Tuesday, 31 December 2013

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా? 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః | తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా || వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః | ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః || వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు. 1. వృషభాద్రి - అంటే ఎద్దు : వ్రుశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు) వాక్కు అంటే - శబ్దం శబ్దం అంటే - వేదం వేదం అంటే - ప్రమాణము వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు. 2. వృషాద్రి - అంటే ధర్మం : ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం. 3. గరుడాద్రి - అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు. భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు. అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి. 4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటతాడు. 5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం. 6. వేంకటాద్రి - వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం. 7. నారాయణాద్రి - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం.

Monday, 30 December 2013

ధర్మాచరణ

Jaji Sarma
ధర్మాచరణ
మనుర్భవ జనయా దైవ్యం జనమ్ -( ఋగ్వేదం 10-5316)
స్త్రీ పురుషులు ఏ మార్గాన్ననుసరించినా అది వారితో పాటు, సమాజానికి సర్వ మానవ కళ్యాణానికి, సహకరించేదిగా ఉండాలని మన పూర్వులు అనుభవంతో చెప్పారు. తనవలె ఇతరుల కష్ట సుఖాలను - హాని లాభాలను తెలుసుకొన్నవాడే మనుష్యుడు.
"మనుష్యుడంటే దానం చేసేవాడు, శీలసంపన్నుడు, శుభగుణ విభూషితుడు, శ్రేష్టమైన ఆచారాలు కలవాడని" ఆర్య చాణక్యుడు వ్యాఖ్యానించాడు.
ధర్మాత్ములు, అనాధులు, నిర్బలులను రక్షించువాడు మనుష్యుడని అన్నాడు. సత్యము, న్యాయము, ధర్మముల కొరకు ప్రాణములను విడుచువాడే నిజమైన మనుష్యుడని అన్నాడు. దారుణమైన దు:ఖం ప్రాప్తించిన, ప్రాణ హాని కలిగిన, మానవత్వ రూప దర్మం నుంచి విచలితుడు కాకూడదని తన నిజజీవితంలో నిరూపించాడు. శుభకర్మలు చేయువాడు, ఆచారవంతుడు, ఆత్మజ్ఞానాన్ని పొంది సుఖించేవాడు మనుష్యుడని ఆర్య చాణక్యుడు కీర్తించాడు. ఆత్మజ్ఞానానికి మించిన సుఖం మరొకటి లేదని స్పష్టం చేశాడు.
హస్తస్య భూషణం దానం - చేతులకు దానమే భూషణం
సత్యం కంఠస్య భూషణం - కంఠమునకు సత్యమే భూషణం
శ్రోత్రస్య భూషణం శాస్త్రం - చెవికి ధర్మ వచనములే ఆభరణమని ఇవే సహజమైన, శాశ్వతమైన భూషణాలని ఘోషించాడు. భర్తృహరి మానవ ధర్మానికి సంబంధించిన ఈ సుగుణములు లేకుంటే మానవజన్మ వ్యర్ధమవుతుందని అన్నాడు.
ఓ కధ చెప్పుకుందాము.
ఒక అడవిలో మనుష్య శవం ఉంది. కొద్ది దూరంలో మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ శవాన్ని తినేందుకు నక్క ముందుగా శవం చేతులను సమీపించింది. ఆ మహర్షికి అంతరాయం కలిగి కన్నులు తెరిచి చూశాడు. వెంటనే దివ్యదృష్టితో చనిపోయిన ఆ వ్యక్తిని గురించి తెలుసుకున్నాడు. నక్కను ఉద్దేశించి " ఈతని చేతులు ఎన్నడూ దానం చేసి ఎరుగవు, కనుక వాటిని తినకూడదు" అన్నాడు. అప్పుడా నక్క చేతులను వదిలి చెవులను తినబోగా, "ఈ చెవులు ఏనాడు ధర్మశాస్త్రాలు గాని, ఆత్మజ్ఞానానికి సంబంధించిన అంశాలను గాని వినలేదు. కాబట్టి చెవులు ముట్టతగినవి కావు" అని అన్నాడు. అప్పుడా నక్క కళ్ళను తినబోయింది. "ఈ నేత్రాలెన్నడు సాధువులను దర్శించినవి కావు, కనుక తినరాదని" అన్నాడు. అప్పుడా నక్క కాళ్ళను తిందామనుకుంది. అది గ్రహించి, ఆ కాళ్ళు ఏనాడు మానవులను భవసాగరమునుంచి తరింప సజ్జలను, తీర్ధాలను దర్శించి ఎరుగవు కావున తినడానికి తగినవి కావని అన్నాడు. మృతుడి ఉదరం అన్యాయార్జితంతో పెరిగింది కాబట్టి అదీ తినకూడదేనని ముని చెప్పాడు. అప్పుడా నక్క కనీసం తలనైనా తిని పొట్ట నింపుకొందామనుకుంది. బతికి ఉండగా ఇతగాడి తల గర్వంతో మిడిసిపడుతుండేది, అదీ తినేందుకు తగింది కాదని మహర్షి వారించాడు!
ఈ కధ ద్వారా మనం గ్రహించవలసినది ఇది.
సత్యవాది, ధర్మాత్ముడు, సదాచారశీలి, సౌశీల్యమూర్తిగా మనిషి మెలిగితేనే మానవధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తించినట్లు.

Wednesday, 25 December 2013

నవ నారసింహక్షేత్రం

Pathaneni Joga Rao
నవ నారసింహక్షేత్రం

Information on sri Ahobila nava narasimha kshetram nava narasimha temple in ahobila in india

ఆంధ్ర దేశం లోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65 కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్ర కృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

ఎగువ అహోబిల రాజ గోపురం స్థలపురాణం:: ఇందుగల డందు లేడని సందేహము వలదని, హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది. ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్ల తోచీల్చి సంహరించిన సమయం లో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు ----
"అహోవీర్య అహోశౌర్య అహోబహుపరాక్రమః !
నారసింహ పరః దైవం ఆహోబిలః ఆహోబిలః !!"
అని కీర్తించారట. అప్పటి నుంచి ఈ క్షేత్రం” అహోబలం “అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలం లోని గుహ లో స్వయం భువు గా వెలసిన ఉగ్ర నర సింహు ని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యాను భూతికి లో నైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో! బిలం , అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం. హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపం తో నరసింహుడు అరణ్యం లో గర్జిస్తూ, క్ష్వేళిస్తూ,పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయన లో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవ నారసింహ రూపాలని భావించబడుతోంది.

