Thursday 30 May 2013

సంపదనిచ్చే మంత్రం



ధనసంపదనిచ్చే మంత్రం

కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం

తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)

Wednesday 29 May 2013

మాధవేశ్వరి

మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

లింగరాజ ఆలయం,

Kaliyuga Daivam
లింగరాజ ఆలయం, భువనేశ్వర్ లో అన్ని అతిపెద్ద,లతెరితే 465 అడుగులు 520 అడుగుల కొలిచే ఒక spacious సమ్మేళనం గోడ లోపల ఉన్న. గోడ 6 అంగుళాలు మందపాటి మరియు మదురు ఒక సాదా ఏటవాలు దీనిపై 7 అడుగులు. సరిహద్దు గోడ లోపలి ముఖం కలిసి బహుశా బయట దూకుడుపై సమ్మేళనం గోడ రక్షించడానికి ఉద్దేశించిన ఒక చప్పరము అక్కడ నడుస్తుంది.
లింగరాజ ఆలయం చాలా భువనేశ్వర్ అత్యంత ముఖ్యమైన స్మారక చిహ్నం. వంద మరియు ఎనభై అడుగుల ఎత్తు పెరుగుతున్న మరియు మొత్తం భూభాగం ఆధిపత్యం ఇది నిర్మాణ కళింగ రకం అన్నది క్వింట్ సారాంశం మరియు భువనేశ్వర్ వద్ద భవన నిర్మాణ ఆచారం పరాకాష్ఠ ఫలితంగా ప్రాతినిధ్యం
మనాథ్ ఆలయం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. సోమనాథ్ ఆలయాన్ని విదేశీ దురాక్రమణదారులు/మత ఛాందసవాదులు ఎన్నోసార్లు సార్లు(6సార్లు కూల్చివేశారు అని చెప్తారు) కూల్చివేశారు. 

అష్టాదశ శక్తి పీఠాలు

భక్తి సమాచారం
అష్టాదశ శక్తి పీఠాలు

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

Friday 24 May 2013

శ్రీ లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామావళి:--

శ్రీ లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామావళి:--ఓం నారసింహాయ నమఃఓం మహాసింహాయ నమఃఓం దివ్య సింహాయ నమఃఓం మహాబలాయ నమఃఓం ఉగ్ర సింహాయ నమఃఓం మహాదేవాయ నమఃఓం స్తంభజాయ నమఃఓం ఉగ్రలోచనాయ నమఃఓం రౌద్రాయ నమఃఓం సర్వాద్భుతాయ నమః || 10 ||ఓం శ్రీమతే నమఃఓం యోగానందాయ నమఃఓం త్రివిక్రమాయ నమఃఓం హరయే నమఃఓం కోలాహలాయ నమఃఓం చక్రిణే నమఃఓం విజయాయ నమఃఓం జయవర్ణనాయ నమఃఓం పంచాననాయ నమఃఓం పరబ్రహ్మణే నమః || 20 ||ఓం అఘోరాయ నమఃఓం ఘోర విక్రమాయ నమఃఓం జ్వలన్ముఖాయ నమఃఓం మహా జ్వాలాయ నమఃఓం జ్వాలామాలినే నమఃఓం మహా ప్రభవే నమఃఓం నిటలాక్షాయ నమఃఓం సహస్రాక్షాయ నమఃఓం దుర్నిరీక్షాయ నమఃఓం ప్రతాపనాయ నమః || 30 ||ఓం మహాదంష్ట్రాయుధాయ నమఃఓం ప్రాఙ్ఞాయ నమఃఓం చండకోపినే నమఃఓం సదాశివాయ నమఃఓం హిరణ్యక శిపుధ్వంసినే నమఃఓం దైత్యదాన వభంజనాయ నమఃఓం గుణభద్రాయ నమఃఓం మహాభద్రాయ నమఃఓం బలభద్రకాయ నమఃఓం సుభద్రకాయ నమః || 40 ||ఓం కరాళాయ నమఃఓం వికరాళాయ నమఃఓం వికర్త్రే నమఃఓం సర్వర్త్రకాయ నమఃఓం శింశుమారాయ నమఃఓం త్రిలోకాత్మనే నమఃఓం ఈశాయ నమఃఓం సర్వేశ్వరాయ నమఃఓం విభవే నమఃఓం భైరవాడంబరాయ నమః || 50 ||ఓం దివ్యాయ నమఃఓం అచ్యుతాయ నమఃఓం కవయే నమఃఓం మాధవాయ నమఃఓం అధోక్షజాయ నమఃఓం అక్షరాయ నమఃఓం శర్వాయ నమఃఓం వనమాలినే నమఃఓం వరప్రదాయ నమఃఓం అధ్భుతాయ నమః ll 60 llఓం భవ్యాయ నమఃఓం శ్రీవిష్ణవే నమఃఓం పురుషోత్తమాయ నమఃఓం అనఘాస్త్రాయ నమఃఓం నఖాస్త్రాయ నమఃఓం సూర్య జ్యోతిషే నమఃఓం సురేశ్వరాయ నమఃఓం సహస్రబాహవే నమఃఓం సర్వఙ్ఞాయ నమః || 70 ||ఓం సర్వసిద్ధ ప్రదాయకాయ నమఃఓం వజ్రదంష్ట్రయ నమఃఓం వజ్రనఖాయ నమఃఓం మహానందాయ నమఃఓం పరంతపాయ నమఃఓం సర్వమంత్రైక రూపాయ నమఃఓం సర్వతంత్రాత్మకాయ నమఃఓం అవ్యక్తాయ నమఃఓం సువ్యక్తాయ నమః || 80 ||ఓం వైశాఖ శుక్ల భూతోత్ధాయ నమఃఓం శరణాగత వత్సలాయ నమఃఓం ఉదార కీర్తయే నమఃఓం పుణ్యాత్మనే నమఃఓం దండ విక్రమాయ నమఃఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమఃఓం భగవతే నమఃఓం పరమేశ్వరాయ నమఃఓం శ్రీ వత్సాంకాయ నమః || 90 ||ఓం శ్రీనివాసాయ నమఃఓం జగద్వ్యపినే నమఃఓం జగన్మయాయ నమఃఓం జగత్భాలాయ నమఃఓం జగన్నాధాయ నమఃఓం మహాకాయాయ నమఃఓం ద్విరూపభ్రతే నమఃఓం పరమాత్మనే నమఃఓం పరజ్యోతిషే నమఃఓం నిర్గుణాయ నమః || 100 ||ఓం నృకే సరిణే నమఃఓం పరతత్త్వాయ నమఃఓం పరంధామ్నే నమఃఓం సచ్చిదానంద విగ్రహాయ నమఃఓం లక్ష్మీనృసింహాయ నమఃఓం సర్వాత్మనే నమఃఓం ధీరాయ నమఃఓం ప్రహ్లాద పాలకాయ నమఃఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః || 108 ||

శ్రీ కూర్మ జయంతి


Kaliyuga Daivam
శ్రీ కూర్మ జయంతి ..

మంధనాచల ధారణ హేతో, దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్.

మహావిష్ణువు అవతారాలైన దశావతారాలలో శ్రీ కూర్మావతారం నేరుగా రాక్షస సంహారం కోసం అవతరించినది కాకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని బట్టి ఉద్దేశింపబడినది.
అసుర వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలసి పురుషోత్తముని ప్రార్ధించారు. కారణాంతరంగుడైన శ్రీ హరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. పాలసముద్రంలో సర్వ తృణాలు, లతలు, ఓషధులు వేసి మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని వాసుకి మహా సర్పాన్ని తరి తాడుగా చేసుకుని మధిస్తే సకల శుభాలు కలుగుతాయని, అమృతం లభిస్తుందని పలికాడు.
ఆ మేరకు ఇంద్రుడు దానవులనూ సాగరమధనానికి అంగీకరింపచేసాడు. పాముకి విషం తల భాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు, తమస్సు పాప భూయిష్టం. దాన్ని అణచివేస్తే తప్ప లోకంలోనైనా, మనస్సులోనైనా ప్రకాశం కలుగదు. అందుకే శ్రీహరి రాక్షసుల్ని మృత్యురూపమైన వాసుకు ముఖం వద్ద నిలిపాడు.
మధనంలో బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవటంతో పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పటి శ్రీహరి లీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపింపజేసే పరిమాణంతో సుందర కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన సుందర పర్వతాన్ని తన కర్పకం (వీపు) పై నిలిపాడు. క్షీరసాగర మధనంలో చిట్ట చివర లభించిన అమృత కలశానికై దేవదానవులు కలహించగా, విష్ణువు మోహిని రూపం దాల్చి, రాక్షసులని సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం ప్రసాదించాడు.
 — 

భక్త కన్నప్ప ఆలయం


భక్తి సమాచారం
భక్త కన్నప్ప ఆలయం
శ్రీకాళహస్తిలోని శివలింగానికి కంటనీరు కారితే తన కన్నులర్పించిన మహా భక్తుడు కన్నప్ప. కన్నప్ప పుట్టిన ఊరు పొత్తపినాడులోని ఉడు మూరు అని శివపురాణం తెలుపుతున్నది. ఈ ఉడుమూరు రాజంపేట మండలంలోని కొం డ్లోపల్లెకు అతి సమీపంలో ఉన్నట్టు మెకంజీ కైఫీయత్తులలోని పోలి, ఊటుకూరు చరిత్రల వల్ల తెలుస్తున్నది. దీంతో అధికారికంగా ప్రకటించక పోయి న భక్త కన్నప్ప జన్మస్థలం రాజం పేట మండలంగా స్థానికులు భావిస్తూ ఈ మండలంలోని ఊటుకూరు గ్రామంలో కన్నప్ప నిర్మించినట్టుగా భావిస్తున్న శివా లయంలో కన్నప్ప విగ్రహాన్ని నెలకొల్పారు.

