Saturday, 26 April 2014

వేదాంగాలు


సనాతన ధర్మం

వేదాలు ముఖ్యంగా ఋగ్,యజుస్,సామ మరియూ ఆదర్వణ విభాగాలుగా ఉన్నాయి. అందులో ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంది. మరి ఆ అర్థాన్ని ఎట్లా తెలుసుకోవడం ? వేదాన్ని అర్థం చేసుకోవడానికి మన ఋషులు వాటికి ఎన్నో వివరణ గ్రంథాలను ఇచ్చారు. వేద రాశి యొక్క అర్థ నిర్ణయాని కొరకు. వీటినే వేదాంగాలు అని అంటారు. అవి ఆరు.
1) శిక్ష
2) వ్యాకరణము
3) ఛందస్సు
4) నిరుక్తము
5) జ్యోతిష్యము
6) కల్పము
1. శిక్షా
వేద శబ్దాల మూలాలు, ధాతువులని బట్టి ఆయా శబ్దాల ఉచ్చారణ, స్వరములని చెప్పేది. వేదాన్ని ఎట్లా పలకాలో తెలుపుతుంది.
2. వ్యాకరణం
కొన్ని శబ్దాలు ఒక్కో చోట ఒక్కోలా ఉచ్చరించాల్సి ఉంటుంది, అవి ఎట్లాలో చెప్పేది వ్యాకరణం. ఎన్నో ధాతువుల నుండి అర్థాన్ని చెబుతాయి. ఉదాహరణ మనవ అనే పదం మను అనే మహర్షి యొక్క సంతతి కనక మానవ అయ్యింది.
3. కల్పకం
వేద యజ్ఞంకోసం చేయాల్సిన యాగ శాల, వేదిక ఎట్లా ఉండాలి అనే విషయాలను తెలిపేది కల్పకం.
4. నిరుక్తం
పదాలు ఎట్లా తయారు అయ్యాయో తెలుపుతుంది. మనుష్య అనే పేరు ఎట్లా వచ్చింది అంటే 'మత్వా కర్మాణి సీవ్యతి'. లోకానికి ఏది కావాలో ముందే ఆలోచించి చేసే వాడు కనక మనిషి అని పేరు.
5. ఛందస్సు
ఛందస్సు అనేది వేద మంత్రాలలోని అక్షరాలను కొలిచేది, శబ్దాల అర్థాలను వివరిస్తుంది. విష్ణుసహస్రనామాలు ఉండేవి అనిష్టుప్ ఛందస్సు, అంటే శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. నాలుగు భాగాలు చేస్తే ఒక్కో భాగానికి 8 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రానికి పేరు ఛందస్సుతో ఏర్పడింది. గాయత్రి అనేది ఛందస్సు. కొందరు గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీమూర్తిని బొమ్మగా వేసి చూపిస్తారు, కాని అది తప్పు. గాయత్రి మంత్రం ప్రతిపాదించే దేవత నారాయణుడు. అందుకే సంధ్యావందనం చేసేప్పుడు సూర్యమండలం మధ్యవర్తిగా ఉండి నడిపేవాడు నన్నూ ప్రేరేపించుగాక అని కోరుతారు. నారాయణుడు ఆ మంత్రం యొక్క దేవత. ఉత్పలమాల, చంపకమాల అనేవి తెలుగులో ఛందస్సు. ఆ పదాలు స్త్రీలింగ శబ్దాలు, అట్లానే గాయత్రి ఛందస్సు కూడా.
6. జ్యోతిషం
మనం ఆచరించాల్సిన పనులు ఎప్పుడు, ఏమి, అట్లా చేయాలో తెలిపేది. చంద్రుడిని బట్టి, సూర్యుడిని బట్టి, ఋతువులని బట్టి కాలాన్ని చెబుతుంది.
వీటినే షడంగాలు అని చెబుతారు. ఇవి వేదం యొక్క అర్థాన్ని నిర్ణయించేవి.
(తరువాయి వివరములు త్వరలో తెలుపగలము)
గమనిక:- మన భారతదేశ సనాతన ధర్మం అందరికి తెలియజేయాలన ప్రయత్నంలో ఇది నా చిరు ప్రయత్నం. మన ధర్మం లోకం మొత్తమునకు ఆదర్శవంతమైనది. హైందవ ధర్మంను ఆచరించండి మన తరువాత తరాలకు తెలియజేయండి.
మీ శ్రేయోభిలాషి.