ఎగువ అహోబిలం స్వామి వారి కళ్యణ మండపం::
వీర రసావతారరూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మి గా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించ వలసి వచ్చింది. ఆ సమయం లో ఆ చెంచెతకు స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యం తో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పు కుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మి గా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

రాజగోపుర దృశ్యం::
నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరం అరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు ను నరసింహ రూపుని గా దర్శన మీయ వేడుకున్నాడు. ఆనాడు గరుడునికి స్వామి సాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.
"జ్వాలాహోబిల మాలోల క్రోండ గరంజ్ భార్గవ !
యోగానంద చత్రవట పావన నవమూర్తయః !!''
జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నార సింహ అను తొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీద కొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లో లక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యై భక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు. నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడ వేరు వేరు గా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చు నన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.
ఆలయప్రత్యేకత :
శ్రీ భార్గవ నరసింహ స్వామి : దిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరం లో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే” అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థంలో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు. అందువలన ఈ అక్షయ తీర్థాన్నే''భార్గవ తీర్థమని” కూడ పిలుస్తారు.
శ్రీ యోగానంద నరసింహ స్వామి : వీరు దిగువ అహోబిలానికి తూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు. స్వామి ప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లను నేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నికగన్నది. కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తే స్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.
శ్రీ ఛత్రవట నరసింహస్వామి : ఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లో వట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలను అభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామి : నవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలు మతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.
శ్రీ వరాహ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నే క్రోడ నరసింహ స్వామి అని కూడ పిలుస్తారు.
శ్రీ మాలోల నరసింహస్వామి : ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మి మా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము .ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామి: ఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరం లో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని “ అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్ల తో చీల్చి, చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురు తాయి. కార్తీకమాసం లో నేతి దీపాన్ని స్వామి సన్నిథి లో వెలిగించి, ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమ తో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం “అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 6 కి. దూరం లో పావన నదీతీరాన ఈ స్వామి కొలువు తీరి ఉన్నాడు. నవ ఆల యాల్లో ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయన కే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీ కరంజ నరసింహస్వామి : ఎగువ అహోబిలానికి 1 కి మీ దూరం లో ఈస్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితం లో అభివృధ్ధి ని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయని చెపుతారు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి: ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథి కూడ ఉపాలయాలు గా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకు గల సంబంధాన్ని కూడ భక్తులు విశ్లేషించుకుంటున్నారు.
చారిత్రకప్రాధాన్యం : దిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయం తో అలరారుతుంటుంది. ముఖ మండపం , రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతులతో నయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాలమీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు ,వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువుతీరి కనువిందు చేస్తాయి.

ఈ శిల్పాకృతు లను చూస్తుంటే అహోబలం ! అహోబిలం!! అనడమేకాదు అహోశిల్పం !!! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైట కూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నం గా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వం గా దర్శించవచ్చు . కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహు నకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు ఈ ఆలయం లో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధి లో ఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవి తో తన కళ్యాణానికి ముందు లక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలం లో స్వామి ఉగ్రరూపుడై ఉండటం తో దిగువ అహోబిలం లో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తి గా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణం గా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం : ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరం లో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీనినుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీనిదర్శనం ,స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుక లో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.
"ఉగ్ర వీరః మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖః !
నృసింహః భీషణఃభద్రంమృత్యుమృత్యః నమామ్యహః !!"
అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు

ప్రహ్లాదమెట్టు: ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికి మధ్య లోని ఒక గుహ లో ప్రహ్లాదుని రూపం దర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొని యాడబడు తున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిలమఠం: ఆథ్యాత్మిక వికాసం కోసం ,వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్రశాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒకమఠం స్థాపించ బడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319 లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు.అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు.అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను ,దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యుని గా స్వీకరించాడు.

ఈ బాలుని కి సాక్షాత్తు స్వామియే యోగిరూపం లో వచ్చి,అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యుని గా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతి గా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యం లో వివిధ సేవా,అభివృద్ధి మత ప్రచార ,సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తం గా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ప్రత్యేక ఉత్సవాలు: ప్రతిసంవత్సరం ఫాల్గుమ మాసం లో బ్రహ్మోత్సవాలు, ప్రతినెల స్వాతి నక్షత్ర పర్వదినాన 108 కలశాల తో తిరుమంజన సేవ,గ్రామోత్సవం జరుగుతాయి. ఈ రోజుల్లో వేలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరై, స్వామిని సేవించుకుంటారు. నృసింహ జయంతి ఇచ్చట జరుగు గొప్పఉత్సవం గా పేర్కోనవచ్చు.
ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచు గా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో వారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.


వామాంకస్థితి జానకీ పరిలత్కోదండ దండం కరే
చక్రం చోర్థ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలహాతపత్రనయనం భద్రాద్రి మూర్థ్ని స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం!!!!
Anchoori Mallaiah గారి వివరణ..

(ఎడమతొడపై కూర్చున్న సీత సేవింప,శోభించుచున్న ధనువునొకచేతను,పై చేత చక్రమును,కుడిచేతులు రెంటియందు శంఖమును, బాణమును ధరించుచున్నట్టియు, పద్మపురేకులవంటి నేత్రములుగలిగినట్టియు, భద్రాచల శిఖరమందున్నటియు,భుజకీర్తులు మొదలగువానిచే అలంకరింపనట్టియు,నల్లనైన రఘురాజశ్రేస్ఠుడైనట్టియు రాముని సెవించుచున్నాను!!)

తపస్సు తప్పక చెయ్యాలి.


నైవాక్రుతిః ఫలతి, నైవశీలం, న కులం
విద్యాపినైవ, న చ యత్న క్రుతాపి సేవా
భాగ్యాని, పూర్వ తపసాఖులు సంచితాని
కాలేఫలంతి పురుషస్య యధైవ వుక్షాః
(నీతిశతకం-98)

పురుషునకు ఆకారం - అందమైన రూపంగాని, కులంగాని, శీలం - నడవడి కాని, విద్యగాని, ప్రయత్న పూర్వకంగా చేసిన సేవగాని ఫలాన్నివ్వలేవు. పురాక్రుతమైన అంటే పూర్వజన్మలో చేసికొన్న తపస్సువల్ల కలిగే భాగ్యమే వ్రుక్షాలు వాటి వాటి కాలంలో ఫలాలనిచ్చినట్లుగా ఫలాన్నిస్తుంది. కనుక తపస్సు తప్పక చెయ్యాలి. పనసాది వ్రుక్షాలు కాలంలో ఫలాలనిచ్చినట్లు, పూర్వపుణ్య సంచిత భాగ్యములు ఫలప్రదమౌతాయి.

नैवाक्रुतिः फलति, नैवशीलं, न कुलं
विद्यापिनैव, न च यत्न क्रुतापि सेवा
भाग्यानि, पूर्व तपसाखुलु संचितानि
कालेफलंति पुरुषस्य यधैव वुक्षाः
(नीतिशतकं-98)

Neither a handsome or a beautiful physical form nor caste nor character nor conduct or behaviour, nor education nor intended service will yield results. As trees offer fruits during their respective seasons, so also human beings receive fruits of their penance of past births. One should, therefore, do penance. As trees give fruits when due, so also the virtuous and righteous actions of last births will bear fruit in this life when ripe.

మూడు కోరికలు

మూడు కోరికలు

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. 

"అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్! 
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!

ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది....ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు.

By: వెంకట మధు -ప్రాచీన గాధా లహరి

మాటలవల్ల ఆర్థికలాభం,

జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీః జిహ్వాగ్రే మిత్రబాంధవాః |
జిహ్వాగ్రే బంధనం ప్రాప్తిః జిహ్వాగ్రే మరణం ధ్రువం ||

మాటలవల్ల ఆర్థికలాభం, మంచిమిత్రులు లభిస్తారు. అలాగే మాట మనిషిని బ్రతికిస్తుంది. ఆ మాటనే సద్వినియోగం చేసుకోలేకపోతే ఆ మనిషినే చంపుతుంది. జబ్బుతోయున్న రోగికి ఏం పరవాలేదు అన్న వైదుని మాటే దివ్యౌషధము. కష్టంలోయున్న మనిషికి ధైర్యం చెప్పేమాటలు ఊరట కలిగిస్తాయి.