ఆలయ చరిత్ర...
ద్వాపరయుగంలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేయ గా పాశుపతాస్త్రం ఇచ్చారు గాని మోక్షం ప్రసాదించలే దు. కలియుగంలో బోయ వాడుగా జన్మించి మోక్షం పొందుతావని శివుడు అర్జునుడికి చెప్పినట్టు ఇతిహాసం పేర్కొంటోంది. ఈ ప్రకారం అర్జునుడు కలియుగంలో ఊడుమూరులోని బోయకుటుంబంలో తిన్నడుగా జన్మించి శివుని అనుగ్రహాన్ని అందుకున్నారన్నది ప్రతీతి. ఉడుమూరులో కన్నప్ప ప్రతిష్ఠించిన లింగమే ఉడుమేశ్వరాల యంగా ప్రసిద్ధి చెందిందంటారు. ఆ శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఉడుమూరు కొండ్లోపల్లె సమీపంలో ఉండేదని, కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం కాలగమనంలో సమీపంలోని ఊటుకూరుకు చేరిందంటారు. ఇక్కడి శివాలయం అత్యంత పురాతనమైంది. ఊటుకూరు గ్రామం తాళ్ళపాక అన్నమాచార్యు లవారి అవ్వగారి ఊరు. ఈ ఊరికి 700 సంవత్సరాల కాలం నాటి చరిత్ర మనకు అవగతమవుతుంది. ఏది ఏమైనా కన్నప్ప జన్మస్థలం అధికారికంగా ప్రకటించకపోయినా స్థానికులు కన్నప్ప జన్మస్థలాన్ని రాజంపేట మండలంగానే భావిస్తూ కన్నప్ప స్మారకోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
రజో గుణము, తమో గుణము, సత్వ గుణము అనే మూడు గుణములు ఆది కాలంలో శ్రీమన్నారాయణుడు తన శరీరం నుండి సృష్టించాడు! ఈ మూడు గుణములతో శ్రీమన్నారాయణుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని మూడు రూపాలు ధరించాడు! ఈ మూడు గుణములు మానవులు ఆనందంగా ఉండటానికి పనికి వస్తాయి! రజో గుణం వల్లే సృష్టి జరుగుతుంది! ఈ రజస్సు స్త్రీ లో, ఈ రజస్సు పురుషుడులో రేతస్సులో లేకపోతె ఈ బ్రహ్మ సృష్టి కొనసాగదు! ఈ సృష్టి కర్త గ ఉన్నప్పుడు బ్రహ్మ రూపాలో ఉంటాడు శ్రీమన్నారాయణుడు! ఇంకా తమోగుణం అనేదానితో నాశనం చేస్తాడు! ఈ రజో గుణం ఎంత ఉండాలో అంత కంటే ఎక్కువ అయితే తద్వారా ఆహారం మీద కామం మీద కోరిక ఎక్కువ అయిపోతుంది! నిద్ర ఎక్కువై, బ్రష్టుడై, హింస ప్రవృత్తి అధికమై చివరికి నసించిపోతాడు! ఈ నశించే టప్పుడు తమోగుణం తో రుద్రుడై లోకాలన్నీ తనలో కలిపేసుకుంటాడు! ఇక మూడో గుణం అయిన పవిత్రమైన సత్వగుణం! దీనికి ఉనికి, నిలబడుట అని కూడా అర్ధం! శ్రీ మహా విష్ణువు జనములు నిలబడటానికి, ప్రాణులన్నీ బ్రతకడానికి, ఆహారాన్ని అందించి వీరి గుణం ప్రశాంతం గ ఉండటానికి తనే సత్వగుణం స్వీకరించి విష్ణువు అనే పేరుతో సృష్టిని కొనసాగిస్తుంటాడు! ఆపుడు అయన గోవింద రూపం లో ఉంటాడు!
సృష్టికర్త్రి బ్రహ్మ రూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప అని ఈ మూడింటిలో ఉన్న మహాశక్తిని స్తోత్రం చేస్తుంటాం మనం!

Wednesday 22 May 2013

దేవునికి పువ్వులు సమర్పిస్తే..!?



దేవునికి సంపెంగ పువ్వులు సమర్పిస్తే..!?
దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం.
1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.
3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
4. రుద్రాక్షపూవును అర్పిస్తే -ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
5. మల్లెపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలుపరిహరించబడతాయి.
6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండాసంతోషంగా ఉంటాయి.
7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.
8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలుతొలగిపోతాయి.
12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.
13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.
15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.
16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.
17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.
18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.
19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టిపీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనంఅవుతుంది.
20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

Gomata Gomata

Friday 17 May 2013

వైశాఖ మాస విశిష్టత


నరసింహ శర్మ
వైశాఖ మాస విశిష్టత
మనము -వైశాఖ స్నానం-వైశాఖ వైశిష్ట్యం- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

స్నానము ఎప్పుడు చేసినా ఎలా చేసినా శరీర మలినాలను తొలగించుకునే మార్గాలలో ఒకటి. ఆది మానవుడు ఆచరించడానికి స్నానానికి దైవత్వాన్ని మిలితం చేసి మన పూర్వికులు మనకందించిన ఆత్యాద్మిక ఆరోగ్యసూత్రాలే ఈ స్నానవ్రతాలు .

సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు.

సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు.

వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు.

పొద్దునే్న నిద్రను వదిలి స్నానాదులుచేసి రావిచెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలు చేసి మాధవుని తులసీదళాలతో పూజించడం అనేది ఈ వైశాఖమాసానికి ఉన్న ప్రత్యేకత. మాసాల్లో వైశాఖం మహావిష్ణువుకు ప్రీతికరమైనదని చెబుతారు. తృతీయనాడు కృతయుగం ఆరంభమైందని, కనుక ఈ కృతయుగాదినే అక్షయ తృతీయ పర్వదినంగా జరుపుతారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిషోత్తర పురాణం చెప్తోంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయనాడు బదరీ నారాయణుని దర్శించితే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయనాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఈ రోజు మొదలుకొని అన్నీ పర్వదినాలే. ఈ శుక్ల తదియనాడు సింహాచలేశుడు తన భక్తులకు నిజరూప దర్శనాన్ని కలుగచేస్తాడు. తదియనాడు ఆ సింహాచల వరాహ నృసింహుని చందనోత్సవాన్ని జరుపుతారు. లోకాలన్నీ కూడా చందనమంత చల్లగా ఉండాలనీ కోరుకొని ఈ చందనోత్సవంలో జనులందరూ పాల్గొంటారు. ఈ శుద్ధ తదియనాడు శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా రోహిణీ దేవికి జన్మించిన కారణాన బలరామ జయంతిని జరుపుకొంటారు. పంచమినాడు అద్వైతాన్ని లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరాచార్యుని జయంతి. ఆ ఆదిశంకరుడు చిన్ననాడే దరిద్రనారాయణులను చూసి కరుణాసముద్రుడై లక్ష్మీదేవిని స్తోత్రం చేసి వారిళ్ల్లను సౌభాగ్యాలకు నెలవు చేసాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారస్తోత్రంగా ఈనాటికీ విరాజిల్లుతోంది. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన రామానుజాచార్యుడు షష్ఠినాడు జన్మించిన కారణంగా రామానుజ జయంతిగా విశేషపూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షపాప్త్రి కోసం తీసుకొన్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దాన్ని బహిరంగ పరిచాడనే గురాగ్రహాన్ని కూడా లోకులకోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పతనం తెలుసుకొని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి మానవులకు ఎంతైనా ఉంది అని జ్ఞప్తి చేయడానికే ఈ రామానుజాచార్య జయంతి జరుపుతారంటారు. తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద అవ్వడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తపస్సులు చేసి కైలాసనాథుడిని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకొని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖమాస సప్తమినాడే జరిగింది. ఈ గంగోత్పత్తిని పురస్కరించుకొని గంగాస్తుతిని చేసినవారికి పతితపావన గంగ సకలపాపపు రాశిని హరిస్తుందని పండితులు చెప్తారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశే మోహినే్యకాదశి అని అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించినవారికి మహావిష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణ్ధుమ ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. తండ్రి మాటలను జవదాటకుండా పితృవాక్య పరిపాలకునిగా పేరుతెచ్చుకొన్న జమదగ్ని పుత్రుడు ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువును పట్టుకొని 21సార్లు రాజులపై దండయాత్ర చేసాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు శివచాపాన్ని విరచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకొందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నింటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోయాడు. ఆ జమదగ్ని రేణుకల పుత్రుడైన పరశురామజయంతిని పరశురామ ద్వాదశిగా జరుపుతారు. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహావిష్ణువు నృసింహుడై స్థంభంనుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశపుడిని సంహారం చేసి లోకాలన్నింటిని కాపాడినరోజు శుద్ధ చతుర్థశిగా భావించి నృసింహ జయంతిని చేస్తారు. ఇంకా బుద్ధ జయంతి, కూర్మజయంతి, నారద జయంతి ఇలా ఎందరో మహానుభావుల జయంతులు జరిపే ఈ వైశాఖం నుంచి మనం కూడా లోకకల్యాణకారకమైన పనులు చేయాలనే భావనను ఏర్పరుచుకోవాలి

