Bramhasri Samavedam Shanmukha Sarma
విద్యారాజ్ఞీ భగవతి సుధాపానా సుమోహినీ
శంఖతాటంకినీ గుహ్యా యోషి త్పురుషమోహినీ
ఖింకరీభూతగీర్వాణి కన్యకాక్షరరూపిణీ
స్విద్యత్కపోలఫలకా మూకారత్న విభుషితా
శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క మంత్రిణి శ్రీ రాజశ్యామలా లేక రాజమాతంగిగా పిలువబడే ఈమే బండాసురునితో జరిగిన యుద్ధంలో లలితాపరమేశ్వరి యొక్క చెరుకగడనుండి ఈమే సృజించబడినది.
లలితోపాఖ్యానములో ఈమేకు అనేక పేర్లు ఇవ్వబడినవి.
పరాభట్టారికాదేవి బదులుగా ఈమే ప్రపంచాన్ని పాలిస్తుంది. లలితా సహస్రనామంలో శ్రీ రాజశ్యామలా దేవి " మంత్రిణి న్యస్తరాజ్యధూః " అని ప్రస్తుతింపబడినది.
శ్రీ రాజశ్యామలాదేవి మనసుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈమే విషంఘుడు అనే రాక్షసునుని సమ్హరించినది. ఈమే అష్ట భుజములతో విరాజిల్లుతుంది. ఒక చేతిలో ధాన్యం(గతించిన కర్మలకు) ,కమలం ( బుద్ధికి సంబంధించిన కార్య కలాపాలు), తాడు (ప్రేమకు), అంకుశం (కోపమునకు), జప మాల మరియు పుస్తకాలు ( విగ్ఙాఞమునకు), వీణ (యోగం) మనకు ప్రతీకలు.
భూమికి ఆనిన ఈమే కుడిపాదము మనం సాధన చేయవలెనని మనకి సూచిస్తుంది.
ఈ రాజశ్యామలాదేవి స్తోత్రమును పఠించిన వారికి ముల్లోకాలలో తిరుగు అనేది ఉండదు. ఈమెను కొలిచే భక్తులకు కవిత్వము, సంగీతము, నృత్యము మొదలయిన లలితకళలయందు గొప్ప ప్రావీణ్యాన్ని కలుగచేస్తుంది. శ్రీ రాజశ్యామలాదేవి తన భక్తులకు వారి వారి రంగాలలో ఉన్నతస్థానాన్ని కల్పిస్తుంది.
శ్రీ మాత్రే నమః