Wednesday, 29 May 2013

అష్టాదశ శక్తి పీఠాలు

భక్తి సమాచారం
అష్టాదశ శక్తి పీఠాలు

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.