Thursday 16 May 2013


Suvarna Radhaakrishna
ఘనాపాఠి అని ఎవరిని అంటారు ? దేనిలో ప్రావిణ్యం ఉన్నవారికి ఈ బిరుదు లభిస్తుంది ?

కృష్ణ యజుర్వేదంలో వరుసగా...సంహిత మంత్రాలు( 42 పన్నాలు లేక ప్రశ్నలు ), అరణ్యకం ( బ్రహ్మ విచారం ) (12 ప్రశ్నలు ), బ్రాహ్మణం ( మంత్రం యొక్క తంతు భాగం )(28 ప్రశ్నలు ) ... ఈ మొత్తం 82 ప్రశ్నలను "ఆశీతిద్వయం " అందురు. మొత్తం 82 ప్రశ్నలను ఆవర్తనం చేసిన పిదప ... సంహిత మంత్రాలకు (42 ప్రశ్నలకు ) పదపాటం , క్రమ , జట , ఘనాపాఠం చేసి " ఘనాపాఠి " అగుదురు .

ఘనం అంటే అదొక వేద పఠనములో ఉచ్చారణ ప్రక్రియ. ఉదాహరణకు 12-21-123-321-123-23-32 ఇలా వరుసలో చదువుతారు. (ఇక్కడ అంకెలు శబ్దాలు) ... ఉదా : గణాణాం / త్వా / గణపతిగుం ( Contd )....అనే దానిలో ఒక్కో పదాన్ని 1,2,3 లాగా తీసికొని పైన చెప్పిన 12-21-123-321-123-23-32 వరుస క్రమములో గబగబా చదవగలగాలి .

Sweta Vasuki
చందనయత్ర గురించి కొన్ని వివరాలు:--

ఈ నెల 13-05-2013 వ తేదీన సింహాచలమున వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే మనం అక్షయ తృతీయ(చందనయాత్ర) అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు.... స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము. 

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట. అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.

చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకిస్తారు.


