Monday 30 July 2012

బ్రాహ్మముహూర్తంలో నిద్రలేచి తీరాలని పండితులు అంటున్నారు.



ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిరాయువును పొందడానికి బ్రాహ్మముహూర్తంలో నిద్రలేచి తీరాలని పండితులు అంటున్నారు. ఆయుర్వేదం- సూర్యుడుదయించుటకు 90 నిమిషాల మునుపటికాలమే బ్రహ్మమూహూర్తం. ఇది బుద్దిని వికసింపజేస్తుంది. ఈ బ్రహ్మముహూర్తంలోనే సూర్యభగవానుడు తన అసంఖ్యాకకిరణాల జ్యోతిని, శక్తిని ప్రపంచంపై ప్రసరింపజేయనారంభిస్తాడు. అప్పుడు వాటి ప్రభావం వల్ల మనశరీరం చురుకుగా పనిచేస్తుంది.

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నక్షత్రమండలం నుండి ప్రసరించే కాంతికిరణాలు ప్రాణుల మస్తిష్కాన్ని ప్రభావితం చేస్తాయి. అప్పటి భాస్కరకిరణ పుంజం మానవ శరీరంలోని జీవకణాలను చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి ఆ వేళలో మానవుడు తన ప్రాణాలను మహా ప్రాణాలతో సంబంధింపజేస్తే మానవునిలో అపారమైనశక్తి ఉత్పన్నమౌతుందని పండితుల అభిప్రాయం.

ఈ సమయంలో జీవకోటి నిద్రాదశలో ఉంటుంది. ఈ నిశ్శబ్ధవాతావరణంలో ఇంద్రియనిగ్రహాన్ని పాటించే మహర్షులు మేలుకుని ధ్యాన సమాధిని పొంది తపోమయ విద్యుత్తరంగాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపచేస్తూంటారు.

బ్రాహ్మముహూర్తంలో నిద్రిస్తూంటే చేసుకున్న పుణ్యమంతా నశిస్తుంది. బ్రాహ్మే ముహూర్తేయా నిద్రా సా పుణ్యక్షయకారిణీ- అంటారు. పుణ్యనాశానికెవరూ అంగీకరించరూ కదా. కాబట్టి తెల్లవారుజామున నిద్రలేచి తీరాల్సిందే.

నూతన విషయాలు ఆలోచించడానికి, గ్రంథరచన సాగించడానికి, మానసిక వికాసానికి బ్రాహ్మముహూర్తమెంతో సాయపడుతుంది. ఆ సమయంలో రాత్రి అంతా చంద్రకిరణాల నుండి నక్షత్రకిరణాల నుంచి ప్రసరించి అమృతాన్ని గ్రహించి ఉషఃకాలవాయువు వీస్తూంటుంది. ఈ గాలిసోకి శరీరమారోగ్యంగా, ముఖం కాంతివంతంగా, మనస్సు ఆహ్లాదకరంగా, బుద్ధినిశితంగా ఉంటాయి.

కాబట్టి బ్రాహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల దేవతల, పితరుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆయువును పెంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు.

Nigama Ramana.

మంగళసూత్రంలో పగడం ఎందుకు?

మంగళసూత్రంలో పగడం ఎందుకు?

మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకు?

ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక, దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు

అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు,


 స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు. 

కుజగ్రహ కారకత్వము: అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, 


విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు 

శారీకంగా ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!! ఇహ స్త్రీ జీవితంలో వీరిద్దరు ఎంత 

పాత్రపోషిస్తారో పరిశీలిద్దాము.

ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున 


కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.


భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు 


జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమిటో చూద్దామా!


ముత్యం పగడం ధరించిన పాతతరరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం 


స్త్రీలలో కానుపు ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.


ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ 


భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంటగ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను,

 దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహం వలదు.

కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూ 


కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంతశుభపలితాలు సమకూర్చగలవు.


మరొక విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు 


కుజుడేనన్న మాట మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.


ప్రతి స్త్రీ జీవితంలో ఈ పై చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే యిక జీవితం ఆనందమయమే


 కదా!


Vijaya Gopal Mallela.

పాణి గ్రహణం



పాణి గ్రహణం 

పార్వతీపరమేశ్వరులు సనాతన దంపతులు, వారి దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితం , లోకానికి తల్లిదండ్రులైన వారికి మన నమస్సులు.

వివాహం :
దీని సంస్కృతపదం: "వహ్" అనే ధాతువుకు "వి" అనే ఉపసర్గను "ఘిజ్ఞ్" అనే ప్రత్యయాన్ని చేరిస్తే :వి+ వహ్+షిజ్ఞ్" = వివాహం. అర్ధం: విశేషప్రాపణం అంటే విశేషమైన సమర్పణం .

ఇక పర్యాయపదాలు : పరియణం,ఉద్వాహం,కళ్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంధం, దారోపసంగ్రహణం, దార పరిగ్రహం, దారకర్మ,దారక్రియ యిత్యాదులు.

వివాహ పద్ధతులు : బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. ఇక వీటి అర్ధాలు తెలుసుకుందామా:

బ్రహ్మం : అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే బ్రాహ్మ వివాహం అవుతుంది ) శాంతాఋష్యశృంగులు)

దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్నవారికి దక్షిణగా కన్యను యిచ్చి వివాహం చేయటం, యిది దైవ వివాహం.

ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకుని కన్యను యివ్వటం, ఇది ఋషులలో ఎక్కువగా యుంటుంది, కనుక ఆర్షం అయింది.

ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం. (సీతారాములు)

అసురం: వరుని వద్ద ధనం తీసుకొని కన్యకు యిస్తే అసుర వివాహం (కైకేయి దశరధులు)

గాంధర్వం: పరస్పరం అనురాగంతో (మంత్ర విధానం లేకుండ) చేసుకునేది గాంధర్వ వివాహం (శకుంతలా దుష్యంతులు)

రాక్షసం: యుద్ధం చేసి కన్యను అపహరించి చేసుకునే వివాహం: (మండోదరిరావణుడు)

పైశాచికం: కన్యను నిద్రావస్థలో అపహరించి చేసుకునే వివాహం.

పైన చెప్పిన వాటిలో అత్యంత శ్రేష్ఠం : బ్రహ్మం. ప్రజాపత్యం ధర్మబద్ధం .

నిషిద్ధాలు : రాక్షసం ,పైశాచికం.

ఈ నవనాగరికతలో పైన చెప్పినవన్నీ కాకపోయినా, కొన్నైనా సాధ్యపడుతున్నాయా? మనమంతట మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాము.

Vijaya Gopal Mallela

Thursday 26 July 2012

అష్టభోగములు
అన్నము, వస్త్రము, గంధము, పుష్పము, పానుపు,తాంబూలము, స్త్రీ, గానము. 

2) అష్టమదములు.
అర్ధమదము, స్త్రీమదము,విద్యామదము,కులమదము, రూపమదము,ఉద్యోగమదము, యౌవనమదము, అన్నమదము.

3) కూటత్రయము
శక్తి, మధ్యమ,వాగ్భవమాటలు.

4) అక్షయ త్రయము :
కంచికమాక్షి, మధురమీనాక్షి, కాశీవిశాలాక్షి.

5) అవస్థత్రయము

జాగ్రత్,స్వప్న,సుషుప్తి,అవస్థల

6)త్రివిధ పరమేశ్వరులు
సత్తు, చిత్తు, ఆనందము

7) త్రివిధదీక్షలు.
దృగ్దీక్ష , స్పర్శదీక్ష, వాగ్దీక్ష

మన ఆహారం ఇతరులకు యివ్వడం ద్వారా మనకు బలం చేకూరూతుంది. ఇతరులకు వస్త్ర దానం చేయడం వలన మనకెక్కువ సౌందర్యము సంక్రమిస్తుంది. సత్యశౌచకములకు ఆలవాలమైన సంస్థల్ని నెలకొల్పడం ద్వారా అశేషమైన ధనం సంప్రాప్తమవుతుంది.

