Sunday 27 October 2013

వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు

Brahmasri Chaganti Koteswara Rao Garu.
వెండి దీపాలతో ఆరాధన - ఫలితాలు
వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే ఈ క్రింది ఫలితాలు పొందవచ్చు.

1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు - సంపదలు కలుగుతాయి.
10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.


ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు...
1. మేషరాశి - త్రివత్తులు (3)
2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
3. మిధునరాశి - సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
5. సింహరాశి - పంచమవత్తులు (5)
6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
10. మకరరాశి - సప్తమవత్తులు (7)
11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
12. మీనరాశి - పంచమవత్తులు (5)


జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు...
1. మేష లగ్నం - పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం - పంచమవత్తులు (5)
10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం - ద్వివత్తులు (2)