Thursday, 21 March 2013


  1. 1. తత్ - గణేశ్వరుడు
   2. స - నృసింహ భగవానుడు
   3. వి - విష్ణుదేవుడు
   4. తుః - శివదేవుడు
   5. వ - కృష్ణ భగవానుడు
   6. దే - రాథా దేవి
   7. ణ్యం - లక్ష్మీదేవి
   8. భ - అగ్నిదేవుడు
   9. ర్గః - ఇంద్రదేవుడు
   10. దే - సరస్వతి
   11. వ - దుర్గాదేవి
   12. స్య - హనుమంతుడు
   13. ధీ - పృధ్వీదేవి
   14. మ - సూర్యదేవుడు
   15. హి - శ్రీరాముడు
   16. ధి - సీతామాత
   17. యో - చంద్రదేవుడు
   18. యో - యమదేవుడు
   19. నః - బ్రహ్మదేవుడు
   20. ప్ర - వరుణదేవుడు
   21. చో - నారాయణుడు
   22. ద - హయగ్రీవ భగవానుడు
   23. యా - హంసదేవత
   24. త్ - తులసీదేవి

   మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.
  ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :

ఓం భూర్భువస్సువః 
తత్సవితుః వరేణియం 
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్ 

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...

1. తత్ - గణేశ్వరుడు
2. స - నృసింహ భగవానుడు
3. వి - విష్ణుదేవుడు
4. తుః - శివదేవుడు
5. వ - కృష్ణ భగవానుడు
6. దే - రాథా దేవి
7. ణ్యం - లక్ష్మీదేవి
8. భ - అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రదేవుడు
10. దే - సరస్వతి
11. వ - దుర్గాదేవి
12. స్య - హనుమంతుడు
13. ధీ - పృధ్వీదేవి
14. మ - సూర్యదేవుడు
15. హి - శ్రీరాముడు
16. ధి - సీతామాత
17. యో - చంద్రదేవుడు
18. యో - యమదేవుడు
19. నః - బ్రహ్మదేవుడు
20. ప్ర - వరుణదేవుడు
21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీదేవి

మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.

Wednesday, 20 March 2013

శివలింగ నిర్మాణం :


Suvarna Radhaakrishna
శివలింగ నిర్మాణం :

పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. కాబా గోడలో అమర్చిన అస్వాద్ అనే నల్లని రాయిని స్వర్గ రాయి గా భావించి ముస్లిములు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు
శివలింగ నిర్మాణం :

పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. కాబా గోడలో అమర్చిన అస్వాద్ అనే నల్లని రాయిని స్వర్గ రాయి గా భావించి ముస్లిములు హజ్ యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు

దర్భ యొక్క ప్రాముఖ్యం :


Suvarna Radhaakrishna
దర్భ యొక్క ప్రాముఖ్యం :

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది గ్రహణ కాలం. ఆ సమయంలో అన్నిటి మీదా దర్భను ఉంచడం మనకు అలవాటు. కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే: సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది. అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ గృహాలను పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను దర్భగడ్డితో కప్పుకొమ్మని శాసనం చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు. ఇలాకాక, కనీసం పిడికెడు దర్భలైనా ప్రతివ్యక్తీ గ్రహణ సమయాలలో శిరస్సుమీద కప్పుకొంటే, చెడు కిరణాల ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు. అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది. ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు. వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
దాతగానివాని తఱచుగా వేఁడిన
వాడుఁ దాతయగునె వసుధలోన
అవురు దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!

అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి. ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి. వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి
.

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?

గాయత్రీ మంత్రానికి, రామాయణానికీ సంబంధం ఏమిటి?

గాయత్రీ మంత్రంలో 24 అరాలున్నాయి. వాల్మీకి మహర్షి 24 వేల శ్లోకాలతో శ్రీరామాయణాన్ని రచించి, ప్రతి వెయ్యి 

శ్లోకాలకు మొదటి శ్లోకంలో గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు సంపుటీకరించి, రామాయణాన్ని పవిత్రం

 చేశాడు. గాయత్రీ మొదటి అక్షరం 'త' శ్రీరామాయణ ప్రారంభ శ్లోకం'తపస్వాధ్యాయ నిరతం' అని శ్లోకం 


ప్రథమాక్షరంగా ఉంది. అలాగే పట్టాభిషేక సర్గలో, చివరశ్లోకం, చివరి అక్షరం 'త'గా ఉంది.