పొట్టమీద మూడు మడతలుగల స్త్రీ అదృష్టవంతులవుతారు, రెండు మడతులున్న స్త్రీ భర్తకు ప్రియాతిప్రియమగును, ఒకే మడత యుంటే పుత్రసంతానవతి అవుతుంది.

Friday 13 July 2012

ఇది కేవలము సమాచార నిమిత్తము ఇందు ఇవ్వబడినది.

ఇది కేవలము సమాచార నిమిత్తము ఇందు ఇవ్వబడినది.
శ్రీచక్రోపాసనకు సద్గురువుల ఉపదేశములేకుండా శ్రీచక్రోపాసన కూడని పని.

శ్రీచక్రము
శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలే...నిది ఏదీ లేదు ఈ లోకంలో.
మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది.

శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు.
శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు.
నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది.
తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు.
శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది.
అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము.
సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము.

శ్రీచక్రము 3 రకములుగా
లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨. కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము.
సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీచక్రమును పూజించిన యెడల, సర్వ శక్తులూ, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని
మన పూర్వీకులు, ఋషులు వక్కాణించి యున్నారు. శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ సాక్షాత్కారం లభించినట్లే.

ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య
సిద్దుల కొరకు చతుషష్టి (64)తంత్రములను సృష్టించెను. కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు 'క్క మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరుని చే నిర్మింపబడినవి. శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని చెప్పుదురు. కాబట్టి అధికారముకల వారికి శ్రీవిద్యా తంత్రము,మిగతా వారికి చతుషష్టి (64)తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీవిద్యోపాసన వలన, శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం చే ఆత్మ విచారణ యందు ఆసక్తి
కలిగి, ఐహిక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును. అందుకే దీనిని బ్రహ్మవిద్య అని అన్నారు.
శ్రీవిద్యా మహా మంత్రములు అనునవి మోక్ష సాధనమగు మార్గములుగా చెప్పబడినవి.
ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కావలయును అనేవారికి ఇవి నిర్దేశింపబడినవి.
శ్రీమాత్రే నమః
మీ
భాస్కరానంద నాథ
పాదుకాంత పూర్ణ దీక్షా
శ్రీవిద్యోపాసకులు
(కామరాజుగడ్డ
రామచంద్రరావు)

శ్రీకృష్ణుడి అలంకారం : నెమలి పింఛం

శ్రీకృష్ణుడి అలంకారం : నెమలి పింఛం
(మొదటి భాగం)

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?

... "మ" కారము మధనానికి అని అర్ధము.
"యూర" అనే పదం హృదయానికి అని అర్ధము.
ఇంకా "మ" అంటే మగనెమలిని కూడా అంటారు.

పక్షిజాతిలో "యోగవిద్య "తెలిసిన పక్షులు ఐదు మాత్రమే ఉన్నాయి, అవి: శుకము, హంస, గరుడుడు,నెమలి చివరిది పావురము. వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఞానము ఉన్నది.

అసలు నెమలి అందమే పింఛం.

క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వఛ్ఛ మైన నీటిబిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

ఇక నెమలి పూర్వ వృత్తాంతం తెలిసికుందాము:-
శ్రావస్తి పట్టణ సామంతుడైన పంచవర్ణుడు క్రౌంచపక్షుల గాయాలు నయంచేసినందుకు గాను వృద్ధుడైన ఆ రాజుకు యవ్వనాన్ని ప్రసాదిస్తామంటే, వద్దని, మీకు మల్లే నేను విహంగంగా ఆకాశంలో విహరించాలని ఉందని అది అనుగ్రహించండి. అలాగే అని మేము చెప్పబోయే దేవతా మంత్రం ఆకాశంలో మబ్బులు క్రమ్మినపుడే నీకు పనిచేసి, నీకు చిత్రవిచిత్రమైన వర్ణనలు కలిగిన ఈకలు, పింఛము కలుగగలవు. అప్పుడు ఈ జగత్తులో నీయంతటి అందమైన పక్షి మరొకటి యుండదు. ఒక హెచ్చరిక, ఎటువంటి పరిస్థితులలో ఈ మంత్రం నీ భార్యకు చెప్పకు" అని వెళ్ళిపోయాయి.

ఒకనాడు ఆకాశం మేఘావృతమై యుండగా ఈ మంత్రప్రభావం చూద్దామని, మంత్రోఛ్ఛరణంగా ఈ మంత్రాన్ని పఠించి మనోహరమైన, అందమైన పక్షిగా మారిపోయి ఆనందంగా గెంతులు వేస్తూండగా అతని భార్య చూసింది. ఆనాటినుండి భర్తను ఎన్నోవిధాలుగా హింసిస్తూ, వేధిస్తూ ఆ మంత్రాన్ని తనకు చెప్పమంది. ఇక ఆ బాధలు పడలేక సరేనన్నాడు. ఇది తెలిసికున్న ఆ మంత్రాన్ని అధిష్టించిన దేవత అతని భార్యకు బుద్ధిచెప్పాలనుకుంది. ఆ మంత్రము చేత కారుమేఘాలను సృష్టించి వాతావరణాన్ని ఆనందమయం చేసింది. ఆ సమయంలో ఆయన భార్య తను అతిసుందరమైన విహంగంగా మారిపోతున్నాననే భావనలో " అతిసుందర:" అనబోయి "అసుందర: అన్నది. వెంటనే ఆ పదజాలంతో ఆమె పింఛంలేని ఆడ నెమలిగా మారిపోయింది. తమకిచ్చిన వాగ్దానాన్ని తప్పాడని ఆ క్రౌంచపక్షులు ఆ రాజుని శాశ్వతంగా మగనెమలిగా మారిపొమ్మన్నాయి.

రేతస్సు అనగా వీర్యం : దీనిలో అమొఘమైన శక్తి నిల్వ ఉంటుంది. ఇలాంటి శక్తిని అధోపతన క్రియ ద్వారా మానవులు సంతానాన్నిపొంది వీర్యహీనులు అంటే తేజమును,శక్తిని కోల్పోతుండగా , యోగులు యిదే వీర్యాన్ని " ఊర్ధ్వపతన" క్రియ ద్వారా కపాల భాగానికి చేర్చి మోక్ష మార్గ గాములుగా అవుతున్నారు.

ఇటువంటి యోగులందరిలోకి శ్రీకృష్ణభగవానుడు పరమొత్తమమయిన పరమయోగి. పదహారువేల మంది గోపికలున్నా, అష్టభార్యా సహితుడైనా, భామాలోలుడన్న పేరున్నా ఆయన అసలుసిసలైన నిఖార్సైన బ్రహ్మచారి. అందుకే ఆయన "అస్ఖలిత బ్రహ్మచారి" అయ్యాడు.

నెమళ్ళకు తమ వీర్యాన్ని ఊర్ధ్వముఖంగా నడిపించగలశక్తి గలవి. అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒక స్థాయి తక్కువగా ఉండటంవలన ఈ రేతస్సు (వీర్యం)పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసనను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్భం ధరిస్తుంది.ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైనది, స్త్రీపురుష జననేంద్రియాల సంభోగ ప్రక్రియ ప్రసక్తే లేదు. అందుకని నెమళ్ళు అర్ధస్ఖలిత బ్రహ్మచారులు.

ఎప్పుడైతే,ఎక్కడైతే స్ఖలనము లేదో దాన్ని యోగీ-యోగ సమానమై ఆరాధ్యనీయము, పూజనీయమూ గౌరవస్థానాన్ని ఆక్రమించింది కనుకనే శ్రీకృష్ణుడు తన శిరముపైన నెమలిపింఛానికి సముచిత,సమున్నత స్థానాన్ని అనుగ్రహించాడు

ఆనందలహరి

ఆనందలహరి అనబడు మొదటి భాగములో 41 శ్లోకములు ఉన్నవి. వీనిని ఆచార్యులవారు కైలాసము నుండి తెచ్చినారని నమ్మకము.
౧.శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మాపి |
అతస్త్వా మారాధ్యం హరిహర విరించా దిభి రపి
ప్రణంతు స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభావతి!!

భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?

