Tuesday, 30 July 2013

సూర్యచంద్రుల గతులు - గమనాలు - శ్రీ దేవీ భాగవతం

సూర్యచంద్రుల గతులు - గమనాలు - శ్రీ దేవీ భాగవతం

ఇక - ఆపైన ఉన్నది శుద్ధాకాశం. సూర్యుడు ఈ బ్రహ్మాండానికి నట్టనడిమిన ఉన్నాడు కదా! ఈతడు హిరణ్య (బంగారం) అండం నుంచి జన్మించాడు కనుక - ఇతడిని హిరణ్యగర్భుడన్నారు. (కొందరు సూర్యుని గర్భంలో బంగారం ఉందని చెబుతారు.) మృతాండం నుండి జన్మించాడు కనుక, మార్తాండుడనీ అంటారు. ఈ సూర్యగోళానికీ - భూగోళానికీ మధ్య దూరం - పాతిక కోట్ల యోజనాలు. ఈ మహావిశాల విశ్వంలో భూమి, దిక్కులు వగైరా విభజనలకు ఆధారం సూర్యభగవానుడే!

శ్లో|| విషు వత్సంజ్ఞ మాసాద్య గతి సామ్యం వి తన్వతే |
సమస్థాన మాసాద్య దిన సామ్యం కరోతి చ||

ఆరోహణ స్థానంలో మందగతిన ఉంటాడు సూర్యుడు. అది దక్షిణాయణం. కనుక పగళ్లు దీర్ఘం, అవరోహణ స్థానంలో సీఘ్ర గతిన ఉంటాడు. అది ఉత్తరాయణం. కనుక రాత్రులు దీర్ఘం. విఘవత్‌లలో సమగతిలో ఉంటాడు. కనుక పగలూ - రేయీ సమానంగా ఉంటాయి.

రాశుల్లోకి సంక్రమించే సూర్యగతిని బట్టి చెప్పాలంటే - వృషభం నుంచి కన్యారాశి వరకు సూర్యుడు చరిస్తుండగా (దాదాపు 5 నెలల కాలం) పగళ్లు దీర్ఘంగా ఉంటాయి. వృశ్చికం నుంచి మీనరాశి వరకు సూర్యుడు చరిస్తున్నప్పుడు రాత్రులు దీర్ఘం. మేష - తులా రాశుల్లో (విషువత్‌) మాత్రం రాత్రీ పగలూ సమానం. ఈ ప్రకారం సూర్యగతిలో 1. శీఘ్ర 2. మంద 3. సమగతి అనే 3 భేదాలున్నాయి.

ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే - మేరు పర్వతానికి నాలుగువైపులా నాలుగు దిక్పతుల పురాలున్నాయి. అవి. 1. ఐంద్రి (ఇంద్రుని పురి) 2. సంయమని (యమపురి) 3. నిమ్లోచని (వరుణ పురి) 4. విభావరి (కుబేర పురి). ఈ నాలుగు పట్టణాలూ సూర్యగమనానికి నిమిత్తాలు. సూర్యుడు ఇంద్రిలో ఉదయించి, సంయమానికి మధ్యాహ్నం చేరి, నిమ్లోచనిలో అస్తమించి, విభావరిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. అయితే - మేరువు మీద ఉన్నవారికి మాత్రం సూర్యుడు నిరంతరం ఆకాశానికి మధ్యలో ఉన్నట్లే కనిపిస్తాడు. సూర్యోదయం - సూర్యాస్తమయం ఏమిటి? ఆయన నిత్యుడు - శాశ్వతుడు కదా! నిజమే! దర్శన - దర్శనరహిత భేదాల వల్ల ఇవి మనం ఏర్పరుచుకున్నవే! దీనికిదే శ్లోక ప్రామాణ్యం....

శ్లో|| నై వాస్తమన మర్కస్య నో దయః సర్వదా సతః |
ఉదయాస్త మనాఖ్యం హి దర్శనా దర్శనం రవేః ||

ఇప్పుడు చంద్రగ్రహనానికి సంబధించి గమనం. ఇది చిత్రమయినరీతి. సూర్యుడు కాలచక్ర గతుడై 12 రాశులలోనూ సంచరిస్తూ 12 నెలలను కల్పిస్తుండగా చంద్రుడు పక్షద్వయంతో ఈ మాసకాలాన్ని విభజిస్తున్నాడు.

శ్లో|| భానోర్మాంద్య శైఘ్ర్య సమగతిభిః కాల విత్తమైః |
ఏవం భానోర్గతిః ప్రోక్తా చంద్రాదీనాం నిబోధత ||

సూర్యుడికన్నా చంద్రునిది శీఘ్రగతి. ఏయే నక్షత్రాలతో కూడి ఉంటే, ఆయా నక్షత్రాల వల్ల మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి. (ఉదా: చంద్రుడు మృగశిరా నక్షత్రంతో కూడినపుడు మార్గశిర మాసం) పెరుగుతున్న చంద్ర కళలతో దేవతలకు - తరుగుతున్న చద్రకళలతో పితృదేవతలకు ఇతడు ఇష్టడవుతున్నాడు. సూర్యునికి సంవత్సరం పాటు పట్టే కాలచక్రాన్ని ఈతడు నెలరోజుల్లో అధిగమిస్తున్నాడు. అమృత కిరణుడు. మనస్సుపై ప్రభావం చూపేవాడు. రాత్రి కారకుడు. సర్వజీవకోటికీ ప్రాణం - జీవం చంద్రుడే!