Saturday, 19 April 2014

మన ప్రాచీన ధర్మగ్రంథాలు, పురాణాలు తులసి గొప్పదనాన్ని వేనోళ్ళ కీర్తించాయి

మన ప్రాచీన ధర్మగ్రంథాలు, పురాణాలు తులసి గొప్పదనాన్ని వేనోళ్ళ కీర్తించాయి. తులసి మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయని ’స్కాందపురాణం’ చెబుతోంది. తులసీ వనం ఎక్కడ ఉంటే, అది పుణ్యస్థలం లాంటిదని ’పద్మపురాణం’ పేర్కొంటోంది. ఆ ఇంటిలోకి యమభటులు ప్రవేశించలేరని స్పష్టం చేస్తోంది.
తులస్యారోపితాసిక్తా దృష్టాస్స్పృష్టాచ పాలితా!
ఆరోపితా ప్రయత్నేన చతుర్వర్గ ఫలప్రదా!!
తులసి మొక్కను భక్తితో నాటినా, నీటితో తడిపినా, చూసినా, తాకినా, పోషించినా, వనం ఏర్పరచినా - ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ ఫలితాలూ కలుగుతాయి.
ఒక్క తులసిని పెంచినా అక్కడ బ్రహ్మ విష్ణుమహేశ్వరులు, ఇతర దేవతలు ఆవాసం చేస్తారని అంటారు. అలాగే, అక్కడ గంగాది పుష్కర తీర్థాలన్నిటినీ సేవించిన ఫలితం దక్కుతుంది. తులసీ మాతను ప్రార్థించం వల్ల దేవతలందరినీ ప్రార్థించినట్లు అవుతుంది. తీర్థయాత్ర చేసిన ఫలం లభిస్తుంది.
తులసీ కాననం యత్ర యత్ర పద్మవనానిచ!
సాలగ్రామ శిలా తత్ర తత్ర సన్నిహితో హరిః!!
తులసి వనం ఉన్న చోటా, పద్మాలున్న తావులో, సాలగ్రామం ఉన్న ప్రదేశంలో శ్రీమహావిష్ణువు తప్పనిసరిగా ఉంటాడు. దీనిని బట్టి తులసిమొక్కకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో గ్రహించవచ్చు.

Wednesday, 2 April 2014

భూమి గుండ్రంగా ఉన్నదని మొదట చెప్పినది ఎవరు ?

Jaji Sarma 
భూమి గుండ్రంగా ఉన్నదని మొదట చెప్పినది ఎవరు ?
మొట్టమొదట భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పినది ఎవరు? మనం చదువుకున్నది 16,17 శతాబ్దాలకు చెందిన కెప్లర్,కోపర్నికస్,గెలీలియోలని.
కాని ఋగ్వేదం లోని క్రింది మంత్రం గమనించండి.
“ చక్రాణాసః పరీణహం పృథివ్యా….”అర్థం ” భూమి యొక్క వృత్తపు అంచున ఉన్నవారు…”
అతిప్రాచీన గ్రంథం ఐన సూర్యసిద్దాంతం గ్రంథ 12వ అధ్యాయం,32వ శ్లోకంలో
“మధ్యే సమంతాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్టతి”
“బ్రహ్మాండం మద్యలో భూగోళం ఆకాశంలో నిలిచిఉంది” అని దాని అర్థం.
ఆర్యభట్టు రచించిన “ఆర్యభట్టీయం” గ్రంథంలోని గోళపాద అధ్యాయంలో 6వ శ్లోకం ” భూగోళః సర్వతో వృత్తః” అంటే ” భూమి వృతాకారంలో ఉన్నదని అర్థం.
క్రీ.శ.505 లో వరాహమిహిరుడు ” పంచ మహాభూతమయస్తారా గణ పంజరే మహీ గోళః..(13-1)”
అర్థం: పంచ భూతాత్మకమైన గుండ్రని భూమి,పంజరం లో వేలాడే ఇనుప బంతిలా,ఖగోళంలో తారల మధ్య నిలిచిఉంది”అన్నాడు.
లీలావతి గ్రంథం లో భాస్కరాచార్యుడు ” నీవు చూసేదంతా నిజం కాదు.ఎందుకంటే నీవు ఒక పెద్ద వృత్తం గీసి అందులో నాల్గవ భాగం చూస్తే అది మనకు ఒక సరళరేఖలా కనిపిస్తుంది.కానీ నిజానికి అది వృత్తమే.అలాగే భూమి కూడా గుండ్రంగానే ఉన్నది.”