౨.తనీయాం సం పం సుంతవ చరణ పంకేరు హ భవం
విరించిః సంచిన్వన్ విరచయతి లోకా న వికలమ్ |
వాహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సక్షుద్వైనం భజతి భాసితో ద్దూళన విధిమ్!!

దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు.

౩.అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ |
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి!!

దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.

౪.త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణ
స్త్వమేక నైవాసి ప్రకటతి వరాభీత్యభినయా |
భయాత్ త్రాతుం దాతుం ఫలమపి చ వంఛా సమాధికమ్
శరణ్యే లో కానాం తవ హి చరణా వేవ నిపుణౌ!!

తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.

౫.హరిస్త్వా మారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం
పురానారీభూత్వా పురరిపు మపి క్షోభమనయత్ |
స్మరో పిత్వాం నత్వా రాతినయన లేహ్యేన వపుషా
మునీనా మత్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్!!

త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.

౬.ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా
వసంత స్సామంతో మలయ మరుదాయోధనరథః |
తథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపా
మాపాంగా త్తే లభ్ద్వా జగదిద మనంగో విజయతే!!

పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.

౭.క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తన నతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా |
ధను ర్భాణా న్పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమధితు రాహోపురుషికా!!

శ్రీదేవీ స్వరూప ధ్యానం: క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది; కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరిక్షీణామధ్య - కృశించిన నడుము కలది; పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము; ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.

౮.సుధాసింధో ర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే |
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ||

సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.

౯.మహీం మూలాధారే కమపి మణిపురే హుతవహం
స్థితం స్వాధిష్టానే హృది మరుత మాకాశ ముపరి |
మనో పి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం
సహస్రారే పద్మే సహా రహసి పత్యా విహరసే ||

వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ)- సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.

౧౦.సుధా ధారా సారై శ్చరణ యుగళాంత ర్విగళితై:
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసాః |
అవాప్య స్వాం భూమిం భుజగ నిభ మధుష్యవలయం
స్వమాత్మానాం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి ||

కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.

౧౧.చాతుర్భిః శ్రీ కంఠైః శివయువతిభిః పంచభిరపి
ప్రభిన్నాభి శ్శంభో ర్నవభిరపి మూల ప్రకృతిభిః |
చతుశ్చత్వారింశ ద్వసుదళ కలాశ్ర త్రివలయ
త్రిరేఖాభి స్సార్థం తవశరణ కోణాః పరిణితాః!!

శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.

౧౨.త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం
కవీంద్రా: కల్పంతే కథమపి విరించి ప్రభృతయః |
యదా లోకౌత్సుక్యా ధమరలలనాయాంతి మనసా
తపోభిః దుష్ప్రాపామపి గిరీశ సాయుజ్య పదవీమ్ ||

శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి

౧౩.నరం వర్షీ యంసం నయనవిరసం నర్మసు జడం
త వాపాంగాలోకే పతిత మనుధావంతి శతశః |
గళ ద్వేణీబంధాః కుచకలశ విస్త్రస్త సిచయాః
హఠాత్త్రు ట్యత్కాంచ్యో విగళిత దుకూలా యువతయః ||

దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.

౧౪.క్షితౌ షట్పంచాశత్ ద్విసమధిక పంచాశ దుధకే
హుతాశే ధ్వాషష్టి శ్చతురిధిక పంచాశదనిలేః |
దివి ద్విషట్త్రింశ న్మనసి చ దుతుష్షష్ఠి రితి యే
మయూఖా స్తేషా మప్వుపరి తవ పాదాంబుజయుగం ||

షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.

౧౫.శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటమ్
వరత్రాసత్రాణస్ఫటిక ఘుటికా పుస్తక కరామ్
సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః!!

సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.

౧౬.కవీంద్రాణాం చేతః కమకవన బాలాతపరుచిం
భజన్తే యే సన్తః కతిచిదరుణా మేవ భవతీమ్
విరించి ప్రేయస్యాస్తరళతర శృంగారలహరీ
గభీరాభి ర్వాగ్భి ర్విదధతి సభారంజనమమీ!!

రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు.

౧౭.సవిత్రీ భిర్వాచాం శశి మణి శిలా భంగరుచిభి
ర్వశిన్యా ద్యా భిస్త్వాం సహ జనని సంచింతయతి యః |
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరిచిభిః
వచో భి ర్వాగ్ధేవీ వధన కమలా మోద మధురైః ||

జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడ దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.

౧౮.తనుచ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః
దివం సర్వాముర్వీ మరుణిమ నిమగ్నాం స్మరతి యః |
భవంత్యస్య త్రస్వద్వన హరిణ శాలీన నయనాః
సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణ గణికాః ||

ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడ వశులగుదురు.

౧౯.ముఖం బిందుంకృత్వా కుచయుగ మధస్తస్య తదధో
హకారార్ధం ధ్యాయే ద్దరమహిషి లే మన్మథకలామ్ |
స సద్య స్సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీ మప్యాసు భ్రమయతి రవీందు స్తన యుగాం ||

అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.

౨౦.కిరంతీ మంగేభ్యః కిరణనికురుంబామృతరసమ్
హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తి మివ యః |
స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ
జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారసిరయాః ||

విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.

౨౧.తటిల్లే ఖాతన్వీ తపనశశి వైశ్వానరమయీమ్
నిషణ్ణం షణ్ణామ ప్యుపరి కమలానాం తవ కలామ్ |
మహాపద్మాతన్యాం మృదితమలమాయేన మనసా
మహానద్తఃపశ్యన్తో దధతి పరమాహ్లాద లహరీమ్ ||

యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.

౨౨.భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణా
మితిస్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వంమితియః |
తదైవ త్వం తస్మైదిశసి నిజసాయిజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్రస్ఫుతమకిత నీరాజతపదామ్ ||

భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.

౨౩.త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్థం శంభో రపర మపి శంకే హృత మభూత్ |
యద్తత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనమ్
కుచాభ్యా మానమ్రం కుతిలశశిచూడాలమకుతమ్ ||

శివశక్తుల సంపూర్ణైక్యత

౨౪.జగత్సూతే ధాతా హరి రవతి రుద్రః క్షపయతే
తిరస్కుర్వన్నేత త్స్వమపి వపు రీశ స్థిరయతి |
సదా పూర్వస్సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివః
తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్ర్భూలతిక యోః ||

బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.

౨౫.త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవే త్పూజా తవ చరణయోర్యా విరచితా |
తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్య న్ముకుళితకరో త్తంస మకుటాః ||

సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.

౨౬.విరించిః పంచత్వం ప్రజతి హరి రాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ |
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశాం
మహాసంసారేంస్మిన్విహరతి సతి త్వత్పతిరసౌ ||

మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.

౨౭.హపో జల్ప శ్శిల్పం సకలమపి ముద్రావిరచనా
గతిఃప్రాదక్షిణ్య హ్రమణ మశనాద్యాణ్యహుతివిధిః |
ప్రణామ స్సంవేశః సుఖ మభిలామాత్మార్పంఅదృశా
సపర్యా ప్ర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ||

జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."

౨౮.సుధా మప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీమ్
విపద్యం తేవిశ్వే విధి శత మఖము ఖాద్యా దివిషదః |
కరాళం యత్ క్ష్వేళం కబళితవతః కాలకలనా
న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా ||

దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడ నిరోధింప బడును.

౨౯.కిరీటం వైరించం హరిహర పుర కైటభభిదః
కఠోరే కోతీరే స్ఖలసి జహిజంభారి మకుటమ్ |
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభముపయాతస్య భవనమ్
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తి ర్విజయతే ||

శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.

౩౦.స్వదేహోద్భూ తాభిర్ఘృణిభి రణిమాద్వాభి రభితః
నిషేవ్యే నిత్యేత్వా మహి మితి సదా భావయతి యః |
కి మాశ్చర్యం తస్య త్రిణయన సమృద్ధిం తృణయతో
మహా సంవర్తాగ్ని ర్విరచయతి నీరాజన విధిమ్ ||

దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.