  • ద్వైత, అద్వైతాల సంగమమే భక్తి జ్ఞానము
    సాధకావస్థలో ఉన్నప్పుడు భక్తి, జ్ఞాన మార్గాల నడుమ లోతైన అగాధమున్నట్లు పైకి కనిపిస్తుంది. అందుచేత భక్తులకూ, జ్ఞానులకూ మధ్య ఘర్షణలు తఱచు. ఈ ఘర్షణలు తీవ్రతరమై మన మతంలో ద్వైత, అద్వైత విశిష్టాద్వైత శాఖలు పుట్టుకొచ్చాయి. ద్వైతులు విశిష్టాద్వైతులు భక్తివాదులు. అద్వైతులు జ్ఞానవాదులు. అద్వైతుల పరమగురువు ఆదిశంకరులు.విశిష్టాద్వైతుల పరమగురువు శ్రీమద్రామానుజులు. వారివలెనే శ్రీ మధ్వాచార్యులు కూడా ద్వైతులే. “దేవుడూ, జీవుడూ ఎప్పటికీ వేఱువేఱే”నంటారు ద్వైతులు. “ఇద్దఱూ ఒకటే”నంటారు అద్వైతులు. భగవద్గీతలో, “నా భక్తుడైనవాడే నాకు ప్రియతముడు (యో మే భక్త స్స మే ప్రియః)” అన్న భగవానుడే జ్ఞానికి కాస్త పెద్దపీట వేస్తూ, “జ్ఞానికీ, నాకూ భేదమే లేదని నేను భావిస్తున్నాను (జ్ఞానీత్వాత్మైన మే మతమ్)” అని కూడా చెప్పాడు. మఱోచోట, ఆ భగవానుడే “ఈ ఇద్దఱి కంటే కూడా యోగాభ్యాసియే గొప్పవా”డని తేల్చాడు. తొలిచూపులో ఇదంతా గందరగోళంగా ఉంటుంది. కానీ పరమార్థదృష్ట్యా మూడూ ఏకీభవిస్తాయనేదే గీతాకారుడి హృదయం కావచ్చు.
    జ్ఞానవాదులకు (అద్వైతులకు) భక్తుల చేష్టలన్నీ వెఱ్ఱిమొఱ్ఱి వ్యవహారాలుగా, పిల్లకాయతనంగా తోస్తాయి. స్థావర జంగమాలన్నింటిలోనూ ఆత్మ ఉండగా, ఆ ఆత్మే పరబ్రహ్మై ఉండగా, దానికో ప్రత్యేకమైన పేరూ, ఆకారమూ కల్పించి, మిగతా ఆత్మల నుంచి దాన్ని వేఱుగా భావిస్తూ దాన్ని మాత్రమే పూజించడం వారికి మూర్ఖత్వంలా అగుపిస్తుంది. మానవుడు తనలోనే ఉన్న సర్వశక్తిమంతమైన ఆత్మను దర్శించలేని అంధుడై, బాహ్యప్రపంచంలో తన నెత్తిమీద దేవుడి పేరుతో అనవసరంగా ఒక యజమానుణ్ణి కల్పించుకొని నానా తీర్థక్షేత్రాల్లో ఆయన్ని వెతుకుతూ, ప్రార్థనలూ, స్తోత్రాలూ, శరణాగతి అనుకుంటూ తలబాదుకుని ఏడవడం, నానా కోరికలు కోరడం, దాన్ని భక్తిగానూ, మోక్షమార్గంగానూ భావించడం చూసి వారి పెదవులు పరిహాస స్ఫోరకమైన దరహాసాన్ని అలవోకగా ఒలికిస్తాయి.
    జ్ఞానుల మార్గమూ భక్తులకు అంతే అభ్యంతరకరంగా, బహుశా అంతకంటే ఎక్కువ అభ్యంతరకరంగా గోచరిస్తుంది. అది వారికి మిట్టవేదాంతంగా, దేవుడి పట్ల జీవుడికి గల విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించకుండా ఎగవేస్తున్న బాధ్యతారాహిత్యంగా, నాస్తికతానిర్విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, దేవుడూ, జీవుడూ ఒకటేనన్న సిద్ధాంతాన్ని వారు దైవధిక్కారంగానూ, ద్రోహంగానూ జమకడతారు. కనీసం అవాస్తవికమైన అతిశయోక్తిగా, మిథ్యావాదంగా నైనా చూస్తారు. భగవంతుడికి పూజా, సేవా, స్తోత్రమూ చేయకుండా మనిషి ఓ మూల ముక్కుమూసుకుని ధ్యానం పేరుతో తన గుఱించి తాను చింతన చేస్తూ కూర్చున్నంత మాత్రాన అతనికి పుణ్యమెలా వస్తుందో, అతను సద్గతులకెలా వెళతాడో అర్థం కాక వారు విడ్డూరంతో ముక్కుమీద వేలేసుకుంటారు.
    వాస్తవమేంటంటే – జ్ఞానంతో మనిషికి ఏ స్థితి కలుగుతుందో అదే భక్తితోనూ కలుగుతుంది. లేదా భక్తితో అతడు ఏ స్థాయికి వెళతాడో జ్ఞానంతోనూ అదే స్థాయికి వెళతాడు. నిజాయితీ గల జ్ఞానమార్గం భక్తికీ, అనన్యమైన భక్తిమార్గం జ్ఞానానికీ దారితీస్తాయి. విషయాల లోతును తఱచి తఱచి, పట్టి పట్టి, తెలుసుకుంటూ, తెలుసుకుంటూ సస్పృహం (conscious) గా మనిషి సాధించే మనఃపరిశుద్ధినీ, అరిషడ్వర్గాలపై గెలుపునీ భక్తుడు భక్తిలో మునగడం ద్వారా, అలా మనస్సుని వాటి నుంచి భగవంతుడి వైపు సంపూర్ణంగా త్రిప్పుకొని వాటియందు అభిరుచిని కోల్పోవడం ద్వారా అస్పృహం (uncounscious) గా సాధిస్తాడు. జ్ఞాని తారతమ్యవిచారణ ద్వారా చేసే అన్ని త్యాగాల్నీ, భక్తుడు శరణాగతి ద్వారా, “ఇది భగవంతుడి కోసం, లేదా ఇది భగవంతుడి సంకల్పం” అనుకుంటూ చేయగలుగుతాడు. జ్ఞాని సమాధిస్థితి ద్వారా సాధించే విశ్వాత్మభావాన్ని భక్తుడు భగవద్భావనతో తాదాత్మ్యం చెందడం ద్వారా సాధిస్తాడు. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా అభ్యసించే అద్వైతభావాన్ని భక్తుడు అందఱినీ దైవదూతలుగా భావించడం ద్వారా కైవసం చేసుకుంటాడు. జ్ఞాని యోగాభ్యాసం ద్వారా అలవఱచుకునే ప్రాణాయామాన్ని భక్తుడు భక్తిపారవశ్యంలో మునగడం ద్వారా సహజంగా సాధిస్తాడు. జ్ఞాని నిదిధ్యాసనం చేసీ చేసీ హృదయవైశాల్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా అందుకునే మనోమార్దవాన్ని భక్తుడు స్వాభావికమైన ప్రేమార్ద్ర్దభావం ద్వారా చేఱుకుంటాడు.
    నిజాయితీ గల సత్యాన్వేషణతో కూడుకొన్న జ్ఞానమార్గం బహుక్లిష్టమైనది. ప్రపంచాన్ని ప్రయోగశాలగా, జీవితాన్ని ప్రయోగవస్తువుగా, ఈ జన్మే తనకున్న ఏకైక అవకాశంగా, తన మనస్సే తన ఏకైక సాధనంగా, కొలమానంగా భావిస్తూ, గ్రహించిన ప్రతివిషయాన్నీ ఆచరణ అనే అగ్నిపరీక్షకు లోనుచేస్తూ నానా గుంటల్లో, గోతుల్లో పడుతూ లేస్తూ ఉండగా గమ్యానికి చేర్చేది జ్ఞానమార్గం. అందుకు చాలా నేర్పూ, ఓర్పూ, ధైర్యసాహసాలూ కావాలి. ఈ క్రమంలో మనిషి మొద్దుబాఱిపోతాడు. రాటుదేల్తాడు. అయినా సత్యాన్ని కనుగొనాలనే ఏకైక ఆశయమూ, తదేకనిష్ఠా అతని హృదయమార్దవ సౌరభాన్ని ఇగరనివ్వకుండా కడకంటా నిలబెడతాయి. ఇహపోతే నిక్కమైన భక్తిమార్గమూ కష్టమైనదే. దీనిక్కూడా చాలా గుండెనిబ్బరం కావాలి. “ఏం జఱిగినా భగవత్సంకల్పమే. అంతా నా మేలుకే జఱిగింది. భగవంతుడు ఏం చేసినా నా చిరంతన శ్రేయస్సును గమనంలో ఉంచుకునే చేస్తాడు. ఆయన నాకెప్పుడూ అన్యాయం చేయడు. మంచి జఱగనీ, చెడు జఱగనీ, అది ఎంతటిదైనా కానీ, చలించకుండా ఆయనకు సర్వదా విధేయుణ్ణయి, ఆయన లీలలకు తలవంచి మనసా వాచా కర్మణా స్వీకరించడమే నా పని. ఆయన్ని నేను ప్రశ్నించను. సవాళ్ళూ విసరను. ఆయన మార్గంలోంచి ఎప్పటికీ వైదొలగను. ఆయన్ని శాసించడం నా పని కాదు. నా బలమంతా ఆయనే. నాకు సంబంధించిన అన్ని విషయాలూ ఆయనే చూసుకుంటాడు” అనుకుని అనన్యంగా, నిర్ణిబంధంగా మనసారా భగవంతుణ్ణి ప్రేమించగల ఈ సర్వసమర్పణ భావుకమైన మనో‍ఽవస్థ బహు జన్మజన్మాంతరాల పుష్కల పుణ్యరాశి చేత గానీ సిద్ధించేది కాదు. సుఖపడాలనుకునేవారు ఒక్కపూట కూడా ఈ త్రోవ త్రొక్కలేరు.
    భక్తికి మూలం ప్రేమే. ఆ ప్రేమని మానవుడు భగవంతుడి వైపు మళ్ళించినప్పుడు దాన్ని భక్తి అంటున్నాం. ప్రేమకూ, జ్ఞానానికీ ఉన్న సంబంధం నిగూఢమైనది. ఒకటి రెండో దానికి దారితీస్తుందని పలువుఱు ఎఱగరు. ఒక వస్తువును లేదా విషయాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా అది తన గుఱించిన రహస్యాల్ని మనకు కాలక్రమంలో వెల్లడిస్తుంది. మానవ విజ్ఞానమంతా అలా ఉద్బుద్ధమైనదే కదా ! అలాగే ఒక విషయం గుఱించి, లేదా వ్యక్తి గుఱించి మనకు ఎంత బాగా తెలిస్తే అంతగా దాని/ అతని పట్ల ప్రీతి జనిస్తుంది. లోకంలో ఇతరులందఱికీ ద్వేషపాత్రుడైన వ్యక్తి అతని కుటుంబానికి మాత్రం ప్రేమాస్పదుడు కావడం ఇందువల్లనే. అతని సౌహార్ద కోణాల్ని అతని కుటుంబం ఎఱుగును. ఇతరులెఱగరు. అంతే తేడా. పక్షాంతరంలో – మనం ఒకఱి గుఱించి ఎంతగా అజ్ఞానంలో ఉంటామో అంతగా అతన్ని ద్వేషిస్తాం. జ్ఞానం పెఱిగే కొద్దీ ద్వేషం మాయమై దాని స్థానంలో ప్రేమ జనిస్తుంది. తమ బండిని గుద్దిన వ్యక్తి తమ బాల్యస్నేహితుడేనని తెలిస్తే బండిని పక్కన పారేసి కౌగలించుకుంటారు. కళ్ళు కనిపించని బాలింత పులి తన పిల్లలు తన పిల్లలేనని తెలీకా, గుర్తుపట్టలేకా వాటిని తింటుంది. కాబట్టి జ్ఞానం = ప్రేమ ; అజ్ఞానం = ద్వేషం.
    మనుషులు ‘భాష’ అనే సంకేతాల వ్యవస్థ ప్రకారం మాత్రమే ఆలోచించడం, ఆ చట్రంలోనే ఇతరుల్ని అర్థం చేసుకో యత్నించడం వల్ల ఈ రకమైన అపార్థాలూ, ఘర్షణలూ ప్రబల్తాయి. ఒకఱికొకఱు అర్థం కాక వేఱువేఱు పదజాలాలతో వేఱువేఱు సిద్ధాంతాల్ని వండివార్చి, వాటి కనుయాయిల్ని కూడా సమకూర్చుకుని తరతరాల యుద్ధాలు చేస్తూంటారు. ఇది పాండిత్యాన్ని కాక స్వానుభవ దూరతనే సూచిస్తుంది. స్వానుభవం మినహా వేఱే నిరూపణ లేని ఆధ్యాత్మిక విషయాల్ని వ్యక్తీకరించడానికి ప్రత్యక్ష భౌతికవాస్తవాల పరో॑ఽక్ష దూతలాంటి మానవభాష అసమర్థమైనది. ఎందుకంటే ఎంత హృద్యమైన పండితశైలికైనా మూలభూతమైనది ఒకనాటి పామరభాషే. అంటే, ఒకప్పటి అనాగరిక పామరుల భాషే మారుతూ మారుతూ, మనదాకా వచ్చి ఈనాటి భాషగా రూపుదాల్చింది. అటువంటి నీచ పామరత్వ మూలాలు గలిగిన భాషలోకి పరిణతి చెందిన మానవాత్మ యొక్క మహోన్నత దివ్యానుభవ శిఖరాల్ని యథాతథంగా అనువదించడం అసాధ్యం. అసలు ఆత్మికానుభవాలు మఱీ పెద్దమాటేమో ! కనీసం శృంగార అనుభవాన్నైనా భాష యథాతథంగా వ్యక్తీకరించజాలదు.
    కనుక ఆధ్యాత్మిక మార్గంలో నడవదల్చుకున్న ప్రతివారూ ముందస్తుగా అభ్యసించాల్సింది భాషకతీతంగా ఉండడం. అంటే భాషలో కాకుండా భావాలతో మాత్రమే ఆలోచించడం. అదే పద్ధతిలో ఇతరుల్ని కూడా అర్థం చేసుకోవడం. ఉదాహరణకు - మనలో ఊహాశక్తి హెచ్చిన కొద్దీ మన మనోవ్యాపారాల్లో భాష పాత్ర క్షీణిస్తూ పోతుంది. భాష మనల్ని ఇతరులకు వ్యక్తీకరించుకోవడానికి ఉద్దేశించినటువంటిది. కనుక మనిషి భాషకు బద్ధుడు కావడం ద్వారా దాని శ్రోతైన సంఘానికి బద్ధుడైపోతాడు. అంటే, “సంఘానికి ఏం చెబితే, ఎలా చెబితే తన భావాలకు ఆమోదయోగ్యత లభిస్తుందా ?” అనే నిరంతర చింతలో పడిపోతాడు. కాబట్టి మన ఆలోచనల్లోంచి సంఘాన్ని ఎంతగా బహిష్కరిస్తామో, అంటే సంఘపు లంకెని ఎంతగా త్రెంచుకుంటామో, అంతగా మనం మన అంతరాత్మకు దగ్గఱవుతాం. అంతగా మనం భాషకు అతీతులమవుతాం. భాషనీ, శైలినీ బట్టి మనుషులకు కొలమానం వేసే అలవాటు మానుకోవడం ద్వారా యథార్థమైన లోతుల్లోకి చొఱబడే ప్రతిభ అలవడుతుంది. ఆ విధంగా కూడా మనం భాషకు అతీతులమవుతాం.
    భక్తిమార్గం సంకుచితత్వంతోనూ, జ్ఞానమార్గం శంకలతోనూ మొదలవుతాయి. కానీ అక్కడే చిక్కుపడిపోవు. యోగంలో పరాకాష్ఠ నందుకున్న తరువాత కూడా అరుదుగా మనిషి పతనం చెందే అవకాశం ఉంటుందేమో గానీ, నిక్కమైన జ్ఞానాన్ని గానీ, పరాభక్తిని గానీ ప్రాపించిన తరువాత మనిషి తిరిగి సామాన్యుడయ్యే ఆస్కారమే లేదు. లేదు గాక లేదు. దీని గుఱించే గీతలో, “ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి” అన్నాడు భగవంతుడు. ఒక మాట. జ్ఞానమార్గంలో సాగినా, భక్తిమార్గంలో సాగినా అదంతా భగవత్సంకల్పమే తప్ప తన ఇచ్ఛ కాదు. ఎందుకంటే జ్ఞానానికి మంచి శరీర దార్ఢ్యమూ, తర్క వితర్క నైపుణ్యమూ, బుద్ధికుశలతా, శిక్షణా ఉండాలి. భక్తికి హృదయమార్దవమూ, ప్రేమార్ద్రభావమూ కావాలి. ఇవన్నీ ఆ భగవంతుడే ఇవ్వాలి. మనం అలవాటు చేసుకోబోతే అబ్బేవి కావు. దీనికి తోడు ఏ మార్గంలో గమ్యాన్ని చేఱుకోవాలన్నా ఆ మార్గానికి చెందిన గురువరేణ్యులు తారసిల్లడమూ, వారి శుశ్రూషా, కృపా అత్యావశ్యకం. “ఇహ ఏ పుస్తకాలూ చదవనక్కఱలేదు. ఏ సత్సంగమూ అవసరం లేదు” అన్న స్థితికి వచ్చినప్పుడే గమ్యానికి చేఱుకున్నట్లు. జ్ఞానులూ, భక్తులే నిజమైన వీరులు.

