Thursday 27 February 2014

ఏకాదశరుద్రులు

హిందూ హిందుత్వం
ఏకాదశరుద్రులు :సకల శుభస్వరూపుడైన పరమశివుడు అవసరమైనప్పుడు సాకారరోపంలో ప్రత్యకేహ్స్మై భక్తులను కరుణిస్తూంటాడు. నిరాకారుడైన ఆ మహాదేవుడు పదకొండు రుద్రస్వరూపులుగా భాసిస్తుంటాడని వేదాలుబోధిస్తున్నాయి."శివ, శంభు, పినాకి, స్థాణు, భర్గ, గిరీశ సదాశివ, హర, శర్వ,కపాలి, భవ'' ఇవి ఏకాదశరుద్రుల నామాలు.శివ : సృష్టి ఆదిలో ఓంకార నాదంతో, తెజోమూర్తిగా, దిగంబరంగా భాసించే వాడే "శివుడు''. దిక్కులే అంబరములు [వస్త్రములు]గాగలవాడు కనుక ఆయన దిగంబరుడు.శంభు : రుద్రమాయకులోనైన బ్రహ్మ, విష్ణువులు తమ జన్మకు కారణంతెలుసుకునే ప్రయత్నం చేయగా వారిముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై, సృష్టి క్రమాన్ని వివరించినవాడే "శంభుడు''పినాకి : చతుర్వేదాలయందు శబ్దబ్రహ్మలా తేజరిల్లేవాడే"పినాకి''స్థాణు : పరిపూర్ణ నిష్కామునిగా, సమాధిస్థితిలో నిమగ్నమై జగత్కల్యాణ కాంక్షతో తపస్సు చేసేవాడే "స్థాణుడు''భర్గ : క్షీరసాగరమధనవేళ జనించిన హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి గరళకంఠుగా ప్రఖ్యాతి నొందినవాడే "భర్గుడు''గిరీశ : కైలాసగిరిపై పార్వతీదేవితో కొలువై భక్తుల కోర్కెలుతీర్చేవాడే "గిరీశుడు''సదాశివ : నిరాకార పరబ్రహ్మగా, సర్వరూపాత్మకంగాక్ శుభస్వరూపంగా సకల లోకాలను పాలించేవాడే "సదాశివుడు''హర : సర్పాలంకార భూషితుడై, ధనుస్సును ధరించి పాపాలను హరించేవాడే :హరుడు''శర్వ : ఇంద్రచాపాన్ని ధరించి, పృధ్వీరధికుడై, త్రిపురాసురసంహారం చేసినవాడే "శర్వుడు''కపాలి : దాక్షాయణీ వియోగంతో క్రోధతామ్రాక్షుడై దక్షయజ్ఞ ధ్వంసం చేసియన్ శూలపాణే, "కపాలి''భవ : రురు, దధీచి, అగస్త్య, ఉపమన్యుడు మొదలైన భక్తులకు యోగశాస్త్రాన్ని బోధించిన ఆదిగురువే "భవుడు''ఇలా ఏకాదశరుద్రులుగా లోకహితం కోరే పరమేశ్వరుడు అష్టమూర్తిగా విశ్వసంరక్షణ చేస్తూంటాడని శివపురాణం చెబుతుంది."శర్వుడు''గా జీవుల మనుగడకోసం భూమిని అధిష్టించి -"భవుడు''గా జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి -"రుద్రుడు''గా దుఃఖనివారకుడైన అగ్నిని అధిష్టించి -"ఉగ్రుడు'గా జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి-"భీముడు''గా గ్రహనక్షత్ర మండలాలకు ఆధారం కలిగించడానికి ఆకాశాన్ని ఆశ్రయించి -"పశుపతి''గా జీవులను కర్మపాశ విముక్తులను గావించడానికి జీవాత్మను అధిష్టించి -"ఈశానుడు''గా ఈ చరాచర జీవులకు ప్రాణశక్తిగా, సూర్యుని అధిష్టించి -"మహాదేవుడు''గా తన శీతల కిరణాలలో ఓషధీరూపంతో జీవులను పాలించే చంద్రుని అధిష్టించి -లోకపాలన చేసే పరమేశ్వరుని అనంత కళ్యాణ గుణగణాలను వర్ణించి, విశ్లేషించి, వివరించడానకి వేదాలకే సాధ్యంకాదు. ఇక మనమెంత.ఇంతటి మహోన్నత చరిత్రుడు కనుకనే జగజ్జనని అయిన పార్వతి, పరమేశ్వరుని వలచింది. ఆయనను భర్తగా పొందాలని తహతహలాడింది."అపర్ణ''యై పంచాగ్నిమధ్యంలో తపస్సు చేసింది. తత్ ఫలితంగా ఆ జగత్పితను వరించింది. శివనామ భాగయై వినుతికెక్కింది.
ఏకాదశరుద్రులు :సకల శుభస్వరూపుడైన పరమశివుడు అవసరమైనప్పుడు సాకారరోపంలో ప్రత్యకేహ్స్మై భక్తులను కరుణిస్తూంటాడు. నిరాకారుడైన ఆ మహాదేవుడు పదకొండు రుద్రస్వరూపులుగా భాసిస్తుంటాడని వేదాలుబోధిస్తున్నాయి."శివ, శంభు, పినాకి, స్థాణు, భర్గ, గిరీశ సదాశివ, హర, శర్వ,కపాలి, భవ'' ఇవి ఏకాదశరుద్రుల నామాలు.శివ : సృష్టి ఆదిలో ఓంకార నాదంతో, తెజోమూర్తిగా, దిగంబరంగా భాసించే వాడే "శివుడు''. దిక్కులే అంబరములు [వస్త్రములు]గాగలవాడు కనుక ఆయన దిగంబరుడు.శంభు : రుద్రమాయకులోనైన బ్రహ్మ, విష్ణువులు తమ జన్మకు కారణంతెలుసుకునే ప్రయత్నం చేయగా వారిముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై,  సృష్టి క్రమాన్ని వివరించినవాడే "శంభుడు''పినాకి : చతుర్వేదాలయందు శబ్దబ్రహ్మలా తేజరిల్లేవాడే"పినాకి''స్థాణు : పరిపూర్ణ నిష్కామునిగా, సమాధిస్థితిలో నిమగ్నమై జగత్కల్యాణ కాంక్షతో తపస్సు చేసేవాడే "స్థాణుడు''భర్గ : క్షీరసాగరమధనవేళ జనించిన హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి గరళకంఠుగా ప్రఖ్యాతి నొందినవాడే "భర్గుడు''గిరీశ : కైలాసగిరిపై పార్వతీదేవితో కొలువై భక్తుల కోర్కెలుతీర్చేవాడే "గిరీశుడు''సదాశివ : నిరాకార పరబ్రహ్మగా, సర్వరూపాత్మకంగాక్ శుభస్వరూపంగా సకల లోకాలను పాలించేవాడే "సదాశివుడు''హర : సర్పాలంకార భూషితుడై, ధనుస్సును ధరించి పాపాలను హరించేవాడే :హరుడు''శర్వ : ఇంద్రచాపాన్ని ధరించి, పృధ్వీరధికుడై, త్రిపురాసురసంహారం చేసినవాడే "శర్వుడు''కపాలి : దాక్షాయణీ వియోగంతో క్రోధతామ్రాక్షుడై దక్షయజ్ఞ ధ్వంసం చేసియన్ శూలపాణే, "కపాలి''భవ : రురు, దధీచి, అగస్త్య, ఉపమన్యుడు మొదలైన భక్తులకు యోగశాస్త్రాన్ని బోధించిన ఆదిగురువే "భవుడు''ఇలా ఏకాదశరుద్రులుగా లోకహితం కోరే పరమేశ్వరుడు అష్టమూర్తిగా విశ్వసంరక్షణ చేస్తూంటాడని శివపురాణం చెబుతుంది."శర్వుడు''గా జీవుల మనుగడకోసం భూమిని అధిష్టించి -"భవుడు''గా జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి -"రుద్రుడు''గా దుఃఖనివారకుడైన అగ్నిని అధిష్టించి -"ఉగ్రుడు'గా జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి-"భీముడు''గా గ్రహనక్షత్ర మండలాలకు ఆధారం కలిగించడానికి ఆకాశాన్ని ఆశ్రయించి -"పశుపతి''గా జీవులను కర్మపాశ విముక్తులను గావించడానికి  జీవాత్మను అధిష్టించి -"ఈశానుడు''గా ఈ చరాచర జీవులకు ప్రాణశక్తిగా, సూర్యుని అధిష్టించి -"మహాదేవుడు''గా  తన శీతల కిరణాలలో ఓషధీరూపంతో జీవులను పాలించే చంద్రుని అధిష్టించి -లోకపాలన చేసే పరమేశ్వరుని అనంత కళ్యాణ గుణగణాలను వర్ణించి, విశ్లేషించి, వివరించడానకి వేదాలకే సాధ్యంకాదు. ఇక మనమెంత.ఇంతటి మహోన్నత చరిత్రుడు కనుకనే జగజ్జనని అయిన పార్వతి, పరమేశ్వరుని వలచింది. ఆయనను భర్తగా పొందాలని తహతహలాడింది."అపర్ణ''యై పంచాగ్నిమధ్యంలో తపస్సు చేసింది. తత్ ఫలితంగా ఆ జగత్పితను వరించింది. శివనామ భాగయై వినుతికెక్కింది.

Wednesday 26 February 2014

'శివం' అంటే మంగళం అని అర్థం.

Brahmasri Chaganti Koteswara Rao Garu.
'శివం' అంటే మంగళం అని అర్థం. ఆదిదేవుడైన పరమేశ్వరుడు మంగళప్రదాత. ఆద్యంతాలు లేని జ్యోతిస్వరూపుడు. సృష్టిలోని ప్రతి అణువూ పరమేశ్వరుడే కొలువైవుంటాడు. పరిపూర్ణ పవిత్రత, పరిపూర్ణ జ్ఞానం, పరిపూర్ణ సాధనగల భక్తవత్సలుడు వేదాల్లో రుద్రునిగా కీర్తించబడ్డాడు.

ఇకపోతే.. శివ అంటే శ+ఇ+వ గా వర్గీకరించారు. 'శ' కారము పరమానందాన్ని, 'ఇ' కారము పరమ పురుషత్వాన్ని, 'వ' కారము అమృత శక్తిని సూచిస్తుంటాయి. 'శివౌ' అంటే పార్వతీ పరమేశ్వరులని అర్థం.

సూర్యుని నుంచి వెలుగును, చంద్రుని నుంచి వెన్నెలను, అగ్ని నుంచి వేడిని విడదీయలేని విధంగా శివశక్తులది అవినాభావ సంబంధం. నిత్యానంద స్వరూపుడైన శివుడు సృష్టి, స్థితి, లయ, తిరోభావ, అనుగ్రహాలనే జగత్కార్యాలను చక్కబెడుతుంటాడు.

మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము.