ఇదే ఫలశ్రుతి శ్లోకం. పఠన్‌ద్విజో వాగృషభత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో భూమిపతిత్వ మీయాత్ స్వాత్‌క్షత్రియో 

భూమిపతిత్వమీయాత్ పణిగ్జనః పుణ్యఫలత్వమీయాత్ జనశ్చశూద్రోపి మహత్వమీయాత్ ఇలా, 'త' అనే 


అక్షరంలో శ్రీరామాయణం పరిసమాప్తమైంది. గాయత్రీ మంత్రంలో 'థియోయోనః ప్రచోదయాత్' అని 'త్' కడపటి 

అక్షరంగా ఉంది. అందువల్ల శ్రీరామాయణం శ్రీ గాయత్రీమంత్రార్థ ప్రతిపాదకం. గాయత్రీమంత్రద్రష్ట అయినందువల్లే 


విశ్వామిత్రుడికి శ్రీరాముడి పూర్తి రక్షణ లభించింది.

ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ?


Suvarna Radhaakrishna
ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ?


1.స్వామికి లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది

2.ఇంట్లో మంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి

3.సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది

4.కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు .చాల నీరసంగా ఉంటారు అటువంటి సమయంలో స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె పిల్లల ఆరోగ్యం భాగుపడి వారు బాగా ఎదుగుతారు

5.వ్యాపారం చేసి సమయంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు ,పండ్లు దక్షిణ సమేతంగా ,దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది

6.ఎ వ్యక్తి అయితే హీనంగా చుడభాడుతాడో అటువంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు

7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ,ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి

9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది

10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రాద్దించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్మని అనుగ్రహం ఉంటుంది

11.వాద వివాదాల్లో స్వామిని ప్రాద్దించి తమలపాకుల హర ప్రసాదాన్ని తెంటే జయం మీది అవుతుంది

12.తాoబులా దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది
పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు .తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు .అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు .దేనికి కూడా పర్ణ ప్రసాద మనే పేరు .


ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్తేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘ స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది.? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.

స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ?


1.స్వామికి లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది

2.ఇంట్లో మంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి

3.సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది

4.కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు .చాల నీరసంగా ఉంటారు అటువంటి సమయంలో స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె పిల్లల ఆరోగ్యం భాగుపడి వారు బాగా ఎదుగుతారు

5.వ్యాపారం చేసి సమయంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు ,పండ్లు దక్షిణ సమేతంగా ,దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది

6.ఎ వ్యక్తి అయితే హీనంగా చుడభాడుతాడో అటువంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు

7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది

8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ,ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి

9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది

10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రాద్దించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్మని అనుగ్రహం ఉంటుంది

11.వాద వివాదాల్లో స్వామిని ప్రాద్దించి తమలపాకుల హర ప్రసాదాన్ని తెంటే జయం మీది అవుతుంది

12.తాoబులా దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది
పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు .తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు .అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు .దేనికి కూడా పర్ణ ప్రసాద మనే పేరు .


ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్తేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘ స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది.? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.

స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు, తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.


గోవుకు గడ్డి పెట్టేటప్పుడు, తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.

"ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!

ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!:

ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.

Sunday, 17 March 2013


లోపాముద్ర

http://jagannaatakam.blogspot.in/2007/03/blog-post_12.html

మన పురాణాల్లో ఉన్న లోపాముద్రల కథలు:
1. ఈమెకు కౌశీతకి అని, వరప్రద అని పేర్లున్నాయి. రుగ్వేదంలో కూడా ఈమె ప్రస్తావన ఉంది. అగస్త్య మహామునికి ఈమె భార్య. అగస్త్యుడు ఒకసారి ఒక బావిలో తలకిందులుగా వేలాడే తన పితృదేవతలను చూశాడు. వాళ్ళు అతడి కారణంగానే తామలా ఉన్నామని, అతడు పెళ్ళి చేసుకుని కొడుకును కనేంత వరకు తమకు ఉత్తమగతులు కలగవని చెప్పారు. అప్పుడతను పెళ్ళి చేసుకోదలచి తనకు భార్య కావలసిన స్త్రీని సృష్టించడం కోసం లేడి నుంచి కన్నులు,... ఇలా సృష్టిలోని ఉత్కృష్టమైన అందాలన్నిటినీ పోగుచేశాడు. ఆమె కోసం తమ అవయవాలనిచ్చిన జీవుల శరీరాల్లో ఆ లోపాలు ముద్రలుగా మిగిలిపోయాయి. అందుకే ఆమె పేరు లోపాముద్ర ఐంది. అగస్త్యుడు విదర్భరాజు సంతానం కోసం చేసే యాగానికి వెళ్ళి లోపాముద్రను విదర్భరాణి గర్భంలో ప్రవేశపెట్టాడు. లోపాముద్ర అపురూప లావణ్యవతి (డిజైనర్ బేబీ కద?). అగస్త్యుడు ఆమెకు యుక్తవయసు వచ్చాక వెళ్ళి ఆమెను పెళ్ళాడగోరాడు. ఆమె తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ ఆమే స్వయంగా అగస్త్యుణ్ణి వరించి పెళ్ళాడి ఆయనతోబాటే నిరలంకారంగా ఆశ్రమంలో ఉంటుంది. అగస్త్యుడు పెళ్ళిచేసుకున్నాడేగానీ కొడుకును కనాలన్న విషయం మర్చిపోయి మళ్ళీ యథాప్రకారం తన జపతపాల్లో పడిపోయాడు. ఒకసారి ఆమె స్నానం చేసి వస్తూఉండగా చూసి మర్చిపోయిన విషయం గుర్తొచ్చి నాలిక్కరచుకున్నాడు. ఐతే సంతానవతి కావడానికి ఆమె ఒక కోరిక కోరింది. "మీ దినచర్యలో ఒక ఋషిపత్నిగా నేను పాలు పంచుకుంటున్నాను. కానీ శృంగారం విషయంలో నేనొక రాకుమారిని. యువరాణికి తగిన ఆభరణాలు, రాజోచితమైన పాన్పు ఉంటేనే తప్ప వీలుపడదు." అని చెప్పేసింది. అగస్త్యుడు తన దగ్గర ధనం లేదనేసరికి తనకున్న ఆధ్యాత్మికశక్తులను వినియోగించమని సలహా ఇచ్చింది. అగస్త్యుడు ఆమెను సంతోషపెట్టడానికి శ్రుతర్వరాజును ఆభరణాలు అడిగాడు కానీ వాటిని తీసుకోవడానికి ఒక అసాధారణ నియమం విధించాడు. దాంతో ఆ రాజు ఆయన్ను ముందు వ్రధ్నాశ్వుడనే రాజు వద్దకు, తర్వాత త్రసదస్యుడనే రాజు దగ్గరకు తీసుకుపోయాడు. ఆ త్రసదస్యుడు అగస్త్యుడికి ఇల్వలుడనే వాణ్ణి గురించి చెప్పాడు. అగస్త్యుడు ఇల్వలుడి ఆతిథ్యాన్ని స్వీకరించి అతడి తమ్ముడైన వాతాపిని జీర్ణం చేసుకుని ధనరాశులను తీసుకుని వచ్చి లోపాముద్రను సంతోషపెట్టాడు. ఆమె ఏడేళ్ళు గర్భం ధరించి గుణవంతుడైన కొడుకును కంది. అతనే ధృఢాశ్వుడు లేక ఇధ్మవహుడు. భర్తతో కలిసి ఆమె లలితసహస్రనామ ప్రాశస్త్యాన్ని చాటింది.

2. దధీచి భార్య. ఈమె గర్భవతిగా ఉండగా ఆయన దేవతలకు ఆయుధాలివ్వడానికి అగ్నికి ఆహుతయ్యాడు. ఆమె కూడా చితిప్రవేశం చేయబోయి, గర్భస్థ శిశువు కోసం ఆగిపోయింది. ఒక పిప్పల వృక్షం కింద శిశువును ప్రసవించి చితిప్రవేశం చేసింది. అతడే పిప్పలాదుడు. ఈమె మరోపేరు సువర్చ.

3. కవేరుడనే ఋషిపుత్రిగా విష్ణుమాయ పుట్టింది. ఆమె తపస్సు చేసి ఒక అంశ లోపాముద్రగా, మరో అంశ కావేరి నదిగా రూపొందింది.

4. పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. త్రిపురసుందరి అనుగ్రహం వల్ల పురుషత్వం పోయి దేవిరూపం గల స్త్రీగా మారాడు. అగస్త్యుడు ఆమెను కోరాడు. ఆమె దేవిని ఉపాసించమంది. హయగ్రీవుడి కృప వల్ల అగస్త్యుడు త్రింశతి, శ్రీవిద్యల ఉపదేశం పొందాడు.

భీష్ముడి పూర్వజన్మ


భీష్ముడి పూర్వజన్మ

http://jagannaatakam.blogspot.in/2007/03/blog-post_21.html

ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అష్టవసువులు. భీష్ముడు గతజన్మలో అష్టవసువుల్లో ఆఖరివాడైన ప్రభాసుడు. ఒకసారి అష్టవసువులు లోకవిహారం చేస్తూ వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తారు. అప్పుడు వశిష్ఠుడు ఆశ్రమంలో లేడుగానీ కామధేనువు పుత్రిక నందిని వుంది . ప్రభాసుడు తన భార్య ప్రేరేపించగా తన సోదరుల సాయంతో నందినిని తస్కరిస్తాడు. వశిష్ఠుడు తిరిగొచ్చాక వాళ్ళు చేసిన పని చూసి ఆగ్రహించి వాళ్ళు ఎనిమిది మందీ మనిషి జన్మ ఎత్తుతారని శపిస్తాడు. అప్పుడు మిగిలిన ఏడుగురు వసువులూ తప్పైపోయింది క్షమించమని ఆ మహర్షిని వేడుకోగా ప్రభాసుడొక్కడే తలబిరుసుతో ఆయన్ను తూలనాడుతాడు. దాంతో ఆ ముని వాళ్ళేడుగురికీ మనుషులుగా పుట్టగానే శాపవిమోచనమౌతుందని, ఎనిమిదోవాడు మాత్రం దీర్ఘకాలం కఠినతరమైన మానవ జీవితం గడపవలసి ఉంటుందని శాపాన్ని సవరిస్తాడు. 


ఇది జరగడానికి పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషువు అనే రాజొకడు తన పుణ్యఫలం చేత బ్రహ్మలోకం చేరుతాడు. కానీ అక్కడ నిండు సభలో గంగాదేవిని మోహంతో మైమరచి చూస్తాడు. అది గమనించిన బ్రహ్మ కోపించి అతడిని భూమ్మీద మానవజన్మ ఎత్తమని శపిస్తాడు. అతడు ఆ శాపఫలితంగా భూమ్మీద కురువంశంలో శంతనుడై అవతరించగా గంగ అతడి మీద మోహంతో అతణ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆమెకు దారిలో అష్టవసువులు దీనవదనులై కనిపిస్తారు. ఆమె వారి దు:ఖానికి కారణమడుగగా వాళ్ళు ఆమెకు విషయం వివరిస్తారు. అప్పుడు ఆమె వారికి బెంగపడవద్దని, తాను కూడా భూలోకానికే వెళ్తున్నానని చెప్పి, అక్కడ వాళ్ళు తన కడుపున పుట్టేటట్లు, వాళ్ళు ఒక్కొక్కరూ పుట్టిన వెంటనే శాపవిమోచనం కలిగించేట్లు అనుగ్రహిస్తుంది. అలా అటు అష్టవసువుల శాపవిమోచనం జరగడంతో బాటు ఇటు శంతనుడికి ఒక వారసుడు మిగులుతాడు. అతడే భీష్ముడు. (శాపవశాన మానవజన్మెత్తిన శంతనుడికి పూర్వజన్మస్మృతి లేదు. కానీ తనంతట తాను భూలోకానికి వచ్చిన గంగకు మాత్రం గతంలో జరిగిన విషయాలన్నీ చక్కగా జ్ఞాపకమున్నాయి.) తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే !నరసింహ శర్మ

 • దీర్ఘదర్శి గారి బ్లాగు నుండి శ్రీ విజయమోహన్ గారికి కృతజ్ఞలతో
  పం చ మహా యజ్ఞాలు -3 వ వ్యాసం - పితృ యజ్ఞం - మీకు "అదృష్టం" ఎలా వస్తుంది?
  పం చ మహా యజ్ఞాలు -3 వ వ్యాసం

  పితృ యజ్ఞం

  ముందు వ్యాసాల్లో -
  దేవ యజ్ఞము, ఋషి యజ్ఞాలను గురిం ఛి - చదివాము.
  మూడవది పితృ యజ్ఞం.
  యజ్ఞము - అం టే "స్వార్థ రహితమైన, పరులకు వుపకారమైన" - కార్యము.
  మనం మన కోసం చేసేది యజ్ఞం కాదు. పరుల కోసం చేసేదే యజ్ఞం.

  ఈ యజ్ఞం చేయడానికి మనకున్న పరికరాలేమిటి?

  మనకున్న ధన, ధాన్యాదులను- వొక పక్క నుంచితే -

  మనలోనే నిక్షిప్తమైన మూడు అద్భుత శక్తులను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం వుంచుకోవాలి.
  అవి - మన జ్ఞాన శక్తి, ఆలోచనా శక్తి, క్రియా శక్తి.

  ఈ మూడు శక్తులూ, వొకటిగా చేర్చి- మనం చేసే పనులకు, బలం చాలా ఎక్కువ. ఫలితం చాలా ఎక్కువ.
  అందుకనే - మనం, "మనో, వాక్, కాయ, కర్మణా" - పని చేయాలని, మన అన్ని శక్తులూ వొకటిగా జోడించి, పని చేయాలని - మన ఋషులు చెప్పారు.
  ఈ పంచ మహా యజ్ఞాలలో - దేవతలకు, ఋషులకు, పితృ దేవతలకూ, మిగతా మనుషులకూ, భూత గణాలకు, జరిగే మేలు చాలా వున్నా- వారి ద్వారా - మనకు జరిగే మేలు అంతకంటే ఎక్కువ.

  యిక - పితృ యజ్ఞం గురిం ఛి చూద్దాం.
  పితృ దేవతలంటే - చని పోయిన మన పూర్వీకులు మాత్రమే కాదు.
  బ్రతికి వున్న , మన తలిదండ్రులు - వారి సమానులు కూడా .
  వారికి మనమిచ్చే గౌరవము, వారికి మనం చేసే సేవ, వారి పట్ల మనం ప్రదర్శించే శ్రద్ధా భక్తులు - యిదీ పితృ యజ్ఞమం టే.
  మీరు, మీ పరిధిలో - మీ తల్లిదండ్రులకు , వారు ఉన్నప్పుడే, ఏం చేయగలరో - అవన్నీ చేసేయండి.
  మన ఋషులు, గురువులు చెప్పడం ఎమిటంటే - మీ పితృదేవతలు, బ్రతికి వున్నప్పుడు, వారిని సంతోష పెట్టండి.

  ఏమేమి చేయ గలరో - అవన్నీ - చేసెయ్యండి. అది చాలా ముఖ్యం.
  అందుకనే అన్నారు - మాతృ దేవో భవ; పితృదేవోభవ; ఆచార్య దేవో భవ - అని.
  కానీ - ఈ కాలం లో , పెద్దవాళ్ళయిన కొడుకులతో వుండటానికే - తల్లి దండ్రులు అంత యిష్టం చూపని పరిస్థితులు వస్తూ వుంది. తల్లిదండ్రులకు యిష్టం వున్నా- కొడుకుకో, కోడలికో - యిష్టం లేక పోవడమూ జరుగుతూ వుంది. కొడుకులు, ఎక్కడెక్కడో - వుండడం వలన - యిద్దరికీ యిష్టం వున్నా, కలిసి వుండ లేని పరిస్థితులూ - వున్నాయి.
  "వృద్ధాశ్రమాల" సంస్కృతి అనివార్యమై పోతూ వుంది.

  యిందులో - ఎవరి బాధ్యత ఎంత - అని వ్రేలెత్తి చూపడం - యిక్కడ కుదరదు - కాబట్టి - మీరు ఏమేమి చేయగలరో, మీ బ్రతికి వున్న పితరుల సంతోషానికి - అవన్నీ చేసెయ్యండి - అని మాత్రము చెబుతున్నాను.
  మీరు - ఏమేమి చేస్తారో - అవి - మీ పిల్లలు - భవిష్యత్తులో మీకు చేసే అవకాశం కాస్త వుంది.
  తల్లిదండ్రులకు - ఏమీ చేయని వాడు - నేను సమాజనికి సేవ చేస్తాననడం - హాస్యాస్పదంగా వుంటుంది.

  మీరు - ఏమి చేయగలరు ?
  ప్రతి "మంఛి రోజు" కూ - వారికి నమస్కారం చేసి - వారి ఆశీర్వాదం పొందండి.
  మా నాన్న, మా అమ్మ నాకు ఎంత చేసారో - అని వారు మీకు చేసిన త్యాగాలన్నీ - మీ భార్య / భర్త, స్నేహితులతో -
  చెప్పండి.
  మీ అమా, నాన్నా ఎదురుగా కూడా చెప్పొచ్చు. వారిపై - మీకెంత గౌరవం వుందో, వారికీ తెలియనివ్వండి.
  మీ ఆర్ధిక పరిస్థికి తగ్గని ఆర్ధిక పరిస్థితి - వారికి కలుగ జేయండి.

  తల్లి దండ్రులతో - ఎంత గౌరవం గా మాట్లాడినా -అది మీకు మేలే చేస్తుంది.
  మీ తల్లిదండ్రుల - పితరుల గురిం ఛి తెలుసుకోండి. వారి పట్ల మీ గౌరవం తెలియచేయండి. వారి పేరు మీద - అన్న దానాలో, మరేదైనా - దానాలో - మీ తల్లిదండ్రులకు తెలిసేటట్టు చేయండి.
  యిలా, మీరు ఎన్నో చేయొచ్చు. చేయాలని భావన రావాలి. అంతే.
  మన సంస్కృతిలో - సంవత్సరానికొక సారి - మరణించిన పితరుల కందరికీ పితృ యజ్ఞం జరిపే ఆనవాయితీ వుంది.

  శ్రద్ధతో చేయాల్సిన కార్యం కాబట్టి - దాన్ని "శ్రాద్ధము" అన్నారు.
  అది కాక, ప్రతి అమావాస్య నాడు - మన పితరులకు మాత్రమే కాక, చనిపోయిన అందరికీ - గౌరవం తెలిపే పద్దతిగా - పితృ యజ్ఞం చేసే పద్ధతి కూడా మనకుంది. ఈ రోజుల్లో - మీకు తోచిన పద్ధతిలో - మీకు వీలున్న విధంలో - మీరు చెయ్యండి.
  మనసు ముఖ్యం. మనసుం టే - మార్గాలెన్నో దొరుకుతాయి.
  దీని వలన మీకేం లాభం. చాలా లాభాలున్నాయి.
  అదృష్టం - అనే మాట మీకు తెలుసు.
  కనిపించ కుండా -స్పష్టమైన కారణం తెలియకుండా - మీకు వచ్చే లాభమే - "అదృష్టం".
  అదృష్టమేనేది - మీకు ఈ పంచ మహా యజ్ఞాల వలననే వస్తోందని - మీకు తెలుసా?
  దేవతలు - మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు "అదృష్టం" వస్తుంది.
  ఋషులు, గురువులు - మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు "అదృష్టం" వస్తుంది.
  మీ పితృ దేవతలు, మిమ్మల్ని ఆశీర్వదిస్తే - మీకు "అదృష్టం" వస్తుంది.
  వొకరి "ఆశీర్వాదానికీ" - మీ "అదృష్టానికీ" - మీరు, మీ కనులతో చూడ లేని - అతి పెద్ద లింకు వుంది.

  ఈ కాలం లో - పాశ్చాత్య దేశాలలో కూడా - "లా ఆఫ్ అట్రాక్షన్ " అనే వొక ప్రకృతి ధర్మం పైన చాలా చర్చ జరుగుతూ వుంది. మీరు నిస్స్వార్థంగా అనుకునేది మీకు దగ్గరగా వస్తుందని - ఈ లా యొక్క సారాంశం.

  నిజమే. యిది మన దేశంలో - మొదటి నుండి మనకు తెలుసు.

  నిస్స్వార్థ కార్యాలకు - దేవతలు - అంటే, ప్రకృతి శక్తులు "తథాస్తు" అంటారని, మన శక్తికి వాటి శక్తిని జోడిస్తారని మనకు తెలుసు. అందుకే దేవ యజ్ఞం. శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లాంటి దైవాంశ సంభూతులు కూడా - దేవ యజ్ఞం చేసి గానీ - తమ పనులు మొదలు పెట్ట లేదు. అలాగే ఋషి యజ్ఞమూ, పితృ యజ్ఞమూ కూడా. వారి ఆశీర్వాదము - దేవతల ఆశీర్వాదానికి ఏ విధం గానూ తీసిపోదు.

  మీరు - మీకోసం కోరే వాటికన్నా - మీ తలిదండ్రులు, మీ కోసం, కోరే వాటికి, బలం, ఫలితం, చాలా ఎక్కువ. వారు చేసేది, యజ్ఞం. మీరు చేసేది, మీరు అడిగేది - స్వార్థం.

  యింకా యెంతో వుంది గాని - మనసులో పడిపోతే - యిది చాలు.

Saturday, 16 March 2013


సముద్ర స్నాన విధి:

సముద్ర స్నానానికి కొన్ని నియమాలు శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వకాలాలలోనూ సముద్రాన్ని తాకట౦ గానీ, ఆడడ౦ గానీ కూడదు. అది దేవతా స్వరూప౦.

అశ్వత్థ సాగరౌ సేవ్యౌ స స్పృష్టవ్యౌ కదాచనః!
అశ్వత్థ౦ మన్దవారేతు సాగర౦ పర్వణిస్పృశన్!!

రావిచెట్టు, సముద్రము - వీటిని పూజి౦చవచ్చు, నమస్కరి౦చవచ్చు, కానీ ఎల్లవేళలా ముట్టరాదు. శనివార౦ రావిచెట్టును, సర్వకాలాలలో (పున్నమి, అమావాస్య, స౦క్రమణాదులయ౦దు) సముద్రాన్ని స్పృశి౦చవచ్చు.

సముద్రజలాన్ని ఆచమన౦ చేయరాదు. వేరే జల౦తో ఆచమన౦ చేసి తరువాత సముద్రస్నాన౦ చేయాలి. గోకర్ణ క్షేత్ర౦లో, ప్రఖాస (సోమనాథ) క్షేత్ర౦లో, గ౦గా సాగర స౦గమ స్థల౦లో, జగన్నాథ క్షేత్ర౦లో, సేతువు (రామేశ్వర౦) న౦దు సముద్ర జల౦తో ఆచమన౦ చేయవచ్చు.
సముద్ర స్నాన విధి:

సముద్ర స్నానానికి కొన్ని నియమాలు శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వకాలాలలోనూ సముద్రాన్ని తాకట౦ గానీ, ఆడడ౦ గానీ కూడదు. అది దేవతా స్వరూప౦.

అశ్వత్థ సాగరౌ సేవ్యౌ స స్పృష్టవ్యౌ కదాచనః!
అశ్వత్థ౦ మన్దవారేతు సాగర౦ పర్వణిస్పృశన్!!

రావిచెట్టు, సముద్రము - వీటిని పూజి౦చవచ్చు, నమస్కరి౦చవచ్చు, కానీ ఎల్లవేళలా ముట్టరాదు. శనివార౦ రావిచెట్టును, సర్వకాలాలలో (పున్నమి, అమావాస్య, స౦క్రమణాదులయ౦దు) సముద్రాన్ని స్పృశి౦చవచ్చు.

సముద్రజలాన్ని ఆచమన౦ చేయరాదు. వేరే జల౦తో ఆచమన౦ చేసి తరువాత సముద్రస్నాన౦ చేయాలి. గోకర్ణ క్షేత్ర౦లో, ప్రఖాస (సోమనాథ) క్షేత్ర౦లో, గ౦గా సాగర స౦గమ స్థల౦లో, జగన్నాథ క్షేత్ర౦లో, సేతువు (రామేశ్వర౦) న౦దు సముద్ర జల౦తో ఆచమన౦ చేయవచ్చు.

Sunday, 3 March 2013

కాశ్యప గోత్రము :- హిందూ సమాజములో "సాంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత" అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. మఱి ఎవఱికైనా 'తమ యొక్క గోత్రము తెలీదనుకోండి. అప్పుడేమి చేయాలి ? అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను. అనగా తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.

శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే |
యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||

తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించినారు అని శ్రుతివాక్యము.

కశ్యప ప్రజాపతి :- కశ్యప మహర్షి, మన ఖండములలో "ఆది పురుషుడు" అని భావించవచ్చును. దక్షిణ ఆసియా దేశాలలో - మూల స్తంభము. అనాది మనిషి, నాగరికత అభివృద్ధి చెందే దశలలోని ప్రజలకు మార్గదర్శకత్వము వహించినాడు. ఈ పైన చూపిన శ్లోకము అందుకు ముఖ్య ఆధారము.

కశ్యప కుటుంబము :- సృష్టికర్త బ్రహ్మ మరీచి అనే మహర్షిని సృజించెను. ఆ మరీచి భార్య పేరు కళ. ఈమె కర్దమ ప్రజాపతి కుమార్తె. వారికి జన్మించినవాడే కశ్యపుడు. కర్దమ ప్రజాపతి మాతామహుడు. కావున ఈతని మధ్యవర్తిత్వముచే కశ్యప ఋషి వివాహమైనది. దక్ష ప్రజాపతి తన కుమార్తెలు పదమువ్వుఱిని - కశ్యపునికి ఇచ్చి వివాహమొనరించెను. అలాగే వైశ్వానరుని తనయలు ఇఱువుఱు కశ్యపుని అర్ధాంగీ పదవులను పొందినారు. 15 మంది సతులతో కూడి, జీవితమును నియమబద్ధముగా గడుపుచూ క్రమముగా ఆ మునివరుడు సమాజ సుస్థిరతకు అవసరమైన నియమావళిని రూపొందించే ప్రయత్నాలను చేసెను. ఆతని సంతానము తామరతంపరగా వర్ధిల్లి, మానవుని ఉనికి ప్రవర్ధమానమైనది. మానవుని సుఖ జీవనమునకు నీరు ముఖ్య ఆధారము గనుక, కశ్యపుడు సంఘ నిర్మాణమునకు నదీ, సముద్ర తీరములను ఎంచుకుని ఆ అన్వేషణలో సఫలీకృతుడైనాడు. తద్వారా “కశ్యప ప్రజాపతి”గా ప్రజల అభిమానమును పొందినాడు.

వివిధ ప్రాంతముల ఉనికిని కనుగొన్న ఋషిసత్తముడు :- నీల మత పురాణములో కశ్యప మౌని గుఱించిన అనేక అంశములకు ఆధారములు లభించినవి. కాశ్మీరమునకూ, కశ్యపునికీ అవినాభావ సంబంధము కలదు. “కశ్యప మీర దేశము” పరిణామములో “కాశ్మీరము” ఐనది. నేటి వ్యావహారిక నామము “కాశ్మీర్”. కశ్యప = కూర్మము, మధుపాన మత్తుడు అనే అర్ధాలు ఉన్నవి. శ్రీకూర్మము అంటే తాబేలు - భూమిపైనా, జలములలోనూ జీవించే ఉభయ చర ప్రాణి. కశ్యపుడు - ఇటు పృధ్వీతలము పైనా, అటు నీటిలోనూ నిర్భీతిగా సంచరించగల శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నట్టి వ్యక్తి.

అంబుధికి ముని పేరు :- నదీ తీరములు, జలనిధులు మిక్కిలిగా ఉన్న సీమలలో 'ప్రజా సంఘముల ఏర్పాటుకు' పునాదులను వేశాడు కశ్యపుడు. తటాకాది జలాశయములు మనిషికి జీవనాధారములై, నాగరికతలు నవ్య నవీనముగా రూపొందే దశలకు శ్రీకారము చుట్టాడు తాపసి కశ్యపుడు. కశ్యప మహాఋషి సంచార జీవనములో కనుగొని, ప్రజా జీవనమునకు పూలబాటలను పరిచాడు. కనకనే అవి ఆ మునీశ్వరుని నామముతో వినుతికెక్కినవి. కశ్యప + మీర = కాశ్మీరము/ కాశ్మీరదేశము. కశ్యప సముద్రము = అనగా నేటి కాస్పియన్ సాగరము, సప్త మహా సముద్రాలలో ఒకటి Darya -I - Kaspyan. (Kashyap sagar - caspian sea