जिह्वाग्रे वर्तते लक्ष्मीः जिह्वाग्रे मित्रबांधवाः ।
जिह्वाग्रे बंधनं प्राप्तिः जिह्वाग्रे मरणं ध्रुवं ॥

One is blessed by Goddess Lakshmi due to his sweet words and one becomes good to friends and relatives because of his endearing words. If one does not know how to speak politely, one invites death. An assuring word from a doctor saves the life of a patient. Consoling words to a suffering or one in difficulties will comforting that person.

Atmajyoti - ఆత్మజ్యోతి, డిశంబర్, 2013

షోడశ దానాలు:

షోడశ దానాలు:

దానాలన్నిటిలో ముఖ్యమైనవి షోడశదానాలు, అవి వరుసగా :: 

(1) కన్యా దానం = దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
(2) సువర్ణ దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
(3) దాసీజనం దానం = దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
(4) వాహన దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
(5) అశ్వ దానం = దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.
(6) గజ (ఏనుగు) దానం = దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.
(7) గ్రుహ దానం = తీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.
(8) నాగలి దానం = దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.
(9) కాలపురుష దానం = దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.
(10) కాలచక్ర ప్రతిమ = దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
(11) భూ దానం = దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.
(12) మేక దానం = దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.
(13) వ్రుషభ దానం = దీనివల్ల మ్రుత్యుంజయం కలుగుతుంది.
(14) పాన్పు దానం = దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.
(15) గో దానం = దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.
(16) నువ్వురాశి దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.

ఆత్మజ్యోతి, డిశంబర్, 2013

*దశ, షోడశ దానాలేవి?

గో, భూ, తిల, హిరణ్య, రత్న, విద్య , కన్యా దాది పదహారు దానాలు షోడశ దానాలు.
గో, భూ, తిల, హిరణ్య, ఆజ్య, వస్త్ర, ధాన్య , గుడ, రౌష్య, లవణ దానాలు దశ దానాలు.
మహాఋషులు, దేవతలు దశ,షోడశ దానాలలో అన్నదానాన్ని చేర్చలేదు. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం మహొన్నతమైనది.

Vasireddy Doondi Srinivas Chowdary

దానాలు దశదానాలని, షోడశ దానాలని రకరకాలుగా ఉంటాయి. దశదానాలంటే - గో, భూ, తిల, హిరణ్య, ఆఙ్య, వస్త్ర, ధాన్య, గుడ, రౌష్య, లవణ దానాలు. షోడశ దానాలంటే - గోదానము, భూదానము, తిల దానము, హిరణ్యదానము, రత్నదానము, విద్యాదానము, కన్యాదానము, దాసీదానము, శయ్యాదానము, గృహదానము, అగ్రహారదానము, రథదానము, గజదానము, అశ్వదానము, చాగదానము, మహిషిదానము.

- కె.బి.ఎస్‌. శర్మ, Andhra Prabha, 3 April 2013.

1 గోదానము, 2 భూదానము, 3 ధన దానము, 4 రత్న దానము, 5 గృహ దానము, 6 రథ దానము, 7 గజ దానము, 8 అశ్వ దానము, 9 కన్యా దానము, 10 విదా దానము, 11 వస్త్ర దానము, 12తిలా దానము, 13 హిరణ్య దానము, 14 రజత దానము, 15 శయ్యా దానము, 16 శయ్యా దానము.

పోతన తెలుగు భాగవతం

ఈలోకములొగాని , పరలోకములోగాని .. ఏమీ ఆశించకుండా ఉదారముగా ఇవ్వడాన్నే దానము అనాలి.

16 దానాల పేర్లు :

గావ (ఆవులు) దానము
సువర్ణ (బంగారము ) దానము
రజిత (వెండి) దానము
రత్నాని (నవరత్నాలలో ఏదోఒకటి లేదా అన్నీ) దానము
సరస్వతీ (పుస్తకం) దానము
ధాన్యము (ఏ ధాన్యమైనా సరే) దారము
పయస్వినీం (పాలిచ్చే శక్తి ఉన్న ఈనని గోవు) దానము
చత్రము (గొడుగు) దానము
గృహము (ఇల్లు) దానము
తిలా (నువ్వులు) దానము
కన్య (అల్లునికి వివాహంలో కూతురు) దానము
గజ (ఏనుగు) దానము
అశ్వ (గుర్రము) దానము
శయ్యా (మంచం, దుప్పటి, దిండు) దానము
వస్త్రము (బట్టలు) దానము
మహి (భూమి) దానము

seshagirirao_vandana@yahoo.com

హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.

తప్పక చదవండి........(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) హనుమాన్ చాలీసాలో చెప్పిందే నాసా స్పష్టం చేసింది.ఇక్కడే మన మహర్షుల మహాత్యం తెలుస్తింది.ఈ క్రింది విషయం పరిశీలంచండి. హనుమాన్ చాలీసాలో ... "యుగ సహస్ర యోజన పర భాను, లీల్యో తాహి మధుర ఫల జాను" హనుమాన్ చాలీసా వచ్చిన అందరికీ పైన చెప్పిన పంక్తులు తెలుసు. పై పంక్తులకి అర్ధాన్ని ఒకసారి తెల్సుకుందాం. భాను అంటే సూర్యుడు.యుగ సహస్ర యోజన అంటే దూరాన్ని తెలియజేస్తుంది. లీల్యో తాహి మధుర ఫల జాను అంటే ..సూర్యుడిని లీలగా మధురమైన పండు అనుకున్నాడు బాల హనుమంతుడు. ఇక్కడ భూమికి సూర్యుడికి దూరాన్ని యుగ సహస్ర యోజన అన్నారు.ఈ దూరాన్ని విశ్లేషించుకుందాం. యుగ -12000 సంవత్సరాలు సహస్ర -1000 యోజనం- 8 మైళ్ళు యుగ X సహస్ర X యోజనం 12000X1000=12000000 12000000X8=96000000 మైళ్ళు ఈ మైళ్లను కిలోమీటర్లోకి మారిస్తే.... ఒక మైలు =1.6 కి .మీ. 96000000X1.6=153600000 ఇది భూమికీ సూర్యుడికి ఉన్న దూరం.(గూగుల్ లో చూడండి.149,600,000 సుమారు ) అని హనుమాన్చాలీసాలో తులసీదాసు ఏ విధంగా చెప్పగలిగాడో నాసా వారికి అంతుచిక్కడం లేదు. ఎటువంటి టెలిస్కోపులు ఆధునిక పరికరాలు లేకుండా మన మహర్షులు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగాలిగారో ఆలోచించండి. కేవలం వాళ్ళ తప్పశ్శక్తి, జ్ఞ్యాన నేత్రంతో చూడగలిగారు. హిందూమతం గొప్పతనం అది. మీకు నచ్చితే షేర్ చేయండి.మీ అభిప్రాయం చెప్పండి. జై హింద్