౩౧.చతుష్షష్ట్యా తం త్రై స్సకలమతి సంధాయ భువనమ్
స్థిత స్తత్తత్త్సిద్ధి ప్రసవపరతమ్ త్రైః పసుపతిః |
పునం స్త్వన్నిర్బంధా దఖిల పురుషార్థై కఘటనా
స్వతంత్త్రం తే తంత్రం క్షితి తల మవాతీతరదిదమ్ ||

దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.

౩౨.శివశ్శక్తిః కామః క్షితి రథః రవి శ్శీతకిరణః
స్మరో హమ్స శ్శక్ర స్తదనుచ పరామారహరయః |
అమీ హృల్లేఖాభి స్తిసృభి రవసానేషు ఘటితాః
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ ||

దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము. ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడినది. (షోడశాక్షరి మంత్రము గుహ్యము. గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను. కనుక ఈ శ్లోకములో 15 అక్షరములే చెప్పబడినవి.)

౩౩.స్మరంయోనిం లక్ష్మిం త్రితయమిద మాదౌతవమనో
ర్ని ధాయైకే నిత్యేనిరవధి మహాభోగ రసికాః |
భజన్తి త్వాం చింతామణి గుణ నిబద్దాక్షవలయాః
శివాగ్నౌ జుహ్వాంతస్సురభిఘృతధారాహుతిశతైః ||

కౌలులు బాహ్య విధానములో చేయు దేవి అర్చన వర్ణన. ఈ శ్లోకము బీజాక్షరములున్నవి. ఇది అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.

౩౪.శరీరం త్వం శంభో శ్శశిమిహిరవక్షోరుహయుగమ్
తవాత్మానం మన్యే భగవతి నవాత్మాన మనఘమ్ ||
అతశ్శేష శ్శేషీత్వయ ముభయ సాధారణతయా
స్థిత స్సంబంధో వాం సమరసపరానందపరయోః ||

శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.

౩౫.మనస్త్వం వ్యోమ త్వం మరు దసి మరుత్సారథి రసి
త్వమాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహిపరం |
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానందాకారం శివయువతి భావేన బిభృషే ||

షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.

౩౬.తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటి ద్యుతిధరమ్
పరం శంభుం వందే పరిమిళిత పార్శ్యం పరచితా |
యమారాధ్య న్భక్త్వా రవిశశి మవిషయే
నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే ||

ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.

౩౭.విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం
శివం సేవే దేవీ - మపి శివ సమాన వ్యవసితామ్ ||
యయోః కాంత్యాయాంత్యాః శశికిరణ సారూప్య
విధూతాం తర్థ్వాం విలసతి చకోరీవ జగతీ ||

విశుద్ధి చక్రము నందలి దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.

౩౮.సమున్మీల త్సంవిత్కమల మకరందైక రసికమ్
భజే సంసద్వంద్వం కిమపిమహతాం మానసచరమ్ |
యదాలాపా దష్టాదశ గుణిత విద్యా పరిణతిః
యధాద త్తేదోషాద్గుణ మఖిల మద్భ్యః పయ ఇవ ||

అనాహత చక్రము నందలి హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి

౩౯.తవ స్వాధిష్టానే హుతశాహ మధిష్టాయ నిరతమ్
త మీడే సంవర్తం జనని మహతిం తాంచ సమయామ్ |
యదాలోకే లోకాన్ దహతి మహతిః క్రోధకలితే
దయార్ద్రా యాదృష్టి శ్శిశిర ముపచారం రచయతి ||

స్వాధిష్ఠాన చక్రము నందలి సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ

౪౦.తటి త్వంతం శక్త్యా తిమిరపరిపంథి స్ఫురణయా
స్పుర న్నానార త్నాభరణ పరిణద్థేంద్ర ధనుషమ్ |
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హర మిహిరత ప్తం త్రిభువనమ్ ||

మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని

౪౧.తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా
నవాత్మానం మన్యే నవరస మహాతాండవనతమ్ |
ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా
సనాభాధ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగ దిదమ్ ||

మూలాధార చక్రము నందు నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)

విశ్వనాధ నగరీ స్తోత్రం:

విశ్వనాధ నగరీ స్తోత్రం:

యత్ర దేహపతనేపి దేహినాం ముక్తి రేవ భవతీతి నిశ్చితం!
పూర్వ పుణ్యనిచయేన లభ్యతే విశ్వనాధ నగరీ గరీయసీ!!

... స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాతివల్లభా!
దుండి భైరవవిదారితా శుభా విశ్వనాధ నగరీ గరీయసీ!!

రాజతేత్ర మణికర్ణికామలా సా సదాశివ సుఖప్రదాయినీ!
యా శివేన రచితా నిజాయుధైర్విశ్వనాధ నగరీ గరీయసీ!!

సర్వదామరబృందవందితా దిగ్గజేంద్ర ముఖవారితా శివా!
కాలభైరవ క్రుతైకశాసనా విశ్వనాధ నగరీ గరీయసీ!!

యత్ర ముక్తి రఖిలైస్తు జంతుభిర్లభ్యతే మరణ మాత్రతః!
సాఖి లామరగనైరభీప్సితా విశ్వనాధ నగరీ గరీయసీ!!

ఉరగం తురగం ఖగం మృగం వా కరిణం కేసరిణం ఖారం నరం వా!
సకృతాప్లుత ఏవ దేవనద్యాః లహరీ కిం న హరం చరీకరోతి!!

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచితం శ్రీ విశ్వనాధ నగరీ స్తోత్రం సంపూర్ణం

కాశీపంచకం

కాశీపంచకం

మనో నివృత్తిః పరమోపశాంతిః స తీర్థవర్యా మణికర్ణికా త్ర
జ్ఞానప్రవాహో విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా || ౧ ||

... యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా కా కాశికాహం నిజబోధరూపా || ౨ ||

కోశేషు పంచస్వభిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిగేహగేహం
సాక్షీ శివః సర్వగతోంతరాత్మా కా కాశికాహం నిజబోధరూపా || ౩ ||

కాశ్యాంతు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా || ౪ ||

కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తి శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోzయం తురీయః సకలజనమనః సాక్షిభూతోంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి || ౫ ||

పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కన్పించినది. ముముక్షువునకు బహిర్భూతము గా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రదానస్తానము కన్పించుచున్నది.

శ్రీ ఆదిశంకర భవత్పాదాచార్య విరచితం శ్రీ మణికర్ణికాష్టకం

శ్రీ ఆదిశంకర భవత్పాదాచార్య విరచితం శ్రీ మణికర్ణికాష్టకం

త్వత్తీరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్యముక్తిప్రదౌ
వాదంతౌ కురుతః పరస్పరముభౌ జంతోః ప్రయాణోత్సవే |
మద్రూపో మనుజోzయమస్తు హరిణా ప్రోక్తః శివస్తత్క్షణా-
... త్తన్మధ్యాద్భృగులాంఛనో గరుడగః పీతాంబరో నిర్గతః || ౧ ||

ఇంద్రాద్యాస్త్రిదశాః పతంతి నియతం భోగక్షయే యే పున-
ర్జాయంతే మనుజాస్తతోపి పశవః కీటాః పతంగాదయః |
యే మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి నిష్కల్మషాః
సాయుజ్యేzపి కిరీటకౌస్తుభధరా నారాయణాః స్స్యుర్నరాః || ౨ ||

కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా
తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ |
స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా
కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః || ౩ ||

గంగాతీరమనుత్తమం హి సకలం తత్రాపి కాశ్యుత్తమా
తస్యాం సా మణికర్ణికోత్తమతమా యేత్రేశ్వరో ముక్తిదః |
దేవానామపి దుర్లభం స్థలమిదం పాపౌఘనాశక్షమం
పూర్వోపార్జితపుణ్యపుంజగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే || ౪ ||