Bramhasri Samavedam Shanmukha Sarma
రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దివావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని మనం చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. "ఆచారహీనం నపునంతి వేదాః" అని శాస్త్రం. ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. "ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః" అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు - తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. "అభిషేకాత్ ఆత్మశుద్ధిః" అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు - ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి. వాటిలో క్షీరము ప్రధానమైనది. శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. వీటితో అభిషేకం చేయడం వల్ల ఒక కల్పవృక్షం ఎలా కోరికలు తీరుస్తుందో అలాంటి ఫలితములొస్తాయి. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.
రాత్రి వ్రతములు కొన్ని ఉంటాయి. దివావ్రతములు కొన్ని ఉంటాయి. మహాశివరాత్రి అహోరాత్ర వ్రతము. శివరాత్రి అనడంలోనే రాత్రి పాధాన్యం గురించి చెప్పబడుతున్నది. పైగా అమ్మవారికి కూడా మనం నవరాత్రులు అని మనం చేస్తాం. రాత్రి అంతర్ముఖ స్థితికి సంకేతం. ఆ సమయంలో చేసే ఆరాధనలు ధ్యానానికి, జ్ఞానానికి ప్రధానమైనవి. కర్మకు ప్రధానమైన వ్రతాలు పగటియందు చేస్తారు. లింగోద్భవ కాలం, తురీయ సంధ్యాకాలంలో ఒక మహాగ్ని లింగంగా తన ఆదిమద్యాంతరహితమైన తత్త్వాన్ని ప్రకటించాడు గనుక ఆ రాత్రికి ప్రాధాన్యమున్నది. అది జరిగినది మాఘబహుళ చతుర్దశి అర్థరాత్రి సమయం గనుక ఈ రాత్రిని మనం శివరాత్రి వ్రతంగా చేస్తున్నాం. ప్రతి ఆరాధనకీ ఉన్న నియమాలే శివారాధనలో కూడా ఉన్నాయి. వాటితో పాటు మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఏ ఆరాధనకైనా ముందు ఉండవలసినది శుచి. దానినే సదాచారం అంటాం. "ఆచారహీనం నపునంతి వేదాః" అని శాస్త్రం. ఎంత వేదపండితుడైనా ఆచారపాలన లేనప్పుడు వాడు తరించడు. "ఆచార ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః" అని విష్ణుసహస్రనామం చెబుతున్నది. సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేయడం, స్నానసంధ్యాది నిత్యకృత్యముల తర్వాత శివారాధన చేయాలి. శివారాధనలో ప్రధానమైనది శివధర్మములు కొన్ని చెప్పబడుతున్నాయి. శివధర్మములు అనగా శివుని ఉద్దేశించి చేసే కర్మలు. పూర్ణిమ, అమావాస్యలయందు సముద్రం ఎలా వృద్ధిచెందుతుందో అలా ఆ కర్మలు వృద్ధిచెందే కాలం శివరాత్రి. అలాగే శివధర్మములు కొద్దిపాటి చేసినప్పటికీ గొప్ప ఫలితాలుంటాయి. శివాభిషేకం, నామస్మరణ ఇత్యాదులు. మహాశివరాత్రి నాడు ఆ కర్మలు చేస్తే కొద్దిపాటి చేసినప్పటికీ అధికఫలాన్నిస్తాయి పర్వకాల సమయంలో సముద్రం వలె అని పరమేశ్వరుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. స్నానం శరీరానికి కేవలం బాహ్యశుద్ధిని మాత్రమే కలిగిస్తుంది. పూర్ణశుద్ధి కావాలి అంటే భస్మధారణవల్ల శుద్ధి అవుతున్నది. అందువల్ల త్రిపుండ్రములుగా నుదుటియందు, కంఠమునందు, భుజములయందు, చేతులయందు, వక్షస్థలములయందు భస్మాన్ని ధరించాలి అని శాస్త్రం. భస్మధారణ, రుద్రాక్షధారణ, పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఈమూడూ శివధర్మానికి ప్రధాన నియమాలు. స్వామికి ఇష్టమైన బిల్వదళములు, తుమ్మిపూవులు, ద్రోణ కుసుమములు(ఉమ్మెత్త పువ్వులు), వాటితో ఆరాధన చేయాలి. పంచబిల్వములు - తులసి, మారేడు, ఉసిరి, నిర్గుండి(వావిలి), నిమ్మ వీటితో అర్చించడం పరమేశ్వరునికి ప్రీతి. షట్కాల శివపూజ అని నాలుగు గంటలకొకమారు అభిషేకాదులు చేయాలి. అభిషేకప్రియః శివః అని అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అర్హులు మంత్రసహితంగా, తెలియని వారు శివాయ నమః అనే నామం అంటూ అభిషేకం చేసినా చాలు. భక్తికి పరవశించే స్వామి పంచాక్షరితో చేసే పూజకే చాలా సంతోషిస్తాడట. వివిధ ద్రవ్యాలతో శివభిషేకం: భగవదుపచారములలో ఒక్కొక్క ఉపచారానికీ ఒక్కొక్క ఫలితాన్ని చెప్పారు. పరమేశ్వరునికి అభిషేకం అత్యంత ప్రీతిపాత్రమైనది. "అభిషేకాత్ ఆత్మశుద్ధిః" అని శాస్త్రం చెబుతోంది. అభిషేకం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మ అనగా చిత్తము. అంతఃకరణం శుద్ధికావాలి. చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా? తో పాటుగా శివపూజ లేనిదే చిత్తశుద్ధి రాదయా అని కూడా ఉంది. అందుకని చిత్తశుద్ధి కోసం శివపూజ చేయాలి. తరువాత చిత్తశుద్ధితో శివపూజ చేయాలి. శుద్ధికి గొప్ప సాధనం అభిషేకం. ప్రతిదానికీ ప్రధాన, అవాంతర ప్రయోజనాలు లభిస్తాయి. ప్రధానమైనది ఆత్మశుద్ధి. అవాంతర ప్రయోజనాలు - ఐశ్వర్యం లభించడం, రోగాలు పోవడం, జ్ఞానం రావడం, మొ!!వి. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు, శుద్ధ సత్త్వ స్వరూపుడు. అందువల్ల ఆరాధనలో సాత్త్విక పదార్థాలను వినియోగించాలి. వాటిలో క్షీరము ప్రధానమైనది. శుద్ధజలం క్షీరం కంటే ప్రధానమైనది. శుద్ధజలంతో అభిషేకం చేయడం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం. గోక్షీరమే అభిషేకానికి వినియోగించాలి. వేరేవాటిలో గోక్షీరం కలపడం కూడదు. కొందరు ఆవుపాల ప్యాకెట్లు చించి నేరుగా అభిషేకం చేస్తారు. అలా చేయరాదు. మరికొందరు కొబ్బరికాయ కొట్టి నేరుగా అభిషేకం చేస్తారు. అది కూడా మహాదోషం. వాటిని వేరే పాత్రలోకి తీసుకొని అభిషేకం చేయాలి. క్షీరాభిషేకం వెండి పాత్రలోనే చేయాలి. రాగి, కంచు ఇత్యాది పాత్రలలో చేయరాదు. రాగి, కంచు పాత్రలతో తీర్థాన్ని కూడా పుచ్చుకోరాదు. అలా చేయడం వల్ల కల్లుపుచ్చుకున్న దోషం వస్తుంది. క్షీరంతో అభిషేకం చేస్తే అమృతంతో చేసిన గొప్ప ఫలం వస్తుంది. అపమృత్యు వంటి దోషాలు పోతాయి. క్షీరజన్యమైన దధితో అభిషేకం చేయడం కూడా ముఖ్యమైన అంశం. ఇది కూడా అమృతత్వాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. గోఘృతం (ఆవునెయ్యి)తో అభిషేకం చేయడం వలన యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల వాక్శక్తి, జ్ఞానశక్తి లభిస్తాయి. శుద్ధజలాభిషేకం ఆత్మశుద్ధికి హేతువవుతుంది. పైగా గంగాజలంతో అభిషేకం చేయడం ప్రత్యేకమైన విధి. గంగాజలంతో అభిషేకం చేయడంవల్ల తత్త్వజ్ఞానం లభిస్తుంది. భస్మంతో అభిషేకం మోక్షహేతువు. వివిధ ఫలరసములతో అభిషేకం అభీష్టసిద్ధినిస్తుంది. పసుపునీటితో అభిషేకం అమంగళములను తొలగించి మంగళములను, శుభాలను కలిగిస్తుంది. కుశజలం (దర్భలు ముంచిన నీరు), మారేడు తులసీదళములు నీటిలో వేసి ఆనీటితో అభిషేకం చేయవచ్చు. ఈ దళములను వేయడం వల్ల ఆజలము ఔషధంగా మారి అన్ని రోగాలను పోగొట్టగలుగుతుంది. వీటితో అభిషేకం చేయడం వల్ల ఒక కల్పవృక్షం ఎలా కోరికలు తీరుస్తుందో అలాంటి ఫలితములొస్తాయి. ఐశ్వర్యాలొస్తాయి. సుగంధద్రవ్యములు కలిపిన జలం, వట్టి వేళ్ళు కలిపిన జలముతో అభిషేకం తాపహరం, రోగహరం.

శివాభిషేక ఫలములు

శివాభిషేక ఫలములు

1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
Chaganti Koteswara rao garu

పశూనాం పతిం పాపనాశం పరేశం

Bramhasri Samavedam Shanmukha Sarma
పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం
మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 ||
మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం
గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం
భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 ||
శివాకాంతశంభో శశాంకార్థమౌళే
మహేశాన శూలిన్జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 ||
నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః
నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
నచోష్ణం నశీతం నదేశో నవేశో
నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 ||
అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం పారమాద్యంతహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 ||
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య||
(అష్ట నమస్కార శ్లోకం)
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || 9 ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః
త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి || 10 ||
త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే
త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ
లిఞ్గాత్మకే హర చరాచర విశ్వరూపిన్ || 11 ||
పశూనాం పతిం పాపనాశం పరేశం
గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యం |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం
మహాదేవమేకం స్మరామి స్మరామి || 1 ||
మహేశం సురేశం సురారాతినాశం
విభుం విశ్వనాథం విభూత్యఞ్గభూషం |
విరూపాక్షమింద్వర్క వహ్ని త్రినేత్రం
సదానందమీడే ప్రభుం పంచవక్త్రం || 2 ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం
గవేంద్రాధిరూఢం గుణాతీత రూపం |
భవం భాస్వరం భస్మనాభూషితాఞ్గం
భవానీకలత్రం భజే పంచవక్త్రం || 3 ||
శివాకాంతశంభో శశాంకార్థమౌళే
మహేశాన శూలిన్జటాజూటధారిన్ |
త్వమేకోజగద్వ్యాపకోవిశ్వరూపః
ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || 4 ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం
నిరీహం నిరాకారమోంకారవేద్యం |
యతోజాయతే పాల్యతే యేన  విశ్వం
తమీశం భజే లీయతే యత్ర విశ్వం || 5 ||
నభూమిర్నచాపో నవహ్నిర్నవాయుః
నచాకాశమాస్తే న తంద్రా ననిద్రా |
నచోష్ణం నశీతం నదేశో నవేశో
నయస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || 6 ||
అజం శాశ్వతం కారణం కారణానాం
శివం కేవలం భాసకం భాసకానాం |
తురీయం పారమాద్యంతహీనం
ప్రపద్యే పరం పావనం ద్వైతహీనం || 7 || 
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే
నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య
నమస్తే నమస్తే శృతిఙ్ఞానగమ్య||
(అష్ట నమస్కార శ్లోకం)
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ
మహాదేవశంభో మహేశ త్రినేత్ర |
శివాకాంతశాంతస్స్మరారే పురారే
త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || 9 ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే
గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకః
త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోసి || 10 ||
త్వత్తో జగద్భవతి దేవ భవస్స్మరారే
త్వయ్యేవతిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవగఛ్ఛతి లయం జగదేతదీశ 
లిఞ్గాత్మకే హర చరాచర విశ్వరూపిన్ || 11 ||

Tuesday 25 February 2014

మహాశివరాత్రి: మాఘ మాసంలో శివుడిని బిల్వముతో అర్చిస్తే?


మహాశివరాత్రి: మాఘ మాసంలో శివుడిని బిల్వముతో అర్చిస్తే?
మహాశివరాత్రి రోజునే కాదు.. ఏయే మాసంలో ఏయే పూలతో పరమేశ్వరుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. చైత్రమాసంలో శంకరుని దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.

జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది.

శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.

కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు.

మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమానంలో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
‪#‎హైందవ‬ సంస్కృతి మాస పత్రిక 9000790904

Sunday 23 February 2014

గజకేసరీ యోగం అంటే ఏమిటి?

Nerella Raja Sekhar
గజకేసరీ యోగం అంటే ఏమిటి?

గజము అంటే ఏనుగు. కేసరీ అంటే సింహం. యోగం అంటే కలయిక. ఏనుగు సింహములు కలిసి ఉండటం అంటే జరిగే పని కాదు.

కలిసినప్పుడు యుద్ధం తప్పదు. కానీ ఏనుగు సింహములను ఒకచోట వుంచి సమాధానపరచగలిగిన స్థాయి సమన్వయకర్తగా ఈ యోగ జాతకులు ఉంటారు అని ఈ పేరు యోగమునకు పెట్టారేమో అని అనిపిస్తోంది. అయితే ‘గజకేసరీ సంజాతస్తేజస్వీ ధనవాన్ భవేత్ మేధావీ గుణసంపన్నో రాజాప్రియకరో నరః’ అని ఫలితం చెప్పారు.

గజకేసరీ యోగంలో పుట్టిన వారు మంచి తేజస్సు కలవారు, ధనవంతులు, మేధావులు, సుగుణములు కలవారు, ప్రభువులకు ఇష్టులు అగుదురు. అసలు గజకేసరీ యోగం వున్నదా? లేదా? ఎలా తెలుసుకోవాలి.