Tuesday, 24 December 2013

తీర్ధయాత్రల మహిమలు


భక్తి సమాచారం
 • తీర్ధయాత్రల మహిమలు
  ఇంద్రియాలను త్రికరణ శుద్ధిగా పెట్టున్న వారు, దృఢమైన మనసు కలిగిన వారు, అహంకారం లేని వారు, ఇతరు ల నుండి ఏమీ ఆశించని వారు మితభోజనం చేసేవారు, ఎల్లప్పుడూ సత్యం పలికే వారు, శాంత స్వభావం కలిగిన వారు తీర్ధయాత్రలు చేసిన వారు ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. మలిన మనస్కులు, పాపాత్ములు ఎ న్ని తీర్ధాలు చేసినా ఫలితం శూన్యం.దానధర్మాలు చేయని వారు తాము చేసిన అపరాధం వలన దరిద్రులు ఔతా రు.అలాంటి వారు దరిద్రులు యజ్ఞములు చేయ లేరు.కనుక పుణ్య తీర్ధములు చేసి పుణ్యం పొందవచ్చు.
  సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్ధం ప్రశిద్ధమైంది. దానిలో స్నానమాచరించిన పది అశ్వ మేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పష్కరంలో పది సంవత్సరాలు నివసిం చిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్ధంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసి న ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యంయ యాతిపతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్ధం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నా నం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది.
  వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నా నం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్ధంలో శివుని పూ జించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివిని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్ధం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్ధంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది.
  శివుడు నివసించే దేవికాక్షేత్రాన్ని , కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్గసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భే ద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్ధం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్ర కోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్ధం, పుష్కర తీర్ధం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు.
  కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉన్నది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది. విష్ణు స్థానంలో విష్ణు మూర్తిని పూజించినా, పారిప్లవ తీ ర్ధంలో, శాలుకినీ తీర్ధంలో, సర్పతీర్ధంలో, వరాహతీర్ధంలో, అశ్వినీ తీర్ధంలో, జయంతిలో ఉండే సోమతీర్ధంలో, కృత శౌచ తీర్ధంలో స్నానమాచరించిన ఎంతో పుణ్య ప్రాప్తి కలుగుతుంది.
  అగ్నివట క్షేత్రంలో, ముంజవట క్షేత్రంలో శివారాధన చేసినా యక్షిణీ తీర్ధంలో స్నానం చేసినా కామ్యసిద్ధి కలుగుతుంది. జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజుల ను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచ కం పవిత్రత సంతరించుకోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతు న్నా యి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది.
  కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్ధం, కపిల తీర్ధం, సూర్యతీర్ధం, గోభనం, శంఖినీ తీర్ధం, యక్షేంద్రతీర్ధం, సరస్వతీ నది, మాతృ తీర్ధం, బ్రహ్మావర్తం, శరవ ణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్ధం, ఆపగ నదీ తీర్ధం, సప్తఋషి కుం డం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలా స్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి .
  నారద నిర్మిత అంబాజన్మం అనే తీర్ధంలో చనిపోతే పుణ్య లోకాలకు పోతారు.పుండరీకం అనే తీర్ధంలో ఉన్న వైతరణిలో స్నానమాడినా, ఫలకీ వనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీనది, దృషద్వతీ నదీ సంగమంలో సమస్త పాపాలు నశిస్తాయి. కిందర్త తీర్ధంలో తిలోదానం చేస్తే పితృ ఋణం తీరితుంది. అహస్సు, సు దినం, అనే తీర్ధాలలో స్నామాచరిస్తే సూర్య లోక ప్రాప్తి కలుగుతుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగా స్నాన మాచరించి శివుని ఆరాధించిన అశ్వమేధ ఫలం కలు గుతుంది. వామన తీర్ధంలో స్నానం చేస్తే విష్ణు లోకానికి పో తారు. పావన తీర్ధంలో స్నానమాచరించిన వంశం పవిత్ర మౌ తుంది. శ్రీకుంజంలో తీర్ధాన్ని దర్శిస్తే బ్రహ్మలోకం సి ద్ధిస్తుంది. సప్తసారస్వతాలు అనే తీర్ధంలో స్నానంచేస్తే సమగ్ర సారస్వతప్రాప్తి కలుగుతుం ది. ఔశనశం, కపాల మో చనం, విశ్వా మిత్రం, కార్తికేయం అనే తీర్ధాలలో స్నానమాచరిస్తే పాప విముక్తులౌతారు. పృధూక తీర్ధంలో చనిపోతే పాపాల నుండి విముక్తులౌతారు.
  గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్ధంలో స్నానం చేస్తే సర్వదు॰ఖ విముక్తి కలుగుతుం ది. స్వస్తి పురం అనే తీర్ధం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఏకరాత్రం అనే తీర్ధంలో ఉపవాసం చేస్తే స్త్యలోకం సిద్ధిస్తుంది. ఆ దిత్యాశ్రమంలో సూర్య్డిని ఆరాధిస్తే సూర్యలోక ప్రాప్తి కలుగు తుంది. దధీచి తీర్ధంలో మూడురాత్రులు నివసిస్తే ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. స్యర్యగ్రహణ సమయంలో సన్ని హిత తీర్ధంలోస్నానం చేస్తే నూరు అశ్వమేధాలు చేసిన ఫలం పొందు తారు. ధర్మతీర్ధంలో స్నానం చేస్తే ధర్మాచరణ కలుగుతుంది. జ్ఞానపావనం, సౌగంధికం అనే తీర్ధాలలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి.సరస్వతీ హ్రదం నుం డి వచ్చే జలంలో స్నానం చేస్తే అశ్వమేధయాగమ్ ఛెశీణా ఫాళామ్ వ్స్తుంది. శాకంబరీ తీర్ధంలో ఒక రోజు శాకాహార తపస్సు చేస్తే పణ్యం లభిస్తుంది. ధూమావతీ, రధావర్తం అనే తీర్ధాలలో స్నానం చేస్తే దు॰ఖం నుండి విముక్తు లౌ తారు.

Monday, 23 December 2013

గౌతముడి ఏనుగు


భక్తి సమాచారం 

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు "తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు" అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు "నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు" అని అన్నాడు. "రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు" అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు "మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?" అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు "పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని" అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: "నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను."

గౌతముడు: "సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు."
ధృతరాష్ట్రుడు: "అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను."

గౌతముడు: "అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?"
ధృతరాష్ట్రుడు: "అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?"

గౌతముడు: "పోని పవిత్రమైన మేరువనానికి రా!"
ధృతరాష్ట్రుడు: "సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు."

గౌతముడు: "విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ"
ధృతరాష్ట్రుడు: "సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు."

గౌతముడు: "అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!"
ధృతరాష్ట్రుడు: "కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు."

గౌతముడు: "అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?"
ధృతరాష్ట్రుడు: "దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు."

గౌతముడు: "సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు."
ధృతరాష్ట్రుడు: "అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు."

గౌతముడు: "పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?"
ధృతరాష్ట్రుడు: "అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు."