దుఃఖాంభోధిగతో హి జంతునివహస్తేషాం కథం నిష్కృతిః
జ్ఞాత్వా తద్ధి విరించినా విరచితా వారాణసీ శర్మదా |
లోకాఃస్వర్గసుఖాస్తతోzపి లఘవో భోగాంతపాతప్రదాః
కాశీ ముక్తిపురీ సదా శివకరీ ధర్మార్థమోక్షప్రదా || ౫ ||

ఏకో వేణుధరో ధరాధరధరః శ్రీవత్సభూషాధరః
యోzప్యేకః కిల శంకరో విషధరో గంగాధరో మాధవః |
యే మాతర్మణికర్ణికే తవ జలే మజ్జంతి తే మానవాః
రుద్రా వా హరయో భవంతి బహవస్తేషాం బహుత్వం కథమ్ || ౬ ||

త్వత్తీరే మరణం తు మంగళకరం దేవైరపి శ్లాఘ్యతే
శక్రస్తం మనుజం సహస్రనయనైర్ద్రష్టుం సదా తత్పరః |
ఆయాంతం సవితా సహస్రకిరణైః ప్రత్యుద్గతోzభూత్సదా
పుణ్యోzసౌ వృషగోzథవా గరుడగః కిం మందిరం యాస్యతి || ౭ ||

మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః
స్వీయైరబ్ధశతైశ్చతుర్ముఖధరో వేదార్థదీక్షాగురుః |
యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్యపారంగత-
స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్ || ౮ ||

కృచ్ఛ్రై కోటిశతైః స్వపాపనిధనం యచ్చాశ్వమేధైః ఫలం
తత్సర్వే మణికర్ణికాస్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్ |
స్నాత్వా స్తోత్రమిదం నరః పఠతి చేత్సంసారపాథోనిధిం
తీర్త్వా పల్వలవత్ప్రయాతి సదనం తేజోమయం బ్రహ్మణః || ౯ ||

శ్రీ వేద వ్యాస అష్టోత్తర శత నామావళి

శ్రీ వేద వ్యాస అష్టోత్తర శత నామావళి

ఓం..కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోక హితేరతం
వేదాబ్జభాస్కరం వందే శమాది నిలయం మునిం


1.ఓం వ్యాసాయ నమః
2..ద్వైపాయనాయ నమః
3..శ్రేష్ఠాయ నమః
4..సత్యాత్మనే నమః
5..బాదరాయణాయ నమః
6..మునయే నమః
7..సత్యవతీ పుత్రాయ నమః
8..శుక తాతాయ నమః
9..తపోనిధయే నమః
10..వశిష్ఠనప్త్రే నమః
11..సర్వజ్ఞాయ నమః
12..విష్ణు రూపాయ నమః
13..దయానిధాయే నమః
14..పరాశరాత్మజాయ నమః
15..శాంతాయ నమః
16..శక్తిపౌత్రాయ నమః
17..గుణాంబుధయే నమః
18..కృష్ణాయ నమః
19..వేదవిభక్త్రే నమః
20..బ్రహ్మసూత్రకృతే నమః
21..అవ్యయాయ నమః
22..మహాయోగీశ్వరాయ నమః
23..సౌమ్యాయ నమః
24..ధన్యాయ నమః
25..పింగజటాధరాయ నమః
26..చీరాజనధరాయ నమః
27..శ్రీమతే నమః
28..అష్టాదశపురాణకృతే నమః
29..దండినే నమః
30..కమండలధరాయ నమః
31..కురువంశప్రవర్ధకాయ నమః
32..నిర్మమాయ నమః
33..నిరహంకారాయ నమః
34..నిష్కళంకాయ నమః
35..నిరంజనాయ నమః
36..జితేంద్రియాయ నమః
37..జితక్రోధాయ నమః
38..స్మృతికర్త్రే నమః
39..మహాకవయే నమః
40..తత్త్వ జ్ఞానినే నమః
41..తత్త్వబోధకర్త్రే నమః
42..కాశీనివాసభువే నమః
43..మహాభారత కర్త్రే నమః
44..చిరంజీవినే నమః
45..మహామతయే నమః
46..సజ్జనానుగ్రహపరాయ నమః
47..సత్యవాదినే నమః
48..ధృఢవ్రతాయ నమః
49..బదర్యాశ్రమసంచారిణే నమః
50..కోటిసూర్యసమప్రభాయ నమః
51..త్రిపుండ్రవిలసత్ఫాలాయ నమః
52..అష్టావింశతిరూపభ్రుతే నమః
53..రవీందుమిత్రశిష్యాడ్యాయ నమః
54..సుశీలాయ నమః
55..యతిపూజితాయ నమః
56..వైయ్యాఘ్రచర్మవసనాయ నమః
57..చిన్ముద్రావిలసత్కరాయ నమః
58..రుద్రాక్షమాలాభూషాడ్యాయ నమః
59..కలిపాపనివారకాయ నమః
60..ధర్మాశ్వమేధసందేష్ట్రే నమః
61..సంజయజ్ఞానదృష్టిదాయ నమః
62..ద్రుతరాష్ట్రపుత్రదర్శినే నమః
63..విదురాదిప్రపూజితాయ నమః
64..పుత్రమోహవ్యాకులాత్మనే నమః
65..జనకజ్ఞానదాయకాయ నమః
66..కర్మఠాయ నమః
67..దీర్ఘ దేహాడ్యాయ నమః
68..దర్భాసీనాయ నమః
69..వరప్రదాయ నమః
70..యమునాద్వీపజననాయ నమః
71..మొక్షోపాయప్రదర్శకాయ నమః
72..ఋషిపూజ్యాయ నమః
73..బ్రహ్మనిధయే నమః
74..శిఖావతే నమః
75..జటిలాయ నమః
76..పరాయ నమః
77..అష్టాంగయోగనిరతాయ నమః
78..గాంధారీగర్భసంరక్షకాయ నమః
79..పాండవప్రీతిసంయుతాయ నమః
80..వసుభూపాలదౌహిత్రాయ నమః
81..వ్యాసకాశీసదావాసాయ నమః
82..నరనారాయణార్చకాయ నమః
83..నిత్యోపవాససంతుష్టాయ నమః
84..పరహింసాపరాన్గ్ముఖాయ నమః
85..శివపూజైకనిరతాయ నమః
86..సురాసురసుపూజితాయ నమః
87..సర్వక్షేత్రనివాసినే నమః
88..సర్వతీర్ధావగాహనాయ నమః
89..యుధిష్టిరాభిషేక్త్రే నమః
90..స్మృతిమాత్రాప్తసన్నిధయే నమః
91..త్రికాలజ్ఞాయ నమః
92..విశుద్దాత్మనే నమః
93..నిర్వికారాయ నమః
94..నిరామయాయ నమః
95..ఊర్ధ్వరేతసే నమః
96..మాతృభక్తాయ నమః
97..నిశ్చింతాయ నమః
98..నిర్మలాశయాయ నమః
99..రూపాంతరచరాయ నమః
100..పూజ్యాయ నమః
101..సదా శిష్యసమావృతాయ నమః
102.. భిక్షేశ్వర ప్రతిష్ఠాత్రే నమః
103..నిరవద్యాయ నమః
104..నిరంకుశాయ నమః
105..సర్వభూతహృదావాసాయ నమః
106..సర్వేష్టార్ధప్రదాయకాయ నమః
107..సర్వలోకగురవే నమః
108 ..సచ్చిదానందజ్ఞాననిధయే నమః

ఇవి నేను సేకరించి ఉపయోగించుకునే వేద వ్యాస అష్టోత్తర శతనామాలు. సాధ్యమైనంత వరకూ
అచ్చుతప్పులు సరిజూసి ఇస్తున్నాను.'డ్య' అనే అక్షరం వచ్చిన ప్రతి చోట ఆ అక్షరానికి క్రింద 'వొత్తు' వున్నది అని భావించి ఉచ్చారణ లో వొత్తు తో పలుక వలసినదిగా మనవి. అలాగే ఒక్కోచోట రెండవ 'ట' వత్తు ఉదాహరణకు 89 నామంలో..పడలేదు..నేను జీ మెయిల్ ట్రాన్స్ లిటరేషన్ వాడుతాను..అందులో ఈ ఇబ్బంది ఒకోసారి వస్తుంది..ఈ చిన్నిసవరణలను గమనించగలరు!

