Tuesday, 29 October 2013

వాస్తు పురుషుడు

Nerella Raja Sekhar




వాస్తు పురుషుడు............................

పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సమ్రక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి 'ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముకంగా క్రిందకు పడవేశారు.

ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.

శిరస్సున - శిఖి(ఈశ) దక్షిణ నేత్రమున - సర్జన్య వామనేత్రమున - దితి దక్షిణ శోత్రమున - జయంతి వామ శోత్రమున - జయంతి ఉరస్సున (వక్షమున) - ఇంద్ర, అపవత్స, అప, సర్ప దక్షిణ స్తనమున - అర్యమా వామ స్తనమున - పృధ్వీధర దక్షిణ భుజమున - ఆదిత్య వామ భుజమున - సోమ దక్షిణ బాహువున - సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

వామ బాహువున - పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట దక్షిణ పార్శ్వకామున - వితధి, గృహక్షత వామ పార్శ్వకామున - అసుర, శేష ఉదరమున - వినస్వాన్, మిత్ర దక్షిణ ఊరువున - యమ వామ ఊరువున - వరుణ గుహ్యమున - ఇంద్ర జయ దక్షిణ జంఘమున - గంధర్వ వామ జంఘమున - పుష్పదంత దక్షిణ జానువున - భృంగరాజ వామ జానువున - సుగ్రీవ దక్షిణ స్పిచి - మృగబు వామ స్పిచి - దౌవారిక పాదములయందు - పితృగణము

ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే 'వాస్తు పురుషుడూ గా సృష్టిగావించాడు.