గౌతముడు: "దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము."
ధృతరాష్ట్రుడు: "శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను."

గౌతముడు: "ప్రజాపత్య లోకానికి వెళదాము."
ధృతరాష్ట్రుడు: "అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది."

గౌతముడు: "గోలోకం?"
ధృతరాష్ట్రుడు: "తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?"

గౌతముడు: "సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!"
ధృతరాష్ట్రుడు: "అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు."

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు "మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?" అని పాదాభివందనము చేశాడు గౌతముడు. "అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి" అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

ఈ కథలోని నీతి

ఏ పుణ్యకార్యములు మనము చేయవలెనో తద్వారా ఏ ఏ పాపకార్యములు మనము చేయకూడదో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించినాడు. (ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు. అంటే మానవుడు. కాబట్టి మావనుడు ఏ పుణ్యకార్యాలు చేయాలో మనకు ఈ కథలో తెలిసింది) కానీ అందఱూ అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగములో అశ్వమేధ రాజసూయ యాగములు చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందఱూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చేయాలి: తల్లిదండ్రుల సేవ, అతిథిసేవ, సత్యం, భూతదయ, గీతనృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య పాతివ్రత్యాది వ్రతములు.

ద్వాదశ జ్యోతిర్లింగాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుణ్యక్షేత్రముల పేర్లు..

Nerella Raja Sekhar
ద్వాదశ జ్యోతిర్లింగాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుణ్యక్షేత్రముల పేర్లు..

1.సోమనాథుడు - - విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్>> (పొగడ మొక్క).

2.మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్>> (తెల్ల జిల్లేడు మొక్క).

3.మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్>>. (ఆకాశమల్లి మొక్క).

4.ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరము, మధ్య ప్రదేశ్>>> (సంపంగి మొక్క).

5.వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్>> (గరిక లేక రుద్రాక్ష మొక్క).

6.భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనె వద్ద, మహారాష్ట్ర>>> ( నల్లకలువ మొక్క).

7.రామేశ్వరుడు - రామేశ్వరము, తమిళనాడు>> (మల్లె మొక్క).

8.నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనము) ద్వారక వద్ద, మహారాష్ట్ర>> (గోరింట మొక్క).

9.విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్>>> (మారేడు మొక్క).

10.త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర>>> (మరువము మొక్క).

11.కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్>>> (తుమ్మి మొక్క).

12.ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర>>> (గన్నేరు మొక్క).
ద్వాదశ జ్యోతిర్లింగాల వనంలో ఉండాల్సిన 12 మొక్కలకు సంబంధించిన పుణ్యక్షేత్రముల పేర్లు..

1.సోమనాథుడు - - విరవల్ రేవు, ప్రభాస్ పట్టణము, సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్>> (పొగడ మొక్క).

2.మల్లికార్జునుడు - శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్>>  (తెల్ల జిల్లేడు మొక్క).

3.మహాకాళుడు - (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్>>. (ఆకాశమల్లి మొక్క).

4.ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు - మామలేశ్వరము, మధ్య ప్రదేశ్>>>  (సంపంగి మొక్క).

5.వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) - పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్>> (గరిక లేక రుద్రాక్ష మొక్క).

6.భీమశంకరుడు - డాకిని, భువనగిరి జిల్లా, పూనె వద్ద, మహారాష్ట్ర>>> ( నల్లకలువ మొక్క).

7.రామేశ్వరుడు - రామేశ్వరము, తమిళనాడు>>  (మల్లె మొక్క).

8.నాగేశ్వరుడు (నాగనాథుడు)- (దారుకావనము) ద్వారక వద్ద, మహారాష్ట్ర>> (గోరింట మొక్క).

9.విశ్వనాథుడు - వారణాసి, ఉత్తరప్రదేశ్>>>  (మారేడు మొక్క).

10.త్రయంబకేశ్వరుడు - నాసిక్, మహారాష్ట్ర>>>  (మరువము మొక్క).

11.కేదారేశ్వరుడు - హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్>>>  (తుమ్మి మొక్క).

12.ఘృష్ణేశ్వరుడు (కుసుమేశ్వరుడు) - వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర>>> (గన్నేరు మొక్క).

Sunday, 22 December 2013

శాస్త్రమే ప్రమాణము తప్ప ఇతరములు కావు.

Thotapalli Sridhar Sarma

మన భారతీయ సంప్రదాయాలు
కలియుగంలో జనులు మంద బుద్ధులు, పరధర్మాసక్తతాపరులు, రోగపీడితులు, పాఖండులు (ఇది తిట్టుకాదు పా అంటే వేదం దాన్ని ఖండించేవారు పాఖండులు అని అర్థం) వగైరా వగైరా కలి ప్రభావ పూరితమైన మనస్తత్వం కలిగి ఉంటారని వ్యాసోక్తి. వ్యాస మహర్షి ఎంతో త్యాగ బుద్ధితో, జనులను ధర్మమార్గంలో ఉంచడానికి ఇచ్చిన వేదవిహితమైన వాఙ్మయం మనకి ప్రమాణం. గీతలో శ్రీ కృష్ణుడే చెప్తారు "తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ! జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!" తస్మాత్= కావున, కార్య+అకార్య వ్యవస్థితౌ = కార్యము చేయవలెనా చేయవద్దా అని నిర్ణయించవలసినప్పుడు, శాస్త్రం=శాస్త్రము తే ప్రమాణం=నీకు ప్రమాణం (అనుమాన నివృత్తి చేయదగలిగినది, ఆధారపడవలసినది) ఇహ శాస్త్రవిధానోక్తం=ఈ విధంగా చేయొచ్చా లేదా అన్న శాస్త్రవిధిని బట్టి కర్మకర్తుఁ=స్వకర్మను చేయడానికి అర్హసి = అర్హుడవౌదువు అని స్వయం విష్ణుమూర్తి సంపూర్ణ అవతారమైన శ్రీ కృష్ణపరమాత్మ బోధ. అంటే శాస్త్రమే ప్రమాణము తప్ప ఇతరములు కావు. శ్రీ కృష్ణుడికి దణ్ణం పెడతాం కానీ ఆయన చెప్పింది ప్రమాణం కాదంటే?

ఈ శాస్త్రములేవి అంటే అవి పధ్నాలుగు ఉన్నాయి అని చెప్పబడింది. ఈ పధ్నాలుగింటినీ ధర్మస్థానములు అంటారు
వేదములు - 4
1)ఋగ్వేదము 2) యజుర్వేదము 3)సామవేదము 4)అథర్వవేదము
వేదాంగములు 6
1)శిక్ష 2)కల్పము 3)జ్యోతిషము 4)వ్యాకరణము 5)నిరుక్తము 6)ఛందస్సు
ఇతరశాస్త్రములు
1)పురాణాములు 2) న్యాయము 3) మీమాంస 4) ధర్మ శాస్త్రములు
మొత్తం 14

సనాతన ధర్మంలో చరించే వారెవరైనా వీనిని తెలుసుకొని వాటికణుగుణంగా చరించవలసి ఉంటుంది. ఇవే ప్రమాణములు. తరవాతి పరంపరలో వచ్చినవారెవరైనా ఇవే తిరిగి తిరిగి తిప్పి తిప్పి చెప్పగలరు కానీ అవైదికాన్ని చెప్పరు కదా! అలా చెప్తే వైదిక ధర్మమెలా అవుతుంది!