దేవగురౌ లగ్నాచ్చంద్రా ద్వా-శుభ మృగ్యుతే - నీచాస్తారి గృహైర్హేనే యోగోయం గజకేసరీ’ జన్మలగ్నము నుండి కానీ చంద్రుడు వున్న రాశి నుండి కానీ గురువు 1,4,7,10 స్థానములలో వున్నప్పుడు ఆ గురువుకు ఆ స్థితిలో నీచ దోషం, అస్తమయ దోషం, శత్ర క్షేత్ర దోషం వంటివి లేనప్పుడు శుభదృగ్యోగములు వున్నప్పుడు గజకేసరీ యోగం కలుగును.

మకరం, వృషభం, తులా రాశులు గురువుకు నీచ శత్రు క్షేత్రములు ఆ రాశులలో గురువు వున్నప్పుడు గజకేసరీ యోగం వర్తింపదు అని గుర్తించాల. ‘శుభగ్రహ వీక్షణ’ అనే విషయంలో శుక్ర బుధులకు శత్రుత్వం వున్నది కావున ఇక్కడ పరాశరుల వారి ఉద్దేశం ఆధిపత్యరీత్యా శుభ గ్రహములు అని నా భావన.

శత్రు క్షేత్రంలో వుంటే రాజయోగం లేదు అని అన్నప్పుడు శత్రు గ్రహం అయిన నైసర్గిక శుభులు శుక్రుడు బుధుడు కాదు అనవచ్చు. ఆధిపత్య శుభులు అంటే కోణాధిపతులు, మరియు కేంద్రాధిపత్యం వచ్చిన పాప గ్రహములు అనుకోవచ్చు.

‘జాతక పారిజాతం’లో కేంద్ర స్థితే దేవగురౌ మృగాంకాద్యోగస్తదా హుర్గజకేసరీ ణి -దృష్టే సితార్యేందుసుతైః శశాంకే నీచాస్త హీనైర్గజకేసరీస్యాత్. చంద్రునకు కేంద్రమందు గురువు వున్నచో గజకేసరీ యోగము మరియు చంద్రుడు నీచాస్త దోషములు లేని సితి- శుక్రుడు, ఆర్య - బృహస్పతి - ఇందుసుతైః - బుధ గ్రహములచే చూడబడినను గజకేసరీ యోగము అని భావము. అని నైసర్గిక శుభులు కూడా పరిధిలోకి తీసుకొని వివరించారు.

ఈ ప్రకారం ఆధిపత్య శుభ గ్రహములతో సంబంధం లేకుండా నైసర్గిక శుభగ్రహాలు పరిధిలోకి తీసుకొని ఈ రాజయోగం చెప్పబడినది. దీని ప్రభావం ఎప్పుడు మనకు గోచరిస్తోంది అంటే జన్మతః ఎప్పుడూ సంఘంలో విశేష గౌరవములతోనే వుండే అవకాశం గజకేసరీ యోగం కలిగిస్తుంది. అయితే చంద్ర, గురు అంతర్దశల కాలాలు శుభగ్రహాలు ఏవయితే గురువుతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయో ఆ సమయంలో విశేషంగా ధన లాభం, కీర్తి లాభం, రాజసన్మానం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా ఫలదీపిక ‘శశిని సురగురోః కేంద్రగే కేసరీతి’ అని చెప్పిన కారణంగా శుభగ్రహానుబంధం వున్ననూ లేకున్ననూ గజకేసరీ యోగము అనే చెప్పాలి.

గురువు మిత్ర క్షేత్రంలో కంటే స్వక్షేత్రంలో వుండగా స్వక్షేత్రం కంటే ఉచ్ఛ క్షేత్రంలో వుండగా ఈ రాజయోగ ప్రభావం ఎక్కువగా ఉండి సంఘంలోనూ రాజరికంలోనూ అధిక గౌరవ మర్యాదలు పొందుతారు. అయితే ఈ రాజయోగములు భావచక్రం ద్వారా చూడవలెననియు రాశి చక్రంలో వున్న గ్రహముల ద్వారా కంటే భావచక్రంలో రాజయోగములు గుర్తించి ఫలితాంశములు చెప్పటం వలన నిర్దుష్టముగా మంచి ఫలితాలు రాగలవు అని మహర్షుల వాదన అందువలన భావచక్రం ద్వారా ఈ జాతక యోగములు పరిశీలింపగలరు.

విభూతి స్నానం .......


Nerella Raja Sekhar


విభూతి స్నానం .......

స్నానం అంటే ఒంటి మీద నీళ్ళు పోసుకోవడం. ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. ఎందుకనో? నీళ్ళకీ విభూదికీ ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో?

విభూది ఒక రకం బూడిదే అని మనందరికీ తెలుసు. కాని నీళ్ళూ కూడ మరొక రకం బూడిదే అని మనలో ఎంతమందికి తెలుసు? ఉదజని వాయువు ని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టేరా? లేక, ఇది కేవలం కాకతాళీయమా?

వివిధ హోమభస్మాలు చేసే మేలు:

శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.

శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.

శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.

శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.

శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి.

శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.

శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.

శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.

హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.

గమనిక: హోమభస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.

Thursday 13 February 2014

రేపే మహా మాఘి.( మాఘ పౌర్ణమి )

https://www.facebook.com/hindu.dharmachakram/posts/1422381418001220:0
రేపే మహా మాఘి.( మాఘ పౌర్ణమి )
సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ . ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు , పూర్ణిమలు మనకి లెక్కల్లోకి వస్తాయి. శాస్త్రీయం గా చందృడు .. భూమి .. సూర్యుడు గమనాల బట్టి పగలు , రాత్రులు , నెలలు , సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే . దీనినే కేలండర్ అంటాము .
తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకి సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి . పూర్ణిమ నాడు తెల్లవారు ఝామున వెళ్లి సముద్రస్నానము చేయడం మంచిది .

పూర్ణిమలలొకెల్ల మాఘమాసం లో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసం లో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసం లో వచ్చే పూర్ణిమ లు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమల లో చేసే దేవతారాధం మరింత శ్రేస్టమయినది . " మహామాఘి , అలభ్యయోగం " అని ఈ మాఘ పూర్ణిమను అంటారు .అంటే ఈ రొజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట .
వైశాఖీ కార్తీకీ మాఘీ !
తిధయోతీవ పూజిత: !!
స్నానదాన విహీనాస్తా !
ననేయా: పాండునందన !! .
అని చెప్పబడింది . స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడుపకూడదు.

స్నానము :

యాగాల్లో అశ్వమేధం, వ్రతాల్లో సత్యనారాయణస్వామి వ్రతం, ధర్మాల్లో అహింస ఎంత గొప్పవో స్నానాల్లో మాఘస్నానం అంతగొప్పది. అలాంటి మాఘస్నానాన్ని ప్రవాహజలంలో చేస్తేనే అధికఫలితం. . జపం, తపం, దానం, వ్రతం మొదలైనవాటితో కూడా ఆ భగవంతుణ్ణి సంతృప్తిపరచలేమేమోగానీ... మాఘమాసంలో కేవలం స్నానం వల్లనే ఆయన
ప్రసన్నుడై భక్తులను సకలపాపాలనుంచీ విముక్తుణ్ణి చేస్తాడని పద్మపురాణం ఉత్తరఖండంలోని మాఘమాస మహత్యం చెబుతోంది. కార్తీకమాసం దీపప్రజ్వలనకు ప్రత్యేకమైతే... మాఘం స్నానాలకు ప్రత్యేకం. నారద పురాణాన్ని అనుసరించి... దేవతలు తమ శక్తులనూ తేజస్సులనూ మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది. ఈ మాసంలో వస్త్రాలూ గొడుగులూ నువ్వులూ దానంచేస్తే విశేషఫలం లభిస్తుంది.

సూర్యోదయానికి ముందే...
పౌర్ణమినాడు చంద్రుడు మఘ(మఖ) నక్షత్రంతో ఉండే మాసం మాఘమాసం. మాఘమాస మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు ఆరోగ్యదాయకం. సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చే కాలమిది. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. ఈ కిరణాలు నీటిపై పడటం వల్ల ఆ నీరు చాలా శక్తిమంతమవుతుందట. అందుకే, జనవరి 20 నుంచి మార్చి 30 వరకూ సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలామంచివని చెబుతారు.

మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనామాసం. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈ రోజున తలస్నానం చేసి, సూర్యభగవానుడికి నమస్కరించాలి. ఆదిత్యహృదయం, సూర్యాష్టకం వంటివి చదవాలి. మాఘంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలున్నప్పుడు చేసే స్నానమే అత్యుత్తమమైనది. సూర్యోదయం తరవాత చేసే స్నానం నిష్ఫలమైనది. మాఘమాసమంతా నదీస్నానం చేయలేనివాళ్లు కనీసం మూడురోజులైనా
చేయాలట. ఈనెలలో అమావాస్యనాడు ప్రయాగలో స్నానంచేస్తే సమస్త పాపాల నుంచీ విముక్తి లభిస్తుందని మహాభారతంలోని అనుశాసనిక పర్వం చెబుతోంది.

సనాతనధర్మంలో స్నానానికి ఎంతో విశిష్టస్థానం ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్ధిచేసి, మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ స్నానాలు నిత్య, నైమిత్తిక, కామ్య, క్రియాంశ, అభ్యంగన, క్రియా అని ఆరు రకాలు. ఇందులో వైశాఖ, కార్తీక, మాఘమాసాల్లో ప్రత్యేక ఫలితాలను కోరి చేసే స్నానాలనూ; యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలనూ కామ్యస్నానాలుగా చెబుతారు. ఇలాంటి స్నానం ప్రవాహజలాల్లో... ముఖ్యంగా
సాగరసంగమ ప్రదేశాల్లోనూ చేస్తే ఇంకా మంచిది.
కానీ ఇక్కడే ఒక్క ముఖ్య విషయం గమనించండి, నదీ స్నానం మంచిది అన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయరాదు, ఎందుకంటే...
మనము ప్రతిరోజూ చేసే స్నానము శరీర శుభ్రతకోసము చేస్తాము. కొందరు వేడినీరు స్నానము చేస్తారు. తల శుభ్రతకోసము ప్రతిరోజూ తలస్నానము చేసేవారూ ఉన్నారు. విధిగా వారానికి ఒకసారైనా తలస్నానము చేయాలి. స్నానానికి మంచినీరే వాడాలి. పూర్వము నదులన్నీ తాము పుట్ట్టిన ప్రాంతము నుండి కొండలు , అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్చము గాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగిఉండేవి. ఎటువంటి మలినాలూ , రసాయనాలు , మురికినీరు కలిసేవికావు . అలా ప్రవహించే నదినీటిలో స్నానము చేస్తే ఆరోగ్యము గా ఉండేవారు. కానీ ప్రపంచమంతా పారిశ్రామికమైన తరువాత , జనాభా విపరీతముగా పెరగడము వలన , నదీప్రాంతాలలో పరిశ్రములు నెలకొల్పడమువలన , బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలు విసర్జించడము మూలంగా నదీజలాలు పూర్తిగా కలుషితమైపోయినవి . పూర్వము పుణ్యము వస్తుందనే నెపముతో నదీస్నానాలను , చలినీటి స్నానాలను ,నీటీప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు. అదే ఆచారము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఎంతమాత్రము ఆరోగ్యప్రదమైనది కాదు. పుణ్యము మాట ఏమోగాని ఇప్పుడు నదీస్నానాలు, కోనేరు స్నానాలు , పుష్క్రరస్నానాలు ఏమాత్రము ఆరోగ్యకరమైనవి కావు . కాలము తో పాటు ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇదీ అంతే ... ప్రతిదాన్నీ శా్స్త్రీయ పరముగా ఆలోచించాలి .
సేకరణ.
నచ్చిన వారు షేర్ మాత్రమె చేయవలెను, కాపి చేయరాదు.
తేది.13-02-2014, మ. 2.55
Nerella Raja Sekhar
వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత........

వాస్తు శాస్త్రంలో ‘అర్వణము’ అనే ఒక మాట ఉంది. అర్వణమూ అంటే అచ్చి రావటం. గ్రామాలూ, నగరాలూ, స్థలాలూ, క్షేత్రాలూ కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.

ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.

వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.