చంద్రునికి 3 లక్షల యోజనాల దూరంలో మేరువుకు ప్రదక్షిణంగా భచక్రం తిరుగుతూ ఉంటుంది. నక్షత్రాలన్నీ ఈ భచక్రంలోనే సంచరిస్తుంటాయి అభిజిత్‌తో కలిసి 28 నక్షత్రాలు.

ఈ భచక్రానికి రెండు లక్షల యోజనాల దూరాన శుక్రగ్రహం. సూర్యునికి ముందు - వెనుకలుగా చరించే ఇతడికీ శీఘ్ర - మంద - సమగతులున్నాయి. లోకోపకారి. ఇతడికి రెండు లక్షల యోజనాల దూరాన బుధుడు సౌమ్యుడు. ఈతడికి రెండు లక్షల యోజనాల పైన అంగారకుడున్నాడు. వక్రించనంతవరకు ఇతడూ శుభుడే! ఆపైన రేండు లక్షల యోజనాల దూరంలో శనైశ్చరుడున్నాడు. చాలా మందగతి గలవాడు. ముప్పై నెలలకు గాని ఒక్కోరాశి నుంచీ కదలడు. అంటే ఒక్కోరాశిలోను 21/2 సం||రాలుంటాడు. సహజంగానే అశుభుడు. సూర్యపుత్రుడైన ఇతడికి కటాక్ష వీక్షణం కూడా ఉంది. కాని అది పొందడానికి శ్రమించాల్సి ఉంటుంది.

ఇక్కడకు నవగ్రహాల ఉనికిని స్థిరపరచిన తరువాత, జగదంబిక, ఈశనైశ్చరునికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలాన్ని ఏర్పరచింది. ఈ సప్త ఋషులు లోకాలకు ఎల్లవేళలా శుభం కోరుతూ ఆకాశాన దక్షిణంగా తిరుగుతుంటారు. ఈ సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల దూరంలో దిక్పాలకులతో సమానంగా దక్షిణం వైపున నిశ్చలంగా కనిపించే సర్వదేవపూజితుడైన ధృవుడున్నాడు. పరమ భాగవతోత్తముడు. లోక వందితుడు. తన తేజస్సుతో ఇతర గ్రహాలను ప్రకాశింపచేస్తుంటాడు. గ్రహ రాశులన్నీ ధ్రువుడి చుట్టూ తిరుగుతూంటాయి.

శ్లో|| ఆ కల్పాంతం చ క్రమంతి ఖే శ్యేనాద్యాః ఖగా ఇవ |
కర్మ సారథ్యయో వాయు వశగాః సర్వ యేవ తే ||

కాల చక్రాన్ని తిప్పే నిమిత్తం గ్రహాలన్నీ ధ్రువుడు కేంద్రబిందువుగా, వాయుప్రేరితాలై కదలాడటం - అదీ ఆ కల్పాంతం వరకు ఆకాశంలో గరుడ పక్షుల్లా చలించటం గొప్ప నిర్మాణ వైచిత్రి. ఈ గ్రహాలే ప్రాణికోటి కర్మల సారధులు. ఈ జ్యోతిర్గణాలు అలా చలిస్తూనే ఉంటాయి తప్ప, ఎన్నడూ రాలిపోవు.

సూర్య మండలానికి క్రిందుగా ఉన్నలోకాలలో సిద్ధ, చారణ, విద్యాధరలోకాలు కూడా ఉన్నాయి. వీటికి క్రిందుగా యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత, భూత విహారానికి సంబంధించిన లోకాలూ ఉన్నాయి. వాయుసంచారం ఉన్నంతవరకు అంతరిక్షం అనీ - దీనికి నూరుయోజనాల క్రిందుగా భూగోళం ఉన్నదనీ చెప్పబడింది
Brahmasri Chaganti Koteswara Rao Garu.
హిందువుల వైవాహిక శుభకార్యాల్లొ "అగ్ని" ని సాక్షిగా ఎందుకు పెడతారు అన్నది చాలా మంది దంపతులకు తెలీదు. మన సంస్కృతీ, సంప్రదాయాల్లో అగ్నిని పవిత్రంగా చూడడం ఆచారం. పూజలు, యజ్ఞయాగాదులు అగ్ని లేకుండా జరగవు. అగ్ని సాక్షిగా లేకపోతే ఆ వివాహం ధర్మసమ్మతం కాదంటారు. పెళ్ళీ డు వచ్చిన ఆడపిల్లలు చక్కగా చూడముచ్చటగా ఉంటారు. వివాహానికి యోగ్యమైన అమ్మాయిని చంద్రసాక్షిగా గంధర్వుడూ, గంధర్వసాక్షిగా అగ్ని ఆమెను రక్షించగా అగ్నిసాక్షిగా వరుడు గ్రహిస్తాడు. అందుకని "అగ్నిసాక్షిగా పెళ్లి " అనే మాట వచ్చింది. వేదాలలోని ప్రధమ శబ్దం అగ్ని, ఆ అగ్నిని ఋషులు గుర్తించి అగ్రస్వరూపునిగా కీర్తించారు. ఆ ప్రధమస్వరూపుని ఆరాధన వల్ల మనం తరిస్తాము. సృష్టిలో మనకు ఏదైనా గోచరం కావలెనంటే దానికి రూపం కావాలి. రూపమిచ్చేది అగ్ని. నిరాకార జ్యోతిర్మయ బ్రహ్మం అగ్ని. సాకార విశ్వమూ అగ్నే. మన శరీరంలో ఉష్ణత్వం, ఈ విశ్వంలో సూర్యుడు, నక్షత్రాలు, జ్ఞానాగ్ని, వనాగ్ని, అంటూ సమస్తం అగ్నిమయం.