తెలియక చేసినా! తెలిసి చేసిన దోషం దోషమే!

Mandavilli Durga
తెలియక చేసినా! తెలిసి చేసిన దోషం దోషమే!

నృగుడు అనే మహారాజు సర్వం భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఇతను దానధర్మాలు అనేకం చేసిన పుణ్యాత్ముడు. అడిగిన వారికి లేదు అనకుండా దానం చేశాడు. ఈయన చేసిన దానాలు ఎవడూ లెక్కకట్టలేనన్ని ఉన్నాయి. ఈయన చేసిన దానలకి మెచ్చి కుబేరుడే ఈయనదగ్గర కొలువున్నాడు. లక్ష్మి ఎల్లప్పుడూ ఈయన దగ్గరే ఉండేది. వందలు, వేలు, లక్షలు గోవులను దానం చేశాడు. ఒకవేళ లేకపోతే కొనుక్కొచ్చి మరీ దానం చేసేవాడు. ఈ నృగ మహారాజు దానధర్మాల వలన సంపదలు వచ్చి పడిపోతూ ఉండేవి.
అలా ఎవరూ చేయలేనన్ని లెక్కలేనన్ని దానాలు చేశాడు. దేవతలు సైతం మెచ్చుకునేవారు. ఈయన పేరు ముల్లోకాలలో మారుమ్రోగి పోయింది. అంతటి మహా పురుషుడు. కాని ఒకసారి ఒక విప్రునికి గోవు దానమిచ్చాడు. అది 4, 5 రోజులకి మళ్లి వచ్చి రాజుగారి మందలో కలిసిపోయింది. ఈవిషయాన్ని గమనించని రాజుగారు! అదే గోవుని మరో విప్రుడికి దానమిచ్చాడు. ఆగోవును తీసుకెళుతుంటే, గోవుని పోగొట్టుకున్న విప్రుడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈయన్ని చూశాడు. ఈయనతోబాటు తీసుకెలుతున్న గోవుని చూసాడు. దీనితో మొదటి విప్రుడికి కోపం వచ్చి! నీకు బుద్దివుందా! సాటి విప్రుడి గోవుని దొంగతనం చేయడానికి మనస్సు ఎలా వచ్చింది. అనగానే గోవుని తీసుకెలుతున్న విప్రుడు ఆమాటలకి భాధపడి నేను దొంగతనం చేయడమేమిటి? రాజుగారు నాకు దానమిచ్చారు. తీసుకెళ్తున్నాను. కావాలంటే పద రాజుగారి దగ్గరే తెల్చుకుందాం అని రాజుగారి దగ్గరికి వెళ్లి విషయాన్ని వివరించారు. మొదటి విప్రుడు ఐతే ఏకంగా రాజుగారిని తిట్టేశాడు. నీకసలు కొద్దిగైన బుద్ది, జ్ఞానం ఉన్నాయా? నాకు దానమిచ్చిన గోవుని తీసుకొచ్చి ఇంకొకడికి దానమిస్తావా? చూడు నిన్ను ఇప్పుడే శపిస్తున్నాను అనేసరికి రాజుగారు ఒణికిపోయి! బ్రాహ్మణోత్తమా శాంతించండి. మీరు కోపగిస్తే ఎవరైనా బ్రతకగాలరా? దేవతలు సైతం గౌరవించే ఉత్తములు మీరు. శాంతించండి అని రెండోసారి దానమిచ్చిన విప్రుడిని! బ్రాహ్మణోత్తమా నీకు 1000గోవులు దానమిస్తాను. ఈగొవుని ఇచ్చేయి అన్నాడు. నేను ఇవ్వనంటే ఇవ్వను. ఎందుకంటే వీడు నన్ను అనవసరంగా నిందించాడు. లేకపోతె ఇచ్చేవాడినే అన్నాడు. మళ్లి మొదటి విప్రుడు దగ్గరికి వెళ్లి! నీకు రాజ్యం అంతా ఇచ్చేసి నేను అడవికి వెళ్ళిపోతాను. ఆగోవుని వదిలెయ్యండి అన్నాడు. ఆయనకూడా! కుదరదు. ఈగొవు కామధేనువు తో సమానం. అన్ని ఆవులు 5లీటర్లు పాలిస్తే ఇది 10లీటర్లు ఇస్తుంది కాబట్టి నేను వదులుకోను అని మొండి పట్టు పట్టారు ఇద్దరు బ్రాహ్మణులు. ఏమిచేయాలో తోచక ఇద్దరినీ బ్రతిమాలాడు. కాదంటే కాదు అని ఇద్దరు గోవుని వదిలేసి వెళ్లారు.

కొన్నాళ్ళు గడిచింది. కాలక్రమంలో రాజుగారు మరణించారు. ఈయన చేసిన దానాల పుణ్యం వలన స్వయంగా తీసుకెళ్ళడానికి యముడే వాహనం మీద వచ్చాడు. వాహనం మీద ఎక్కించుకుని తీసుకెళుతూ! మహానుభావా! నిన్ను దర్శించడం చాల సంతోషంగా ఉంది. నువ్వు చేసిన దానాలు, ధర్మాలు, ప్రజలని కన్నబిడ్డల్లా చూసుకున్న తీరు అద్భుతం. నీతో సరితుగేవాడు ముల్లోకాలలో లేడు. కాకపోతే విప్రులకి ఇచ్చిన దానం తిరిగి తీసుకోవడం అనే చిన్న దోషం వలన నీకు నరకం ప్రాప్తించింది. కనుక ముందుగా నరకానికి వెళతావ? స్వర్గానికి వెళతావా? ఇది కూడా నీవు చేసిన పుణ్యం ఫలితంగా అడుగుతున్న అవకాశమే గాని మరొక అవకాశం కాదు. సామాన్యంగా పాపులకి అవకాశం ఉండదు. కనుక ఆలోచించుకుని చెప్పమన్నాడు.

అప్పుడు నృగ మహారాజు! ముందు సుఖం అనుభవిస్తే కష్టం అనుభవించడం కష్టం కనుక ముందు నరకమే అనుభవిస్తాను అన్నాడు.
యమధర్మరాజు! సరే నరకానికి పో అని గెంటేశాడు. ఈనరక శిక్ష ఎప్పుడు తొలగుతుంది చెప్పండి అన్నాడు. ఇది కృతయుగ మధ్యమం. మధ్యలో త్రేతాయుగం వెళ్లి, ద్వాపర కలియుగ సంధి కాలం వస్తుంది. అప్పుడు విష్ణువు తానె స్వయంగా శ్రీకృష్ణ అవతారం దాల్చి, భావిలో తొండ రూపంలో కొండలా ఉన్న నిన్ను ఎడమ చేతితో తీసి భూమిపై పడేస్తాడు. అప్పుడు నీ శిక్ష తొలగి స్వర్గానికి వెళతావు అని పంపించాడు.
యమధర్మరాజు చెప్పినట్టే తొండగా మారి ద్వారకా నగరంలో ఒక భావిలో కప్పల్ని, పురుగుల్ని తింటూ ఉంటాడు. అలా దాదాపుగా 30 లక్షల సంవత్సరాలు నరకం అనుభవించిన తరువాత శ్రీకృష్ణుడి కుమారులు బంతి ఆట ఆడుకుంటుంటే ఆబంతి వెళ్లి ఈభావిలొ పడుతుంది. పిల్లలు బంతికోసం ఈబావిలొ చుస్తే తొండ కనబడుతుంది. ఇది బావిలో ఉంటె నీళ్ళు పాడౌతాయని దీన్ని బయటికి తీయడానికి తాడు కట్టి లాగుతారు. ఎంతలాగిన కొండలా కదలదు. వందలమంది వచ్చి లాగుతారు. అయిన కదలదు. కృష్ణుడు వీరిని చూసి తనే స్వయంగా వచ్చి ఎడమచేతితో బావిలో నుండి తీసి బయటపడేస్తాడు. ఆతొండ మానవరూపం ధరించి జరిగిన విషయాన్ని చెప్పి విమానం ఎక్కి స్వర్గనికీ వెళ్ళిపోతాడు.

