Friday 24 May 2013

భక్త కన్నప్ప ఆలయం


భక్తి సమాచారం
భక్త కన్నప్ప ఆలయం
శ్రీకాళహస్తిలోని శివలింగానికి కంటనీరు కారితే తన కన్నులర్పించిన మహా భక్తుడు కన్నప్ప. కన్నప్ప పుట్టిన ఊరు పొత్తపినాడులోని ఉడు మూరు అని శివపురాణం తెలుపుతున్నది. ఈ ఉడుమూరు రాజంపేట మండలంలోని కొం డ్లోపల్లెకు అతి సమీపంలో ఉన్నట్టు మెకంజీ కైఫీయత్తులలోని పోలి, ఊటుకూరు చరిత్రల వల్ల తెలుస్తున్నది. దీంతో అధికారికంగా ప్రకటించక పోయి న భక్త కన్నప్ప జన్మస్థలం రాజం పేట మండలంగా స్థానికులు భావిస్తూ ఈ మండలంలోని ఊటుకూరు గ్రామంలో కన్నప్ప నిర్మించినట్టుగా భావిస్తున్న శివా లయంలో కన్నప్ప విగ్రహాన్ని నెలకొల్పారు.

ఆలయ చరిత్ర...
ద్వాపరయుగంలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేయ గా పాశుపతాస్త్రం ఇచ్చారు గాని మోక్షం ప్రసాదించలే దు. కలియుగంలో బోయ వాడుగా జన్మించి మోక్షం పొందుతావని శివుడు అర్జునుడికి చెప్పినట్టు ఇతిహాసం పేర్కొంటోంది. ఈ ప్రకారం అర్జునుడు కలియుగంలో ఊడుమూరులోని బోయకుటుంబంలో తిన్నడుగా జన్మించి శివుని అనుగ్రహాన్ని అందుకున్నారన్నది ప్రతీతి. ఉడుమూరులో కన్నప్ప ప్రతిష్ఠించిన లింగమే ఉడుమేశ్వరాల యంగా ప్రసిద్ధి చెందిందంటారు. ఆ శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ఈ ఉడుమూరు కొండ్లోపల్లె సమీపంలో ఉండేదని, కన్నప్ప ప్రతిష్ఠించిన శివలింగం కాలగమనంలో సమీపంలోని ఊటుకూరుకు చేరిందంటారు. ఇక్కడి శివాలయం అత్యంత పురాతనమైంది. ఊటుకూరు గ్రామం తాళ్ళపాక అన్నమాచార్యు లవారి అవ్వగారి ఊరు. ఈ ఊరికి 700 సంవత్సరాల కాలం నాటి చరిత్ర మనకు అవగతమవుతుంది. ఏది ఏమైనా కన్నప్ప జన్మస్థలం అధికారికంగా ప్రకటించకపోయినా స్థానికులు కన్నప్ప జన్మస్థలాన్ని రాజంపేట మండలంగానే భావిస్తూ కన్నప్ప స్మారకోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.