలకే కాకుండ పితృదేవతలకు కుడా ప్రీతికరమైన మాసం - "భాద్రపద మాసం " ! దశావతారాలలో రెండు అవతారాలను శ్రీ మహా విష్ణువు ఈ మాసం లోనే ధరించాడు. అవి వరాహ, వామన అవతారాలు. ఈ మాసం లోని శుద్ధ తదియ రోజున వరాహ జయంతి . ఆ రోజున విష్ణువు ఆలయాలకు వెళ్ళి స్వామిని దర్శించుకుని , అర్చనలు చెయ్యాలి. ఈ మాసం లో శుక్ల పక్ష పాడ్యమి నుండి దశమి వరకు దశావతారాలలో రోజుకొక అవతారాన్ని పూజించి , చివరి రోజున అన్ని అవతారాలను పూజిస్తూ దశవతార వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీ మహా విష్ణువు కృప లభిస్తుంది . ఈ సమయములో దేవ ఋషి పితురలకు తర్పణాలు ముఖ్య విధులుగా చెప్పబడ్డాయి. భాద్రపద శుక్ల పక్ష షష్టి నాడు పంచగవ్య ప్రాశనం చెయ్యాలి అని శాస్త్ర వచనం . అందు వల్ల అశ్వమేధ యాగం ఫలము లభిస్తుంది అని అంటారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, ఆవుమూత్రం , గోమయం అనేవి పంచగవ్యాలు. బహుళ పక్షం పితృదేవతలకు ఇష్టమైన కాలం. అందుకే దీనికి "పితృపక్షం" లేక మహాలయ పక్షం అని పేర్లు. ఈ పక్షములో పదిహేనురోజుల పాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం , శ్రాద్ధ విధులను నిర్వహించడం , పిండప్రదానాలు చేయదం వంటివి ఆచరించాలి . మహాలయ అమావాస్య నాడు కుడా ఈ విధముగా చెయ్యాలి . ఈ మాసములో ఒక పూట భొజనం , మరో పూట ఉపవాసం ఉండాలి. బెల్లం, ఉప్పులను దానం చెయ్యడం మంచిది . పూర్ణిమ నాడు శ్రీ భాగవత పురాణాన్ని దానం చెయ్య్డం వల్ల మరణ అనంతరం విష్ణువులోక ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్ర వచనం . భాద్రపద పూర్ణిమ నాడు జరుపుకునే ఉమా మహెస్వర వ్రతం సర్వ విధాలా శ్రేష్టమైనది . ఈ వ్రతం చేసిన భక్తుల ఇళ్ళు సకల సంపదలతో కళకళలాడుతూ ఉంటాయి.

Monday 2 September 2013



మ|| కొడుకుల్ పుట్టరంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెన్? పుత్రులు లేని యా శుకునకుం బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా! 28వ పద్యము శ్రీ కాళహస్తీశ్వర శతకము -దూర్జటి
తా|| ఈశ్వరా! లోకములోని జనులెంత అవివేకులు! కొడుకు పుట్టాలేదనియు, తమకు ఉత్తంగతులు లేవనియు అజ్ఞానముచే ఏడ్చుచుందురు. కౌరవచక్రవర్తి యైన ధృతారష్ట్రునకు వందమంది కొడుకులు పుట్తిరిగదా! వారివల్ల అతడెంత ఉత్తమగతికి బోయినాడు? బ్రహ్మచారిగా నుండి అపుత్రకుడైన శుకమహర్షికి ఏ దుర్గతులు గలిగినవి? ఇదంతయు భ్రాంతి తప్ప మరొకటి కాదు; అపుత్రకుడైన వానికి మోక్షమార్గము మూసికొని పోవునా? వట్టిది. “జ్ఞానేనహి నృణాం మోక్షః”.

Sunday 1 September 2013

పూజలకు ఉపయుక్తములగు వివిధ సామాగ్రులలో కేవలము పత్రము, పుష్పము,ఫలము, జలములను పేర్కోనుటలోని ఆంతర్యము - సామాన్య మానవులకు సైతము ఎట్టి శ్రమగాని, హింసగాని, వ్యయముగాని, లేకుండా సులభముగా లభించు ఏ వస్తువునైనను భగవదర్పణచేయవచ్చు. - అను విషయమును తెల్పుటకే. ఈ సందర్భమున ఒక విషయం మననం చేసుకుందాం. 
12 ఏండ్లు వనవాసము, ఒక ఏడు అజ్ఞాత వాసము, పూర్తి చేసిన పాండవులు తమ రాజ్యభాగమును తమకిమ్మని దుర్యోధనుని అడుగగా దానికతడు పూర్తిగా నిరాకరించెను. పాండవుల పక్షమున శ్రీ కృష్ణుడు దూతగా కౌరవులకడకేగెను. బయట మిక్కిలి శిష్టాచారుని వలే కనబడుటకై దుర్యోధనుడు ఆయనకు ఆడంబరముగా స్వాగత సన్నాహములను నెరపెను. అతడు భోజనమునకాహ్వానింపగా భగవానుడు అందులకు నిరాకరించెను. దుర్యోధనుడు కారణమడుగగా భగవానుడు ఇట్లు చెప్పెను. 
""సంప్రీతి భోజ్యాన్యన్నాని, ఆపద్భోజ్యాని వా పునః!
న చ సంప్రీయసే రాజన్ న చైవాపద్గతా వయమ్!! (ఉ. పర్వం - 91/25)
భుజించుటకు రెండు కారణములు ఉండును. ప్రేమ గలచోట ఏది సమర్పించినను అది తృప్తికరముగనే యుండును. లేదా ఆకలికి నకనకలాడు వానికి ఎదుటివాడు ఏ భావముతో ఏది సమర్పించినను దానితో ఆ ఆకలిని తీర్చుకొనవలసియే వచ్చును. ఇచట ఈ రెండు కారణములు లేవు. మీలో నాపై ప్రేమలేనే లేదు. నేను ఆకలిగొనియును లేను." అని పల్కి పిలుపుతో పనిలేకయే విదురునింటికి పోయెను. భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మొదలగు పెద్దలు విదురునింటికి వెళ్లి తమ ఇంటికి రమ్మని శ్రీ కృష్ణుని ఆహ్వానించిరి. కాని భగవానుడు ఎవ్వరి ఇండ్లకు వెళ్ళలేదు. విదురుని ఇంటిలోనే అతడు భక్తితో సమర్పించిన పదార్ధములను ప్రేమతో స్వీకరించి అతనిని కృతార్ధుని చేసెను. దుర్యోధనుని విందును తిరస్కరించి, విదురుని౦ట పప్పుపులుసులను ఆరగించి "భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు" అని మనకు తెలియజెప్పెను.