దేశం గురించి,అనారోగ్య సమయాలలో,గ్రామం గురించి,గృహ ప్రవేశ విషయాలలో,సేవకుని స్వీకరించే విషయాలలో,దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి.యాత్రలకు,వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.

వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం ఏ వర్గునకు చెందినదో ఆవర్గు అతనికి స్వవర్గు అవుతుంది,అయిదవది శత్రు వర్గు అవుతుంది.

ఉదా:-రాజశేఖర్ అనే వ్యక్తికి ఏ దిక్కు శత్రు వర్గు అవుతుంది.పేరులో మొదటి అక్షరం "రా" ర అనే అక్షరం "య" వర్గులో ఉంది .ఉత్తరం "స్వ "వర్గు అవుతుంది.కాబట్టి అయిదవ వర్గు దక్షిణం శత్రు వర్గు అవుతుంది.కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి దక్షిణ దిక్కు పనికి రాదు.

1,3,6,7 వర్గులు శుభప్రదమైనవి.2,4,6,8 శుభప్రదమైనవి కావు.

స్వవర్గు - ధన లాభం
ద్వితీయ వర్గు - స్వల్ప లాభం
తృతీయ వర్గు - శుభ ప్రదం
చతుర్థ వర్గు - వ్యాధులు
పంచమ వర్గు - శత్రు క్షేత్రం
షష్టమ వర్గు - కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమ వర్గు - సర్వ సౌభాగ్యం
అష్టమ వర్గు - మరణ ప్రదం
వాస్తు శాస్త్రంలో వర్గులు వర్గాధిపతుల యొక్క ప్రాధాన్యత........

వాస్తు శాస్త్రంలో ‘అర్వణము’ అనే ఒక మాట ఉంది. అర్వణమూ అంటే అచ్చి రావటం. గ్రామాలూ, నగరాలూ, స్థలాలూ, క్షేత్రాలూ కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.

ఈ అర్వణం చూసే విధానం ‘కాలామృతం’ జ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది. 

వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.

దేశం గురించి,అనారోగ్య సమయాలలో,గ్రామం గురించి,గృహ ప్రవేశ విషయాలలో,సేవకుని స్వీకరించే విషయాలలో,దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి.యాత్రలకు,వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.

వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరం ఏ వర్గునకు చెందినదో ఆవర్గు అతనికి స్వవర్గు అవుతుంది,అయిదవది శత్రు వర్గు అవుతుంది.

ఉదా:-రాజశేఖర్ అనే వ్యక్తికి ఏ దిక్కు శత్రు వర్గు అవుతుంది.పేరులో మొదటి అక్షరం "రా" ర అనే అక్షరం "య" వర్గులో ఉంది .ఉత్తరం "స్వ "వర్గు అవుతుంది.కాబట్టి అయిదవ వర్గు దక్షిణం శత్రు వర్గు అవుతుంది.కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి దక్షిణ దిక్కు పనికి రాదు.

1,3,6,7 వర్గులు శుభప్రదమైనవి.2,4,6,8 శుభప్రదమైనవి కావు.
  
స్వవర్గు - ధన లాభం
ద్వితీయ వర్గు - స్వల్ప లాభం
తృతీయ వర్గు - శుభ ప్రదం
చతుర్థ వర్గు - వ్యాధులు
పంచమ వర్గు - శత్రు క్షేత్రం
షష్టమ వర్గు - కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమ వర్గు - సర్వ సౌభాగ్యం
అష్టమ వర్గు - మరణ ప్రదం

సదా భగవత్ స్మరణ చేస్తూ పనులు సాగించండి. మీరు చేసే కార్యము యజ్ఞము అయిపోతుంది.

Jaji Sarma
సదా భగవత్ స్మరణ చేస్తూ పనులు సాగించండి. మీరు చేసే కార్యము యజ్ఞము అయిపోతుంది.
మరణసమయంలో కఫ, వాత, పిత్త దోషాలకు నేను లోనైతే నీ నామస్మరణకు గొంతు, భగవద్ధ్యానానికి మనస్సు అనుకూలంగా ఉంటాయో, ఉండవో చెప్పలేను, అప్పుడే స్మరిస్తానులే అని ఇప్పుడు మానలేను. ఎందుకైనా మంచిది. ఈ రోజే నీ పాదపద్మాలనే పంజరంలో నా మనస్సు అనే రాజహంసను ప్రవేశపెడతాను, ఆలస్యం చేయను అనే భావాన్ని కులశేఖరులు తమ ముకుందమాలలో-
‘కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంత
మద్వైవ మే విశతు మానస రాజహంస
ప్రాణప్రయాణ సమయే కఫ వాత పిత్తై
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే’ అనే శ్లోకంలో వివరించారు.

అందుకే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, ఇంద్రియాలు బలంగా, పరిపుష్టంగా ఉన్నప్పుడే, ముసలితనం రాకముందు తనకు, ఇతరులకు శ్రేయస్సును కలిగించే పనులను చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. తరువాత చేద్దాం, తొందరేముంది అని వాయిదా వేయవద్దు, సత్కార్య నిర్వహణకై తొందరపడాలి. సత్కార్యసాధనకై ఎక్కువగా ప్రయత్నించాలి.

Monday 10 February 2014

అక్షౌహిణి సంగతి

Jaji Sarma
కౌరవుల పక్షమున పొరాడిన అతిరధులు
భీష్ముడు
సుయోధనుడు
శల్యుడు
భూరిశ్రవుడు
కృపాచార్యుడు
ద్రోణాచార్యుడు
అశ్వథామ
బాహ్లికుడు, అతని కుమారుడు సోమదత్తుడు

కౌరవుల పక్షమున పొరాడిన మహారధులు
సైంధవుడు
త్రిగర్తాధిపతులు ఐదుగురు

కౌరవుల పక్షమున పొరాడిన సమరధులు

కాంభోజరాజు
సుదక్షిణుడు
లక్ష్మణకుమారుడు
శకుని
అలంబసుడు
భగదత్తుడు

కౌరవుల పక్షమున పొరాడిన అర్ధరధులు
మహిష్మతి అధిపతి నీలుడు
అవంతీ దేశాధీశులు విందాను విందులు
బృహద్బలుడు
దండధారుడు
కర్ణుడు
------------------------------------------------------------------------------------------

పాండవుల పక్షమున పొరాడిన అతిరధులు
అర్జునుడు
ధర్మరాజు
భీమసేనుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు
అభిమన్యుడు
సాత్యకి
దృష్టద్యుమ్నుడు
కుంతిభోజుడు
పాండవుల పక్షమున పొరాడిన మహారధులు
ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు
ఉత్తరుడు,
ద్రుపదుడు
విరాటుడు
శిఖండి
ఉత్తమౌజుడు
యుధామన్యుడు
క్షత్రదేవుడు
జయంతుడు
అమితౌజుడు
విరాటుడు
సత్యజితుడు
కేకయరాజులు అయిదుగురు
కాశీశుడు
నీలుడు
సూర్యదత్తుడు
మదిరాక్షుడు
శంఖుడు
చత్రాయునుడు
చేకితానుడు
చంద్రదత్తుడు
వ్యాఘ్రదత్తుడు
పాండవుల పక్షమున పొరాడిన సమరధులు
నకుల, సహదేవులు
కాశ్యుడు
పాండవుల పక్షమున పొరాడిన అర్ధరధులు
దృష్టద్యుమ్నుని కుమారుడు దృతవర్ముడు
------------------------------------------------------------------------------
మొత్తము 18 అక్షౌహిణల సేన కురుక్షేత్ర మహాసంగ్రామములో పాల్గొన్నది.
అక్షౌహిణి అంటే ఎంత ?
పూర్వము మన చరిత్రలో యుద్ద సైన్యాన్ని అక్షౌహిణి లో కొలుస్తారు. కంబ రామాయణం లో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి.
1 రధము + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే : ఒక పత్తి

పత్తి X 3 = సేనాముఖము; అంటే 3 రధములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు

సేనాముఖము X 3 = గుల్మము ; అంటే 9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు

గుల్మము X 3 = గణము ; అంటే 27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు

గణము X 3 = వాహిని ; అంటే 81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు

వాహిని X 3 = పృతన ; అంటే 243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు

పృతన X 3 = చమువు ; అంటే 729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు

చమువు X 3 = అనీకిని ; అంటే 2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు

అనీకిని X '10' = అక్షౌహిని ; అంటే 21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు

ఇటువంటి అక్షౌహినీలు 18ది కురుక్షేత్ర యుద్దములో పాల్గొన్నాయి .... అంటే

3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు

మీకో విషయం, ఇక్కడ ఒక్కొక్క రధం మీద యుద్ద వీరునితో పాటు సారధి కూడా ఉంటాడు. సారధులని కూడా లెక్కలోనికి తీసుకుంటే, రధబలం 7,87,329 కి చేరుకుంటుంది.

అలాగే గజబలం తో యుద్దవీరునితో పాటు మావటి వాడిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.

అక్షౌహిని X '18' = ఏకము

ఏకము X '8' = కోటి ( ఈ కోటి మన కోటి కాదు )

కోటి X '8' = శంఖము

శంఖము X '8' = కుముదము

కుముదము X '8' = పద్మము

పద్మము X '8' = నాడి

నాడి X '8' = సముద్రము

సముద్రము X '8' = వెల్లువ

అంటే 366917139200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇటు వంటి వి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది.

అంటే 366917139200 X 70

256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు.

వీరికి నీలుడు అధిపతి .

అదీ అక్షౌహిణి సంగతి

Friday 7 February 2014

పంచభూత లింగాల గురించి ...

Nerella Raja Sekhar
పంచభూత లింగాల గురించి ......

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు.

పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు. 

1. పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:- ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం: తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం: ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 5

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 5 
1. తీర్థ యాత్రలు ఎలా చేయాలో మనకి చెప్పే శ్లోకం ఇది.

గాం పర్యటన్మేధ్యవివిక్తవృత్తిః సదాప్లుతోऽధః శయనోऽవధూతః
అలక్షితః స్వైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని

అవధూతగా తిరిగాడు, పవిత్రమైన దాన్ని ఆహారముగా, ఒంటిగా (వివిక్త) భోజనం చేసాడు. రోజూ మూడు పూటలా స్నానము చేస్తూ (సదాప్లుతోऽధః), నేల మీద పడుకుంటూ (అధః శయనో), తనవారెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు, దుమ్ము ధూళితో నిండి ఉండి అవధూత వేషముతో ఉండి, స్వయముగా అందగాడు కాబట్టి తన అందము ఇంకొకరి మనసులో వికారం కలిగించకుండా అవధూత పరమాత్మను సంతోషింపచేసే వేషములో వ్రతములు చేస్తూ 

2. భార్య భర్తలు కలిసి భోజనం చేయకూడదు. ఒంటరిగా భోజనం చేయాలి. నలుగురిలో కూర్చుని భోజనం చేస్తే పదార్థాలు ఒకటే అయినా తినే తీరుని చూస్తే అధర్మం వస్తుంది. తన చొట్టూ కూర్చున్న వారు అధర్మంగా తింటే దాని మీదకు మనసు పోతుంది.

3. అహంకారమనేది మన అంతఃకరణాన్ని పూర్తిగా పరీక్షిస్తుంది. ప్రతీ క్షణం మన అంతఃకరణం మనకి నిశ్చయతత్వాన్ని బోధిస్తుంది. అయినా మనసు వినదు.

4. శిశుపాలుడు రాజసూయానికి వచ్చేసరికే 92 తప్పులు జరిగాయి. రాజసూయములో మిగిలిన ఎనిమిదీ చేసాడు 

5. రధులలో అగ్రుడైన , పూర్వ జన్మలో పార్వతీ దేవి గర్భంలో ధరించిన కుమారస్వామి అయిన సాంబుడిని, ఆ కుమారస్వామి ఆరాధనతో జాంబవతి ఈయనను కుమారునిగా పొందింది.

6. సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైః సుఖం వాన్యదుపారమం వా
విన్దేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్వదేన్నః

ఇది మనమందరమూ వేసుకోవాలసిన ప్రశ్న. ప్రపంచములో ప్రతీ ప్రాణీ ఎందుకు పని చేస్తుంది? సుఖం కోసం. కానీ వాళ్ళు చేసే పనుల వలన సుఖం కలుగుతున్నదా? పోనీ దుఖమైనా తొలగుతోందా (అన్యదుపారమం వా).
ఈ రెండూ లేకపోగా, ఆ పనుల వలన మరికాస్త దుఃఖం కలుగుతోంది. ఇది న్యాయమేనా. దీనిలో ఏది యుక్తమో మీరు చెప్పండి. సుఃఖం కోసం పని చేస్తుండగా దుఃఖం ఎందుకు కలుగుతోంది.

