Friday 11 October 2013

"ఆంధ్ర ప్రదేశ్ గోవధ నిషేధ మరియు పశు సంరక్షణ చట్టం 1977" (The A.P. Prohibition of Cow Slaughter and Animal Preservation Act 1977 ప్రకారం...

౧) ఆంధ్ర ప్రదేశ్ లో గోవులను , దూడలను (దూడలు మగవి అయినా , ఆడవి అయినా సరే) ఎట్టి పరిస్థితులలో కూడా చంపకూడదు.

2)మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న, గేదె మొదలైనవాటిని చంపాలంటే వాటి వయస్సు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి వుండాలి, పూర్తిగా నిరుపయోగంగా వున్నాయని, పదునాలుగు సంవత్సరాల వయసు దాటినదని ప్రభుత్వము నియమించిన పశు వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాలి.

౩) ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ అనుమతి వున్న కబేళా (పశువధశాల)లలో మాత్రమె వధించాలి, రోడ్ లపై, ఇండ్లల్లో, ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం, మాంసాన్ని విక్రయించడం నేరము.

4) పశువుల రవాణాకు కూడా A.P.Motor Vehicle Rules 1989 rule 253 sub rule (1), clause(iii) ప్రకారం కొన్ని నియమాలు వున్నాయి.
అ) ఒక లారీ లో ఆరు కంటే ఎక్కువ పశువుఅను రవాణా చేయకూడదు.
ఆ) ఈ ఆరు కూడా రవాణా చేస్తున్న సమయములో పశువైద్యుడి ధ్రువపత్రాన్ని కలిగి వుండాలి.
ఇ) వాహనములోపశువులతోబాటు వాటి బాగోగులు చూసుకునే వ్యక్తి (attedent) వుండాలి.
ఉ) First Aid Box వుండాలి.
ఊ) మేత, నీరు వుండాలి.
ఋ) మూసివేయబడి ఉన్న వాహనాలో (closed containers) పశువులను తరలించకూడదు.

ఇలాంటి అనేక నియమాలు ఉన్నప్పటికీ ప్రభుత్వము, అధికారులు పట్టించుకోని కారణముచేత విచ్చలవిడిగా గోవులు మరియు పశువుల హత్య రాష్ట్రంలో జరుగుతున్నది. ఆరోగ్యకరమైన ఎద్దులను పోలీసు అధికారులు దగ్గర వుండి కబేలాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు. ముస్లిం సంతుష్టీకరణ కొరకు అక్రమ పశువధను ప్రోత్సహిస్తున్నారు,హిందూ మనోభాలను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం, అధికారులు ప్రవర్తిస్తున్నారు.
8 వ తేదీ నాడు హర్యానా నుండి భాగ్యనగరానికి కంటైనర్ లో అక్రమంగా తరలి వచ్చిన హర్యానా జాతికి చెందిన 27 ఆరోగ్యకరమైన ఎద్దులను గోశాలకు తరలించి, దింపిన తరువాత అక్కడే వున్న పోలీసు అధికారి చట్ట విరుద్దంగా అదే కంటైనర్ లో ఇరువది ఏడు ఎద్దులను కుక్కించి వ్యాపారులకు అప్పగించిన సంఘటన ఇందుకు నిదర్శనము. వీటి విలువ సుమారుగా పది లక్షల రూపాయలు వుంటుంది. దాదాపుగా ప్రతి పొలిసు స్టేషన్ పరిధిలో లో అక్రమంగా ఎద్దుల తరలింపు నిరాఘాటంగా జరుగుతుంది. అక్కడక్కడ మాత్రం ఆవులను కాపాడుతున్నారు.