Thursday 31 October 2013

నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి ఇంకా రెండు రోజులు ఉంటుంది అనగా ( నరక చతుర్దశి) దీపావళి కొలాహలం మొదలు అవుతుంది. నరక చతుర్దశి నాడే దీపావళి అని అందరికి తెలిసిన విషియమే! అయితే ఈ పండగల గురించి కొన్ని తెలియని రహస్యాలు ప్రాచీన గ్రంధాలలో దాగున్నాయి.

చతుర్దశ్వాంతుయే దీపాన్నరకాయ దదంతిచ
తేషాం పితృ గణః సర్వే నరకాత్ స్వర్గమాప్నురయః

అంటే చతుర్దశి తిధి నాడు నరకలోకంలో ఉన్న పితృదేవతల కోసం దీపాలు వెలిగించితే, వారు స్వర్గలోక వాసాన్ని పొందుతారని అర్ధం.

ఆశ్వయుజ కృష్ణపక్షస్య చతుర్దాశ్యాం విధూదయే
తిల తైలేన కర్తవ్యం స్నానం నరక భీరుణా

ఆశ్వియుజ కృష్ణ చతుర్దశి నాడు చంద్రోదయానికి ముందు గానే నువ్వులు నూనేతో అభ్యంగన స్నానం చెయ్యాలి.(తలంటి స్నానం)

స్నానాంతరం తప్పనిసరిగా యమ తర్పణం విడవాలి.

ఇక్కడ చంద్రోదయ కాలానికి ప్రాముఖ్యత ఉంది. బహుళ చతుర్దశినాడు చంద్రోదయం ఇరవై ఎనిమిది ఘడియలకు అవుతుంది . అప్పటికి ఒక గంట లోపు మాత్రమే , రాత్రి సమయం ఉంటుంది.సరిగ్గా ఆ సమయంలోనే చతుర్దశి అభ్యంగన స్నానం చెయ్యాలి. సూర్యోదయం తరువాత చేసే అభ్యంగన స్నానానికి విలువ లేనందున, దాన్ని " గౌణం"అని అన్నారు (గౌణం అంటే ప్రాముఖ్యం లేనిది అని అర్ధం)

దీపావళి సమయంలో నువ్వుల నూనేతో తలంటి స్నానం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చతుర్దశి నాడు - దీపావళి అమావాస్య సమయాలలో నువ్వుల నూనేను లక్ష్మి దేవి ఆవహించి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. తలంటికి ఉపయోగించిన నీళ్ళలో ఉత్తరేణి, తమ్మి చెట్ల ఆకులను వేసి వాటి కొమ్మలతో ఆ నీటిని బాగా కలియబెట్టాలి.ఇలా చేసినందు వల్ల మెదడును, నాడులను ఉత్తేజితం చేసే భాస్వరం తయారై, ఆ జల స్నానం వల్ల బుద్ధి చురుకుదనం పెరుగుతుంది.

సీతాలోష్ట సమాయౌక్తః సంకట దళాన్వితః
మారపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

ఈ శ్లోకం ద్వారా చతుర్దశి అభ్యంగాన్ని చెయ్యాలి.
నరక చతుర్దశి నాడు నరక బాధ తప్పించిన 'సమరవర్తికీ (యమధర్మరాజు) ఉత్తరేణి ఆకులను తల పై పెటుకుని, పదునాలుగు నామాలతో, తిల్లలతో కూడిన జలాంజులను మూడేసి చొప్పున విడిచి పెట్టాలి.

యమాయ నమః
మృత్యువేనమః
వైవస్వతాయనమః
సర్వభూతక్షయాచ నమః
ధ్ధ్నాయనమః
పరమేష్టినే నమః
చిత్రాయ నమః
ధర్మరాజాయ నమః
అంతకాయ నమః
కాలాయ నమః
ఔదుంబరాయ నమః
నీలాయ నమః
వృకోదరాయ నమః
చిత్రగుప్తాయతే నమః

అంటు పదునాలుగు నామాలను ఉచ్చరిస్తూ, నామానికి మూడు తిలంజలులు చొప్పున మొత్తం 42 తర్పణాలను యమునికి సమర్పించవలేను.

కాబట్టి నరక చతుర్దశి నరకలోకవాసులకు పుణ్య గతులను కలిగించే పండుగ అని, అందుకే ఈ రోజున, తల్లి తండ్రులు లేని వారు తప్పకుండా దక్షిణ దిక్కున దీపం వెలిగించాలి.
చతుర్దశి నాటొ సాయంకాలం ప్రదోషకాలములో దీపదానం చెయ్యాలి.
దేవాలయాలలో దీప పంక్తులు ఏర్పాటు చెయ్యాలి. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందటానికి దీపావళి చతుర్దశి నాడు, కార్తిక సుద్ధ పాడ్యమి నాడు తప్పకుండా దీపదానం చెయ్యాలి.

దీపావళి

దీపమాలికలతో ఆశ్వియుజ కృష్ణ అమావాశ్య నాడు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిదేవికి నీరాజనాలు అర్పించే రోజు ఈ దీపావళి అని చెప్పబడుతోంది. రాక్షస రాజు అయిన బలి పాతాళానికి అణగద్రొక్కబడినది, శ్రీ రాముడు పట్టాభిషిక్తుడుదైనది, విక్రమార్క చక్రవర్తికి పట్టాభిషేకం అయినది ఈ దీపావళి రోజునే కావడం విసేషం.

ఈ రోజున లక్ష్మి దేవి భూలోకానికి దిగి వచ్చి, ప్రతి ఇంటా తిరుగుతు ఉంటుంది, కాబట్టి ఇళ్ళను శుబ్ర పరుచుకుని, శుచిగా ఉంచుకొవలన్నది ఈ పండుగ ప్రథమ నియమం.
బలిని పాతాళానికి పంపిన వామనమూర్తి , అథడి చెరలోనున్న దేవతలను విడిపించి, తనతో పాటుగా క్షీరాబ్ది కి తీస్కునివెళ్ళింది అన్న రోజు ఈ రోజు కావడం వల్ల లక్ష్మిదేవికి ఈ రోజు అత్యంత ప్రీతికరమైన రోజు.

బాణ సంచా

దీపావళి నాడు పేల్చే టపాకాయలుకు (బాణసంచా) ఒక పురాణ కధనమే ఉంది. ప్రప్రధమముగా బాణసంచాను రూపొందించింది శ్రీ కృష్ణుని పత్ని సత్యభామ !

ఈమే తండ్రి సత్రాజిత్తుకు ఈ బాణసంచ చేసే విద్యను సూర్యుడు బోధించినట్లుగా "భాగవతం" పేరుకుంతొంది.

ఈ విద్యను సత్రాజిత్తు తన కుమార్తేకు ధారపోసాడని పురాణ కధనం.

నేటి ఆధునిక బాణ సంచాకు ముందు తాటి గిలకల పూలమట్టాలను,, జనపకట్టెల జుంజుం కట్టలను, పెద్ద నేపాళ విత్తనాలను పుల్లలకు గుచ్చి, వెలిగించి ఆనందించేవారు.

అవి నేటి కాకరపువ్వొత్తులు,మతాబులు,చిచ్చుబుడ్డ్లుకు సమానం. సబ్దాలు చేసే, వెలుగును ఇచ్చే బాణ సంచ వెనుక ఒక పురాణమైన, శాస్త్రపరమైన మరో సత్యం దాగి ఉంది. మహాలయ పక్షంలో పైలోకాల నుండి భూమికి దిగివచ్చిన పితృదేవతలు దీపావళి రాత్రి తిరిగి పయనమై ఊర్ధ్వలోకాలకు వెల్లే సమయము. ఈ వెలుగు
వారికి కాంతి బాటగా ఉండాలనే సద్ద్యుద్దేసముతో


Bramhasri Samavedam Shanmukha Sarma

Wednesday 30 October 2013

దీపావళి రోజున లక్ష్మీపూజ



దీపావళి రోజున లక్ష్మీపూజ

"దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్|
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే||"

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు,
సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అలాంటి దీపాలపండుగ
అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం
దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన
హారాన్ని ప్రసాదించాడు.

ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో.. తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో
వేయగా.. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు
ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును
కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి
దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి
తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను
పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా
ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను
కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. నీవు
అనుకున్నట్లు శ్రీహరి అంత సంకుచిత మనస్కుడు మాత్రం కాదు.

"నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా
మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా,
విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి
ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా
ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని
పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

Tuesday 29 October 2013

వాస్తు పురుషుడు

Nerella Raja Sekhar




వాస్తు పురుషుడు............................

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సమ్రక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముకంగా క్రిందకు పడవేశారు.

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.

శిరస్సున - శిఖి(ఈశ) దక్షిణ నేత్రమున - సర్జన్య వామనేత్రమున - దితి దక్షిణ శోత్రమున - జయంతి వామ శోత్రమున - జయంతి ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప దక్షిణ స్తనమున - అర్యమా వామ స్తనమున - పృధ్వీధర దక్షిణ భుజమున - ఆదిత్య వామ భుజమున - సోమ దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట దక్షిణ పార్శ్వకామున - వితధి, గృహక్షత వామ పార్శ్వకామున - అసుర, శేష ఉదరమున - వినస్వాన్, మిత్ర దక్షిణ ఊరువున - యమ వామ ఊరువున - వరుణ గుహ్యమున - ఇంద్ర జయ దక్షిణ జంఘమున - గంధర్వ వామ జంఘమున - పుష్పదంత దక్షిణ జానువున - భృంగరాజ వామ జానువున - సుగ్రీవ దక్షిణ స్పిచి - మృగబు వామ స్పిచి - దౌవారిక పాదములయందు - పితృగణము

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడూ గా సృష్టిగావించాడు.

Monday 28 October 2013

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

Jaji Sarma

By Brahmasri Chaganti Koteswara Rao Garu.

సంధ్యావందనం ఎందుకు చేయాలి?

సంధ్యావందనం అనే ఆచారాన్ని ఒక సంప్రదాయంగా, మొక్కుబడిగా చేయడం కంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మరింత శ్రద్ధాసక్తులతోచేసే అవకాశం ఉంది. సూర్యభగవానుడు ఒక్కడే. కానీ, ఆయనలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి.

"ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి.
సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలోసావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి.
త్రి సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.
ఆయా శక్తులను

"గాయత్రీం ఆవాహయామి
సావిత్రీం ఆవాహయామి
సరస్వతీం ఆవాహయామి"

అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు.

మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావము వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు.దాన్ని కొనసాగించడంవల్లమనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది

స్నానకాలమునందు పఠించ వలసిన శ్లోకములు:

Bramhasri Samavedam Shanmukha Sarma 
ఆదివారము, శ్రాద్ధ సమయమున, సంక్రాంతి రోజు, గ్రహణము పట్టినపుడు, మహాదానము చేయునపుడు, తీర్థములందు, ఉపవాస దినమునందు, మైల ప్రాప్తించినపుడు, వేడి నీటితో స్నానము చేయరాదు. తీర్థాదులయందు ప్రవాహమునకు ఎదురుగా స్నానము చేయవలెను. స్నానానంతరము అక్కడే వస్త్రములను ఉతకరాదు. అంతేకాక తీర్థములయందు సబ్బు/షాంపూల వంటివి వాడరాదు. ప్రతి దినము నూనె ఆలేపనము చేసుకొని స్నానము చేయువానికి ఏదినము కూడ నిషిద్ధము లేదు. నూనె, అత్తరు మొ!! రాసుకొనుట ఏదినమైనను దూషితము కాదు. నువ్వులనూనె గ్రహణ దినమున వాడరాదు. స్నాన సమయమున తన ముఖము ఉత్తర, లేక తూర్పు దిశవైపు కానీ ఉండవలెను. విడిచిన వస్త్రముతో స్నానము చేయరాదు. స్వయముగా రాత్రి ధరించిన వస్త్రముతో స్నానము చేయరాదు. ఆ వస్త్రమును ఉచ్ఛిష్టమని చెప్పుదురు.


స్నానకాలమునందు పఠించ వలసిన శ్లోకములు:

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతక నాశనమ్!!
ఆదివారము, శ్రాద్ధ సమయమున, సంక్రాంతి రోజు, గ్రహణము పట్టినపుడు, మహాదానము చేయునపుడు, తీర్థములందు, ఉపవాస దినమునందు, మైల ప్రాప్తించినపుడు, వేడి నీటితో స్నానము చేయరాదు. తీర్థాదులయందు ప్రవాహమునకు ఎదురుగా స్నానము చేయవలెను. స్నానానంతరము అక్కడే వస్త్రములను ఉతకరాదు. అంతేకాక తీర్థములయందు సబ్బు/షాంపూల వంటివి వాడరాదు. ప్రతి దినము నూనె ఆలేపనము చేసుకొని స్నానము చేయువానికి ఏదినము కూడ నిషిద్ధము లేదు. నూనె, అత్తరు మొ!! రాసుకొనుట ఏదినమైనను దూషితము కాదు. నువ్వులనూనె గ్రహణ దినమున వాడరాదు. స్నాన సమయమున తన ముఖము ఉత్తర, లేక తూర్పు దిశవైపు కానీ ఉండవలెను. విడిచిన వస్త్రముతో స్నానము చేయరాదు. స్వయముగా రాత్రి ధరించిన వస్త్రముతో స్నానము చేయరాదు. ఆ వస్త్రమును ఉచ్ఛిష్టమని చెప్పుదురు.


స్నానకాలమునందు పఠించ వలసిన శ్లోకములు:

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!
నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతక నాశనమ్!!

. కార్తీకమాసము

Bharadwaja Chadalavada
. కార్తీకమాసము
కార్తీక మాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.

అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
ఇంకా చూడండి]
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్ధన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

పండుగలు
క్రమ సంఖ్య తిథి పండుగ
1 కార్తీక శుద్ధ పాడ్యమి
ఆకాశ దీపారంభము, బలి పాడ్యమి

2 కార్తీక శుద్ధ విదియ
భ్రాతృ విదియ

3 కార్తీక శుద్ధ తదియ
సోదరి తృతీయ

4 కార్తీక శుద్ధ చతుర్థి
నాగుల చవితి

5 కార్తీక శుద్ధ పంచమి
నాగ పంచమి

6 కార్తీక శుద్ధ షష్ఠి
*

7 కార్తీక శుద్ధ సప్తమి
శ్రీ విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపత్యము

8 కార్తీక శుద్ధ అష్ఠమి
*

9 కార్తీక శుద్ధ నవమి
కృతయుగము ప్రారంభమైన రోజు.

10 కార్తీక శుద్ధ దశమి
*

11 కార్తీక శుద్ధ ఏకాదశి
ఉత్థాన ఏకాదశి

12 కార్తీక శుద్ధ ద్వాదశి
చిలుకు ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి :: స్వాయంభువ మన్వంతరములో

13 కార్తీక శుద్ధ త్రయోదశి
*

14 కార్తీక శుద్ధ చతుర్దశి
వైకుంఠ చతుర్దశి

15 కార్తీక పూర్ణిమ
తులసీ పూజ, కార్తీకదీపం, జ్వాలా తోరణము, కోరల పున్నమి, గురునానక్ జయంతి, ధాత్రీ పూజ :: దక్షసావర్ణిక మన్వంతరములో

16 కార్తీక బహుళ పాడ్యమి
*

17 కార్తీక బహుళ విదియ
*

18 కార్తీక బహుళ తదియ
*

19 కార్తీక బహుళ చవితి
*

20 కార్తీక బహుళ పంచమి
*

21 కార్తీక బహుళ షష్ఠి
*

22 కార్తీక బహుళ సప్తమి
ప్రళయకల్పం ప్రారంభం

23 కార్తీక బహుళ అష్ఠమి
*

24 కార్తీక బహుళ నవమి
*

25 కార్తీక బహుళ దశమి
*

26 కార్తీక బహుళ ఏకాదశి
ఉత్పత్యైకాదశి

27 కార్తీక బహుళ ద్వాదశి
*

28 కార్తీక బహుళ త్రయోదశి
*

29 కార్తీక బహుళ చతుర్దశి
మాసశివరాత్రి
. కార్తీకమాసము
కార్తీక మాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.

అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
ఇంకా చూడండి]
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్ధన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద

శివాభిషేక ఫలములు

శివాభిషేక ఫలములు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.

దూర్వాంకుర (గరిక)

భక్తి సమాచారం

దూర్వాంకుర (గరిక)
పూర్వం సంయమినీ పురంలో ఒక మహోత్సవం జరుగుతోంది. ఆ ఉత్స వాన్ని చూడడానికి సర్వదేవతలు, గంధర్వులు అందరూ వచ్చారు. ఆ సభలో తిలోత్తమ నా ట్యం చేస్తోంది. ఇంతలో ఆమె పైట కొంగు జారుతుంది. ఆమె కుచ సౌందర్యాన్ని చూసి యముడు తిలోత్తమను కామించి, సిగ్గును విడిచి ఆమెను కౌగిలించుకోడానికి ప్రయత్ని స్తాడు. ఆ ఫలితంగా సభలో అభాసుపాలవు తాడు. నవ్వులపాలైన యముడు తలవంచు కొని సభ నుండి బయటకు వెళ్ళిపోతున్నప్పు డు అతని రేతస్సు స్ఖలితమై భూమిపై పడు తుంది. స్ఖలితమైన ఆ రేతస్సు నుండి జ్వాలా మాలలతో మండుతోన్న వికృత రూడుడైన పురషుడొకడు జన్మిస్తాడు. అతనికి భయంకర మైన కోరలున్నాయి.

అతడు పెద్ద పెద్ద అరుపు లతో మూడు లోకాలను భయపెట్ట సాగాడు. భూమండలాన్ని దహింపజేస్తూ, వాడి జటలు ఆకాశాన్ని తాకుతూ, వాడి భయంకర అరుపు లతో మూడు లోకాల వారి మనస్సులు భ్రాంతి పడునట్లు చేయసాగాడు. అపుడు దేవతలు, ఋషులు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, అతడ్ని శర ణువేడతారు. విష్ణుమూర్తి వారినందరినీ తీసుకొ ని గణపతి వద్దకు వెళ్ళి వివిధ స్తోత్రాలు చేస్తారు.

శ్లో నమో విఘ్నస్వరూపాయ నమస్తే విఘ్నహారిణే
నమస్తే సర్వరూపాయ సర్వసాక్షిన్నమోస్తుతే
శ్లో నమో దేవాయ మహతే నమస్తే జగదారయే నమః కృపానిధే
తుభ్యం జగత్పాలన హేతవే - నమస్తే పూఠ్ణతమసే
శ్లో నమస్తే వేదవిదుషే నమస్తే వేదకారిణే
కిమన్యం శరణం యామః కోమనః స్వాధ్భయాపహః
‘‘విఘ్నస్వరూపుడవు, విఘ్నాలను హరించేవాడవు, సర్వస్వరూపుడవు, సర్వసాక్షి అయిన హే పార్వతీనందనా, నీకివే మా ప్రణామాలు. దేవాది దేవుడవు, జగత్తుకు మూలమైన వాడవు, జగత్తు సవ్యంగా నడపడానికి హేతువైన వాడవు, సంపూర్ణ తమోరూపుడవైన హే గణనాథ! నీకు ఇవే మా వందనాలు. సర్వసంహార కారకుడవు, భక్తవరదుడవు, సర్వదావు, సర్వులకు శరణ్యమైన వాడవు, నీ భుక్తుల సర్వ కోర్కెలను తీర్చేవాడవు అయిన నీకు నమస్కారాలు, వేదవేత్తవు, వేదకర్తవు అయిన నిన్ను వదిలి ఇంకెవర్ని మేము శరణువేడుట? ప్రభూ! మా భయాన్ని నువ్వు తప్ప ఇంకెవరు పోగొట్టగలరు? మా అందరికీ మరణం సమీపిస్తే నువ్వెందుకు ఉపేక్షిస్తున్నావు స్వామీ?’’ అంటూ దేవతలందరూ గణపతిని ప్రార్ధిస్తారు.

అపుడు పద్మం వంటి నేత్రాలతో, కోటి సూర్యుల తేజస్సుతో, మల్లె పువ్వు
ల కంటే తెల్లనైన పలువరుసలతో, శంఖం వంటి కంఠంతో, నానాలంకా
రాలతో దివ్యాంబరాలను ధరించి రత్నసింహాసనంపై కూర్చొ ని దేవతలకు దర్శనమిస్తాడు గణపతి. ప్రభువుకు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. తరువాత జయజయ ధ్వానాలు పలుకుతారు.
‘‘దేవతలారా! అనలాసురుని భయం వల్ల స్వకర్మలను వీడివున్న మిమ్మ ల్ని రక్షించడానికే నేను అవతరించాను. ఆ దుష్ట రాక్షసుడి చూడడంతో టే మీరంతా నన్ను ప్రేరేపించండి. ఆ ఉత్సాహంలో నేనువాడ్ని వధించ గలను’’ అంటూ స్వామివారు దేవతల కభయమిస్తారు.

ఈలోగా అనలాసురుడు దశదిక్కుల్నీ దహింపజేస్తూ భూలోకానికి వచ్చి కోలాహలం సృష్టిస్తాడు. అతని చూడడంతోటే మునులంతా పరు గులు తీస్తూ బాలకుడి రూపంలో నున్న గణపతిని కూడా పారిపొమ్మని లేకపోతే ఆ క్రూర రాక్షసుడు వేధించగలడంటూ అజ్ఞానంతో చెబుతా రు. జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ తత్త్వం పూర్తిగా ఋషులకు కూడా అవగతం కాకపోవడం వల్లనే ఆ క్రూరుడు తమ స్వామినేమైనా చేస్తాడే మోనన్న భయంతో స్వామి వారి పట్ల అతిశయించిన ప్రేమతోను, ఆజ్ఞా నంతోను గణనాథుని పారిపొమ్మని సలహానిస్తారు.

వారి మాటల్ని విన్న గణపతి చలించకుండా హిమాలయ పర్వతంవలె తన శరీరాన్ని పెంచి, అక్కడే నిలబడతాడు. ఋషులు, దేవతలు మాత్రం స్వా మి వారిని వదిలివేసి దూరంగా పారిపోతారు. పర్వతంలా కదలకుండా, అడ్డంగా నిలబడి వున్న బాల గణపతి మీదకు కాలాగ్నిలా మండిపడుతూ అనలాసురుడు వస్తాడు. ఆ సమయంలో పర్వతాల తోను, కారడవులతోను నిండివున్న భూమి వణు కుతుంది. ఆకాశంలో మేఘ గర్జనల వం టి పెద్ద పెద్ద ధ్వనులు ప్రా రంభమవుతా యి. ఆ శబ్దాలకు చెట్లు కొమ్మలపై వున్న పక్షులు నేల కూ లిపోయాతాయి. ఈ హడావుడిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియ డం లేదు. అప్పుడు బాలగణపతి తన యోగమాయాబలంతో అనలాసు రుడ్ని పట్టుకొని మ్రింగి వేస్తాడు.

అనలాసురుడు తన కడుపులోనికి కనుక వెళ్ళితే సమస్త భవనాలు దగ్ధమవుతాయని తలచి స్వామి వారు వాడిని తన కంఠంలోనే నిలుపుకొం టారు. తరువాత తాపాన్ని ఉపశమనం చేయడం కోసం ఇంద్రుడు చంద్రక ళను స్వామి వారికి ప్రసాదిస్తాడు. అప్పటి నుండి స్వామి వారు ఫాలచం ద్రుడయ్యారు. సిద్ధి, బుద్ది అనే మానవ కన్యల్ని సృష్టించి స్వామి వారికి ప్రసాదిస్తాడు. వారిని అలింగనం చేసుకోవడం వలన స్వామి వారి తాపం కొంతవరకు శాంతిస్తుంది. తరువాత విష్ణువు కమలాలను స్వా మి వారికి ప్రసాదిస్తాడు

కార్తిక మాసం

భక్తి సమాచారం

కార్తిక మాసం
కార్తీకం.. ఈ పేరు వింటే చాలు. భవబంధాలు క్షణాల్లో తొలగిపోయే వీలు. భక్తప్రజాళికిది మంగళకర మాసం. అద్వైతసిద్ధికి అసలైన విలాసం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తీకం మానవాళికి కొంగుబంగారమవుతోంది. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం.. ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తీకం నిండుగా అల్లుకున్నాయి. అందుకే ఏ మాసానికీ లేని ప్రత్యేకత దీనికే స్వంతం.

శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తీకం గొప్పవరం. చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది.

క్షీరసాగర విహార...
ముందుగా క్షీరసాగరశయనుడైన నారాయుణ్ణి గురించి చెప్పుకోదలిస్తే ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లే పరంధాముడు మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశినాడు చతుర్దశభువనాల వ్యవహార సరళినీ సమీక్షించే కార్యాన్ని చేపడతాడు. ఈ సందర్భంగా పద్మపురాణంలోని సోమకాసుర వధను గుర్తుచేసుకోవాలి. వేదాలను అపహరించి సాగరాంతర్భాగంలోకి చొచ్చుకుపోతున్న ఈ రాక్షసుణ్ణి విష్ణువు మత్స్యావతారమెత్తి సంహరించిన కాలమిదే. సరిగ్గా కార్తీకమాసం పదకొండవరోజున పురుషోత్తముడు మత్స్యావతారంలోకి మారాడని శాస్త్రం చెబుతోంది. దేవాసురులు క్షీరసాగరమథనం చేసిందీ, శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మిని పరిణయమాడిందీ ఈ మాసంలోనే. క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకుద్వాదశి) వంటి పర్వదినాలకు నెలవైంది గనుకనే జనార్థునికి ప్రీతికరమైనమాసంగా కార్తీకం విరాజిల్లుతోంది.

భక్తికీ ముక్తికీ...
కార్తీకానికి శివునికీ ఉన్న బంధం భక్తికీ ముక్తికీ ఉన్న అనుబంధం. త్రిపురాసురసంహారాన్ని చేపట్టి రుద్రుడు లోకాలను శాంతపరిచింది కార్తీకంలోనే. భూమిని రథంగా చేసుకుని, సూర్యచంద్రుల్ని ఆ తేరుకు చక్రాలుగా మార్చుకుని, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని, బ్రహ్మసారథ్యంలో శంభుడు ఆ అసురు వధను లోక కళ్యాణకార్యంగా జరిపాడు. కార్తీకంలో శివుడు సజ్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్యనుంచి ప్రదోష కాలం వరకూ అయిదురూపాలతో భక్తులను ఆశీర్వదిస్తాడు.

స్నానం... దానం... దీపం...
స్నానం, దానం, జపం, తపం, దీపం, ఉపవాసం వంటి సన్మార్గాల్లో పయనిస్తూ కార్తీకమాసంలో శివకేశవుల చిత్తాన్ని భక్తులెవరయినా ఇట్టే గెలవవచ్చు. వేకువఝామునే సముద్ర స్నానమో, నదీ స్నానమో లేక నివాసంలోనే శీతల స్నానమో ఆచరించి శుచిర్భూతులై ఈశ్వరార్చన చేసినా, అచ్యుతుణ్ణి శరణువేడినా లేక ఇద్దరినీ కొలిచినా కోరికలు క్షణాల్లోనే నెరవేరతాయి. మనకున్నదాన్లో కొంత భాగాన్ని పాత్ర ఎరిగి దానం చేయడం మరో పుణ్యవిధి. కార్తీకదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞానతిమిరాలను ఆవలకు నెట్టి విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతీ రోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువులంతా కార్తీక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగులు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాలు కార్తీకనక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తుంటారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తీక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయి.

ఉపవాసయోగం...
కార్తీక సోమవారాలు, కార్తీక పున్నమి ఉపవాసాలకు అనుకూలమైన రోజులు. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. రోజంతా శివధ్యానం చేస్తూ భగవంతునికి సమీపంగా ఉండటంతో పాటుగా, శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరో యోగం. కొందరు ఈ ఉపవాసాన్ని రోజు మొత్తాన ఒక మారే ఫలహారం తీసుకుని ఏకభుక్తంగా నిర్వహిస్తారు. మరికొందరయితే వండని పదార్థాలు అంటే పండ్లు, కాయలు తింటూ నక్తం చేస్తుంటారు. ఈ నక్తం కార్తీకమాసం అంతా చేపట్టే భక్తులూ లేకపోలేదు.

సతత హరితం...
పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని చెప్పడం, వృక్షోరక్షతి రక్షితః అనే పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతస్సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద పనస ఆకుల విస్తట్లో జరిగే విందులు. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు సిసలైన రాచమార్గాలు. కార్తీకంలో తులసిమాతను ధ్యానించడం పరమశ్రేష్ఠం. ఉసిరి కాయల మీద ఆవునెయ్యి దీపాలుంచి తులసమ్మను కొలవడం సకల పాప క్షయకరం.

అద్వైతం... మోక్షదాయకం...

Sunday 27 October 2013

హిందూ ధర్మంసంస్కృతి - హిందూ వివాహం

హిందూ ధర్మంసంస్కృతి - హిందూ వివాహం

మన ధర్మం సనాతనము, సార్వ దేశికము, సార్వ కాలికము, సార్వ జనీనము, మహిమాన్వితము, సర్వోత్తమము, ఆచరణలో నిగ్గు తేలినది. ఈనాటికీ మనదేశం సంస్కృతి,ధర్మం, ఆధ్యాత్మికత, నీతి మొదలగు విషయాలలో ప్రపంచానికి గురు స్థానం లోనే ఉన్నది. శాంతి, సౌభ్రాతృత్వముల కొరకు ప్రపంచం భారత దేశం వైపు చూస్తున్నది. విజ్ఞానంలో కూడా గొప్పదే. అనేక మంది విదేశీయులు మన ప్రాచీన విశ్వ విద్యాలయాలలో శిక్షణ పొందారు. కానీ నేటి మన స్థితి ఏమిటి ? పరాయి పాలనలో మన జాతి ఆత్మ విస్మృతి చెందినaది. తన గొప్పతనాన్ని, తన వారసత్వాన్ని మరచి పోయింది. పరాయి వాళ్లు రాసిన రాతలను నమ్మి తన అస్థిత్వాన్నే కోల్పోవు చున్నది. మన ఆచారాలు మూఢాచారాలని, మనవి గుడ్డి నమ్మకాలనీ, మనము అనాగరికులమనీ విదేశీయులు మనకు అన్నీ నేర్పారని పాఠ్య పుస్తకాలలో రాసి మన పిల్లల చేత చదివించుచున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా మనలో చైతన్యం కనిపించుట లేదు. విదేశీయులు మన ఆచారాలను అధ్యయనం చేసి వాటి లోని గొప్పదనాన్ని వారు మనకు చెపితే గాని నమ్మలేని స్థితిలో ఉన్నాము. వారు చెపితే అది మనకు వేదం. ఆత్మవిస్మృతి లో నున్న జాతిని జాగృతం చేయాలి. ఆత్మ ప్రబోధం కలిగించాలి. మన ఆచారాలలోని అంతరార్ధాన్ని తెలియజేయాలి.

మనం పెళ్ళిళ్లు చేస్తున్నాం ఆడంబరంగా. డబ్బు ఖర్చు పెడుతున్నాం విరివిగా. అప్పుల పాలవుతున్నాం తరచుగా. కట్నాలు, మర్యాదలు, లాంఛనాలు కావాలంటున్నాం అధికంగా. వాటి కొరకు అలకలు, తగాదాలు, వేధింపులు చూస్తున్నాం ఎక్కువగా. ఎందుకీ మంత్రాలు ? ఏమిటి వీటి అర్ధాలు ? అని తెలుసు కుందామనే కోరిక ఉంది తక్కువగా. ప్రయత్నం, కృషి జరగటల్లేదు బొత్తిగా. అందుకే మన ఆవేదన ఇంతగా.

వివాహ మహోత్సవ ఆహ్వానం అని అందరికీ పంపుతాం. కానీ వివాహం ఉత్సవం కాదు. అది మానవుని వికాసానికి ఏర్పరచిన షోడశ సంస్కారాలలో ప్రధాన మైనదని మనకు తెలియదు.సాన పెట్టుట వలన వజ్రం ప్రకాశించి నట్లు సంస్కారాల వల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. జీవితం సార్థకం, సుఖవంతం, ఆనందమయం అవుతుంది. వివాహం లోని మంత్రాల అర్థం పరమార్థం తెలియక, ఏదో విధంగా త్వరగా పూర్తి చేయండని పురోహితుని తొందర పెడుతూ ఉంటాం. దాని వల్ల మనమే నష్ట పోతామని గ్రహించం. ఫోటోలు, వీడియోలు, విందులకు ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమైన సంస్కారాన్ని విడిచిపెడుతున్నాం. ఫలితం బాగా లేదని బాధపదుతున్నాం.

మన ప్రాచీనమైన ఆచారాలలోని అంతరార్థాన్ని తెలియజెప్పి, అధునాతన శాస్త్ర విజ్ఞానంతో సమన్వయించి, వాటిని సరియైన పద్ధతిలో చక్కగా ఆచరింప జేయాలనే మా తపన.

II. వివాహ శబ్దార్ధం

శ్లో|| ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తన!

వ్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||

శ్రీమద్రామాయణంలో జనక మహారాజు అంటారు. ఓ రామచంద్రా! ఈ సీత నా కుమార్తె. నీకు సహధర్మ చారిణిగా ఈమెను అర్పించుచున్నాను. ఈమె చేతిని పట్టుకొని ఈమెను స్వీకరింపుము. నీకు శుభమగు గాక!

పరస్పర తపస్సంప త్ఫలాయిత పరస్పరౌ |

ప్రపంచ మాతాపితరౌ ప్రాంచౌ జాయావతీ స్తుమః ||

పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. వారి దాంపత్యము తపస్సంపద యొక్క ఫలితము. ప్రపంచానికి తల్లితండ్రులైన ఆ దంపతులకు నమస్కారములు.

వివాహ శబ్దార్ధం:

సంస్కృతంలో 'వహ్' అనే ధాతువుకు 'వి' అనే ఉపసర్గను 'ఘఞ్' అనే ప్రత్యయాన్ని చేరిస్తే వి+వహ్+ఘఞ్ = వివాహః అనే పదం ఏర్పడింది. దీనికి అర్ధం విశేష ప్రావణం అనగా విశేషమైన (ప్రత్యేకమైన) సమర్పణం. ఈ పదానికి అనేక పర్యాయ పదాలున్నాయి. పరిణయం, ఉద్వాహం, కల్యాణం, పాణిగ్రహణం, పాణిపీడనం, పాణిబంభం, దారోప సంగ్రహణం, దార పరిగ్రాహం, దారకర్మ, దారక్రియ మొదలైనవి.

వివాహ భేదములు:

మనువు వివాహ పద్ధతులను 8గా విభజించాడు.

బ్రాహ్మోదైవ స్తధైవార్షః ప్రాజాపత్యస్తధాసురః |

గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచ శ్చాష్టమోథమః ||

1. బ్రాహ్మం, 2. దైవం, 3. ఆర్షం, 4. ప్రాజాపత్యం, 5. అసురం, 6. గాంధర్వం, 7. రాక్షసం, 8. పైశాచం అని వివాహాలు ఎనిమిది రకాలు.

1. బ్రాహ్మం: అలంకరించిన కన్యను పండితుడు, శీలవంతుడు అయిన వరుని ఆహ్వానించి దానం చేస్తే బ్రాహ్మ వివాహమౌతుంది. (ఉదా: శాంతా ఋష్యశృంగుల వివాహం)

2. దైవం: యజ్ఞంలో ఋత్విక్కుగా వున్న వారికి - దక్షిణగా కన్యను ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహమౌతుంది.

3. ఆర్షం: వరుని నుండి గోవుల జంటను తీసుకొని కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం. ఇది ఋషులలో ఎక్కువగా వుండేది గనుక ఆర్షం అయింది.

4. ప్రాజాపత్యం: వధూవరులిద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించండి అని చెప్పి కన్యాదానం చేయటం ప్రాజాపత్యం అవుతుంది. (సీతారాములు)

5. అసురం: వరుని వద్ద డబ్బు తీసుకుని కన్యను యిస్తే అది అసుర వివాహం. (ఉదా: కైకేయీ దశరథులు)

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు

Brahmasri Chaganti Koteswara Rao Garu.
వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు
వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు - సంపదలు కలుగుతాయి.
10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.


ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు...
1. మేషరాశి - త్రివత్తులు (3)
2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
3. మిధునరాశి - సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
5. సింహరాశి - పంచమవత్తులు (5)
6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
10. మకరరాశి - సప్తమవత్తులు (7)
11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
12. మీనరాశి - పంచమవత్తులు (5)


జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు...
1. మేష లగ్నం - పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం - పంచమవత్తులు (5)
10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం - ద్వివత్తులు (2)

Friday 25 October 2013

మహా శివునుకి "త్రిపురాంతక" అని పేరు ఎలా వచ్చింది?

Brahmasri Chaganti Koteswara Rao Garu.


మహా శివునుకి "త్రిపురాంతక" అని పేరు ఎలా వచ్చింది?
.......................................................................
రాక్షస జాతికి చెందిన తారకాక్ష, విద్యున్మలి,కమలాక్ష ముగ్గురు రాక్షసులు బ్రహ్మ దేవుని కోసం ఘోర తపస్సు చేసి, వరాలు పొందుతారు.
ఆ వరాలు ఫలితంగా ఒకొక్క రాక్షసుడు ఒకొక్క లోహాలలో దాగి ఉంటారు.
తారకాక్ష బంగారములోని, విద్యున్మలి వెండి లోని, కమలాక్ష సీసము లోని ప్రవేశించి మానవులని, దేవతలని భయబ్రాంతులని చేస్తూ, విద్వాంసం సృష్టిస్తారు.
దేవతలు అందరూ మహా శివునికి తమ ఆవేదలని వ్యక్తం చేస్తూ, శరణం కోరుతారు . ఆ ముగ్గురి రాక్షసులని అంత మొందించడానికి పరమ శివుడికి దేవతలందరూ సహాయాన్ని అందిస్తారు.
1) మేరు పర్వతం మరియు ఓంకారములు "బాణము" గా మారతాయి.
2)భూమి మరియు ఇతర దేవతలు "రధము" గా మారతారు.
3)నాలుగు వేదాలు "నాలుగు గుర్రాలు"గా మారుతాయి.
4)బ్రహ్మ రధ సారిధి గా తన సేవలు అందిస్తారు.
5) వాసుకి సర్పము విల్లుకి తాడుగా మారుతుంది.
6)మహా విష్ణువు బాణముగా(Arrow ) గా మారుతారు.
7) సూర్యుడు, చంద్రుడు రధ చక్రములుగా(wheels ) మారుతారు.
వీరి అందరి సహాయముతో పరమ శివుడు ముగ్గురు రాక్షసులని సంహరించడం వలన "త్రిపురాంతక" అని పేరు వచ్చింది.

దాంపత్య కలహాలు తొలగిపోవాలంటే జామపండును..?

భక్తి సమాచారం
దాంపత్య కలహాలు తొలగిపోవాలంటే జామపండును..?

దాంపత్య కలహాలు తొలగిపోవాలంటే.. జామపండ్లను శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి దంపతులకు తినేందుకు ఇస్తే దాంపత్యంలోని కలహాలు తొలగిపోతాయి.

సంకష్ట హర గణపతికి జామపండ్లను నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి దానం చేస్తే ఆరోగ్య భాగ్యం దేహంలోని నీరసం తొలగిపోతుంది. 

రుద్రాభిషేకం సమయంలో జామపండ్ల రసాన్ని కమలా పండు రసాలతో దేవునికి అభిషేకం చేసి ఇతరులకు పండును తినేందుకు ఇస్తే నిదానంగా జరుగుతున్న పనులు మీ మనసుకు ఇష్టమైన రీతిలో త్వరగా జరుగుతాయి.

తాంబూలంతో పాటు జామపండ్లను సంకల్ప సమేతంగా పూజ చేసి దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం జరిపి ప్రార్థన చేసి దేవునికి కుడివైపు ఉంటి ప్రార్థిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుంది.

కుంకుమను ఎలా చేస్తారు?

భక్తి సమాచారం
కుంకుమను ఎలా చేస్తారు?

కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.

ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .

ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

జపం :

Brahmasri Chaganti Koteswara Rao Garu.
జపం :
ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్నిస్తుంది. నదిలో చెసే జపం రెట్టింపు ఫలాన్నిస్తుంది. గోశాలలో జపం వందరెట్లు,యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది . పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధి లోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితము. శివ సాన్నిద్యంలో జపం చెస్తే అనంతమైన ఫలాన్నిస్తుంది.

అలాగే ఇతర జప ఫలితములు (వివిధ ఆసనములపై) :-
వెదురు తడకపై కూర్చునిచేస్తే - దారిద్ర్యము
రాతిపై కూర్చునిచేస్తే - రోగాలు
నేలపై కూర్చునిచేస్తే - ధుఖము, కొయ్యపీటపై-దౌర్భాగ్యము ,
గడ్డితో చేసిన చాపపై - చిత్తచాపల్యము కలుగుతాయి.

జింక చర్మము పై కూర్చునిచేస్తే- జ్ఞానసిద్ధి
వ్యాఘ్ర చర్మం(పులి తోలు)- మోక్షము
వస్త్రాసనం మీద- ధన సమృద్ధి
పేముతో అల్లిన ఆసనం - రోగ నివారణము కలుగును.

ధుఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేసుకొవాలి. అలాగే ధర్భలతో చేసిన ఆసనంపై జపము చేసిన పుష్టిని కలుగిస్తుంది.

కలియుగములో కీర్తనము మరియు జపము శ్రేష్ఠమైనవి. పూర్వము, వేయి ఎకరాలు అమ్మితే దొరికే డబ్బు, ఈ రోజుల్లో ఒక్క సెంటు అమ్మితే దొరుకుతుంది. అదే కలియుగము యొక్క విశేషము. ఈ రోజుల్లో అయిదు నిమిషాలు పాటు ఏకాగ్రతను పొందగలిగితే అదే గొప్ప సొత్తు. జపము అనగా ఒక ప్రత్యేక దేవతను సూచించు మంత్రమును ‘పునఃపునః’ ఉచ్చరించటము.

Thursday 24 October 2013

నిత్య పూజావిధానం :


Brahmasri Chaganti Koteswara Rao Garu. · 
  • నిత్య పూజావిధానం :

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

    (వినాయకుని / యిష్టదైవమును ధ్యానించవలెను).

    (ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-)

    శ్లో : అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
    యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాఅంతర శ్సుచి:
    ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః

    (అనుకుని అనంతరం కుడిచేతి బొటన వ్రేలితో - ఆ ఉద్ధరిణె లోని నీళ్ళను తమ తలపై మూడు సార్లు చల్లుకొనవలెను)

    ఓం గురుభ్యో నమః

    దీపమును వెలిగించి - గంధ పుష్పాదులతో అలంకరించి - దీపదేవతాభ్యో నమః అని నమస్కరించుకోవాలి.

    దీప శ్లోకం : ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామితే దేవి గృహాణ ముదితోభవ

    ఆచమన కేశవ నామములు

    1. ఓం కేశవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
    2. ఓం నారాయణాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
    3. ఓం మాధవాయ స్వాహా (అనుచు - జలపానము చేయవలెను)
    4. ఓం గోవిందాయ నమః (అనుచు - ఎడమ చేతిని కుడి అరచేతితోను)
    5. ఓం విష్ణవే నమః (అనుచు - ఎడమ అరచేతితోను కడుగుకొనవలెను)
    6. ఓం మధుసూదనాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
    7. ఓం త్రివిక్రమాయ నమః (అనుచు బొటన వేలితో పై పెదవిని)
    8. ఓం వామనాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
    9. ఓం శ్రీధరాయ నమః (అనుచు శిరమున జలము చల్లుకొనవలెను)
    10. ఓం హ్రుషికేశాయ నమః (అనుచు ఎడమ అరచేతిపైనను )
    11. ఓం పద్మనాభాయ నమః (అనుచు రెండు పదముల పైనను)
    12. ఓం దామోదరాయ నమః (అనుచు శిరము పైన నీరు చల్లుకొనవలెను)
    13. ఓం సంకర్షణాయ నమః (అన్ని వేళ్ళు ముడిచి ఆ వేళ్ళ మొదళ్ళతో గడ్డమును తాకవలెను)
    14. ఓం వాసుదేవాయ నమః (అనుచు ఎడమ ముక్కును)
    15. ఓం ప్రద్యుమ్నాయ నమః (అనుచు కుడి ముక్కును అంగుష్ఠ (బొటనవేలు) తర్జనులతో (చూపుడు వేలు) తాకవలెను)
    16. ఓం అనిరుద్ధాయ నమః (అనుచు ఎడమ కన్నును)
    17. ఓం పురుషోత్తమాయ నమః (అనుచు ఎడమ చేతిని )
    18. ఓం అధోక్షజాయ నమః (అనుచు ఎడమ చేతిని)
    19. ఓం నారసింహాయ నమః (కుడి చేతిని అంగుష్ఠ (బొటనవేలు) అనామికలతో (ఉంగరం వేలు) తాకవలెను
    20. ఓం అచ్యుతాయ నమః (అనుచు నాభిని అంగుష్ఠ కనిష్టికలతో (బొటన చిటికెన వేళ్ళతో) తాకవలెను)
    21. ఓం జనార్ధనాయ నమః (అనుచు అరచేతిని హృదయమునకు ఆనించాలి)
    22. ఓం ఉపేంద్రాయ నమః (అనుచు శిరమును కరాగ్రముతో తాకవలెను)
    23. ఓం హరయే నమః (అనుచు బాహు మూలములను వేళ్ళను ముడుచుకొని తాకవలెను)
    24. ఓం శ్రీకృష్ణాయ నమః.

    భూతోచ్చాటనము

    ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
    ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

    1. శ్లోకము చదివి - పూజాస్థలమున జలమును - అక్షతలను చల్లవలెను. తరువాత కూర్చుని అక్షతలు కొన్ని వాసన చూసి వెనుకకు వేసుకోవాలి.

    అథ ప్రాణాయామః

    (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి )

    ఓం భూః, ఓం భువః , ఓం సువః, ఓం జనః, ఓం తపః ,
    ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం
    భర్గో దేవస్య ధీమహి
    ధీయోయనః ప్రచోదయాత్
    ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం
    (మూడు సార్లు జపించవలెను)

    అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకొనవలెను.

    సంకల్పము

    మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే శ్రీ మహా విష్ణు రాజ్ఞీయ ప్రవర్తమానస్య
    అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతా వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే రమణక వర్షే అయింద్ర ఖండే శ్రీసైలస్య పశ్చిమే పార్శ్వే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ........ (శ్రీ నందన (సంవత్సరం పేరు)) నామ సంవత్సరే (ఆయనం పేరు చేర్చి) ..... ఆయనే (దక్షిణాయనే) , (ఋతువు పేరు చేర్చి) ..... ఋతే (శరత్) , ..... మాసే (కార్తీక ), .... పక్షే (శుక్ల) , .... శుభ తిథౌ .....శ్రీమాన్ (గోత్రము పేరు చెప్పి) గోత్రః (తన పేరు చెప్పుకొని) నామధేయః శ్రీమతః (గోత్రము పేరు చేర్చి) గోత్రస్య (తన పేరు చేర్చుకొని) నామ ధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐస్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం , మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ (మనం ఏ దైవమును పూజిస్తున్నామో అ దైవము పేరు చెప్పుకోవాలి - కార్తిక మాసం - దామోదర - ఈశ్వర - తులసి) శ్రీ .............. దేవతా పూజాం కరిష్యే - సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపాచారైః సంభవితా నియమేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే /

    అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.
    కలశ పూజ:
    కలశం అంటే నీళ్ళు వుండే పాత్ర కు గంధము, కుంకుమ అలంకరించి అక్షతలు, పుష్పము వేసి ఎడమ అరా చేతితో కింద పట్టుకొని కుడిఅరచేతితో పైన పట్టుకుని

    తదంగ కలశ పూజాం కరిష్యే //
    శ్లో : కలశస్య ముఖే విష్ణుః కంఠ్ ఎ రుద్రస్సమాశ్రితః
    మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః //
    కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
    ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః //
    అంగై శ్చ సాహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
    గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ //
    నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
    ఆయాంతు శ్రీదేవి (దేవుని పేరు చేర్చి) పూజార్థం దురితక్షయ కారకాః (కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ)
    పూజాద్రవ్యాణి (దేవుడి మీద చల్లి ) దేవం (తమ మీద చల్లుకుని) ఆత్మానం సంప్రోక్ష్య //

    శ్రీ మహా గణాధిపతి పూజా

    అదౌ - నిర్విఘ్నేన పరిసమాప్యార్థం శ్రీ మహా గణాధిపతి పూజాం కరిష్యే
    ఓం సుముఖాయ నమః
    ఓం ఏకదంతాయ నమః
    ఓం కపిలాయ నమః
    ఓం గజకర్ణాయ నమః
    ఓం లంబోదరాయ నమః
    ఓం వికటాయ నమః
    ఓం విఘ్నరాజాయ నమః
    ఓం ధూమకేతవే నమః
    ఓం గణాధ్యక్షాయ నమః
    ఓం ఫాలచం ద్రాయ నమః
    ఓం గజాననాయ నమః
    ఓం వక్రతుండాయ నమః
    ఓం శూర్పక ర్ణాయ నమః
    ఓం హేరంభాయ నమః
    ఓం స్కందపూర్వజాయ నమః
    ఓం గణాధిపతయే నమః
    షోడశ నామ పూజా సమర్పయామి
    శ్లో : వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా //
    గణాధిపతి సుప్రీతో వరదో భవతు
    మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు //

    ప్రతి ఉపచారమునకు ముందు - మనం పూజిస్తున్న దైవమును " ఓం శ్రీ .................... దేవతాయై నమః" అని నమస్కరించుకుంటూ ఆయా ఉపచారములను జరపాలి.

    1. ఆ దైవము ధ్యాన శ్లోకమును స్మరించుకుని

    ఓం శ్రీ ......................దేవతాయై నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి . (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను )

    2. ఓం శ్రీ .................. దేవతాయై నమః ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)

    3. ఓం శ్రీ ................... దేవతాయై నమః రత్న సింహాసనం సమర్పయామి ( కొన్ని అక్షతలు సమర్పించవలెను)

    4. ఓం శ్రీ .................... దేవతాయై నమః పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి - కడిగినట్టు భావించాలి )

    5. ఓం శ్రీ ....................దేవతాయై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి - కడిగినట్టు భావించాలి ).

    6. ఓం శ్రీ ...................... దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).

    7. ఓం శ్రీ .................... దేవతాయై నమః మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)

    8. ఓం శ్రీ .................... దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి.

    9. ఓం శ్రీ .................... దేవతాయై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి - వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).

    10. ఓం శ్రీ .................... దేవతాయై నమః ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).

    11. ఓం శ్రీ .................... దేవతాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి - యజ్ఞోపవీతం రూపేణ అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).

    12. ఓం శ్రీ .................... దేవతాయై నమః శ్రీ గంధాం ధారయామి - (గంధం సమర్పించాలి).

    13. ఓం శ్రీ .................... దేవతాయై నమః సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).

    14. ఓం శ్రీ .................... దేవతాయై నమః సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).

    15. ఓం శ్రీ .................... దేవతాయై నమః (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని
    చదువుకొన వలెను.

    16. ఓం శ్రీ .................... దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి).

    17. ఓం శ్రీ .................... దేవతాయై నమః దీపం దర్శయామి (దీపం చూపించాలి).

    18. ఓం శ్రీ .................... దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
    ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయా త్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
    సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పము తో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (క్లోక్ వైస్ ) తిప్పాలి.
    అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి)
    అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
    దిగువ మంత్రము లతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు - బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
    ఓం ప్రాణాయ స్వాహా-- ఓం అపానాయ స్వాహా -- ఓం వ్యానాయ స్వాహా -- ఓం ఉదానాయ స్వాహా -- ఓం సమానాయ స్వాహా --
    ఓం పరబ్రహ్మణే నమః --- అంటూ నివేదించవలెను.

    ఓం శ్రీ .................... దేవతాయై నమః తాంబూలం సమర్పయామి - తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).

    ఓం శ్రీ .................... దేవతాయై నమః కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
    ఓం శ్రీ .................... దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).

    ఓం శ్రీ .................... దేవతాయై నమః నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను --
    శ్లో : యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
    తాని తాని ప్రణశ్యంతు ప్రదక్షిణం పదే పదే
    పాపాహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవా
    త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత వత్సలా
    అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
    తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా //

    ఓం శ్రీ .................... దేవతాయై నమః గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి ,
    అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి ,
    ఓం శ్రీ .................... దేవతాయై నమః సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్ , దేవ్యోపచారాన్ సమర్పయామి.

    (అంటూ అక్షతలు సమర్పించవలెను).

    అనయా , యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ -- శ్రీ ............................... దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు ----
    ఓం శ్రీ .................... దేవతాయై నమః (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ )

    కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్
    కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణా యేతి సమర్పయామి

    యే తత్ ఫలం శ్రీ ................... దేవతార్పణ మస్తు

    హరిః ఓం తత్సత్

జంబుద్వీపం:

జంబుద్వీపం:

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

8 ) భద్రస్వ వర్ష

(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

భారత్ మాతా కి జై !

Share with everyone !
జంబుద్వీపం:

సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు "జంబుద్వీపే భరతవర్షే భరతఖండే" అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?

జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:

1) కేతుముల వర్ష

2) హరి వర్ష

3) ఇలవ్రిత వర్ష

4) కురు వర్ష

5) హిరణ్యక వర్ష

6) రమ్యక వర్ష

7) కింపురుష వర్ష

8 ) భద్రస్వ వర్ష

(స్పష్టంగా అవగాహన రావడానికి చిత్రాన్ని చూడండి. Check the picture for clear idea.)

పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.

ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.

మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !

మనల్ని దిగ్బ్రాంతికి గురిచేసే విషయం ఏమిటంటే మన ప్రభుత్వం ఇంకా మన పాఠ్య పుస్తకాలలో ఇటువంతి అబద్ధపు సిద్ధాంతాలను, భారత దేశానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని/భారతీయులను తక్కువచేసి చూపించే తప్పుడు చరిత్రను భోదిస్తుంది. మన ప్రభుత్వం దేశ యువతకు మన పూర్వికులు పామరులు/ఏమి తెలియని వాళ్ళు అని భోదిస్తుంది. దేశ భక్తులు కనుగొన్న నిజమైన చరిత్రను భోదించడం లేదు.

ఎల్.కె. అద్వాని మన పాఠ్య పుస్తకాలలో మన ఋషుల గురించి పెట్టాలి అనే ప్రతిపాదన తెచ్చినపుడు కొన్ని కుహానా లౌకికవాద పార్టీలు(Pseudo secular political parties) విద్యావ్యవస్థను కాషాయమయం(Saffronisation) చేయొద్దని తిరస్కరించాయి. నేను ఏ రాజకీయ పార్టి వైపు నుంచి మాట్లాడట్లేదు కానీ వోటు బ్యాంకు కొసం తమ సొంత దేశం యొక్క గొప్పతనాన్ని తిరస్కరించి మన పూర్వీకులను మనమే చిన్నచూపు చూసే దేశం ఎదైనా ఉంటుందా? ఏం మన ఋషులు భారతీయులు కాదా? వారి గురించి మన పాఠ్య పుస్తకాలలో ఎందుకు ఉండకూడదు?

ఏ రాజకీయ పార్టీ అయినా/ప్రభుత్వం అయినా దేశ సంస్కృతిని/పూర్వీకులను గౌరవించాలి. ఇప్పటికైనా భారతీయులు మేలుకోవాలి. మనం ఎంత గొప్ప సంస్కృతికి వారసులమో గ్రహించి మన సంస్కృతిని కాపాడుటకు మనవంతు కృషి చేయాలి.

భారత్ మాతా కి జై !

Share with everyone !

Wednesday 23 October 2013


శ్లోll ఓం శ్రుతి స్మృతి పురాణా మాలయం కరుణాలయం l
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ll
ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం l
అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం ll
------------------------------------------------------------

దశావతార స్తుతి:

దశావతార స్తుతి:

1. వేదోధారవిచారమతే ! సోమకదానవసంహరణ!
మీనాకారశరీర నమో ! భక్తంతే పరిపాలయ మాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే !
రామ హరే ! కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే !
2. మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
3. భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
4. హిరణ్యకశిపుచ్చేదన హేతో ప్రహ్లాదా భయధారణ హేతో
నరసింహా చ్యుత రూపా నమో భక్తంతే పరిపాలయ మాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
5. భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే
వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
6. క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే
భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
7. సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
8. కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే
కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
9. దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప
బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
10. శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
దశావతార స్తుతి:

1. వేదోధారవిచారమతే ! సోమకదానవసంహరణ!
మీనాకారశరీర నమో ! భక్తంతే పరిపాలయ మాం.
నామస్మరణా ధన్యోపాయం న హిపశ్యామో భవతరణే !
రామ హరే ! కృష్ణ హరే తవ నామ పదామి సదా నృహరే !
2. మంథాచలధారణ హేతో దేవాసుర పరిపాల విభో
కూర్మాకార శరీరా నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
3. భూచోరక హర పుణ్యమతే క్రీడోధ్ధఋతభూ
క్రోడాకార శరీర నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామే భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
4. హిరణ్యకశిపుచ్చేదన హేతో ప్రహ్లాదా భయధారణ హేతో
నరసింహా చ్యుత రూపా నమో భక్తంతే పరిపాలయ మాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
5. భవబంధనహర వితతమతే పాదోదకవిమతాఘతతే
వటు వటు వేషమనోఙ్ఞ నమో భక్తం తే పరిపాలయమాం.
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
6. క్షితిపతివంశక్షయకరమూర్తే క్షితిపతి కర్తాహర మూర్తే
భూగుకులరామ పరేవ నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
7. సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో
రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
8. కృష్ణానంత కృపాజలథే కంసారే కమలేశ హరే
కాళియమర్థన లోక గురో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
9. దానవసతి మానాపహార త్రిపుర విజయమర్థన రూప
బుద్థఙ్ఞాయ చ బౌధ్ధనమో భక్తంతే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
10. శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే
Li

Tuesday 22 October 2013

అయ్యప్ప దీక్ష నియమావళి

భక్తి సమాచారం
అయ్యప్ప దీక్ష నియమావళి
నిశ్చలమైన మనస్సుతో సంకల్పిచడాన్ని దీక్ష అంటారు. మనస్సును, వాక్కును, శరీరమును త్రికరణ సుద్దిగా నడిపింపజేస్తానని స్పంకల్పించి, ఇంధ్రియాలను చెడు కర్మల నుండి మరల్చి సత్కర్మలలొ వినియోగించుటకు ఫ్రతిగ్న చెసుకొనుటను దీక్ష అంటారు.

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :-

1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.

2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.

3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.

4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.

5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.

6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.

7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.

8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.

9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.

10. దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను.

11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.

12. తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను 'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం' లేదా 'మాతా' అని పిలవాలి.

13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.

14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.

15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.

16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను.

17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.

18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి.

19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.

20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.

21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.

22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.

23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.
అయ్యప్ప దీక్ష నియమావళి 
నిశ్చలమైన  మనస్సుతో సంకల్పిచడాన్ని దీక్ష అంటారు. మనస్సును, వాక్కును, శరీరమును త్రికరణ సుద్దిగా నడిపింపజేస్తానని స్పంకల్పించి, ఇంధ్రియాలను చెడు కర్మల నుండి మరల్చి సత్కర్మలలొ వినియోగించుటకు ఫ్రతిగ్న చెసుకొనుటను దీక్ష అంటారు.

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :-

1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.

2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.

3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.

4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.

5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.

6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.

7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము. 

8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము. 

9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.

10. దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను. 

11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.

12. తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను 'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం' లేదా 'మాతా' అని పిలవాలి.

13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.

14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.

15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.

16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను. 

17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.

18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి. 

19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.

20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.

21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.

22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.

23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.