Friday 24 May 2013


భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
రజో గుణము, తమో గుణము, సత్వ గుణము అనే మూడు గుణములు ఆది కాలంలో శ్రీమన్నారాయణుడు తన శరీరం నుండి సృష్టించాడు! ఈ మూడు గుణములతో శ్రీమన్నారాయణుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని మూడు రూపాలు ధరించాడు! ఈ మూడు గుణములు మానవులు ఆనందంగా ఉండటానికి పనికి వస్తాయి! రజో గుణం వల్లే సృష్టి జరుగుతుంది! ఈ రజస్సు స్త్రీ లో, ఈ రజస్సు పురుషుడులో రేతస్సులో లేకపోతె ఈ బ్రహ్మ సృష్టి కొనసాగదు! ఈ సృష్టి కర్త గ ఉన్నప్పుడు బ్రహ్మ రూపాలో ఉంటాడు శ్రీమన్నారాయణుడు! ఇంకా తమోగుణం అనేదానితో నాశనం చేస్తాడు! ఈ రజో గుణం ఎంత ఉండాలో అంత కంటే ఎక్కువ అయితే తద్వారా ఆహారం మీద కామం మీద కోరిక ఎక్కువ అయిపోతుంది! నిద్ర ఎక్కువై, బ్రష్టుడై, హింస ప్రవృత్తి అధికమై చివరికి నసించిపోతాడు! ఈ నశించే టప్పుడు తమోగుణం తో రుద్రుడై లోకాలన్నీ తనలో కలిపేసుకుంటాడు! ఇక మూడో గుణం అయిన పవిత్రమైన సత్వగుణం! దీనికి ఉనికి, నిలబడుట అని కూడా అర్ధం! శ్రీ మహా విష్ణువు జనములు నిలబడటానికి, ప్రాణులన్నీ బ్రతకడానికి, ఆహారాన్ని అందించి వీరి గుణం ప్రశాంతం గ ఉండటానికి తనే సత్వగుణం స్వీకరించి విష్ణువు అనే పేరుతో సృష్టిని కొనసాగిస్తుంటాడు! ఆపుడు అయన గోవింద రూపం లో ఉంటాడు!
సృష్టికర్త్రి బ్రహ్మ రూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప అని ఈ మూడింటిలో ఉన్న మహాశక్తిని స్తోత్రం చేస్తుంటాం మనం!