భక్తి సమాచారం
సర్వం శుభకరం కేదారేశ్వర వ్రతం

ఓం కేదారేశ్వరాయ నమః హరిహరాదులకు ప్రీతికరం, ఉత్తమమోత్తమం, అధిక ఫలదాయకం అయిన కార్తిక మాస వ్రత ప్రభావం అమూల్యం. ఎందరో భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలను, సమస్త భోగాలను పొంది సుఖశాంతులతో జీవించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. నెలరోజులపాటు ఈ వ్రతాన్ని పాటిస్తే కైవల్య ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు, కార్త్తిక శుద్ధ పౌర్ణమినాడు కేదారేశ్వర వ్రతమాచరిస్తే నెలరోజులపాటు వ్రతాన్ని చేసిన ఫలం దక్కుతుందని శివపురాణం చెబుతోంది.
వ్రత కథ: ఒకసారి పరమేశ్వరుడు సమస్త శివగణంతో కైలాసంలో పార్వతి మాతతో కలిసి ప్రమథగణాలు, భక్తులు చేసే నృత్యం తిలకిస్తున్నాడట. ఆ నృత్యంలో భృంగిరిటి అనే భక్తుడు తన్మయత్వంతో నృత్యం చేస్తుంటే చూసిన పరమశివుడు అమితానందం పొందాడట. ఇంతటి ఆనందాన్ని కలిగించిన ఆ పరమభక్తుడిని స్వామి అనుగ్రహించాడు. పరమేశ్వరుని అనుగ్రహ పాత్రుడినయ్యానని పరమానందంతో ఆ భక్తుడు మహాదేవునికి ప్రదక్షిణలు చేసి సెలవు తీసుకున్నాడట.
ఇదంతా గమనించిన భవాని మాత తనను వదిలి భృంగిరిటి తన పతి అయిన పరమేశ్వరుడి చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేశాడని మహాదేవుడిని అడిగిందట. దానికి పరమేశ్వరుడు యోగులకు తనవల్ల మాత్రమే ప్రయోజనం ఉందని, భవాని వల్ల ఏ ప్రయోజనం లేదని ఆ కారణంగానే అతను తన చుట్టూ ప్రదక్షిణ చేసాడని చెప్పాడట. దాంతో ఆగ్రహించిన పార్వతి మాత పరమేశ్వరుని దగ్గరున్న తన శక్తిని ఆకర్షిచిందట. పార్వతిమాత కూడా కళావిహీనురాలై అక్కడినుంచి అరణ్యాలకు వెళ్లిపోయింది. అలా అరణ్యంలో వెడుతూ గౌతమాశ్రమాన్ని చేరింది. గౌతముడు తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని కేదారేశ్వర వ్రతమాచరించమని, తిరిగి పతిపతులిద్దరు ఒక్కటవుతారని సూచించాడట. గౌతమ మహర్షి సూచన మేరకు పార్వతి మాత కేదారేశ్వర వ్రతమాచరించగా మహదేవుడు ప్రత్యక్షమై అమ్మవారికి తన శరీరంలో అర్ధ్భాగాన్ని ఇచ్చాడట. దాంతో పార్వతీమాత కేదారేశ్వర వ్రతం ఆచరించే భక్తుల ఇంట సిరులు పండాలని, శివుడ్ని కోరగా శివుడు అనుగ్రహించాడట. ఆనాటినుంచి కేదారేశ్వర వ్రత మహిమ వెలకట్టలేనిదన్నట్టుగా, ప్రజలు భక్తుల చేత నిర్వహించబడుతూ వస్తోంది.
కేదారేశ్వర వ్రత విధానం
ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి. శుచి, శుభ్రతలను పాటిస్తూ కేదారేశ్వరస్వామి వారికి ప్రీతిపాత్రమైన పదార్ధాలను తమ శక్తికొలదీ నివేదించాలి. మహాదేవుడికి ఇష్టమైన బిల్వ, రావి, గనే్నరు తదితర పత్రాలతో స్వామిని ఆరాధించాలి. ఈ వ్రతాన్ని జాతి, కుల, మత భేదం లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. శ్రీ కేదారేశ్వర స్వామి వారికి చేసే జప తపాల వల్ల పూజల వల్ల విశేషమైన పుణ్యఫలాలు దక్కుతాయని శివపురాణం చెబుతోంది.

భక్తి సమాచారం
ఏ శివ లింగాలకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం వుంటుంది?
జ్యోతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం వుంటుంది. అలాగే సిధ్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్టచేసిన లింగాలను పూజించినా మంచి ఫలితం వుంటుంది. స్వయంభూ లింగార్చన కూడా.

లింగాలలో అనేక రకాలు వున్నాయి. వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిధ్ధిస్తాయంటారు. అవేమిటో తెలుసుకుందామా?

వజ్ర లింగాన్ని పూజిస్తే ఆయుః వృధ్ధి, ముత్యం లింగాన్ని సేవించటం రోగ నాశకరం, పద్మరాగ లింగం లక్ష్మీ ప్రాప్తినిస్తుంది, పుష్యరాగం లింగాన్ని పూజిస్తే యశస్సు, నీలం లింగం ఆయుః వృధ్ధి, మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి, స్ఫటిక లింగార్చన సర్వకామనలనూ సిధ్ధింపచేస్తుంది. లోహ లింగ పూజ శతృనాశనాన్ని చేస్తుంది, ఇత్తడి లింగార్చన తేజస్సునిస్తుంది. గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది, వెన్న లింగం మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ధాన్యపు పిండితో చేసిన లింగార్చనవల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
ఇలా రక రకాల లింగార్చనలవల్ల రకరకాల ఫలితాలున్నాయి. రసలింగం, అంటే పాదరసం వున్న లింగానికి అభిషేకం చేసి ఆ తీర్ధం సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని ప్రసిధ్ధి. ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ తీర్ధాన్ని సేవించటంవల్ల కేన్సర్ వగైరా పెద్ద వ్యాధులు పోవటమే కాకుండా మానసిక చింతలు దూరమయి మనశ్శాంతి కలుగుతుంది.
పాదరస శివ లింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు వుండవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ఈ లింగం చిన్నగా వున్నా చాలా బరువుగా వుంటుంది. దీన్ని ఇంట్లో వుంచి కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు.

మన దేశంలో పాదరస శివలింగం వున్న ఒకే ఒక దేవాలయం ఉజ్జయినిలో సిధ్ధాశ్రమం. ఇక్కడి శివ లింగం బరువు సుమారి 1500 కిలో గ్రాములు. ఫ్రపంచంలో ఎక్కడా ఇటువంటి శివలింగం లేదంటారు. భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు. మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి వుంది. ఈ శివ లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని అక్కడివారి నమ్మకం.

భక్తి సమాచారం
విభూతి

విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.
హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్‌ తత్‌ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్‌' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్‌ సర్వపాపానామ్‌ భస్మేతి పురికీర్తితమ్‌' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్‌ అని కొనియాడారు.మారేడు దళం శివునికి ప్రీతికరమైనది. భస్మంతో అభిషేకం తర్వాత, మారేడు దళంతో శివుని పూజిస్తారు మూడు ఆకులు, మూడుగుణాలు సూచిస్తాయి. మారేడు కొమ్మలే వేదాలు. వేరులు రుద్రుడు. మారేడు దళం త్రినేత్రాలను సూచిస్తాయి. వీటిని పౌర్ణమి నాడు కోయరాదు. పశ్చిమ దేశాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మారేడు మొక్కలను పరిశోధనలకై పెంచు తున్నారు. కీళ్లవ్యాధులు, వాంతులు, క్షయ, విరేచనాలకు మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు దళాల రసాన్ని మంచినూనెలో కలిపి వేడిచేసిన తర్వాత చెవివ్యాధులకు ఉపయోగిస్తారు.
విభూతి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది.

విభూతి

 విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.
హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్‌ తత్‌ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్‌' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్‌ సర్వపాపానామ్‌ భస్మేతి పురికీర్తితమ్‌' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్‌ అని కొనియాడారు.మారేడు దళం శివునికి ప్రీతికరమైనది. భస్మంతో అభిషేకం తర్వాత, మారేడు దళంతో శివుని పూజిస్తారు మూడు ఆకులు, మూడుగుణాలు సూచిస్తాయి. మారేడు కొమ్మలే వేదాలు. వేరులు రుద్రుడు. మారేడు దళం త్రినేత్రాలను సూచిస్తాయి. వీటిని పౌర్ణమి నాడు కోయరాదు. పశ్చిమ దేశాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మారేడు మొక్కలను పరిశోధనలకై పెంచు తున్నారు. కీళ్లవ్యాధులు, వాంతులు, క్షయ, విరేచనాలకు మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు దళాల రసాన్ని మంచినూనెలో కలిపి వేడిచేసిన తర్వాత చెవివ్యాధులకు ఉపయోగిస్తారు.
విభూతి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది.

భక్తి సమాచారం
పంచ భూతాలు


జీవులకు ఐదు ప్రాధమిక ఆధారాలు ..

ఆకాశం
వాయువు
అగ్ని
నీరు
భూమి

మనిషి లో ఐదు ప్రాణాలు ఉంటాయని ఈ ఐదు ప్రాణాలు పంచ భూతాల్లో కలిసి పోతాయని అంటారు.
పంచ భూతాలను సూచిస్తూ ఐదు ప్రసిద్ధ శివ క్షేత్రాలు ఉన్నాయి.

ఆకాశం - చిదంబరం - శివుడు నిరాకారం గా ఉంటాడు
వాయువు - శ్రీకాళ హస్తి - శివలింగం నుండి గాలి వస్తూ ఉంటుంది
అగ్ని -అరుణాచలం - స్వామి దగ్గర వెలుగు ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
నీరు -జంబుకేశ్వరం - శివ లింగం నుండి నీరు వస్తూ ఉంటుంది
భూమి - ఏకాంబరేశ్వర , కంచి -

భక్తి సమాచారం
శివ మానస పూజ ఎలా చేస్తారు?

శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు. అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు. వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రమున్నవాళ్ళు మరి ఏం చెయ్యాలి? ధర్మ గ్రంధాలు ఏం చెబుతున్నాయి?

అసలు భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమయినది. మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి.

అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి, భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలి? భగవంతుడు అక్కడ వున్నాడని భావించి ఆయనకి రత్న సింహాసనం వెయ్యాలి. ఆకాశ గంగని తెచ్చి మనసారా అభిషేకించాలి. వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి. సుగంధ భరితమైన పూవులతో, మారేడ దళాలతో పూజించాలి. ధూపం, దీపం అన్నీ సమర్పించాలి. షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి. స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నన్ను దయచూడమని వేడుకోవాలి.

బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు.


భక్తి సమాచారం 


భక్తి సమాచారం
మునిగిరిలో వేంచేసిన రామలింగేశ్వర స్వామి

పవిత్ర కృష్ణానదీ తీరాన సుమారు 612 అడుగుల ఎతె్తైన కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం ఎంతో ప్రఖ్యాతి చెందినది.
శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైన మరియు మారుషిగణములలో ఒకరైన భృగువంశోధరుడు శ్రీ జమదగ్నిమహర్షి సంతానమైన శ్రీ పరశురాములవారు దక్షిణభారతదేశాన్ని దండెత్తుతు అరాచకములు చేయువారిని శిక్షించుచు మంచిని పెంపొందించు చుండెడివారు. అట్టి సందర్భములలో వారి ఆగ్రహమునకు గురియైన అనేకమంది క్షత్రియులు నశించినారు. అంత తానుచేసిన దోషములనుండి ప్రాయశ్చిత్తముకొరకు యావత్ భారతావనిలోని అనేక నదీప్రదేశములను తిరుగుచూ, అనేక దేవాలయములను దర్శించుకొని, అనేక దేవాలయములు నిర్మించినారు. తన శిష్యులకు ధర్మాధర్మములను బోధించుచు, పరమపవిత్రమైన హిందూ ధర్మాలకు మూలమైన దేవాలయ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళు సందర్భములలో అనేక దేవాలయములను ప్రతిష్ఠింపచేసినారు. స్వయం వ్యక్తమైన ఆలయములలో అర్చనలు చేసెడివారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతాములలో సంచరించుచున్న సందర్భములో ‘‘మునిగిరి’ చేరెను. ‘‘మునిగిరి’’పై అనేకమంది మునులు తపస్సు చేసేడివారట. వారికి ఎటువంటి తపోభంగము కలుగకుండా పరుశురాముడు రక్షించినాడని, అంతేకాక, స్వయంభూవై వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామిని పునఃప్రతిష్ఠ చేసినారని చెప్పుదురు. అంతేకాక కొండపైనుండి నదీప్రవాహమువరకు 101 లింగాలను ప్రతిష్ఠించినారట. అవి కాలగర్భములో కలసిపోయినవట.
ఇంద్రకీలాద్రి, మునిగిరి, ఋష్యసృంగం, గరుడాద్రి, వేదాద్రి మొదలగు పర్వతశ్రేణులు కృష్ణమ్మ ప్రవాహముచే విడివడి కృష్ణానదికి దక్షిణాన మునిగిరి వచ్చి చేరినది. అదే గిరిపై శ్రీ రామలింగేశ్వరస్వామివారు వాయు లింగాకారముగా ఉద్భవించినారు. ఈ లింగాకారమునే పరుశురాముడు పునఃప్రతిష్ఠ చేసినారు. శ్రీస్వామివారు అష్ఠముఖ పానుపట్టముపై వేంచేసి యుండుట ఇక్కడి ప్రత్యేకత.
శ్రీరామచంద్రమూర్తి సీతాసమేతుడై దక్షిణ దేశ సంచారము చేయుచు స్వామిని దర్శించినారని ప్రతీతి. చాళుక్యులు, కాకతీయులు రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు మరియు ఎందరో మహానుభావులు మహర్షులు, మునులు, ఈ మునిగిరిపై స్వామిని దర్శించి తరించినారని ప్రతీతి. వేయి మంది మునులు తపస్సుచేసిన స్థలము కనుక ‘‘వెయి మునుల కుదురని’’పిలిచెడివారు. కాలక్రమముగా ‘‘యనమలకుదురు’’గా పిలబడుచున్నది. ఇప్పటికీ నాగేంద్రస్వామివారు అనేక రూపాలలో భక్తులకు దర్శనమిచ్చుదురని ప్రతీతి.
1983 సంవత్సరములో శ్రీ శృంగేరి భారతీ తీర్థస్వామి వారి ఆధ్వర్యములో శిఖర ప్రతిష్ఠగావించినారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఘాట్‌రోడ్డు నిర్మించుటమైనది.
ఉపాలయములుగా శ్రీపార్వతీదేవి, శ్రీమహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివార్ల ఆలయములు గలవు.
శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవములు, మహాశివరాత్రి పర్వదినములలో త్రైయాహ్నికముగా జరుగును. మహాశివరాత్రి పర్వదినమున ప్రభోత్సవము స్వామివారి కళ్యాణోత్సవము జరుగును. స్వామివార్కి గ్రామోత్సవము అత్యంత వైభవముగా జరుగును.
ధ్వజ అవరోహణ కాలమందు స్వామివారికి నివేదించిన నందిముద్దలు అత్యంత మహిమాన్వితమైనవట. సంతాన ప్రాప్తికై భక్తులు ఉపవాసముండి సాయంత్రము స్వామివారికి నివేదించిన నంది ముద్దలు అర్చక స్వాములు ధ్వజస్థంభమువద్ద ఎగురవేయగా ఆ ముద్ద ఎవరి కొంగున పడితే వారికి సంతానప్రాప్తి కల్గునని భక్తుల ప్రగాఢ నమ్మకము.
కార్తీకమాసం శ్రీ స్వామివారి జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున మహాకుంభాభిషేకము, అన్నదానము జరుగును.
ఈ దేవాలయము విజయవాడకు 3 కి.మీ దూరములోను, ఇంద్రకీలాద్రిపై వెలసి వున్న శ్రీ కనకదుర్గమ్మవారికి 7 కి.మీ. దూరములో గలదు. బస్సు సౌకర్యము గలదు. కాలినడకన దర్శించువారికొరకు మెట్ల మార్గము కలదు. ఆలయమునకు చేరుకొను దారి అంతయూ సాయంత్ర సమయములో విజయవాడ నగర విద్యుత్తు దీపాల వెలుగులో కాంతివంతముగానుండును. దేవాలయ ప్రవేశము చేసినంతనే అలౌకికానందము కల్గును. ద్వార ప్రవేశమునందు ఆంజనేయస్వామి భారీ విగ్రహము గోచరించును.