కల్యాణవృష్టిస్తవః

కల్యాణవృష్టిస్తవః

కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి-
ర్లక్ష్మీస్వయంవరణమఙ్గళదీపికాభిః|
సేవాభిరమ్బ తవ పాదసరొజమూలే
నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్||౧||

కళ్యాణములను వర్షించునవీ, అమృతముతొ నిండినవీ, లక్ష్మి స్వయముగా ప్రాప్తించు నట్టి మంగళములను చూపించునవీ, అగు నీ పాదపద్మముల సేవలచే భాగ్యవంతులైన జనుల యొక్క మనస్సునందు ఏమేమి కల్గింప బడలేదు?

ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే
త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే|
సాన్నిధ్యముద్యదరుణాయుతసొదరస్య
త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య||౨||

ఓ తల్లీ| నిన్ను నమస్కరించునపుడు కన్నులు ఆనంద బాష్పములతొ నిండుగాక. పదివేల సూర్యుల సమానమైనదీ, అమృతముతొ నిండినదీ, అగు నీ దివ్యస్వరూపము యొక్క సాన్నిధ్యము కలుగుగాక. ఇది మాత్రమే నా కొరిక.

ఈశత్వనామకలుషాః కతి వా న సన్తి
బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః|
ఏకః స ఏవ జనని స్థిరసిద్ధిరాస్తే
యః పాదయొస్తవ సకృత్ప్రణతిం కరొతి||౩||

ఈశ్వరుడు (ప్రభువు) అను పేరును కలుషితము చేయుచూ ప్రతి జన్మము నందును వినాశమును పొందు బ్రహ్మ మొదలగు దేవతలేందరు లేరు? నీపాదములకు ఒక్కసారి ఏవడు నమస్కరించునొ ఒ జననీ| వాడే స్థిరమైన సిద్దిని పొందగలడు.

లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం
కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్|
కన్దర్పకొటిసుభగాస్త్వయి భక్తిభాజః
సంమొహయన్తి తరుణీర్భువనత్రయేపి||౪||

ఓ త్రిపురసుందరీ| కారుణ్యముతొ నిండినదీ, కాంతివంతమైనదీ, అగు నీ కటాక్షమును ఒక్కసారి పొంది నీ భక్తులు కొటి మన్మథసమానులై ముల్లొకములందలి యువతులను సమ్మొహ పరచుచున్నారు.

హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా
మాతస్త్రికొణనిలయే త్రిపురే త్రినేత్రే|
త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ
దీవ్యన్తి నన్దనవనే సహలొకపాలైః||౫||

త్రికోణము నందు నివసించు ఓ తల్లీ| త్రిపుర సుందరీ| మూడు కన్నులు ఉన్న దానా| నీ నామమగు హ్రీంకారమునే వేదములు వర్ణించుచున్నవి. నీభక్తులు నిన్ను స్మరించుచూ యమభటుల పరాభవమును వదలి నందనవనము నందు లొకపాలులతొ క్రీడించుచున్నారు.

హన్తుః పురామధిగళం పరిపీయమానః
క్రూరః కథం న భవితా గరలస్య వేగః|
నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం
దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య||౬||

ఓ తల్లీ| అమృతముతొ తడిసి చల్లనై న నీ దేహము పరమేశ్వరుని అర్ధశరీరమై తాపమును చల్లార్చనిచొ త్రిపురాంతకుడగు శివుడు కంఠము నిండుగా త్రాగిన గరళము యొక్క తీవ్రత ఏంత క్రూరముగా ఉండేదొ కదా|

సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయొః ప్రణామః|
కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి||౭||

ఓ దేవి| నీ పాదపద్మములకు చేసిన నమస్కారము సర్వజ్ఞత్వమును, సభలొ వాక్పాటవమును కలిగించును. అంతేకాక మేరుస్తున్న కిరీటమును, ఉజ్జ్వలమైన తేల్లని గొడుగును, రేండు పక్కల వింజామరలను, విశాలమైన భూమిని(రాజ్యాధికారమును) ఇచ్చును.

కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు
కారుణ్యవారిధిభిరమ్బ భవత్కటాక్షైః|
ఆలొకయ త్రిపురసున్దరి మామనాథం
త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణమ్||౮||

ఓ తల్లీ| త్రిపురాసుందరీ| కొరికలు తీర్చు కల్పవృక్షములు, కరుణా సముద్రములు అగు నీ కటాక్షముతొ అనాథయైన, నీ పై ఆశలు పేట్టుకున్న నన్ను చూడుము.

హన్తేతరేష్వపి మనాంసి నిధాయ చాన్యే
భక్తిం వహన్తి కిల పామరదైవతేషు|
త్వామేవ దేవి మనసా సమనుస్మరామి
త్వామేవ నౌ మి శరణం జనని త్వమేవ||౯||

అన్య మానవులు ఇతరులైన చిన్న దేవతల పై మనస్సులనుంచి భక్తి పేంపొందించుకొనుచున్నారు. ఒ దేవి| నేను మనస్సుతొ నిన్నే స్మరించుచున్నాను. నిన్నే నమస్కరించుచున్నాను. ఒ తల్లీ| నీ వే శరణము.

లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీక్షణానా-
మాలొకయ త్రిపురసున్దరి మాం కదాచిత్|
నూనం మయా తు సదృశః కరుణైకపాత్రం
జాతొ జనిష్యతి జనొ న చ జాయతే చ||౧౦||

ఓ త్రిపుర సుందరీ| నీ కటాక్షవీక్షనములకు గమ్యస్థలములు ఏన్ని ఉన్ననూ నన్ను ఒక్కసారి చూడుము.నాతొ సమానముగా దయచూపదగినవాడు పుట్టలేదు, పుట్టబొడు, పుట్టుట లేదు.

హ్రీం హ్రీమితి ప్రతిదినం జపతాం తవాఖ్యాం
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే|
మాలాకిరీటమదవారణమాననీయా
తాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః||౧౧||

ఓ త్రిపుర సుందరీ| ’హ్రీం’ హ్రీం’ అని ప్రతిదినమూ జపించువారికి లభించినది ఈ లొకములొ ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగులతొ విరాజిల్లు భూదేవి శ్రీదేవి స్వయముగనే వారిని సేవించును.

సమ్పత్కరాణి సకలేన్ద్రియనన్దనాని
సామ్రాజ్యదాననిరతాని సరొరుహాక్షి|
త్వద్వన్దనాని దురితాహరణొద్యతాని
మామేవ మాతరనిశం కలయన్తు నాన్యమ్||౧౨||

పద్మముల వంటి కన్నులు కల ఒ త్రిపుర సుందరీ| నేకు చేయు వందనములు సంపదలను కలిగించును. ఇంద్రియములన్నిటికీ సంతొషము నిచ్చును. సామ్రాజ్యములనిచ్చును. పాపములను తొలగించును. ఒ తలీ నీ నమస్కార ఫలితము ఏల్లప్పుడు నన్ను పొందుగాక.

కల్పొపసంహృతిషు కల్పితతాణ్డవస్య
దేవస్య ఖణ్డపరశొః పరభైరవస్య|
పాశాఙ్కుశైక్షవశరాసనపుష్పబాణా
సా సాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా||౧౩||

ఓ త్రిపురసుందరీ| ప్రళయకాలమునందు తాండవము చేయుచూ గండ్రగొడ్డలిని చేపట్టిన పరమేశ్వరునకు సాక్షిగా పాశము-అంకుశము-చేరకువిల్లు-పుష్పబాణము ధరించిన నీ స్వరూప మొక్కటే నిలబడుచున్నది.

లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం
తేజః పరం బహులకుఙ్కుమ పఙ్కశొణమ్|
భాస్వత్కిరీటమమృతాంశుకలావతంసం
మధ్యే త్రికొణనిలయం పరమామృతార్ద్రమ్||౧౪||

అమ్మా| తేజొవంతమైనదీ, కుంకుమతొ ఏర్రనైనదీ, ప్రకాశించు కిరీటమును ధరించినదీ, చంద్రకళను తలపై అలంకరించుకున్నదీ, త్రికొణము యొక్క మధ్యలొనున్నదీ, అమృతముతొ తడిసినదీ, అగు నీ అర్ధశరీరము ఏల్లప్పుడు నా మనస్సునందు లగ్నమగు గాక.