7. ప్రతీ దానిలో ఉన్న సూక్ష్మ పరిశీలనాత్మక బుద్ధిని చిత్తం అంటారు. పరిశీలించే పని చిత్తానిది. నిశ్చయించే పని అంతఃకరణానిది ఆలోచించే పని బుద్ధిది, మార్పు చెందే పని మనసుది. ఈ నాలుగూ వేరు.

8. భాగవత పరంపర: మైత్రేయుడు విదురునితో ఈ విధంగా చెప్పాడు
సనత్కుమారులు అడిగితే నివృత్తి ధర్మ పరివృత్తుడైన సనత్కుమారునికి ఆదిశేషుడు (సంకర్షణుడు) ఈ భాగవతం వివరించారు. సంకర్షుని ద్వారా సనత్కుమారుడు భాగవతాన్ని విన్నాడు. ఆ సనత్కుమారున్ని సాంఖ్యాయన మహర్షి అడిగారు. 
భాగవత విభూతులు చెప్పాలనుకున్న పరమహంస్య ముఖ్యుడైన సాంఖ్యాయనుడు మా గురువుగారైన పరాశరునికి, బృహస్పతికీ చెప్పాడు. ఆ పరాశరుడు పరమదయాళువు కాబట్టి నాకు చెప్పాడు. ఈ పరాశరుడు వశిష్టుడికి మనుమడు (వశిష్టుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు, ఒక రాక్షసుడు శక్తిని తినివేసాడు. ఆ విషయం తెలుసుకున్న పరాశరుడు రాక్షస వినాశానికి ఒక యజ్ఞం చేసాడు. అప్పుడు పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వచ్చి వారించాడు. అప్పుడు పులస్త్యుడు సంతోషించి పురాణ కర్తవి అవ్వమని వరమిచ్చాడు. పురాణానికి ఆద్యం విష్ణు పురాణం), పులస్త్య బ్రహ్మ ఇచ్చిన వరము వలన మా గురువుగారు భాగవతాన్ని నాకు వివరించాడు. నేను నీకు దాన్నే చెప్పబోవుతున్నాను

9. ప్రణత అర్తి అర్థ ప్రదుడు అని కంచి వరదరాజ స్వామికి పేరు.

10. పూర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగసమాధినా
రాద్ధం నిఃశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్త్వవిన్మతమ్

యజ్ఞ యాగాదులూ చేసి, తోటలూ దేవాలయాలు, చెరువులూ బావులు నిర్మించడం - ఇలా పూర్తములతో, దానములతో యోగములతో సమాధులతో, వీటన్నిటి వలన కలిగే ఉత్తమ శ్రేయస్సు ఒకటే. నేను సంతోషించుటే. నేను సంతోషించుటే దేనికైనా ఫలము. (పరమ శివుడు హాలాహలాన్ని తాగుతూ "ఇలా చేస్తే హరి సంతోషితాడు" అని అంటారు). ప్రపంచంలో చేసే అన్ని పనులకూ ఏకాంత ఫలం నా సంతోషమే అని తత్వము తెలిసిన వారి సిద్ధాంతం. అందుకే మనం భగవదాజ్ఞ్యతో భగవంతుని ప్రీతి కొరకు భగవంతుని కైంకర్యముగా పనులు చేస్తాము. 

11. పాపమే అజ్ఞ్యానానికి కారణం. అలాంటి పాపం మన దరికి రాకుండా చేయమని స్వామిని ప్రార్థిస్తాము. మనం ఏ సమయములో ఏమి అనుభవించాలో ముందే రాసి ఉంటుంది. పూర్వ జన్మలో చేసిన పాపమే ఇపుడు ఆలోచన రూపములో బుద్ధిరూపములో వచ్చి పాప కర్మ అనుభవించేట్లు చేస్తింది. ఎపుడైతే మనం చేసిన పుణ్యం సాత్విక భావాన్ని భక్తినీ కలిగించిందో, ఎపుడైతే మనం పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నమో ఆ సమయాములోనే "పరమాత్మా, మళ్ళీ నా దగ్గరకి పాపం వంతు రానివ్వకూ, నీవు సర్వ సమర్ధుడవు, దయా మయుడవు. ఆ పాపమును శమింపచేసి నాకు ఇలాంటి సాత్విక బుద్ధినే కలగనీ". మనం చెడుపని చేసామంటే అది పాప ఫలితమే. గతం అనుభవించడానికే కాదు, ముందు అనుభవించాల్సిన దానికి కూడా సిద్ధం చేసుకుంటున్నాము. అలా సిద్ధం చేసుకోకుండా చేయమని ప్రార్థిస్తాము.

12. రుద్రుడు ఉండే స్థానాలు పదకొండు 1. హృదయము 2. ఇంద్రియములూ 3. ప్రాణములు 4. ఆకాశము 5. వాయువు 6. అగ్ని 7. జలం 8. భూమి 9. సూర్యుడు 10. చంద్రుడు 11. తపస్సు

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 4

Jaji Sarma
భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 4
1. రామావతార సారం మొత్తం పెద్దల మాట వినుట. గురోర్నిదేశే తిష్ఠన్: దేవతలు కోరితే అవతరించాడు. విశ్వామిత్రుడి మాట మేరకే ఆయనతో వెళ్ళాడు. విస్వామిత్రుని మాటమేరకే తాటకిని సంహరించాడు. ఆయన మాట మేరకే యజ్ఞాన్ని కాపాడాడు, ఆయన ఆజ్ఞ ను అనుసరించి మిథిలా నగరానికి బలయలు దేరి, అహల్యను శాపవిమోచనం గావించి, ఆయన మాటమేరకే శివ ధనుర్భంగం చేసాడు, దశరధుడు చెప్తే సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. తండ్రి మరియు కైక ఆజ్ఞతో అరణ్యానికి బయలుదేరాడు. భరద్వాజుని ఆజ్ఞతో చిత్రకూటంలో నివాసం ఏర్పరుచుకున్నాడు, చిత్రకూటంలో కులపతి ఆజ్ఞతో అక్కడినుంచి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళాడు . దండకారణ్యంలో సుతీక్షుని ఆజ్ఞతో అక్కడ ఋషుల ఆశ్రమాలు దర్శించాడు, అగస్త్య ముని ఆజ్ఞతో పంచవటికి బయలుదేరాడు, పంచవటిలో జటాయువు నిర్దేశంతో ఆశ్రమం నిర్మించుకున్నాడు. కబంధ్ని, శబరి ఆజ్ఞతో సుగ్రీవుడితో స్నేహం చేసి. సుగ్రీవుని మాటతో వాలిని చంపాడు, సుగ్రీవుని మాటతోనే హనుమంతాదులను సర్వదిక్కులకూ పంపాడు. హనుమంతుడు చెప్పినదాన్ని బట్టి, సుగ్రీవుని సలహామేరకూ యుద్ధానికీ బయలుదేరాడు, విభీషణుని సలహా మేరకూ సముద్రున్ని శరణు వేడాడు, సముద్రుని మాటమేరకూ సముద్రానికి వారధి కట్టాడు. రామ రావణ యుద్ధంలో కూడా మాతలి చెబితే రావణున్ని చంపాడు. అగ్నిహోత్రుడు చెబితే సీతమ్మవారిని స్వీకరించాడు, భరద్వాజుడు చెబితే అయోధ్యకు మళ్ళీ వెళ్ళాడు, యమధర్మరాజు చెబితే అవతారాన్ని చాలించుకున్నాడు.

2. కాళీయమర్దన ఘట్టం: దూడలు ఆవులూ కొందరు గోపబాలులతో కలిసి స్వామి వెళ్తుండగా, కొందరు ఆ నదిలో నీరు త్రాగారు. ఆ నీరు త్రాగి మరణించిన వారిని పరమాత్మ తన అనుగ్రహ దృష్టితో బ్రతికించాడు. మరునాడు పొద్దున్న కొందరు పిల్లలను తీసుకొని బలరాముడి కూడా చెప్పకుండా వచ్చాడు. వచ్చి చెట్టు ఎక్కి దూకాడు. ఈ కాళీయ హ్రదమంటే మన సంసారమే. మనలో విషాలను తొలగించడానికే స్వామి వస్తాడు. కాళీయుడు గరుడునితో విరోధం పెట్టుకుని వచ్చాడు. గరుడుడు అంటే పక్షి, అంటే ఆచర్యుడు. భాగవతులతో విరోధం పెట్టుకుంటే విషమయమైన సంసారంలో పడతాము. మళ్ళీ స్వామి కరుణించి ఆ భవతోత్తముల ఆగ్రహాన్ని శమింపచేసి, సంసారం నుంచి విడుదల చేసి నిత్య విభూతికి పంపుతాడు. అలాగే కాళీయ్డుఇని హ్రదం నుండి సముద్రానికి పంపాడు. జీవున్ని పరమాత్మ వైకుంఠానికి ఎలా పంపుతాడో చెప్పే అధ్యాయం. అలాగే పూతన స్తనంలో విషము పెట్టుకుంది. ఈ విషము అంటే విషయములు. అహంకార మమకారాలు స్తనములైతే , అందులో ఉండే శబ్దాది విషయాలు విషములు. విషము తాగితే ప్రమాదం. విషయం ఆలోచిస్తేనే ప్రమాదం. అందుకే కృష్ణుడి లీలల్లో దావాగ్నీ విషమూ పెక్కు సార్లు వస్తాయి. ఆ రాత్రి గోపాలురందరూ అక్కడ విశ్రమించగా దావాగ్ని వచ్చింది. ఆ అగ్నిని కృష్ణుడు తాగేసాడు. మన కామములే అగ్ని. అంతకు ముందు ఆ మడుగులో ఉన్నది అహంకారం అనే విషము. కాళీయుడు ఏ విధంగా ప్రాణ రక్షణ కోసం ఆ హ్రదంలోకి వచ్చి మిగతా జీవులు జేరకుండా హింసించాడో, మనం కూడా సంసారములో కర్మ అనుభవించడానికి వచ్చాము. అది అనుభవించడం చాలక, మరి కాస్త కర్మను మూటగట్టుకుని పోతున్నాము. బృహధారణ్యక ఉపనిషత్సారం ఈ కాళీయ మధన వృత్తాంతం.
ఆ కాళీయ హ్రదంలో స్వామి విహరించాడు. ఆ కాళీయున్ని బయటకు వెళ్ళగొట్టాడు (ఉచ్చాటయిష్యదురగం )

అందరూ ఆనందముతో ఆ రోజు అక్కడ పడుకుంటే దావాగ్ని వచ్చింది. అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు, తాను కూడా మూసుకున్నాడు. అందరినీ తెరవమన్నప్పుడు చూచేసరికి అగ్నిలేదు. (నొట్లోకి ఏ పదార్థం పోతున్నా చూడకూడదని శాస్త్రం. లోపటికి వేడి వెళ్తున్నప్పుడు, కళ్ళలో జ్యోతికూడా మూసుకోవాలని శాస్త్రం). ఒక్క బలరాముడు మాత్రం మూసుకోలేదు. నైవేద్యం పెట్టేప్పుడు అర్చకునికి మాత్రమే మినహాయింపు చూడటానికి. అర్చకుడు కూడా స్వామికి నైవేద్యం పెట్టేప్పుడు ప్రసాదం చూడకూడదు.

3. ఈ శ్లోకానికి అపవర్గప్రదం అని పేరు. పరమాత్మ స్వరూపం, పరమాత్మ సన్నిధి కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. పంచభూతాలు గాని,కాలము గానీ దేశం కానీ, వ్యక్తి కానీ, అవస్థలు కానీ, నిరంతరం మన ప్రయత్నం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసలు తీసుకుంటామో మనం ఈ శ్లోకాన్ని అలా అనుసంధానం చేసుకోవాలి
శశ్వత్ప్రశాన్తమభయం ప్రతిబోధమాత్రం
శుద్ధం సమం సదసతః పరమాత్మతత్త్వమ్
శబ్దో న యత్ర పురుకారకవాన్క్రియార్థో
మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా

పరమాత్మ తత్వాన్ని నూటికి నూరుపాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా చేస్తే మనకు సందేహాలే కలగవు. సర్వదా, అన్నిసమయాలలో (శశ్వత్) ప్రశాంతంగా ఉండి (గుణాలన్నీ అణగారిపోయి), ప్రకృతికంటే అతీతుడైనవాడు అయిన పరమాత్మకు గుణాలు ఎలా ఉంటాయి? అందుకే ఆయన ప్రశాంతాత్మ. ఆయనకెప్పుడు భయం ఉండదు (భయం అంటే ప్రమాదం కలుగుతుందేమో అని ఉండే శంక), సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, ఆయన శుద్దుడు (నిర్వికారుడు), సమం (ద్వేషం అసూయ లాంటివి లేని వాడు,) ఆయన సత్ అసత్ రెండిటికీ సమం (ఉన్నవాళ్ళకి ఉన్నట్లుగా కనపడతాడు, దేవుడు లేడు అనే వారికి లేనట్లుగా కనపడతాడు)
పరమాత్మ విషయంలో వేదం కూడా చేసే పని ఏమీ ఉండదు ( పురుకారకవాన్). వేద వాక్కు కూడా అక్కడిదాకా వెళ్ళి వెనక్కు వస్తాయి. వేదము కూడా పరమాత్మ స్వరూపాన్ని చెప్పలేదు. అది కూడా పనికి రాదు (నక్రియార్థో). మాయ కూడా పరమాత్మ ఎదురుగా వస్తే సిగ్గుపడి మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది.

4. ఈ శరీరం ఉన్నంత వరకూ మనం "చాలా సౌందర్యంగా ఉంది" అని చెప్పుకుంటాం. చాలా కాలం బ్రతుకుతాము అని అనుకున్నా ఆ కాలం దాటిన తరువాత ఉండము అని అందులోనే ఉంది. కనుకూ క్షీర్యతే ఇతి శరీరం, క్షీణించే దాన్ని శరీరం అంటాం, వృద్ధి చెందే దాన్ని దేహం అంటాం. 38 ఏళ్ళ దాక ఇది దేహం, అది దాటగానే అది శరీరం అవుతుంది.

5. మగవారికన్నా ఆడవారికి తెలివి 32 పాళ్ళు, 8 పాళ్ళు కామం, 16 రెట్లు బుద్ధి, 32 రెట్లు ఆకలి, 64 రెట్లు కార్యదక్షత, లెక్కలేనన్ని రెట్లు అసూయా ఉంటుంది

6. నిత్య ప్రళయం: ప్రపంచంలోనూ మన శరీరములోనూ ప్రతీక్షణం కలిగే మార్పు. శిశువు గర్భంలో పడినప్పటినుంచీ ప్రతీక్షణం కలిగే అన్ని అవస్థలూ శరీరానికి వస్తూనే ఉంటాయి. ఈ మార్పులే నిత్య ప్రళయం.
నైమిత్తిక ప్రళయం: బ్రహ్మకు ఒక పగలు అయితే వచ్చేది
ప్రాకృతిక ప్రళయం: బ్రహ్మకు నూరేళ్ళు వస్తే వచ్చేది
ఆత్యంతిక ప్రళయం: ఇది మోక్షం

7. ఇష్టములనీ పూర్తములనీ రెండు రకాల కర్మలు: ఇష్టములని (యజ్ఞ యాగాదులు) పూర్తములనే (నదులూ బావులూ దేవాలయాలు తోటలు చెరువులూ ఏర్పాటు చేయడం) కర్మలు

8. విదురుడు యముని అంశ. పరమాత్మ మాయను తెలిసిన పన్నెండు మంది భాగవతోత్తములలో ఆయన ఒకడు. మొత్తం పదునాలుగు లోకాలలో ఆయన మాయను తెలిసిన వారిలో యముడు నాలగవ వాడు. మనకు భారతంలో 9 మంది కృష్ణులు అయిదుగురు యముళ్ళు, నలుగురు సూర్యులు, ముగ్గురు చంద్రులు, నలుగురు రుద్రులు, శ్రీమన్నారాయణ పరిపూర్ణ తత్వంగా ఒక ముగ్గురూ. ఇలా 27 మంది ఉంటారు. దిక్పాలకులు నారాయ్ణుడు, సూర్యుడు చంద్రుడు. ఉదాహరణకు సాత్యకి, సాంబుడు సైంధవుడు అశ్వద్ధామ రుద్రాంశలు, తొమ్మండుగురు కృష్ణులు, ఐదుగురు యముళ్ళు, ముగ్గురు సూర్యులు. వీరందరూ రాయబారంలో కలిసారు. ఇలాంటి మహాజ్ఞాని అయిన విదురుడు మైత్రేయుని చిన్న విషయాలగురించి అడిగి ఉండడు. చిన్న ప్రయోజనం ఆశించేవారు కాదు.
మైత్రేయుడు వ్యాసుని సహాధ్యాయి. అటువంటి ఉత్తముడైన మైత్రేయునితో అడిగిన ప్రశ్న, పరమాత్మ అయిన భగవంతుని చర్చకు సంబంధించినది అయి ఉంటుంది. పరమాత్మ ఎవరికోసం అవతరిస్తాడో (పరిత్రాణాయ సాధూనాం) వారికోసం మాట్లాడుకున్న మాటలే అవుతాయి గానీ మామూలు కబుర్లు కావు (మనలాగ ఆయుష్షును వృధా చేసే చర్చలు కావు)

9. హస్తిన నుంచి లక్క ఇంటికి వెళ్ళేలోపు మూడు సార్లు పాండవులపై హత్యా యత్నం జరిగింది. బిదికృత్ అనే రాక్షసుడు ఒకసారి, కల్పించబడిన దావాగ్నితో ఒక సారి, విషప్రయోగంతో ఒకసారి. ఈ మూడు ప్రయత్నాలను విదురుడు వారించాడు. తద్వారా కౌరవులకు నరకం రాకుండా చేసాడు. యుద్ధంలో మరణిస్తే పాపం పోతుంది. ఇలాంటి పని చేయడంవలన పాపం వస్తుంది. దారిలో ప్రయత్నం చేయొద్దని వారించాడు. పాండవులు ఒక స్థానం ఏర్పరుచుకునే వరకూ వారినేమీ చేయొద్దని చెప్పాడు. అలాగే ధర్మరాజు హస్తిన నుంచి వెళ్ళేప్పుడు ఒక చిన్న ఎలుకని ఇస్తాడు. ధర్మరాజదులు లక్క ఇంటిలోకి వెళ్ళినపుడు ఆ ఎలుక ఒక కన్నంలోకి వెళ్తుంది. ఇది చూసిన ధర్మరాజుకు మనం కూడా ఒక సొరంగం ఏర్పరచుకోవాలన్న ఉపాయం వస్తుంది

10. ఓర్పు అనేది తల్లి, ధర్మం అనేది తండ్రి. పాండవులకు కుంతి ఉంది. అంటే ఓర్పు ఉంది. వారికే ఓర్పులేకపోతే అంతవరకూ సహించి ఉండి ఉండేవారు కాదు. పాండవులు ధర్మం ఆచరించుట వలన తండ్రి ఉన్నవారే అయినారు.

11. స్త్రీ కన్నీరు వక్షస్థలం మీద పడరాదు. అవి సకల జీవకోటికీ ప్రాణం జ్ఞ్యానం ఇచ్చేవి. యుద్ధములో కూడా రాజు ఓడిపోతే మహారాణిని గౌరవంగా చూచి ఆ రాణి బయటకు వెళ్ళదలచుకుంటే వారిని సమర్యాదగా పంపిస్తారు.

12. దృతరాష్ట్రుడు మంత్రాంగం కోసం మంత్రులందరిలో వరీయుడైన (గొప్పవాడైన, పరమశ్రేష్టుడైన) విదురుడు చెప్పిన విషయాలని మిగిలిన మంత్రులందరూ విదురనీతి అన్నారు. ఒక మంత్రి రాజ్యసభలో మాట్లాడిన మాటలను ఇంతకాలం పాటు భద్రపరచి పెట్టుకున్నాము. మంత్రి అయిన వాడు కర్తవ్యం గూర్చి రాజు అడిగితే రాజకీయ స్వభావాన్నే చెప్పకూడదు. లోకస్వభావాన్ని, ధర్మస్వభావాన్నీ, రాజ్యకృత్యాన్ని చెప్పాలి. ఇలాంటి విషయాలలో లోకం ఏం చేస్తుంది, ధర్మం ఏం చెబుతుంది, రాజు ఏమి చేయాలి. ఒక్క రాముని దెబ్బ తగలగానే తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రావణుడు. తాను పలికినవన్నీ ప్రగల్భాలు అని తెలుసుకున్నాడు. విభీషణుడు, మాల్యవంతుడు, అకంపనుడు, విద్యున్మాలి చెప్పినపుడు, యమ వజ్రములతో సాటి వచ్చే నా బాణపు దెబ్బ రాముడు చూడలేదు కాబట్టి నా మీదకు వస్తున్నాడు అని.

ఈరోజు అహర్ణాహం మధ్యాహ్నం 12 గంటల నుండి చేయవలసిన భీష్మతర్పణ విధి

ఈరోజు అహర్ణాహం మధ్యాహ్నం 12 గంటల నుండి చేయవలసిన భీష్మతర్పణ విధి

మాఘ శుద్ధ అష్టమి ‘భీష్మాష్టమి’ అని పిలువబడుతుంది. ఆ రోజు భీష్ముడికి జల తర్పణం వదలాలి అంటారు. నిత్యపూజలు ముగించుకొని, దక్షిణాభిముఖంగా కూర్చొని అపసవ్యముగా పితృతీర్థముతో మూడుమార్లు తిలోదకాన్ని తర్పణంగా విడవాలి. తండ్రి జీవించిఉన్నవారు చేయకూడదని కౌస్తుభకారుడు చెప్పగా, తండ్రిఉన్నవారుకూడా భీష్మతర్పణం చేయవచ్చునని అనేక స్మృతికారులు వచించారు. మీ ఆచారవ్యవహారాలను పెద్దలనడిగి తెలుసుకొని ఆచరించటం మేలు. పితృకార్యాలలాగానే, మధ్యాహ్నవ్యాపినియైన అష్టమితిథిని చూసుకోవాలి.

ఈ సంవత్సరం ఈరోజు అంటే పిబ్రవరి ఏడవతేది 2014న – భీష్మాష్టమి. అవగాహన, నమ్మకం, ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడేలా – ఆ తర్పణవిధిని ఈ పొస్టులో పొందుపరుస్తున్నాను.
ఆచమ్య ||
ప్రాణానామమ్య ||
ఏవంగుణ … శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణం కరిష్యే ||
ఇతి సంకల్ప్య ||
1. వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | గంగాపుత్రవర్మాణం తర్పయామి || (3 సార్లు)
4. వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | భీష్మవర్మాణం తర్పయామి || (3 సార్లు)
7. వైయాఘ్రపాదగోత్రం | సాంకృతి ప్రవరం | అపుత్రవర్మాణం తర్పయామి || (3 సార్లు)
శ్లో|| భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |
ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియామ్ || (ఇతి తర్పయిత్వా)
(అని మరొకమారు తిలోదకమును విడువవలెను)
పునరాచమ్య | సవ్యేన అర్ఘ్యం దద్యాత్ ||
(తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి)
1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి || (ఒకసారి)
2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి || (ఒకసారి)
3. భీష్మాయ అర్ఘ్యం దదామి ||(ఒకసారి)
4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి || (ఒకసారి)

|| ఇతి భీష్మతర్పణవిధిః ||


భీష్మ తర్పణము ఎందుకు చేయాలి?
సూటిగా ఒక్క వాక్యంలో సమాధానం వ్యాసుడు క్రింది శ్లోకంలో చెప్పినదానిబట్టి – భీష్మతర్పణము చేసినవారికి ఏడాదిపాటుగా చేసిన పాపము వెంటనే నశిస్తుందని.

శ్లో|| శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ |
సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి ||

లౌకికంగా మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి.

శ్రాద్ధకర్మలలో వరుసక్రమంలో పిత (తండ్రి), పితామహ (తాత) ఇంకా ప్రపితామహులను (ముత్తాత) తలుచుకుంటాము. ఆపైన అతి కష్టం మీద ఒకరో ఇద్దరో పేర్లు తెలియవచ్చు. కాబట్టి ఆ ముగ్గురి పైవారైన వృద్ధప్రపితామహులందరికీ కలిపి తర్పణం వదలాలంటే, భీష్మ తర్పణం ఒక దారి – అని కొందరి విశ్వాసం.