కనుక మనం చేసే ప్రతి చిన్న తప్పు లెక్కలోకే వస్తుంది. రోజూ అన్నం, కూడా వండుకుంటున్నాం కదా అని ఆ మంటలో వేలు పెడితే తోలు ఊడుతుంది. కనుక మనకి నిర్దేశించిన పనులు చేయాల్సిందే. తెలిసికాని తెలియక గాని తప్పులు చేయకండి. శాస్త్రాలని, మీ ఇంటి ఆచారాల్ని తప్పని సరిగా అనుసరించండి.

Saturday, 21 December 2013

ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.

Nerella Raja Sekhar


ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.

సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు,జిల్లేడు పూలు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.

చంద్ర గ్రహ దోషము తొలగుటకు: గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మోదుగ చెక్క,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.

కుజ గ్రహ దోషము: మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.

బుధ గ్రహ దోషము: ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

గురు గ్రహదోషమునకు: మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

శుక్ర గ్రహదోషము: యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

శని గ్రహ దోషము: నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

రాహు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.

కేతు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.

బాలముకుందాష్టకం

- బాలముకుందాష్టకం

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ |
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || ౧ ||

సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి || ౨ ||

ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మమ్ |
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి || ౩ ||

లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిమ్ |
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౪ ||

శిక్యే నిధాయాద్యపయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయామ్ |
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి || ౫ ||

కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగేనటనప్రియంతమ్ |
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౬ ||

ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలమ్ |
ఉత్ఫుల్లపద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి || ౭ ||

ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షమ్ |
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి || ౮ ||

Wednesday, 18 December 2013

కాకి - హంస-శ్రీ మహాభారతంలో కథలు

కాకి - హంస-శ్రీ మహాభారతంలో కథలు

పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి పట్టణంలో ఒక వర్తకుడుండేవాడు. చాలా మంచివాడు. గొప్ప భాగ్యవంతుడు. ఓ రోజు ఒక కాకి అతని పంచన చేరింది. అతని కొడుకులు దానికి ఎంగిలి మెతుకులు పెట్టి పెంచారు. అది బాగా బలిసి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూండేది.

ఒకనాడు సముద్రతీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షులు కంటే బలమైనదానివి నువ్వు! ఆ హంసల కంటె ఎత్తు ఎగరాలి. సరేనా" అన్నారు వర్తకుని పిల్లలు.

ఎంగిళ్ళు తిని బలిసిన ఆ వాయసం తారతమ్యజ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి.

"మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరియైన కాకులు లోకంలో ఉన్నట్లు ఎప్పుడైనా,ఎక్కడైనా విన్నావా?" అన్నాయి.

"నూటొక్క గతులలో పరుగెత్తడం చేతనౌను నాకు! ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనాలు వెళ్తాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం - కావాలంటే పందెం కాద్దాం" అంది కాకి.

"ఆ గతులూ గమనాలూ మాకు తెలీదు! మామూలుగా సముద్రం మీద నిటారుగా ఎగురుదాం. మేమంతా రావటం వృథా. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

అనటమే తడవు ఒక హంస గుంపులోంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్ళింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతూంటే కాకి దానికి తన విన్యాసాలను చూపిస్తోంది. హంసను దాటిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి ఎగతాళిగా పిలవడం, ముక్కుమీద ముక్కు మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది రాయంచ. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమొహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. 'అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ, లతలూ ఏవి లేవిక్కడ. ఈ సముద్రంలో పడితే మరణమే గతి' అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది కాకి.

అది చూసి హంస "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేం వాయసరాజమా?" అంది.

కాకి సిగ్గుపడింది.

అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. "ఎంగిళ్లు తిని గర్వంతో కన్నూ మిన్నూ గానక నా కెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతుల్నయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిపుడు తెలిసివచ్చింది. నా యందు దయచూపి నన్ను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడి హంస తన కాళ్లతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది.

"ఇంకెప్పుడూ గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి, ఎగిరిపోయింది రాజహంస.

కాకి లెంపలేసుకుంది.

"అలాగే - వైశ్యపుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా!! హెచ్చులకు పోకు" అని యుద్ధభూమిలో డాంబికాలు పలుకుతున్న కర్ణుడికి హితవు చెప్పాడు శల్యుడు.

Tuesday, 17 December 2013

గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి.గోవులకు అధిష్టాన దేవత సురభీదేవి. కామధేను శక్తియైన లక్ష్మీ స్వరూపం ఈ గోమాత. 'శ్రీసురభ్యైనమః' అనే మంత్రాన్ని జపించి, పై స్తోత్రాన్ని గోసన్నిధిలో పఠిస్తే, అభీష్టసిద్ధులు, ఆయురారోగ్యైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. జ్ఞానము, కీర్తి, ధనము, క్షేమము ప్రసాదించే మహిమ గల స్తుతి ఇది. (దేవీ భాగవతం)

లక్ష్మీ స్వరూపం పరమాం రాధాసహచరీం పరాం!
గనామధిష్ఠతృ దేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్ !!
పవిత్ర రూపాం పూతాం చ భక్తానాం సర్వ కామదాం !
యయా పూతం సర్వ విశ్వం తాం దేవీం సురభిం భజే !!

********************************
నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనమః !
గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదంబికే !!

నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమోనమః !
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమోనమః !!

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే !
క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమోనమః !!

శుభాయై చ సుభద్రాయై గోప్రదాయై నమోనమః !
యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమోనమః !!