హ్రీంకారమేవ తవ నామ తదేవ రూపం
త్వన్నామ దుర్లభమిహ త్రిపురే గృణన్తి|
త్వత్తేజసా పరిణతం వియదాది భూతం
సౌఖ్యం తనొతి సరసీరుహసమ్భవాదేః||౧౫||

ఓ త్రిపుర సుందరీ| ’హ్రీం’ కారమే నీ పేరు. నీ రూపము. అది దుర్లభమైనదని చేప్పుచుందురు. నీ తేజస్సుచే ఏర్పడిన ఆకాశము మొదలగు పంచ భూతసముదాయము బ్రహ్మ ముదలగు సమస్త జీవరాశికి సుఖమును కల్గించుచున్నది.

హ్రీంకారత్రయసమ్పుటేన మహతా మన్త్రేణ సన్దీపితం
స్తొత్రం యః ప్రతివాసరం తవ పురొ మాతర్జపేన్మన్త్రవిత్|
తస్య క్షొణిభుజొ భవన్తి వశగా లక్ష్మీశ్చిరస్థాయినీ
వాణీ నిర్మలసూక్తిభారభరితా జాగర్తి దీర్ఘం వయః||౧౬||

ఓ తల్లీ| మూడు ’హ్రీం’ కారములతొ సంపుటితమైన మహామంత్రముతొ వేలుగొందుచున్న ఈ స్తొత్రమును ప్రతిరొజూ నీ ముందు నిలబడి ఏ మంత్తవేత్త జపించునొ అతనికి రాజులేల్లరు వశులగుదురు.లక్ష్మి చిరస్థాయిగా నుండును. నిర్మలమైన సూక్తులతొ నిండిన సరస్వతి ప్రసన్నురాలగును.చిరాయువు కలుగును.


హర హర శంకర జయ జయ శంకర

హర హర శంకర జయ జయ శంకర
రాజా రాక్షసశ్చైవ శార్దూలాః తత్ర మంత్రిణః!
గృద్రాశ్చ సేవకాః సర్వే యథా రాజా తథా ప్రజా!!


రాజా రాక్షస రూపేణ
వ్యాఘ్ర రూపేణ మంత్రిణా సేవకా స్వానరూపేణా
యథారాజా తథాప్రజా!
 ప్రజా రంజకముగా పరిపాలన చేయ వలసిన రాజే రాక్షసుడిలా ప్రవర్తిస్తే అతని వద్ద నున్న మంత్రులు ప్రజల పాలిట పెద్ద పులులగుదురు. సేవకులు గ్రద్దలై ప్రజలను పీక్కు తిందురు. రాజ్యమునేలే రాజు ఎలా ఉంటే ఆ రాజ్యమునందలి ప్రజలు కూడా అదే విధంగా ఉంటారు సుమా

Sunday 8 July 2012

my frends post

అనుమానం లేదు..అన్నీ వేదాల్లోనే ఉన్నాయి
సంప్రదాయ కుటుంబ నేపథ్యం, గణితంలో పీజీ, బ్యాంకులో ఉద్యోగం, కమ్యూనిస్టు సాహిత్యం, ఆధ్యాత్మిక సేవ, వేదాలేం చెబుతున్నాయో పరిశోధన... ఇవన్నీ కలిస్తే - కేవీ కృష్ణమూర్తి. "మన భవిష్యత్తుకు పునాది గతంలోనే ఉంది...'' అని ఢంకా బజాయించి మరీ చెబుతున్న ఈయన పరమ చాదస్తుడు కాదు, భారతీయ విజ్ఞానం పట్ల గొప్ప నమ్మకమున్న పరిశోధకుడు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పరిశోధకులను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చే కృషి చేస్తున్న ఆధునికుడు. హైదరాబాద్‌లో 'ఐ-సెర్వ్' సంస్థను స్థాపించి ప్రాచీన శాస్త్రాలను పునరుద్ధరించడానికి పనిచేస్తున్న కేవీ కృష్ణమూర్తి అంతరంగం ఆయన మాటల్లోనే....

"సంప్రదాయ కుటుంబంలో పుట్టిపెరగడం వల్ల ప్రాచీన విజ్ఞానం పట్ల ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉండేది. యూనివర్సిటీ నుంచి లెక్కల్లో ఎమ్మే పట్టా తీసుకుని, ఆంధ్రా బ్యాంక్‌లో ఇరవయ్యేళ్ల పాటు ఉద్యోగం చేశాను. ఆ సమయంలోనే ట్రేడ్ యూనియన్ల ద్వారా కమ్యూనిస్టులతో పరిచయం పెరిగింది. ఆ సాహిత్యాన్ని బాగా చదివాను. మన దేశ చరిత్రను వాళ్లు విశ్లేషించే తీరు నాకెందుకో నచ్చలేదు. దాంతో 86లో స్వచ్ఛంద సేవకుడిగా మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లిపోయాను. అక్కడ ఆధ్యాత్మిక సాహిత్య విభాగంలో పనిచేసేవాడిని. ఆ గ్రంథాలను చదువుతూ ఉండగా ఇవాళున్న సైడ్ ఎఫెక్ట్స్ లేని సైన్స్ ఒకనాడు మన దేశంలో వర్ధిల్లిందనే భావన బలంగా కలిగింది నాలో.

దాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించాలంటే పరిశోధన అవసరం. అనేక శాస్త్రాల్లో, అనేక విషయాల్లో లింకులు తెగిపోయాయి. వాటిని పునరుద్ధరించాలంటే బోలెడంత పరిశోధన చెయ్యాలి. నిపుణులను సంప్రదించాలి. ఆ పనిలో ఉన్నప్పుడే నాకో సంగతి అర్థమయింది. అదేమంటే నాలాగే ప్రాచీన విజ్ఞానాన్ని మథిస్తున్నవారు ఇంకొంతమంది ఉన్నారని. అయితే ఎవరి పని వారిది. ఎక్కడో కాశీలో ఒక పండితుడు పరిశోధిస్తున్న అంశమే ఇక్కడ మైసూర్లోనూ మరొక సైంటిస్టు చేస్తుండొచ్చు. దీనివల్ల ఇద్దరి పనిగంటలు, శ్రమ అన్నీ వృథా అయ్యే అవకాశముంది.

అదే వారిద్దరికీ మధ్య కమ్యూనికేషన్ ఉంటే ఆలోచనలూ, పనీ పంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందేవారు కదా అనిపించింది. అందరి వివరాలూ సేకరించి ఒకచోట పెట్టాలనుకున్నాను. దానిలో కొన్ని ఇబ్బందులెదురయ్యాయి. ఎలాగంటే ఆధ్యాత్మిక పరిసరాల్లో నివసిస్తున్న వ్యక్తిని అని సైంటిస్టులు కొందరు నాతో మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. మతపరమైన ఆసక్తితో నేనీ పని చేస్తున్నానేమో అని అనుమానించేవారు. ఇలాకాదని స్వామీజీ అనుమతి తీసుకొని ఆశ్రమం నుంచి బైటకొచ్చేశాను. 2004లో హైదరాబాద్ కేంద్రంగా 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్' (ఐ-సెర్వ్) సంస్థను ప్రారంభించాను. ఇది ఒక పూర్తిస్థాయి పరిశోధన సంస్థ. కులమతాల ప్రస్తావన లేదు, ఉండదు.''