navagraha mangala slokam.

శ్లో|| ఆరోగ్యం పద్మబన్ధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి:

భూలాభం భూమిపుత్రస్సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్య: |


సౌభాగ్యం దేవమన్త్రీ రిపుభయశమనం భార్గవశ్శౌర్యమార్కి:


దీర్ఘాయుస్సైంహికేయో విపులతరయశ: కేతురాచంద్రతారం ||



శ్లో|| అరిష్టాని ప్రణశ్యన్తు దురితాని భయాని చ |


శాన్తిరస్తు శుభం మేస్తు గ్రహా: కుర్వన్తు మంగళం ||

అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము )


అధిక మాసము , క్షయ మాసము ( మల మాసము ) 

      ఈ సారి భాద్రపద మాసమునకు అధిక మాసము వచ్చింది . ఇది రేపటి నుండీ ఆరంభమవుతుంది . అధికమాసమనగా యేమి , అధిక మాసములో యేమి చేయవచ్చును , యేమి చేయరాదు మొదలగునవి ఇక్కడ వివరించడమయినది 

అధిక మాసమును అర్థంచేసుకొనుటకు ముందు సౌర మాసము , చాంద్రమాన మాసము లను గురించి తెలుసుకోవలెను . 

     సౌర మాసము :  రెండు పక్క పక్క సంక్రమణములు మధ్య కాలమునే ఒక సౌర మాసము అంటారు . సంక్రమణమనగా , సూర్యుడు ఒక రాశిని వదలి , తరువాతి రాశిని ప్రవేశించు సమయము . కాబట్టి , సూర్యుడు ఒక రాశిలో ఎంత కాలముంటాడో ఆ అవధి ఒక సౌర మాసము . సౌరమాసపు పేరు , సూర్యుడున్న రాశిపేరుతోనే పిలుస్తారు . ఉదాహరణకు , మేష మాసము , వృషభ మాసము ..ఇలాగ. 

     సూర్యుడి చలనపు వేగము దినదినమూ మారుచుండుట వలన అన్ని సౌర మాసములందూ కాలావధి ఒకటేగా ఉండదు . హెచ్చుతగ్గులు ఉండును . సంవత్సరానికి పన్నెండు సౌర మాసాలుండును . 

     చాంద్రమాన మాసము : రెండు అమావాశ్యల , లేదా రెండు పౌర్ణముల మధ్య కాలమును చాంద్రమాన మాసము అంటారు . అమావాశ్య , / పౌర్ణమి ముగిసినపుడు మాసము కూడా ముగుస్తుంది . అమావాశ్యను గణనకు తీసుకుంటే దానిని  ’ అమాంత మాసము ’ అనీ , పౌర్ణమిని గణనకు తీసుకుంటే దానిని ’ పౌర్ణిమాంత మాసము ’ అంటారు . 

     గుజరాత్ , మహారాష్ట్ర , కర్నాటక , కేరళ , తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్  మరియు బెంగాల్ లలో అమాంతమూ , మిగిలిన రాష్ట్రాలలో పౌర్ణిమాంతమూ వాడుక లో ఉంది .

     అధిక మాసము :  సామాన్యముగా ప్రతియొక్క చాంద్రమాన మాసపు కాలావధిలోనూ ఒక సంక్రమణము ఉంటుంది . అయినా కూడా , సగటు మీద ప్రతి రెండున్నర సంవత్సరాల కొకసారి ఏదో ఒక చాంద్రమాన మాస కాలావధిలో సంక్రమణమే ఉండదు . ఆ చాంద్రమాన మాసమును ’ అధిక మాసము  అంటారు . దాని తరువాతి మాసానికి ’ నిజ మాసము ’ అంటారు . ఈ అధిక-నిజ మాసాలు రెంటికీ ఒకే పేరు . అంటే , ఉదాహరణకు  ఈసారి భాద్రపదము అధిక భాద్రపదము , నిజ భాద్రపదము అని రెండు సార్లు వస్తుంది . 

     ఇలాగ అధిక మాసము వచ్చినపుడు ఆ చాంద్రమాన సంవత్సరములో పదమూడు మాసాలుంటాయి . సరళము గా చెప్పాలంటే , చాంద్రమాన సంవత్సరము , సౌరమాన సంవత్సరము కన్నా పదకొండు రోజుల తక్కువ కాలావధిని కలిగియుంటుంది . దీనిని సరిచేయుటకే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధిక మాసమును చేరుస్తారు . అలా చేర్చుటకు , ఎప్పుడంటే అప్పుడు కాక , సంక్రమణము లేని మాసము అన్న నియమము ఉంది . 

     క్షయ మాసము : ఒకోసారి , ఒకే చాంద్ర మాన మాసములో రెండు సంక్రమణములు వస్తాయి . ఆ చాంద్రమాన మాసమును క్షయ మాసము అంటారు. క్షయ మాసము కార్తీక , పుష్య మరియు మాఘ మాసములలో మాత్రమే సాధ్యము . క్షయ మాసము వచ్చినపుడు , ఆ మాసమూ , దాని తర్వాతి మాసమూ కూడా కలసి పోయినట్లు పరిగణించి ఆచరిస్తారు . దీనికోసము , తిథిలో నున్న రెండు కరణములలో మొదటిది క్షయ మాసానికీ , రెండోదానిని తర్వాతి మాసానికీ చేరినట్లు భావించి ఆచరిస్తారు . క్షయ మాసమున్న సంవత్సరములో పదకొండు మాసాలే ఉండాలి . కానీ , ఆ సంవత్సరములన్నిటిలోనూ తప్పకుండా ఒక అధిక మాసము వస్తుంది కాబట్టి , మొత్తం మీద పన్నెండు మాసాలుంటాయి . క్షయ మాసము 141 సంవత్సరాలకొకసారి సంభవిస్తుంది . అరుదుగా , 19  సంవత్సరాల కొకసారి వస్తుంది . 


     ఇక , ఇంకో సిద్ధాంతము ప్రకారము , సావన వ్యవస్థ అని ఉన్నది . దీనిని ’ బ్రహ్మ సిద్ధాంతము ’ అంటారు . దీని ప్రకారము , బ్రాహ్మణునికి అమావాశ్యతో ముగియునది మాసము . వైశ్యునికి పౌర్ణమితో ముగియునది , రాజులకు సంక్రమణముతో ముగియునది మాసము . 

అధిక మాసము , క్షయ మాసము ఏది వచ్చినా దానిని సామాన్యముగా ’ మల మాసము ’ అంటారు . 

     మలమాసములో నిత్య నైమిత్తిక కర్మలు ( సంధ్యావందనము , ఉపాకర్మ ,  ఔపాసన , బ్రహ్మ యజ్ఞము , తర్పణము ,శ్రాద్ధము వంటివి ) తప్పక చేయాలి . హోమాగ్ని నాశనమైనచో దానిని తిరిగి కూర్చుట , దేవతా ప్రతిమకు అర్చనా సంస్కారాలు లోపించిన తిరిగి ప్రతిష్ఠాపన చేయుట , నైమిత్తికములని చెప్పబడినవి . పాత గృహముల పునరుద్ధరణ ( రిపేరీలు ) చేయవచ్చును . 

సీమంతము , అన్న ప్రాశన వీటిని వదలరాదు . అంటే చేయవచ్చును . 

     తిథి వార నక్షత్రములతో చెప్పబడిన కామ్య కర్మలు , శుభ కార్యములు చేయరాదు . ఈ నిషేధము ఎలాగంటే , ఆ నెలలో మొదలుపెట్టి , అదే నెలలోనే పూర్తి చేయుట కూడదు . అధిక మాసములలో యజ్ఞములు ఆరంభించి ముగించుట కూడదు . ఎందుకంటే అక్కడ సంక్రమణములేక సూర్య మండలము తపిస్తున్నది యని . 

 శతరుద్రీయము 

వ్యాస ఉవాచ:

శ్లో . ప్రజాపతీనాం ప్రథమం తేజసాం పురుషం ప్రభుమ్
భువనం భూర్భువం దేవం సర్వలోకేశవరం ప్రభుమ్. 1

ఈశానం వరదం పార్థ దృష్టవానసి శంకరమ్
తంగచ్ఛ శరణం దేవం వరదం భువనేశ్వరమ్. 2

మహాదేవం మహాత్మాన మీశానం జటిలం శివమ్
త్ర్యక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాసనమ్ . 3

మహాదేవం హారం స్థాణుం వరదం భువనేశ్వరమ్
జగత్ప్రధానమధికం జగత్ప్రీతమధీశ్వరమ్ . 4

జగద్యోనిం జగద్ద్వీపం జయనం జగతో గతిమ్
విశ్వాత్మానం విశ్వసృజం విశ్వమూర్తిం యశస్వినమ్ . 5

విశ్వేశ్వరం విశ్వవరం కర్మాణామీశ్వరం ప్రభుమ్
శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్యభవోద్భవమ్ . 6

యోగం యోగేశ్వరం శర్వం సర్వలోకేశ్వరేశ్వరమ్
సర్వశ్రేష్ఠం జగచ్ఛ్రేష్ఠం పరిష్టం పరమేష్ఠినమ్ . 7

లోకత్రయవిధాతారమేకం లోకత్రయాశ్రయమ్
సుదుర్జయం జగన్నాథం జన్మమృత్యుజరాతిగమ్ . 8

జ్ఞానాత్మానం జ్ఞానగమ్యం జ్ఞానశ్రేష్ఠం సుదుర్విదమ్
దాతారం చైవ భక్తానాం ప్రసాదవిహితాన్ వరాన్ . 9

తస్య పారిషదా దివ్యా రూపై ర్నానావిదై ర్విభోః
వామనా జటిలా ముండా హ్రస్వగ్రీవా మహోదరాః . 10

మహాకాయా మహోత్సాహా మహాకర్ణాస్తథా పరే
అననై ర్వికృతైః పాదైః పార్థవేషైశ్చ వైకృతైః . 11

ఈదృశైస్స మహాదేవః పూజ్యమానో మహేశ్వరః
సశివస్తాత తేజస్వీ ప్రశాదాద్యాతి తే గ్రతః . 12

తస్మిన్ ఘోరే సదా పార్థ సంగ్రామే రోమహర్షణే
ద్రౌణికర్ణకృపైర్గుప్తాం మహేష్వాసైః ప్రహారిభిః . 13

కస్తాం సేనాం తదా పార్థ మనసాపి ప్రధర్షయేత్
ఋతే దేవాన్మ హేష్వాసాద్బహురూపాన్మహేశ్వరాత్ . 14

ప్థాతుముత్సహతే కశ్చిన్నతస్మిన్నగ్రతః స్థితే
నహి భూతం సమం తేన త్రిషు లోకేషు విద్యతే . 15

గంధేనాపి హి సంగ్రామే తస్య క్రుద్ధస్య శత్రవః
విసంజ్ఞా హతభూయిష్ఠా వేపంతి చ పతంతి చ . 16

తస్మై నమస్తు కుర్వంతో దేవాస్తిష్ఠంతి వైదివి
యే చాన్యే మానవా లోకే యేచ స్వర్గజితో నరాః . 17

యే భక్తా వరదం దేవం శివం రుద్రముమాపతిమ్
ఇహలోకే సుఖం ప్రాప్యతే యాంతి పరమాం గతిమ్ . 18

నమస్కురుష్వ కౌంతేయ తస్మై శాంతాయ వై సదా
రుద్రాయ శితికంఠాయ కనిష్ఠాయ సువర్చసే . 19

కపర్దినే కరాళాయ హర్యక్షవరదాయ చ
యామ్యాయారక్తకేశాయ సద్వృత్తే శంకరాయ చ . 20

కామ్యాయ హరినేత్రాయ స్థాణవే పురుషాయ చ
హరికేశాయ ముండాయ కనిష్ఠాయ సువర్చసే . 21

భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే
బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే . 22

ఉష్ణీషిణే సువక్త్రాయ సహస్రాక్షాయ మీఢుషే
గిరీశాయ సుశాంతాయ పతయే చీరవాసనే . 23

హిఅరణ్యభాహవే రాజన్నుగ్రాయ పతయే దిశామ్
పర్జన్యపతయేచైవ భూతానం పతయే నమః . 24

వృక్షాణాం పతయేచైవ గవాం చ పతయే తథా
వృక్షైరావృత్తకాయాయ సేనాన్యే మధ్యమాయ చ 25

స్రువహ్స్తాయ దేవాయ ధన్వినే భార్గవాయ చ
బహురూపాయ విశ్వస్య పతయే ముంజవాససే . 26

సహస్రశిరసే చైవ సహస్రనయనాయచ
సహ్స్రభాహవేచైవ సహస్ర చరణాయ చ . 27

శరణం గచ్ఛ కౌంతాయ వరదం భువనేశ్వరమ్
ఉమాపతిం విరూపాక్షం దక్షం యజ్ఞనిబర్హణమ్ . 28

ప్రజానాం ప్రతిమవ్యగ్రం భూతానాం పతిమవ్యయమ్
కపర్దినం వృషావర్తం వృషనాభం వృషధ్వజమ్ . 29

వృషదర్పం వృషపతిం వృషశృంగం వృషర్షభమ్
వృషాంకం వృషఓభదారం వృషభం వృషభేక్షణమ్ . 30

వృషాయుధం వృషశరం వృషభూతం మహేశ్వరమ్
మహోదరం మహాకాయం ద్వీపచర్మనివాసినమ్ . 31

లోకేశం వరదం ముండం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్
త్రిశూలపాణిం వరదం ఖడ్గచర్మధరం శుభమ్ . 32

పినాకినం ఖడ్గధరం లోకానం పతిమీశ్వరమ్
ప్రపద్యే శరణం దేవం శరణ్యం చీరవాసనమ్ . 33

నమస్తస్మై సురేశాయ యస్య వైశ్రవణస్సఖా
సువాసనే నమో నిత్యం సువ్రతాయ సుధన్వినే . 34

ధనుర్ధరాయ దేవాయ ప్రియధన్వాయ ధన్వినే
ధన్వంతరాయ ధనుషే ధన్వాచార్యాయ తే నమః . 35

గ్రాయుధాయ దేవాయ నమస్సురవరాయ చ
నమో స్తు బహురూపాయ నమస్తే బహుధన్వినే . 36

నమో స్తు స్థాణవే నిత్యం నమస్తస్మై సుధన్వినై
నమో స్తు త్రిపురఘ్నాయ భవఘ్నాయ చ వై నమః . 37

వనపతీనాం పతయే నరాణం పతయే నమః
మాతౄణాం పతయే చైవ గణానాం పతయే నమః . 38

గవాం చ పతయే నిత్యం యజ్ఞానం పతయే నమః
అపాం చ పతయే నిత్యం దేవానాం పతయే నమః . 39

పూష్ణో దంతవినాశాయ త్ర్యక్షాయ వరదాయ చ
హరాయ నీలకంఠాయ స్వర్నకేశాయ వైనమః . 40




Sunday, November 4, 2012


సర్వేంద్రియాణాం నయనం ప్రధానమ్


     
ఇది చదివి కంటి  చూపు వేగముగా మెరుగు పరచుకొని , పూర్తి ఆరోగ్యము పొందండి






     ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ ..అంటారు .. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అంతే కాదు , మంచి కంటి చూపు కూడా ఇస్తాడు . జాతకంలో సూరుడి స్థితిని బట్టి జాతకుని కంటి చూపెలా ఉంటుందో చెబుతారు 

     ఇవన్నీ వినడానికి బాగున్నాయి . అసలెవరైనా దీని మీద ఒక పరిశోధన గానీ ప్రయోగము కానీ చేసి ఫలితాలు చూశారా ? అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది . "  సూర్య థెరపీ " అని ఏదైనా ఉందా ?  నాకు వీటి గురించి మొదట్లో తెలిసేది కాదు . 1993  నుంచీ కంప్యూటర్ పై చాలా పని చేసేవాడిని . రోజుకు 18 గంటలు . ఇంకేముంది ? రెండేళ్ళకే అద్దాలు వచ్చాయి , సరే వయసు కూడా వచ్చింది కదా , ఇది వయసు ప్రభావము అనుకున్నా. 

     2006  లో ,  మా నాన్నగారు ఎప్పుడో 1937  లో రాసిన ఒక రాత పుస్తకము  నా కంట బడింది . అందులో సూర్యుడికి అర్ఘ్యము ఇచ్చే పద్దతి , దాని ఫలితాలు విపులముగా  ఆయన దస్తూరితో రాసి ఉంది . ఆ పుస్తకము అన్నేళ్ళూ నేను చూడక పోవడమే ఆశ్చర్యం . ఆయన 1995  లోనే స్వర్గస్తులైనారు . ఆ తరువాత , అందులోని విషయమే ఇంకో పుస్తకము లో కూడా చదివాను . అప్పటికి నా కళ్ళ పరిస్థితి ఘోరముగా ఉండింది . రోజూ తలనొప్పి , తల తిరగడము , ఒకరకమైన వికారము ఉండేవి .  రెండు మూడు నెలలకు ఒకసారి కళ్ళజోడు మార్చాల్సి వచ్చేది .

      ఒకసారి మహా ఇబ్బంది పడి , 2008 లో , మా నాన్న గారి పుస్తకములోని ప్రకారము సూర్యుడికి అర్ఘ్యము రోజూ ఇచ్చుట  మొదలు పెట్టాను . ఒక పదిరోజులకే కళ్ళ మంటలు పూర్తిగా తగ్గిపోయాయి . తలనొప్పి , వికారము పూర్తిగా తగ్గాయి . నెలరోజులకే నా కళ్ళు చల్లగా , అంతకు ముందు కుంచించుకుని సగం మూసినట్టు ఉండేవి పూర్తిగా , సహజంగానే విప్పారినాయి . ఆరునెల్లయింది , అంతా బాగా ఉంది . 

     ఒకసారి డాక్టరు దగ్గరకు వెళ్ళాను , ఊరికేనే  ( మాకు అక్కడ సంవత్సరానికి రెండు సార్లు ఉచితముగా చూస్తారు . ) వారు చూసి , కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి , అదే కళ్ళజోడు వాడండి , ఇంకేమీ అవసరము లేదు అన్నారు . అంతకు ముందు ప్రతిసారీ కళ్ళ సైటు మారింది అని వేరే రాసిచ్చేవారు . నేనేమీ మాట్లాడకుండా వచ్చాను . తర్వాత ఆరునెల్లకు మళ్ళీ ’ ఊరికే ’ వెళ్ళాను . మళ్ళీ అదే మాట, కళ్ళకి ఏ ఇబ్బందీ లేదు , అదే కళ్ళజోడు అని . అప్పుడు అడిగాను , ’ మరి అంతకు ముందు ప్రతి మూడు నెలలకీ జోడు మార్చవలసి వచ్చేది కదా , నా కంప్యూటర్ పని ఏమీ తగ్గలేదు , మరి ఎందుకు నాకు ఇబ్బంది కలగ లేదు ? ’  అని . ఆ డాక్టరు గారికి విదేశాలలో కూడా మంచి పేరుంది . కానీ ఆయన జవాబు చెప్పలేదు , ’ అరుదుగా  కొంతమందికి అనుకోకుండా కళ్ళు బాగవుతాయి , దానికి కారణాలు చెప్పలేము ’ అన్నారు . 

     అప్పటినుండీ నేను సూర్యుడికి రోజూ అర్ఘ్యము ఇవ్వడము మానలేదు . ఈ విషయము ఒకసారి ఆర్కుట్ లో రాశాను . అది చదివి అర్ఘ్యము ఇచ్చే పద్దతి చెప్పండీ అని చాలా మంది అడిగితే , వారికి రాసిచ్చాను . మధ్యలో వారము పదిరోజులు ఎపుడైనా అర్ఘ్యము ఇవ్వడానికి వీలయ్యేది కాదు . కానీ నాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు . నేను ఆర్కుట్ లో రాసినది పాటించినవారిలో ఒకరిద్దరు, తమకు కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు . 


     మొన్న అధిక మాసము , తర్వాత పితృపక్షాలు రావడముతో , నాకు వేరే జపాలు ఉపాసనలు ఎక్కువ కావడముతో , రెండు నెలలు అర్ఘ్యము వదలలేదు . రెండు రోజుల కిందట నాకు మళ్ళీ తలనొప్పి వచ్చింది . అప్పుడు అర్ఘ్యము మానేసినది గుర్తొచ్చి , మళ్ళీ నిన్నటినుండీ  మొదలుపెట్టాను . ఈ రోజునుండీ నాకు మళ్ళీ కళ్ళు ఎంతో బాగున్నాయి , తలనొప్పి కూడా అదే పోయింది . డాక్టరు దగ్గరకు వెళితే , మళ్ళీ అదే పాట , మీ కళ్ళకు వచ్చిన ఇబ్బందేమీ లేదు , అదే జోడు అని . 

అందుకని వెంటనే ఇది అందరితో మళ్ళీ పంచుకుందామని రాస్తున్నాను . 

శ్రీ సూర్య నమస్కారం , అర్ఘ్యం చ...లఘునా

 దీనికి కావలసినవి , 1 . ఒక రాగి గిన్నె కానీ చెంబు కానీ . 2  .ఎర్ర చందనము . ఇది చెక్కలుగా దొరుకుతుంది , కొన్ని చోట్ల పొడిగా కూడా దొరుకుతుంది . చెక్క తీసుకుంటే , రోజూ గంధము తీయాలి , పొడి అయితే దాన్ని రుద్ది గంధము చేయుట సులభము . ఓ నూరు రూపాయల చెక్క గానీ , పొడిగానీ కొనుక్కుంటే సంవత్సరము పైన వస్తుంది .   ఇదికాక, రోజూ కొన్ని ఏవైనా ఎరుపు రంగు పూలు కావాలి . ఒక కుండీలో కనకాంబరాలు కానీ , ఇంకేవైనా ఎర్ర పూలిచ్చే గులాబీ , మందారము వంటి చెట్టుకానీ పెట్టుకోండి . 

విధానము 

స్నానము, సంధ్యావందనము ముగించి , 
మొదట ఎర్ర చందనము గంధము తీసి ( ఒక బటాణీ గింజంత అయినా చాలు ) రాగి చెంబులోని నీటిలో కలపండి . బాగా ఉద్ధరిణతో కలియబెట్టి , అందులోకి చిన్న చిన్న పూలు గానీ , పెద్ద పూలైతే వాటి రేకులు గానీ కలపండి . 

తర్వాత  సూర్యునికెదురుగా నిలిచి  ఈ కింది మంత్రము చెప్పి నమస్కరించండి 

సూర్య మంత్రం 

||  ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి 

తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ||

     తర్వాత కింది మంత్రము చెప్పుచూ ఇరవైనాలుగు సార్లు ఆత్మ ప్రదక్షిణము చేస్తూ , ప్రతి ప్రదక్షిణము తర్వాత , పూర్తి సూర్య నమస్కారము గానీ ( యోగా పద్దతిలో ) , లేదా , ఊరికే సాష్టాంగ నమస్కారముగానీ , అదీ వీలు కాకున్న , వంగి నేలను ముట్టి నమస్కారము గానీ చేయండి . ఇరవై నాలుగు సార్లు వీలుకాకున్న , పన్నెండు సార్లో , అదీ వీలుకాకున్న ఆరు సార్లో  చేయండి . అయితే శ్రద్ధ ముఖ్యము. వీలైనన్ని ఎక్కువ సార్లు చేయుటకే ప్రయత్నించండి .మొదట ఒక వారము రోజులు  అలవాటు అయ్యేవరకూ కాస్త కష్టమనిపించవచ్చు . ఆ తర్వాత అలవాటుగా , గబగబా చేసేస్తారు . మంత్రము కూడా అప్పటికి నోటికి వచ్చేస్తుంది . 

 సూర్య నమస్కారం 

||  వినతా తనయో దేవః కర్మ సాక్షీ సురేశ్వరః 
సప్తాశ్వ సప్త రజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు ||


|| మిత్ర , రవి , సూర్య, భాను , ఖగ , పూష , హిరణ్య గర్భ, మరీచ , ఆదిత్య , సవిత్ర , అర్క , భాస్కరేభ్యో నమః ||

ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

( పై మంత్రము 24  పర్యాయములు చెప్పి  ప్రతిసారి  ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారములు చెయ్య వలెను )


ఆ తర్వాత ,. సూర్య అర్ఘ్యం  

ఈ కింది మంత్రము చెప్పి రాగి చెంబులోని  గంధము  , పూలు కలిపిన నీటితో మూడు సార్లు కానీ , పన్నెండు సార్లు కానీ అర్ఘ్యము వదలండి. అర్ఘ్యము వదలునపుడు లేచి నిలుచొని, దోసిటి నిండా చెంబులోని నీళ్ళు తీసుకుని , మంత్రము చెప్పి , అంజలితో కిందికి వదలండి , లేదా , ఏ చెట్టు మొదట్లోకో , కుండీ లోకో వదలండి . 

||  నమస్సవిత్రే జగదేక చక్షసే  | జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే |

త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే | విరించి నారాయణ శంకరాత్మనే ||

శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః 
ఇదమర్ఘ్యం సమర్పయామి  (ఎర్ర చందనము , ఎర్ర పూలు కలిపిన నీళ్ళతో  మూడు పర్యాయములు )

౩. తర్వాత సూర్య ధ్యానం 

ఈ శ్లోకము చెప్పి మనసులో సూర్యునికి నమస్కరించండి .

||  ధ్యేయస్సదా సవితృ మండల మధ్య వర్తి | నారాయణ సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ | హరీ హిరణ్మయ వపుర్ధృత శంఖ చక్రః |

ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నం తు మహేశ్వరః | అస్తమానే స్వయం విష్ణుః త్రిమూర్తిశ్చ దివాకరః || 


సమాప్తం



రోజూ సంధ్య వేళలలో ఈ స్తోత్రము చదువుకోండి సర్వ శుభములూ పొందండి . 
ఏక వింశతి సూర్య నామాని 
( హోమాదులలో ఉపయోగించవచ్చును.  సంధ్యా కాలం లో పఠించిన , సర్వ పాప ముక్తులు అగుదురు )

|| వికర్తనో వివస్వాం చ మార్తాండో భాస్కరో రవిః | లోక ప్రకాశకః శ్రీమాన్ లోక చక్షుర్గ్రహేశ్వరః | 
లోక సాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తిమిస్రహా | తపనస్తాపనశ్చైవ శుచిస్సప్తాశ్వ వాహనః |
గభస్తి హస్తో బ్రహ్మా చ సర్వ దేవ నమస్కృతః | ఏక వింశతిరిత్యేష స్తవ ఇష్టస్సదా మమ | 
శరీరారోగ్యదశ్చైవ ధన వృద్ధి యశస్కరః | స్తవ రాజ ఇతి ఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః || 

సూర్యస్తవము 
( బ్రహ్మ ఉపదేశించినది-- భవిష్య పురాణము  ) 

* నమస్సూర్యాయ నిత్యాయ రవయే కార్య భానవే | భాస్కరాయ మతంగాయ మార్తాండాయ వివస్వతే |
ఆదిత్యాయాది దేవాయ నమస్తే రశ్మి మాలినే | దివాకరాయ దీప్తాయ అగ్నయే మిహిరాయ చ | 
* ప్రభాకరాయ మిత్రాయ నమస్తేఽదితి సంభవ | నమో గోపతయే నిత్యం దిశాం చ పతయే నమః | 
నమో ధాత్రే విధాత్రే చ అర్యమ్ణే వరుణాయ చ | పూష్ణే ఖగాయ మిత్రాయ పర్జన్యాయాంశవే నమః | 
* నమో హితకృతే నిత్యం ధర్మాయ తపనాయ చ | హరయే హరితాశ్వాయ విశ్వస్య పతయే నమః | 
విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే | నమస్తే సప్త లోకేశ నమస్తే సప్త సప్తయే | 
*ఏకస్మైహి నమస్తుభ్యమేక చక్ర రథాయ చ | జ్యోతిషాం పతయే నిత్యం సర్వ ప్రాణ భృతే నమః | 
హితాయ సర్వ భూతానాం శివాయార్తి హరాయ చ | నమః పద్మ ప్రబోధాయ నమో వేదాది మూర్తయే | 
* కాదిజాయ నమస్తుభ్యం నమస్తారా సుతాయ చ | భీమజాయ నమస్తుభ్యం పావకాయ చ వై నమః |
ధిషణాయ నమో నిత్యం నమః కృష్ణాయ నిత్య దా | నమోఽస్త్వధితి పుత్రాయ నమో లక్ష్యాయ నిత్యశః|
( సర్వాభీష్ట సిధ్ధి కి ప్రాతః సాయంకాలాలు పఠించ వలెను ) 
----------

తరువాత కానీ , అర్ఘ్యమునకు ముందేకానీ తల్లిదండ్రులకు నమస్కరించండి .

మాతా పితర వందనము

మాతృ నమస్కారం

|| యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః | నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం |
కృఛ్చ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోధరే | త్వత్ప్రసాదాజ్జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే |
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః | వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే ||

పితృ నమస్కారం

|| స్వర్గాపవర్గ ప్రదమేక మాంద్యం బ్రహ్మ స్వరూపం పితరం నమామి
యతో జగత్పశ్యతి చారు రూపం తం తర్పయామస్సలిలైస్తిలైర్యుతైః || 


సమస్త సన్మంగళాని భవంతు