ఈరోజు నేడు పరమ పావనమైన నైమిత్తిక తిథి ’భీష్మాష్టమి’.

ఈరోజు నేడు పరమ పావనమైన నైమిత్తిక తిథి ’భీష్మాష్టమి’.

జీవితాంతం త్యాగం, ధర్మం, ఇచ్చినబాటకు కట్టుబడడం తప్ప అన్యమెరుగని ధీరుడు భీష్మాచార్యులవారు. తన ముందే తరాలు మారిపోతున్నా, సామంతుల బెడద లేకుండా హస్తినాపుర రాజ్యాన్ని కనురెప్పలా కాపాడుతూ, కురువంశాన్ని కాపాడిన మహానుభావుడు. అంత చేసీ చిన్నవాళ్ళయిన మనుమలచేతిలో అవమానాలకు గురైనా తన ధర్మం తప్పని మహా మనీషి ’భీష్మాచార్యులవారు’. యుద్ధంలో సంధ్యాసమయం దాటుతున్నదని అస్త్రాలను వదిలి నేల మీదకు దిగి సన్నని ఇసుకనే జలధారలుగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యమిచ్చి సంధ్యావందనం చేసి చూపిన ధర్మాత్ముడు, దార్శనికుడు. ఈ రోజు తప్పకుండా తలచుకోవలసిన ధర్మాత్ముడు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.
అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే (ఐదు గంటలకు) లేచి పూజామందిరము, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములను ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటుస్నానము చేసి, తెలుపు రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి.

పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళములు, జాజిమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యమునకు పాయసం, తీపిపదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణకవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణము లేదా "ఓం నమోనారాయణాయ" అనే మంత్రమును 108 సార్లు జపించాలి. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు.

యుద్ధ వ్యూహం పన్నినా, రక్షణ భారం నెత్తినేసుకున్నా, ఎదుటివాడి వ్యూహం ఊహించాలన్నా, మరొకరు ఆయన సాటి లేరు ఇచ్చినమాటకి కట్టుబడి నిండు యవ్వనంలో బ్రహ్మచర్య దీక్షని స్వీకరించి చివరివరకూ అలానే ఉన్నా.. రాజ్యం, స్త్రీలు వద్దు మొర్రో అంటున్నా ఏదో ఒక సంక్షోభ తలెత్తి తన పెద్దలే తనని వివాహం చేసుకుని రాజ్యం చేయమని బ్రతిమిలాడినా... మొక్కవోని దీక్షతో తన ప్రతిజ్ఞతప్పక, ధర్మం వీడక తన జీవితమే ఒక సందేశంగా జీవించిన మహోన్నతుడు, మహాత్మా భీష్మాచార్యులవారు.

ఆయనను తలచుకోవటం, మన సంస్కృతికి మన దేశానికి, మన సనాతనధర్మానికి భక్తితో ఒక పుష్పం సమర్పించటంలాంటిది. భగవద్గీతను బోధించిన పరమాత్మ తనంతతాను ఈ భీష్ముడు శరీరం వదిలితే ఈయనకన్నా ధర్మం తెలిసినవాడు, చెప్పగలిగినవాడు లేడు ఆయన దగ్గర అన్నీ తెలుసుకోమని ధర్మరాజాది పాండవులకు చెప్పారంటే భీష్ముడంటే ఏమిటో తెలుస్తోంది.

అసలు నేటికీ మనం పారాయణ చేసే ’విష్ణు సహస్రనామం’ భీష్మాచార్యుల భిక్షగానే కదా దొరికింది.
అవసరంలేని, అన్య మత,దేశాలనుంచి అప్పు తెచ్చుకున్న సంస్కారంతో, అవైదిక మతాదులపెద్దలకు నీరాజనాలు పట్టి బిరుదులిచ్చి, ఉత్సవాలు జరపడానికి సెలవులు (కనీసం ఐచ్చిక సెలవులు) ప్రకటించుకునే మనం కనీసం భీష్మాచార్యుల పేర ఒక్క మంచి పనీ చేయం. కనీసం నేడైనా వారిని తలచుకొని నమస్కరించడం మన విహిత కర్తవ్యం. ఆయన కున్నటువంటి ధీరోదాత్తత, మాటమీదనిలపడి దేశాన్నీ, ధర్మాన్నీ, రక్షించి, ప్రేమించే మనో ధైర్యం, ధర్మాచరణానురక్తి మనందరికీ కలగాలని భీష్మాచార్యులవారి పాదాలను శిరసున ధరించి కోరుకుంటున్నాను.

మాఘపూర్ణిమ.....

Nerella Raja Sekhar
మాఘపూర్ణిమ.....

మాఘపూర్ణిమ నాడు ఇతరులకు దానం చేయాలని పండితులు అంటున్నారు. మాఘమాసం పుణ్యస్నానానికి ప్రసిద్ధమైనది. ఈ నెలలో లేదా మాఘ పూర్ణిమ రోజున..

సితాసితే తు యస్స్నానం మాఘమాసే యుధిష్ఠిర సతేషాం పురావృత్తిః కల్పకోటి శతైరపి మాఘశుక్ల, కృష్ణ పక్షాలలో చేసే స్నానం మహోన్నత ఫలప్రదమని శాస్త్రవచనం. 

అందుచేత శుక్ల, కృష్ణ పక్షాలలోనే గాకుండా మాఘపూర్ణిమ నాడు స్నానానంతరం తిలలు, ఉసిరికలు, దానం చేయవచ్చు. నియమంగా శివపూజ, విష్ణుపూజ, అభీష్ట దేవతాపూజ చేయాలి.

'మాధవః ప్రీయతామ్‌" అని చెప్పి వస్త్రాలు, దుప్పట్లు, చెప్పులు మొదలైనవి దానమీయవచ్చు. అన్నదానం కూడా చేయవచ్చునని పండితులు అంటున్నారు.

అలాగే తిలతైలేన దీపాశ్చ దేయాః శివగృహే శుభాః ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలనూ ప్రసాదిస్తుంది.

ఈ మాసంలో ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున శివాలయంలో దీపమెట్టడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శీతల జలంతోనే స్నానం చేయాలి. నదీస్నానాదులు ఉత్తమం. అదికాకపోతే నూతినీటి స్నానం, లేదా లభించే ఏజలమైనా ఉపయోగించవచ్చునని పండితులు అంటున్నారు.

Wednesday 5 February 2014

మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు.

Nerella Raja Sekhar
మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు.

ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని

"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సూర్యమాతృకే "

అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అస్తిస్వర్యములిస్తాడు.

జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.

రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు.

సూర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాశములో గ్రహ నక్షిత్ర సన్నివేశం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.

సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. రధసప్తమి రోజు స్త్రీలు ఎన్నో నోములు చేయటానికి ప్రారంబధినముగా చేయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 2

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 2 
1. వేటకు వెళ్ళెప్పుడు ఋషులు ఆశ్రమానికి వెళ్ళకూడదు. వేటలో మన మనసు రాజస తామస గుణాలతో ఉంటుంది. ఋషుల ఆశ్రమం సాత్విక గుణంతో ఉంటుంది. పరీక్షిత్తు వెళ్ళి శాపం పొంది వచ్చాడు. కార్తవీర్యార్జనుడు వెళ్ళాడు మొదటికే మోసం వచ్చింది, విశ్వామిత్రుడు వెళ్ళాడు అవమానం పాలయ్యాడు, దుశ్యంతుడు వెళ్ళాడు బాధలు పడ్డాడు. వేటకు వెళ్ళకుండా వెళ్ళినవారు బాగుపడ్డారు. రాముడు భరతుడు, రఘు మహారాజు, దిలీపుడు, ఇక్ష్వాకు. 

2. చనిపోయిన ఏ దేహాన్నైనా తాకచ్చుగాని సర్పదేహాన్ని తాకకూడదు. ముట్టుకుంటే ఆ చంపిన పాపం వస్తుంది.
పరీక్షిత్తు ప్రాణంపోయిన సర్పాన్ని ధనువు యొక్క కొసతో తీసి (ధనుష్కోట్యా ) ఆయనమీద వేసి వెళ్ళాడు. కలిపురుషుడు అడిగిన కొన్ని స్థాలాల్లో బంగారం ఒకటి. ఆయన్ కిరీటాన్ని నెత్తినపెట్టుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆయన పెట్టుకున్న కిరీటం జరాసంధుడిది. ఒకరు వాడే వస్తువులు ఇంకొకరు వాడకూడదు. ఆ వ్యక్తికీ వస్తువుకీ ఉన్న సంబంధంతో ఆ వ్యక్తి గుణాలు ఆ వస్తువుకి వస్తాయి.(ఈ భాగం పాద్మపురాణంలో స్కాంధపురాణంలో ఉంది. ) 

3. ఆత్మ అచ్చేద్యం - శరీరం దేహం. ఆత్మ అక్లేద్యం - శరీరం క్లేద్యం. తన స్వరూపానికి పరిపూర్ణంగా విరుద్దమైన స్వరూపం గల దానిలో (శరీరంలో) చిక్కుకున్నది ఆత్మ. జడమైన శరీరంలో చైతన్యం ఉన్న ఆత్మ ఉంది. తనకన్న తక్కువ దానిలో, తన కన్న తక్కువ అయిన దానిలో ఉంది ఆత్మ. నశించే శరీరంలో ఉండే ఆత్మ మళ్ళీ అలాంటి శరీరంలో ఉండకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి 
శ్రోతవ్యాదిషు యః పరః - వినదగిన దానిలో ఇదే చివరిది శ్రేష్టమైనది. తెలియవలసినదేమిటో తెలియవలసిన మనమేమిటో తెలియవలసిన ఉపాయం ఎమిటో తెలిస్తే కలిగే ఫలమేమిటో, అది తెలియకుండా ఆపేది ఎమిటో తెలియాలి. దీన్నే అర్థ పంచకం అంటారు. మనం పరమాత్మని చేరాలి. పరమాత్మ ఎలా ఉంటాడు పరమాత్మను చేరే మన స్వరూపం ఏమిటి, పరమాత్మని చేరడానికి ఉపాయం ఏమిటి, పరమాత్మని చేరితే ఫలం ఏమిటి, పరమాత్మని చేరకుండా ఆపేది ఏమిటి. ఈ అయిదవదైన విరోధి జ్ఞ్యానం అన్నిటికన్నా బలీయమైనది. ఇన్ని కోట్లమందిని అడ్డగిస్తోంది అంటే అది ఎంత బలీయము. పరమాత్మ కంటే జీవాత్మ కంటే ఉపాయం కంటే ఫలం కంటే బలీయం. మనని పరమాత్మని చేరకుండా ఆపేది ఏమిటి. 

4. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః
దివా చార్థేహయా రాజన్కుటుమ్బభరణేన వా

జీవితమునకు రాత్రి పగలు వయసు ముఖ్యములు. మనము వృధాగా గడిపేది ఈ మూడింటిని. పగలు ఎలా గడుపుతున్నాము రాత్రి ఎలా గడుపుతున్నాము. ఈ పగలూ రాత్రీ రెండూ ఉండే వయసును ఎలా గడుపుతున్నాము. ఇవి తెలుసుకుంటే వైరాగ్యం అదే వస్తుంది. పగలంతా అర్థం సంపాదించడంలో, కుటుంబం పోషించడంలో గడుపుతున్నాము. పగలు ఇంత కష్టపడి రాత్రి నిద్రలో గడుపుతాము. ఈ రెంటితో ఉంటే ఇబ్బందిలేదు గానీ, ఈ రెండూ వయసుకోసం అని అనుకొని స్త్రీ పురుష సంగమానికి (వయః) గడుపుతాము. సంగమానికోసమే అర్థం సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం, నిద్రపోవడం చేస్తాం. దానికోసమే అన్నీ కూర్చుకుంటాము. భగవంతుడు ఇచ్చిన మూడింటినీ దానికోసం పాడుచేస్తున్నాము.

5. జితాసనో జితశ్వాసో జితసఙ్గో జితేన్ద్రియః - ముందు శరీరానికి స్థిరత్వాన్ని ఏర్పరచాలి. కూర్చున్న భంగిమలో మార్పు రాకూడదు. అదే ఆసన్ విజయం. మన ముక్కుకు రెండు నాళికలుంటాయి, సూర్య నాళిక చంద్ర నాళిక. ప్రతీ నలుగున్నర నిముషాలకు మారుతూ ఉంటుంది. శ్వాస ఏ వైపుందో గుర్తిస్తే ఆ శ్వాస వెళ్ళే మార్గాన్ని మార్చుకోవచ్చు. సూర్య నాళం జ్ఞ్యాన మార్గమైతే చంద్ర నాళం భక్తి మార్గం. నిరాకారం యందు మనసు లగ్నం చేయాలంటే సూర్యనాళిక వాయు శ్వాసతో చేయాలి. భక్తి మార్గానికి చంద్రనాళిక. మొదట మనసు దాని మీద ఉంచడం మొదలుపెట్టాలి, కూర్చున్నా నించున్న. ఏ నాసికా రంధ్రం నుండి శ్వాస బయటకు వెళ్తొంది, ఎక్కడ శ్వాస నిలుస్తోందో, గుర్తించాలి. మరి మామూలుగా మనకు ఎందుకు ఇది తెలియట్లేదు. మనం తీస్తున్న శ్వాసే కదా? మన మనసు అక్కడ లేదు కాబట్టి. 
సూర్యనాళిక నిరోధం వచ్చిన వాడు యోగి అవుతాడు, చంద్ర నాళిక యందు సాధన చేసిన వాడు భోగి అవుతాడు. 
మనం అనుకున్నప్పుడు మనం అనుకున్న నాళము నుండి శ్వాస విడుచుట పీల్చుట చేయగలిగితే మనసు మనం చెప్పినట్టు వింటుంది. జ్ఞ్యాన సాధనకు అవసరమయ్యే పనులలో సూర్యనాళంలో శ్వాస తీసుకోవాలి. సూర్య నాళంలో శ్వాస తీసుకున్నప్పుడు హృదయ వేగం తగ్గుతుంది. అంటే భోగం యందు మనసు ఎపుడు లగ్నం చేసామో (చంద్ర నాళం నుండి శ్వాస తీసుకునేప్పుడు, మన కోరిక తీరుతుందో లేదో అన్న ధ్యాసలో మన హృదయస్పందన హృదయ వేగం పెరుగుతుంది).శ్వాస నియమంతో హృదయ గతి యొక్క నియమం కలుగుతుంది, మనోనియమం కలుగుతుంది, దానితో ఇంద్రియనిగ్రహం కలుగుతుంది, దానితో ధారణ కలుగుతుంది, ధ్యానం నిలుస్తుంది. 

6. సర్వధీవృత్త్యనుభూతసర్వ - ప్రపంచంలో ఉండే అన్ని రకాల ప్రాణుల బుద్ధి వృత్తులు ఆయనే, ఆ బుద్ధి వృత్తులకి జరిగే అనుభవం కూడా ఆయనే. (దదామి బుద్ధియోగం... అన్నట్లుగా) బుద్ధి ఆయనే ఇచ్చి ఆలోచన ఆయనే ఇచ్చి సంకల్పం ఆయనే కలిగించి పని అతనే చేయిస్తాడు. ఇది గుర్తిస్తే మన అహంకారం పోతుంది. అలా అనుకున్న వాడికి పరమాత్మ పాప బుద్ధి కలిగించడు. (అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ) కర్తుత్వ భోక్తృత్వ జ్ఞ్యాతృత్వ అభిమాన రాహిత్యం ఏర్పడితే పరమాత్మ యందు ధారణ ఉంచగలం. ప్రపంచంలో ఉండే అన్ని రకాల ప్రాణులు బుద్ధి వృత్తులు పరమాత్మే. ఆ బుద్ధి వృత్తుల చేత అనుభవించబడే అన్ని అనుభవాలు ఆయనే, అన్ని ఆత్మలూ ఆయనే.

7. మనకు కనపడే శరీరం స్థూల దేహం, ఈ దేహాన్నించి బయటకు వెళ్ళేవాడు సూక్ష్మ దేహంతో వెళ్తాడు. ఆ సూక్ష్మ దేహంలో జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్తం అంత: కరణం ఉంటాయి. ఎక్కువ పుణ్యం ఉంటే భోగ దేహంతో వెళ్తాడు, అది సూక్ష్మ దేహము నుంచే వస్తుంది. పాపాలే ఎక్కువ చేస్తే అతనికి యాతనా దేహం వచ్చి నరకానికి ముందు వెళ్తాడు. ఆ దేహం ఉల్లిపొరలో పదహారవ వంతు ఉంటుంది. ఈ రెండూ కాక అతల వితల సుతల లోకాలకు వెళ్ళవలసి వస్తే సంవిత్ దేహం వస్తుంది (అక్కడ ఉన్న భోగాలు ఇంకాస్త ఎక్కువ కాబట్టి ఆ అనుభవించే దేహం ఆ ప్రకారంగా నిర్మింపబడుతుంది. ) ఊర్ధ్వ లోకాలనే జనో మహో తపో లోకాలకి వెళ్ళవలసి వస్తే జ్యోతిర్దేహం వస్తుంది. ఇవి కాక బ్రహ్మాండ కటాహాన్ని దాటి విరజా నదిలో స్నానం చేసిన తరువాత వచ్చిన దేహం పంచ ఉపనిషన్మయ దివ్య దేహం. ఇలా మనకు మొత్తం ఏడు దేహాలు ఉంటాయి. పితృ స్వర్గాది లోకాలను చేరాలనుకునే వారు సూక్షం దేహంతో వెళ్తారు. ఆ స్థితిలో ఇంద్రియ వర్గం ఉంటుంది మనసు ఉంటుంది. ఆ స్థితిలో అష్టాదిపత్యం (అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వసిత్వం ) పొంది.

8. పరమాత్మకు సర్వాత్మనా సేవ చేయని నాడు మానవ జన్మ పొందుట వ్యర్థము. భగవత్ భాగవత ఆచర్య కైంకర్యముతోటే మానవ జన్మ విశిష్టం. అది తప్ప మిగతా క్రియలన్నీ ప్రాణులన్నీ చేసేవే. జ్ఞ్యానం వివేకం మానవుని సొత్తు. వివేకం అంటే వేరు చేసి చూచుట. వేరుగా ఉన్న వాటిని వేరుగానే చూచుట. వేరుగా ఉన్న వాటిని ఒకటిగా చూస్తే అవివేకం. శరీరం ఆత్మ రెండు ఒకటే అనేది అవివేకం. పరమాత్మ ఉండటం వలనే ఆత్మకి ఉనికి ఏర్పడింది. ఆత్మ ఉండటం వలనే శరీరనికి ఉనికి ఏర్పడింది. నా శరీరం నాకు ఇష్టమనే వాడు తనకి తెలియకుండానే పరమాత్మని ఇష్టపడుతున్నాడు. 

9. మూడు శ్లోకాలను సుభద్ర స్తుతి అంటారు. వీటిని నిత్యం పారాయణ చేస్తే పద్దెనిమిది పురాణాల సారాంశం ఇందులో ఉంది. 

యత్కీర్తనం యత్స్మరణం యదీక్షణం యద్వన్దనం యచ్ఛ్రవణం యదర్హణమ్
లోకస్య సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రశ్రవసే నమో నమః

ఎవరి కీర్తన స్మరణ ధ్యానం వందనం కథలు వినుట పూజించుట (అర్హణం) వెంటనే లోకాల యొక్క పాపాలు పోగొడుతుందో అటువంటి పరమ మంగళ కీర్తి కలవానికి నమస్కారం. 

విచక్షణా యచ్చరణోపసాదనాత్సఙ్గం వ్యుదస్యోభయతోऽన్తరాత్మనః
విన్దన్తి హి బ్రహ్మగతిం గతక్లమాస్తస్మై సుభద్రశ్రవసే నమో నమః

వివేకం కలవాడు (విచక్షణా ) ఎవరి పాద పద్మములను చేరడం వలన, ఇహముయందు పరముయందూ మనసుకు గల ఆసక్తి తొలగించుకొని, అన్ని శ్రమలు అలసటలు బాధలు తొలగిపోయి పరమాత్మ పాదములను ఆశ్రయించడం వలన పరమాత్మను పొందుతారు. అలాంటి స్వామికి నమస్కారం 

తపస్వినో దానపరా యశస్వినో మనస్వినో మన్త్రవిదః సుమఙ్గలాః
క్షేమం న విన్దన్తి వినా యదర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః

కొందరు తపస్వులు కొందరు దానపరౌలు, కొందరు కీర్తిని పొందిన వారు, ఇంకొందరు బుద్ధిమంతులు, కొంతమంది వైదికులు (మంత్ర విదులు), కొందరు పరమ పావనులు, ఇలాంటి వారు కూడా తాము ఆచరించినవి, తాము తమవి అనుకున్నవి ఎవరికి అర్పించకుంటే క్షేమాన్ని పొందలేరో అలాంటి పరమాత్మకు నమస్కారం. పొరబాటున కూడా నావి నావి అని అనుకోకుండా, ఒక వేళ నావి అని మనసు అనుకున్నా, అది పరమాత్మకు అర్పించాలి. 

10. ఆత్మకు ఎటువంటి సంగం ఉండదు. ఉండే సంగం మనసుకే ఉంటుంది. మనసుకు సంగం ఉన్నప్పుడు ఆత్మకు బంధం ఎందుకు? మనసుతో ఉన్నందుకు. మనసుతో కోరుకున్నవన్నీ ఆత్మ తనవి అనుకుంటుంది. మనసుతో బంధించబడి ఉన్నతకాలం ఆత్మ సంసారంలో ఉంటుంది. ఆనదమయం విజ్ఞ్యానమయమైన ఆత్మకి మనసు యందు సంగముతో మనసు నాది అన్న భావన వలన ఆత్మ బంధములో ఉంటుంది. నా భార్య అనుకున్నప్పుడు భార్యకు కలిగిన కష్టాలన్ని ఎలా భర్తకు కూడా ఉంటాయో, నా మనసు అనుకున్నంత వరకూ మనసుకు కలిగిన సంగమంతా ఆత్మకూ ఉంటుంది

11. ఈ కింది శ్లోకం విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి

ప్రచోదితా యేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం స్మృతిం హృది
స్వలక్షణా ప్రాదురభూత్కిలాస్యతః స మే ఋషీణామృషభః ప్రసీదతామ్

బ్రహ్మకు కూడా ఎవరి అనుగ్రహంతో వాక్కు ( సరస్వతీ, వేదం) ప్రసన్నమై సృష్టి కలిగించే స్వచ్చమైన జ్ఞ్యానాన్ని ప్రసాదించిందో. (భాగవత ప్రారంభ శ్లోకంలో ఉన్న 'తేనే బ్రహ్మ బృదా యదా ఆది కవయే' బ్రహ్మకు ఎవరి సంకల్పంతో వేదములను ఎవరుపదేశించారో) 
అలాంటి బ్రహ్మ ఈ జ్ఞ్యానమును పొంది పరమాత్మ యొక్క స్వస్వరూప (స్వలక్షణా )జ్ఞ్యానాన్ని పొందాడో ఎవరి సంకల్పంవలన బ్రహ్మకు భాసించిందో అటువంటి ఋషులకు ఋషి అయిన స్వామి ప్రసన్నుడగు గాక 

స్వలక్షణ అంటే వేదం కూడా కేవలం వేదం కాకుండా - సృష్టి స్థితి సంహారములు, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములు, హ్రస్వమూ ధీర్ఘము ప్లుతము ఉదాత్తము అనుదాత్తము స్వరితమూ, పశ్యంతి మద్యమా వైఖరీ (అందులో స్వరములు మూడు , అందులో భేధములు మూడు, ఇలా ఒక్క వర్ణం 32 రకములు ఉంటుంది, 'ఆ అన్నమంటే ఇది హ్రస్వమా ధీర్ఘమా ప్లుతమా? ఉదాత్తమా అనుదాత్తమా స్వరితమా, మంద్రమ మధ్యమమా ఉత్తమమా, తరమా వితారమా అనుతారమా, వివృతమా సంవృతమా, సంవృతములో మళ్ళీ ఉదాత్తమా అనుదాత్తమా, కంఠ్యమా లేక ఉపకంఠ్యమా - ఇవన్నీ వేద లక్షణాలు, స్వరములతోటి - మంద్ర మధ్య తారాది వర్ణ కంఠగత భేధములతోటి ఉర: కంఠ శిరోరాది స్థాన భేధములతోటి కంఠాల్వాది అవస్థా భేధములతోటి ఇన్ని రకములుగా ఉన్న వేదం)