అందరం కలిసి... "వేదాలు భారతీయులందరివీను. వాటి గురించిన ఊహాపోహలు కాకుండా, సరైన అవగాహన మన పౌరులందరికీ ఉండాలి. 'యథేమాం వాచమ్ కళ్యాణి మావదాని జనేభ్య' అనే శ్లోకానికి అర్థం - 'ఈ వేదస్వరం వల్ల సమస్త మానవాళి సుఖసంతోషాలతో ఉండాలి' అన్న శుభాకాంక్షే. అంత ఉదాత్త భావనలున్న వేదాలు, వాటినుంచి వచ్చిన ఉపనిషత్తులు, పురాణాలు వంటి వాటిలో మన విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తల తెగిపడిపోతే మళ్లీ అతికించారని ఉంది. దానికి సంబంధించిన సైంటిఫిక్ వివరాలు మాయమైపోవడం వల్ల ఈనాడది ఏదో జానపద కథలాగా అనిపిస్తుంది. అదెలా చేశారు, దానికి ఆనాడున్న వైద్య విజ్ఞానమెలాంటి పద్ధతులు అనుసరించింది అన్న వివరాలన్నిటినీ మనం పరిశోధించాలి. ఇంతకుముందు 'మిస్సింగ్ లింక్స్' అన్నాను చూడండి, అవి ఇలాంటివే. గాలిలో పుష్పక విమానం ఎగిరిందంటారు, దాని ఇంజనీరింగ్ తెలియకపోతే అది కేవలం కల్పిత కథలాగా మిగిలిపోతుంది. దాని వివరాలను ఇప్పటికైనా సేకరించి ఆధునిక శాస్త్ర సాంకేతికతలతో అనుసంధానిస్తే మన భవిష్యత్ తరాలకు అద్భుతమైన పునాది వేసినవాళ్లమవుతాం. అందుకే మన భవిష్యత్తు గతంలోనే ఉందని నేనంటాను.

ఆ గతాన్ని పరిశోధిస్తున్న వారందరికీ తగిన సౌకర్యాలున్న వేదికను కల్పించడమే ఐ-సెర్వ్ లక్ష్యం. ఈ సంస్థ దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలతో, ఇతర పరిశోధక సంస్థలతో కలిసి కృషి చేస్తోంది. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో కలిసి హెర్బల్ మెడిసిన్ వంటి రంగాల్లో నాలుగు డిప్లమా కోర్సులనూ నిర్వహిస్తోంది. వివిధ భాషల్లోని ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన పదివేల పుస్తకాల సమాచారాన్ని మా గ్రంథాలయంలో భద్రపరిచాం. దాతృత్వ దృష్టితో ఒక ఆయుర్వేద డిస్పెన్సరీనీ నిర్వహిస్తున్నాం. ఏడాదికి పదివేల మంది వరకూ దీని సేవలను వినియోగించుకుంటారని అంచనా. వివిధ శాస్త్రాలకు సంబంధించి అరుదైన రాత ప్రతులను సంపాదించడానికి, వాటిని ఆధునిక పద్ధతుల్లో అందరికీ అందుబాటులో ఉండేలా చెయ్యడానికి ముగ్గురు పరిశోధకులు రెండేళ్లుగా చాలా తిరుగుతూ శ్రమిస్తున్నారు. గణితం, పురావస్తుశాస్త్రం, పర్యావరణం వంటి ఏ రంగంలోని నిపుణులైనా సరే మాతో చేరవచ్చు. వారి విజ్ఞానాన్ని కొత్త పరిశోధనలకు ఉపయోగించవచ్చు.''

వివిధ రంగాల్లో పరిశోధన "ప్రాచీన విజ్ఞానానికి సంబంధించిన ఐదారు వందల పుస్తకాల పేర్లు, వాటి రచయితల పేర్లు సంపాదించి ఒక పుస్తకం ప్రచురించాను. దురదృష్టవశాత్తూ వాటిలో ఏ ఒక్క పుస్తకమూ ఇప్పుడు దొరికేది కాదు. అయితే కనీసం పేర్లయినా తెలియాలన్నది నా ఆలోచన. ఆయుర్వేదం, జ్యోతిషం, గ్రహగతుల గురించిన విజ్ఞానం ఇప్పుడు మనదగ్గర కొంతలో కొంతయినా బతికున్నాయి. అవైనా పూర్తిగా అంతరించిపోకుండా కాపాడుకోవాలని కొన్ని ప్రాజెక్టులు మొదలెట్టాం. ఉదాహరణకు జ్యోతిష, పంచాంగ శాస్త్రాల ఆధారంగా మన చరిత్ర తేదీలను కచ్చితంగా నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే రాముడి కాలం ఏమిటి అన్నది సరిగ్గా తెలిస్తే అప్పటి సామాజిక, రాజకీయ చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోగలం. అలాగే ఒకప్పుడు జీవనదులుగా ఉన్నవి ఎప్పుడు ఎండిపోయాయో తేదీలతో సహా తెలియాలి. అలాగే వర్షాలెప్పుడు పడతాయో పూర్వీకులు సరిగ్గా చెప్పగలిగేవారు. పంచాంగాల్లో రాసిన రోజు వర్షం పడేదంతే. ఇప్పుడా పరిజ్ఞానం లుప్తమైపోతోంది. దాన్ని ఆధునిక వాతావరణ శాస్త్రంతో మేళవించి 'రెయిన్ మ్యాప్ ఆఫ్ ఇండియా' తయారుచేసే పనిలో ఉన్నాం. శ్రీహరికోటలోని ఇస్రోలో ముఖ్య వాతావరణ అధికారిగా పనిచేసి రిటైరయిన డాక్టర్ జీవీ రామ దీనిలో పాలుపంచుకుంటున్నారు.

మరో విషయం చూడండి, పూర్వం భూకంపాల వల్ల కలిగిన జననష్టం గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఇన్నివేల ఏళ్ల మానవ నాగరికతలో భూకంపాలు రాకుండా ఉండి ఉండవు. కానీ వాటిని ముందుగానే అంచనా వేసి జననష్టాన్ని నివారించే పద్ధతి ఆనాడుండేది. దాన్నిప్పుడు వెలికితీయాలి. అలాగే ఐదారేళ్ల క్రితం మన దేశంలో సునామీ వచ్చినప్పుడు తమిళనాట కొన్ని గిరిజన తెగలు దాన్ని ముందుగానే ఊహించి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. వాళ్ల మీద పరిశోధనలు సాగుతున్నాయి. అనాదిగా మనది వ్యవసాయాధారిత దేశమని చెబుతూ వస్తున్నామేగాని భూసార సంరక్షణ కోసం గాని, దిగుబడి పెంచడం కోసం గాని ఏమీ చెయ్యడం లేదు. ఏటికేడూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ప్రాచీన భారతీయ వ్యవసాయ పద్ధతులు' అనే అంశమ్మీద కిందటేడు ఆగస్ట్‌లో నూజివీడులో జాతీయస్థాయి సెమినార్‌ను నిర్వహించాం. మూడొందల మంది రైతులు, దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులు వచ్చి తమ అనుభవాలను, అభిప్రాయాలను కలబోసుకున్నారు. ఇలాంటి ప్రయోజనకరమైన సదస్సులను ప్రతి రెండు నెలలకొకటి చొప్పున నిర్వహిస్తున్నాం.''

నెంబర్ వన్ అవుతాం... "భా' అంటే జ్ఞానం, 'రత్' అంటే ప్రేమికుడు అని అర్థం. అందువల్ల 'భారత్' అంటే జ్ఞానానికి నెలవని అర్థం. అదేదో పాత కాలం మాట కాదు, ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రంగాలను ముందుకు నడిపిస్తున్నది మనవాళ్లే. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత సాయంతో అందిపుచ్చుకుంటే వచ్చే కొన్నేళ్లలోనే మనం 'సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం'గా నిలదొక్కుకోగలం. వేదం, సంస్కృతం తెలిసినవారు, ఆధునిక శాస్త్రజ్ఞులు కలిసి పనిచేస్తే మన దేశం శాస్త్రవిజ్ఞాన రంగాల్లో అసాధారణ ప్రగతిని సాధిస్తుందనే నమ్మకం నాకుంది.''

Prof. K.V.Krishna Murty
Chairman & Managing Director
Institute of Scientific Research on Vedas (I-SERVE)
(Recognized by DSIR as SIRO)
11-13-279, Road No. 8, Alakapuri, Hyderabad-500035
Phone: 91-40-24035013