Saturday, 14 December 2013

'హనుమద్ర్వతం'

ఈ రోజు 'హనుమద్ర్వతం' ఆచరించటానికి పవిత్రమైన రోజు.
కేవల స్మరణమాత్రాన బుద్ధి, బలం, ధైర్యం, యశస్సు, వాక్పటిమ ప్రసాదించే ఆంజనేయస్వామిని పూజించడం వల్ల సర్వభయాలు నశిస్తాయని గ్రహ, పిశాచ పీడలు దరి చేరవని, మానసిక వ్యాధులు తొలగిపోతాయని అనాదికాలం నుంచి విశ్వాసం. అటువంటి ఆంజనేయమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతం 'హనుమద్ర్వతం'. మార్గశిర మాసంలో శుక్ల పక్ష త్రయోదశినాడు ఈ వ్రతం ఆచరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
పూజామందిరంలో బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటుచేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధం, సింధూరం, పుష్పాలతో అలంకరించాలి. కలశం ముందర స్వామివారి చిన్న విగ్రహాన్ని గానీ, చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకుని కలశంలోనికి స్వామివారిని ఆవాహన చేసుకుని వినాయక పూజ, పిమ్మట స్వామివారి పూజ ఆచరించాలి. షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గోధుమతో చేసిన భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించాలి. 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామివారి వద్ద ఉంచి పూజించి ధరించాలి. వ్రతకథా శ్రవణం చేయాలి. రాత్రి ఉపవాసం చేయాలి. తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకోవాలి. ఏడాది తరువాత కొత్త తోరం ధరించాలి. ఈ విధంగా 13 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. కనీసం ఒకసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వ్రతాచారణం వాళ్ళ సమస్యలు, కష్టాలు, తొలగిపోయి, సుఖశాంతులు, సౌభాగ్యం, జ్ఞానం లభిస్తాయని విశ్వాసం.
పాండవులు వనవాసంలో ఉండగా వ్యాసమహర్షి వారిని చూసేందుకు వెళతాడు. ధర్మరాజు తమ కష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశించమని ప్రార్ధిస్తాడు. అప్పుడాయన ఈ 'హనుమద్ర్వతాన్ని' ఆచరింపజేసినట్లు పురాణ కథనం. భీముడు, అర్జునుడు కూడా వేరువేరుగా ఈ వ్రతాన్ని ఆచరించి అజేయులయ్యారని చెబుతారు.
ఈ రోజు 'హనుమద్ర్వతం' ఆచరించటానికి పవిత్రమైన రోజు. 
కేవల స్మరణమాత్రాన బుద్ధి, బలం, ధైర్యం, యశస్సు, వాక్పటిమ ప్రసాదించే ఆంజనేయస్వామిని పూజించడం వల్ల సర్వభయాలు నశిస్తాయని గ్రహ, పిశాచ పీడలు దరి చేరవని, మానసిక వ్యాధులు తొలగిపోతాయని అనాదికాలం నుంచి విశ్వాసం. అటువంటి ఆంజనేయమూర్తిని ఆరాధిస్తూ చేసే వ్రతం 'హనుమద్ర్వతం'. మార్గశిర మాసంలో శుక్ల పక్ష త్రయోదశినాడు ఈ వ్రతం ఆచరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. 
పూజామందిరంలో బియ్యపు పిండితో అష్టదళ పద్మాన్ని చిత్రించి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పాటుచేసి దాన్ని పసుపు, కుంకుమ, గంధం, సింధూరం, పుష్పాలతో అలంకరించాలి. కలశం ముందర స్వామివారి చిన్న విగ్రహాన్ని గానీ, చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకుని కలశంలోనికి స్వామివారిని ఆవాహన చేసుకుని వినాయక పూజ, పిమ్మట స్వామివారి పూజ ఆచరించాలి. షోడశోపచారాలు, అష్టోత్తర శతనామాలతో పూజించాలి. గోధుమతో చేసిన భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించాలి. 13 పోగులు ఉన్న తోరాన్ని స్వామివారి వద్ద ఉంచి పూజించి ధరించాలి. వ్రతకథా శ్రవణం చేయాలి. రాత్రి ఉపవాసం చేయాలి. తోరాన్ని మరుసటి ఏడాది వరకు భద్రంగా ఉంచుకోవాలి. ఏడాది తరువాత కొత్త తోరం ధరించాలి. ఈ విధంగా 13 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. కనీసం ఒకసారైనా ఈ వ్రతం చేసుకుంటే మంచిదని ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ వ్రతాచారణం వాళ్ళ సమస్యలు, కష్టాలు, తొలగిపోయి, సుఖశాంతులు, సౌభాగ్యం, జ్ఞానం లభిస్తాయని విశ్వాసం. 
పాండవులు వనవాసంలో ఉండగా వ్యాసమహర్షి వారిని చూసేందుకు వెళతాడు. ధర్మరాజు తమ కష్టాలు తొలగిపోయే మార్గం ఉపదేశించమని ప్రార్ధిస్తాడు. అప్పుడాయన ఈ 'హనుమద్ర్వతాన్ని' ఆచరింపజేసినట్లు పురాణ కథనం. భీముడు, అర్జునుడు కూడా వేరువేరుగా ఈ వ్రతాన్ని ఆచరించి అజేయులయ్యారని చెబుతారు.

Sunday, 8 December 2013

కార్తికేయం

  శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం..

. దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం


 స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం...

  కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం.

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?

Nerella Raja Sekhar


స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?
స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి.


1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)

స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.

స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)

2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)

10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.

3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.

4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)

భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు. కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.

5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి.

Friday, 6 December 2013

శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం.

Bramhasri Samavedam Shanmukha Sarma
సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తు ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. గుడాకేశుడు విష్ణువు భక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది. సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర ! కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడూ లోక క్షేమమే కదా చేస్తాడు,.....లోకాస్సమస్తాస్సుఖినో భవంతు !!!!!!!
సాధారణంగా ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తు ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు. పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. గుడాకేశుడు విష్ణువు భక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది. సత్యనారాయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర ! కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ప్రసాదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కూడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివేదన చేసి మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణ పరబ్రహ్మం ఎప్పుడూ లోక క్షేమమే కదా చేస్తాడు,.....లోకాస్సమస్తాస్సుఖినో భవంతు !!!!!!!

Thursday, 5 December 2013

Nerella Raja Sekhar
మీ జీవితం దేనితో నిండిపోయినా, మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడు అవకాశం ఉంటుంది...


ఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తరగతి బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు. విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.

క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
తర్వాత ప్రొఫెసర్ ఓ పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు.

"నిండింది" అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.
అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాక మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల మధ్య ఉందే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.

ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.
నవ్వులు సర్దుమణిగాకా, ప్రొఫెసర్ ఇలా అన్నారు -
"ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి.
గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి - దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం, స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపత్రమైన అంశాలు! మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగానే ఉన్నట్లే.

గులక రాళ్ళు - మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి.
ఇసుక - అన్ని చోట్ల ఉండే చిన్న, చితక విషయాలు.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో చోటుండదు.
జీవితంలో కూడ ఇంతే -
ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన, ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.

సంతోషం కలిగించే వాటిపై దృష్టి నిలపండి.
మీ పిల్లలతో ఆడుకోండి.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయట డిన్నర్‌కి తీసుకెళ్ళండి.
మీ 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.
ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరుపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి. మిగిలేదంతా ఇసుకే" –

క్లాసంతా నిశ్శబ్దం.
ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యెత్తి, "మరి కాఫీ దేనికి ప్రతిరూపం?" అని అడిగాడు.
"శభాష్, ఈ ప్రశ్న అడింగందుకు నాకు సంతోషంగా ఉంది.
"మీ జీవితం దేనితో నిండిపోయినా, మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడు అవకాశం ఉంటుంది" అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు.