Wednesday, 24 April 2013


Rajini Radha
రామరక్షాస్తోత్రం:--

(ఈ రామరక్షాస్తోత్రాన్ని ఉగాది మొదలుకుని----శ్రీరామనవమి వరకు, అనగా వసంత నవరాత్రులలో, ప్రతీరోజు 11 సార్లు చదివితే, కోరిన కోర్కెలు నెరవేరుతాయి. అలా చేయలేని వారు 9, 7, 5, 3, అదీ కూడా చేయలేనివారు కనీసం రోజుకి ఒక్కసారి ఐనా చదవవచ్చును.... పుణ్యము వస్తుంది, మన కోర్కెలు తీరుతాయి.)

రచన: బుధ కౌశిక ఋషి
ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీ సీతారామ చంద్రోదేవతా
అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః
శ్రీమాన్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగఃll

ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం
పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్ll

స్తోత్రమ్

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనమ్

ధ్యాత్వా నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనమ్
జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితమ్

సాసితూణ ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకమ్
స్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభుమ్

రామరక్షాం పఠేత్ప్రాఙ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్
శిరో మే రాఘవః పాతుఫాలం దశరథాత్మజః

కౌసల్యేయో దృశౌపాతు విశ్వామిత్ర ప్రియః శృతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః

జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరత వందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః

కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః

సుగ్రీవేశః కటీపాతు సక్థినీ హనుమత్-ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షకుల వినాశకృత్

జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌవిభీషణ శ్రీదఃపాతు రామో‌உఖిలం వపుః

ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్

పాతాళ భూతల వ్యోమ చారిణశ్-చద్మ చారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః

రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్
నరో నలిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి

జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభి రక్షితమ్
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వ సిద్ధయః

వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాఙ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్

ఆదిష్టవాన్ యథాస్వప్నే రామ రక్షా మిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః

ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్
అభిరామ స్త్రిలోకానాం రామః శ్రీమాన్సనః ప్రభుః

తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణా జినాంబరౌ

ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ

శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్టా సర్వ ధనుష్మతాం
రక్షఃకుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ

ఆత్త సజ్య ధనుషా విషుస్పృశా వక్షయాశుగ నిషంగ సంగినౌ
రక్షణాయ మమ రామలక్షణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం

సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్ మనోరథాన్నశ్చ రామః పాతు స లక్ష్మణః

రామో దాశరథి శ్శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః

వేదాంత వేద్యో యఙ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః

ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేథాధికం పుణ్యం సంప్రాప్నోతి నసంశయః

రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతావాససం
స్తువంతి నాభిర్-దివ్యైర్-నతే సంసారిణో నరాః

రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందేలోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ

శ్రీరామ చంద్ర చరణౌ మనసా స్మరామి
శ్రీరామ చంద్ర చరణౌ వచసా గృహ్ణామి
శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి
శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే

మాతారామో మత్-పితా రామచంద్రః
స్వామీ రామో మత్-సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాన్యం జానే నైవ న జానే

దక్షిణేలక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా
పురతోమారుతిర్-యస్య తం వందే రఘువందనమ్

లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణ్యం ప్రపద్యే

మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం

భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

ఇతి శ్రీబుధకౌశికముని విరచితం శ్రీరామ రక్షాస్తోత్రం సంపూర్ణం.

శ్రీరామ జయరామ జయజయరామll

Monday, 22 April 2013


చంద్ర గ్రహణము

స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర చైత్ర శుద్ధ పౌర్ణమి గురువారము తేది 25-04-2013 రోజున స్వాతి నక్షత్ర ద్వితీయ పాద సంచార సమయమున రాహుగ్రస్త సవ్య పాక్షిక చంద్రగ్రహణము యేర్పడును. (గురువారము రాత్రి తెల్లవారితే శుక్రవారము)సూర్యాస్తమయము సా: 06-34 ని॥
గ్రహణ స్పర్శకాలము రా॥ 01-20 ని॥
గ్రహణ మధ్యకాలము రా॥ 01-37 ని॥
గ్రహణ మోక్షకాలము రా॥ 01-53 ని॥
ఆద్యంత పుణ్యకాలము 27 నిమిషములు

ఈ గ్రహణము స్వాతి నక్షత్రము, తులా రాశి వారు చూడరాదు. నిత్య భోజన ప్రత్యాభికాదులు సా।। 04 గంటల లోపు పూర్తి చేసుకోవలెను. పిల్లలు, రోగులు, ముసలివారు రాత్రి 07 గంటల వరకు భోజనాదులు చెసుకొవఛును.

తులారాశి వారు, స్వాతి నక్షత్రము వారు శాంతి జరిపించుకోవలెను. అంతేకాకుండా తులారాశి లోవున్న చిత్త 3, 4 పాదముల వారు, విశాఖ 1, 2, 3 పాదముల వారుకూడా గ్రహణ శాంతి జరిపించుకోవలెను. అనగా ఈ రాశి, నక్షత్రము వారు రజిత చంద్ర బింబము, నాగ ప్రతిమకు పూజ చేసి వాటితోపాటుగా యదా శక్తి ధన, ధాన్యాదులు దానమివ్వవలెను. దీని ద్వారా ఆ దోషము తొలగిపోవుటయే కాక మహాపుణ్య ఫలము కలుగును.

Saturday, 20 April 2013


శ్రీ సీతారామకల్యాణం
జై శ్రీమన్నారాయణ. శ్రీ మొదలి సుబ్రహ్మణ్యం గారు అనువదించిన వాల్మికి రామాయణము బాలకాండ 71 వ 72వ సర్గ లు పరిశీలించిగా , శ్రీ సీతారామ కళ్యాణం "ఉత్తర ఫల్గుణి నక్షత్రములో " జరిగినదని తెలుస్తోంది.

71 వ సర్గలో జనకమహారాజు " ఓ దశరధమహారాజా ! నేడు మఘ నక్షత్రము . నేటికి మూడవ రోజు అనగా ఉత్తర ఫల్గునీ నక్షత్రములో వివాహము" అని అన్నాడు.

72 వ సర్గలో జనకమహారాజు " ఉత్తర ఫల్గుణి నక్షత్రమునకు భగుడు దేవత. సంతాన ప్రదాత " అని కూడా అంటాడు.

ఈ నేపద్యం లో మరో విషయము గుర్తుపెట్టుకోవాలి. విశ్వామిత్ర యాగ సంరక్షణార్ధం రామలక్ష్మణులు వెళ్ళారు. యజ్ఞములు సర్వసాధారణంగా చైత్ర, వైశాఖ మాసములలో జరుగుతాయి. మిధిలానగరంలో కూడా రామలక్ష్మణులు వచ్చినప్పుడు ఓ యాగము జరుగుతోంది.
రామాయణం రచించిన వాల్మీకే పులకించిపోయి వ్రాసారు సీతారామకల్యాణం. బాలకాండలో 66వ సర్గ నుంచి 73వ సర్గ వరకూ 228 శ్లోకాలలో ఈ వివాహం గురించి వ్రాసారు. ఇంత సొగసుగా వర్ణించిన మరొక వివాహం మన పురాణ ఇతిహాసాలలో గాని, కావ్యాలలోగాని లేదేమో అనిపిస్తుంది.
రామాయణంలో మూడు ఘట్టాలలో వాల్మీకి తనను తాను మర్చిపోయి చెప్పారనిపిస్తుంది. మొదటిది వాల్మీకికి నారదుడు రాముడి గుణగణాలను వర్ణించినది. బాలకాండలో మొదటి సర్గలో నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని మొదలుపెట్టి ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః అని పూర్తి చేస్తూ ఒకదాని మించినది ఒకటిగా పది శ్లోకాలు చెప్పారు. ఇది ఆదికవి వాల్మీకి పరవశించి చెప్పినది.
రెండవది సీతారాముల కల్యాణం. ఇది, వసంత ఋతువు ప్రారంభంలో వాల్మీకికోకిల పులకించి పలికినది.
మూడవది అశోకవనంలో సీతను చూసినప్పుడు హనుమంతుడి మనస్సులో మెదిలిన భావాలు. ఆమె ఎలా ఉందో చెప్తాడు. ఆమె విద్యలా ఉంది. కీర్తిలా ఉంది. శ్రద్ధలా ఉంది. బుద్ధిలా ఉంది. వాక్కులా ఉంది. పూజలా ఉంది. భూషణాలు తీసి చెట్టుకు తగిలించినా భర్తృవాత్సల్యం అనే భూషణంతో వెలిగిపోతూ పవిత్రమైన అగ్నిశిఖలా ఉంది. ఇలా ఎన్ని ఉపమానాలు చెప్పినా ఆయనకు తృప్తి లేదు. ఇది వాల్మీకి మహర్షి హృదయం కరిగిపోయి వ్రాసినది


కాబట్టి శ్రీ సీతారామకల్యాణం వసంత ఋతు ప్రారంభము చైత్ర మాసములో ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవమి నుండి త్రయోదశి లోపల జరిగి ఉండవచ్చును.

బృహస్పతి భార్య తారకు బృహస్పతి శిష్యుడైన చంద్రుడికి పుట్టినవాడు బుధుడు. మనువుకుమారుడైన సుద్యుమ్నుడు ఒక కొలనులో స్నానము చేయగా స్త్రీగా మారిపోయెను ఆమె పేరు ఇల. ఆమెను బుధుడు చూచి వివాహమాడెను. వారిరువురకు కలిగిన కుమారుడు పురూరవుడు. బృహస్పతి నవగ్రహాలలో ఒక గ్రహం. తార అనేది నక్షత్రం బుధుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఆ బుధుడి కుమారుడు మాత్రం మనిషే షట్చక్రవర్తులలో ఒకడైన పురూరవుడు. నమ్మబుద్ధికావటం లేదు కదూ.... కానీ అదే నిజం.

స్వధ కూతురు మేనక. ఆ మేనకను హిమవంతుడు వివాహమాడెను. మేనకా హిమవంతులకు పార్వతి పుట్టి తపస్సు చేసి శివుని మెప్పించి వివాహమాడెను. హిమవంతుడంటే హిమాలయ పర్వతములు. ఈ పర్వతములు పితృదేవతల కూతురైన మేనకను వివాహమాడటం వారికి సంతానంగా పార్వతి పుట్టటం
శివుణ్ణి పెళ్ళి చేసుకోవటం అంతా తమాషాగా ఉందా. కానీ అదే నిజం.

మన వేదాలూ పురాణాలూ వట్టి పుక్కిటి పురాణాలని పసలేనివని కాలక్షేపం కోసం రచించినవనీ మనచేతనే పలికించగలిగిన పాశ్చాత్య దేశాల విద్యావిధానములు భారతీయ సంస్కృతిని చరిత్రను పురాణాలను ఇతిహాసాలను పరిహాసం చేస్తుంటే ఆత్మాభిమానం కోల్పోయి మనకన్నా వారే గొప్ప అని భావించే వారందరికీ ఒక విజ్ఞప్తి. ఒకసారి డిసెంబరు 6 వ తేది. 2010 సోమవారం నాటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఒక వార్తను చదవండి. హెడ్డింగ్:- ప్లాస్మా ఆవిష్కరణ.

ఈ అనంత విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు సూర్యచంద్రులు, పర్వతాలు, భూమ్మీద జీవులుగా ఎలామారారో తెలియక ఆశ్చర్యపోతూ తమ పరిశోధనలను కొనసాగిస్తున్న పాశ్చాత్యదేశపు శాస్త్రజ్ఞులను చూస్తే జాలేస్తోంది. ఇంతకాలం మనల్ని మన పురాణాలను మన ఆచారాలను హేళన చేస్తూ ఆటపట్టించిన ఈ పాశ్చాత్య దేశపు శాస్త్రజ్ఞులు అవే నిజమని తమ పరిశోధనల ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. పైన చెప్పిన విషయాలన్నీ పచ్చి నిజాలు. అవే కాదు ఇంకా కూడా చూడండి.

జరాసంధుని బారి నుండి యాదవులను రక్షించుటకై కృష్ణుడు 5200 సంవత్సరాల క్రితమే సముద్రంలో అద్భుతమైన భవనాలతో రాతి కట్టడాలతో ఒక నగరాన్నే నిర్మించటం వీళ్ళు చెబుతున్న సైన్సుతోనో, టెక్నాలజితోనో కాదు. వేద విజ్ఞానంతో. నాసావాళ్ళు తమ ఉపగ్రహాలతో సముద్ర గర్భంలోని ఈ మహానగరాన్ని గుర్తించి, అప్పటికే మనకున్న విజ్ఞానానికి ఆశ్చర్యపోతున్నారు....చుట్టు పక్కల ఎక్కడా కూడా కొండలు బండలు లేని ప్రాంతమైన రామేశ్వరం వద్ద పెద్ద పెద్ద బండలతో సముద్రపు ఈకొననుండి ఆకొనవరకు ఏకంగా వారధినే కట్టించిన శ్రీరామ చంద్రమూర్తి వీళ్ళ సైన్సు టెక్కాలజీలు చదువలేదు. వేదాధ్యయనమే చేశారు.

శ్లో|| అంబితమే నదీతమే దేవితమే సరస్వతి| అప్రశస్తాఇవశ్మసి ప్రశస్తిమ్ అంబనస్కృథి|| సరస్వతి నదిని స్తుతిస్తున్న మంత్రమిది.

ఋగ్వేదంలో సుమారుగా 50 చోట్ల సరస్వతీనది ప్రస్తావన ఉంది. కానీ అటువంటి నది ఏదీ భూమ్మీద ఏనాడూ కూడా లేదనీ, పురాణాల్లోని విషయాలన్నీ అసత్యాలనీ, మనల్ని ఇంతకాలం హేళన చేసినవారు ఈనాడు నాసావారు చెప్తున్న విషయాల్ని విని నోళ్ళు మూసుకున్నారు. నాసావారు చెప్పాక ఇస్రోవారు కూడా పరిశోధించి సరస్వతీనది ఒకటి ఉండేదనీ అది పురాణాల్లో చెప్పినట్లుగానే 14 మైళ్ళ వెడల్పుతో ప్రవహించేదనీ ఏ కారణం చేతనో భూమ్మీద నుండి మాయమై అంతర్వాహినిగా భూగర్భంలో ప్రవహిస్తున్నదని తెలియజేశారు. ఈ సరస్వతీ నదీ జలాలను పైకి తేగలిగితే రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంత మంతా సస్యశ్యామలంగా మారిపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు.

Tuesday, 9 April 2013

శ్రీరామ పంచరత్న స్తోత్రం:

---
రచన: ఆది శంకరాచార్యకంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ

కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ||


విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయవీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ||సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయసుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ||


పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ


పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ ||నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ


నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ ||ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః


సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ||ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం...

Tuesday, 2 April 2013

మనవి


ఈ బ్లాగులో వున్న కంటెంట్ అంతా నాది కాదు.అనేకమంది  మహానుభావుల ,,పుజ్యనియ గురువుల ,ఋషుల తపోధనుల ప్రవచనాలు,,మరియు  వివిధ సైట్ల నుంచి సేకరించిన  సమాచారము  ఒక చోట సమకూరుస్తున్నాను.క్రెడిట్ అంతా అసలు గురువులకు  వ్యాసకర్తలకు చెందుతుందని మనవి.

సర్వకార్య సిద్ధికి జయ మ౦త్ర౦


సర్వకార్య సిద్ధికి జయ మ౦త్ర౦

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః!!

దాసో౭హ౦ కోసలే౦ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శతృసైన్యానా౦ నిహన్తా మారుతాత్మజః!!

న రావణ సహస్ర౦ మే యుద్ధే ప్రతిబల౦ భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః!!

అర్ధయిత్వా పురీ౦ ల౦కామ్ అభివాద్య చ మైథిలీమ్
సమృద్ధార్థో గమిష్యామి మిషతా౦ సర్వరక్షసామ్!!

మహాబల స౦పన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కి౦ధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నాపేరు హనుమ౦తుడు. శత్రుసైన్యములను రూపుమాపు వాడను. వేయి మ౦ది రావుణులైనను యుద్ధర౦గమున నన్నెదిరి౦చి నిలువజాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, ల౦కాపురిని నాశనమొనర్చెదను. రాక్షసుల౦దరును ఏమియూచేయలేక చూచుచు౦దురుగాక. నేను వచ్చిన పనిని ముగి౦చుకొని సీతాదేవికి నమస్కరి౦చి వెళ్ళెదను.


నరనారాయణులుగా నాలుగవ అవతారం

తుర్యే ధర్మ కలా సర్గె నర నారాయణావ్ ఋషీ |
భూత్వాత్మొపశమోపేతమ్ అకరోద్ దుశ్చరమ్ తపః ||

సృష్టి ఆరంభం అయిన తరువాత, బ్రహ్మగారి దేహంలోంచి నేరుగా ఉద్భవించినవారు ప్రజాపతులు అయ్యారు. ఆ ప్రజాపతుల ద్వారా ఉద్భవించినవారు మానవులు ఇతర ప్రాణులు అయ్యారు. ప్రజాపతులు అంటే భగవంతుడి వివిద భాగాల్లోంచి వెలువడ్డ వారు. అలాంటి ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతి అనే ఒక ఆయన, ధర్మ ప్రజాపతి అనే మరొక ఆయన. పరమ శివుని భార్య అయిన పార్వతీదేవి తండ్రి హిమవంతుడు. పరమ శివునికి మొదట ఒక భార్య ఉండేది సతీదేవిఅని, ఆమె తండ్రిగారు దక్షుడు. ఆ దక్ష ప్రజాపతికి దాదాపు అరవై మంది సంతానం ఉన్నారు. అందులో కొంతమందిని పరమ శివుడు వివాహం చేసుకున్నాడు. అట్లా దక్షుడి ఒక సంతానమే మూర్తి అనే పేరుగల ఆమె. ఆమెను ధర్మ ప్రజాపతి వివాహం చేసుకున్నాడు. నాలుగవ అవతారంగా తానే ధర్మ ప్రజా పతికి మూర్తి అనే దక్ష ప్రజాపతి కుమార్తె ద్వారా నర నారాయణులనే కవల పిల్లలుగా అవతరించాడు. అయితే వారు పుట్టిన వెంటనే వారు తపస్సు చేసుకోవడానికి వారి తల్లి తండ్రుల వద్ద అంగీకారం పొంది తపస్సులో గూర్చున్నారు. వారు తపస్సుకి వెళ్తే తల్లి వారిరువురికి సేవ అందించడానికి వారి వద్దే ఉన్నది. ఇది బదరికాశ్రమం యొక్క సన్నివేశం. వారు తపస్సు చేస్తుంటే వారి చుట్టూ పర్వతాలు పేరుకుపోయాయి. ఇప్పుడు నర నారాయణులు ఇరువురు పర్వతాలుగా దర్శనమిస్తారు. నారాయణ పర్వతం కూర్చొని ఉన్నట్టు ఉంటుంది. నర పర్వతం నిలుచున్నట్టు ఉంటుంది. వారిరువురి మధ్య అలకనందా అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. వారిరువురు అక్కడ ఉన్నారని ప్రతి ఋషి వెళ్ళి సేవించుకున్నారు. విజ్ఞానం కల్గిన మహనీయులంతా తపస్సులు అక్కడే చేసుకున్నారు.

వారిరువురు ఆ ప్రాంతాన్ని పవిత్రం చేసారు. అప్పుడు ఆరంభం చేసిన తపస్సు ఈనాటి దాకా చేస్తున్నారు. ఎందుకంటే మంత్రాన్ని తపస్సు చేసిన వ్యక్తి అందిస్తే తప్పక ఫలిస్తుంది. ఒకరికి అందించిన కొద్ది తపస్ శక్తి తరిగిపోతుంది, అట్లా లోకంలో తపస్ శక్తి ఎప్పటికి నిలిచి ఉండాలని, మంత్రం అందుకున్న వారికి శ్రమ లేకుండా వారు నిరంతరం అందిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉండే జీవులంతా వారి ఆత్మ స్వరూపాన్ని గుర్తించి మానసిక ప్రశాంతతతో తరించడానికి అష్టాక్షరీ మంత్రాన్ని వెలువరించి ఆ మంత్రాన్ని ఆయన ఇప్పటికీ తీవ్ర తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఆ మంత్రాన్ని ఉపాసనచేసే వాళ్ళందరికీ ఆ మంత్రం ఫలించాలి అంటే ఎంతెంతో కృషి చేయాల్సి ఉంటుంది, అది ఈ లోకంలో వాళ్ళు చేయగలరో చేయలేరో అని వాళ్ళ తరపున తానే చేస్తున్నాడు ఈ నాటికీ కూడా. "అకరోద్ దుశ్చరమ్ తపః" అలా అతి తీవ్రమైన తపస్సుని ఇప్పటికీ చేస్తునే ఉన్నాడు బదరికాశ్రమంలో.

లోకానికి సర్వ వేద సారమని ఋషులంతా ఉపాసించినట్టి, వేదమే దానికి సారం ఇదే అని చెప్పినటువంటి నారాయణ అష్టాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశం చేసిన స్వరూపం. ఒకే భగవంతుడు రెండు రూపాలు ధరించి ఈ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆచార్యునిగా నారాయణుడు అయ్యాడు. శిష్యునిగా నరుడయ్యాడు. నారాయణుడు నరునికి ఉపదేశం చేస్తూ లోకం అంతా గుర్తించేట్టు చేసాడు. రెండు రూపాలు ధరించడం ఎందుకు అంటే, గురువు అవ్వడం సులభం కానీ శిష్యుడుగా ఉండటమే కష్టం. లోకంలో గురువు ఎట్లా ఉండాలి అని చూపించడానికి తానే గురు స్వరూపం ధరించి, శిష్యుడు ఉండాల్సిన క్రమం ఏమి అనేది తెలుపడానికి తానే శిష్య రూపం ధరించి భగవంతుడు నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని దర్శించి ఇచ్చాడు. మంత్రాన్ని తాను తయారు చేయలేదు, వేదాల్లో ఉన్న మంత్రమే. పైకి కనిపించక దాగి ఉన్న మంత్రాన్నే పైకి తెచ్చి లోకం అంతా గుర్తిచ్చేట్టు అందించాడు.