"దారాధీన స్తథా స్వర్గః పిత్రూణా మా త్మన స్సహ "
అని పెద్దలంటారు. తన పితృలందరికీ స్వర్గం లభించాలంటే, ముందుకాలంలో తానూ తరించాలంటే అది సాధ్యమయ్యేది, భార్య కనబోయే సంతానం ద్వారా కదా! అలాంటి స్వర్గానికి తీసుకుపోగల అవకాశం బార్య ద్వారా లభిస్తుంటే ఆమెను గౌరవించాలి కదా!

ఓం శాంతి: శాంతి: శాంతి:

మహాగ్రంథాలు - శ్రీ దేవీ భాగవతంBrahmasri Chaganti Koteswara Rao Garu.
మహాగ్రంథాలు - శ్రీ దేవీ భాగవతం
వ్యాసపీఠం అంటే?

లోకంలోని ప్రజలు అనుకుంటున్నట్లుగా - వ్యాసుడు ఒక మహర్షి అని మాత్రమే గాక, ఇంకా లోతైన విషయం వారికి ఒకటి తెలియవలసి ఉంది....

అదేమిటంటే - వ్యాసపీఠం అనేది ఒక పదవి. ఒకానొక బృహత్తర కార్యక్రమ నిర్వహణ నిమిత్తం ఆ పదవిలో ఏ మహర్షి, ఏ మహానుభావుడు వస్తాడో అతడే వ్యాసుడు. అనగా - ఇక్కడ వ్యాసపీఠానికి ఒక కార్యక్రమం నిర్దేశితమై ఉంది. అది - వేదవిభజన; పురాణ సముద్ధరణ; పురాణగాథా సృజన - వ్యాప్తీకరణ. ఈ నిర్వహణ భారం అందరికీ సాధ్యం కాదు. ఏ మహనీయుడు దీనికి తగినవాడో, అతడు సాక్షాత్‌ విష్ణు భగవానుడే అయి వుండాలి.

అనగా, దీనిని ఇంకొక రూపంగా చెప్పవలసి వస్తే - "ప్రతి ద్వాపర యుగంలోను శ్రీమన్నారాయణుడే వ్యాసపీఠాన్నలంకరించి, ఈ ధరాతలం మీద ధర్మం నెలకొల్పడానికి పురాణ సృజన చేస్తాడు" అని చెప్పవలసి ఉంటుంది.

శ్లో|| ద్వాపరే - ద్వాపరే - విష్ను ర్వ్యాస రూపేణ సర్వదా |
వేద మేకం స బహుధా కురుతే హిత కామ్యయా ||

మనకు 4 యుగాలున్నాయని తెలుసు ! అవి 1. కృత , 2.త్రేతా , 3. ద్వాపర , 4.కలి. మరి, ప్రతి యుగ కాలపరిమితి కూడ తెలుసు! అవి తమ పరిమితి పూర్తి చేసుకోగానే పెనుప్రళయం సంభవించి, సమస్తం జలమయం - పెను చీకట్లు ఆవరిస్తాయనీ తెలుసు! తిరిగి మళ్ళీ నూతన సృష్టికి శ్రీకారం. అంటే - ఈ సృష్టి చక్రభ్రమణంలో మరోసారి ఈ నాలుగు యుగాలూ ఆవృత్తం అవుతాయి. ఇలా పునఃసృష్టికి మూల భూతుడైన పురుషుడే 'మనువు' అనీ - అతని పేరిట 'మన్వంతరాలు' ఒక క్రమ పరిణామమై విస్తరిస్తాయని గ్రహించాలి. ఇప్పటి వరకు ఈ సృష్టి చక్రంలో ఏడుగురు మనువులు తమ పేరిట మన్వంతరాలు నిర్వహించారు అనాల్సి ఉంటుంది. అలగే ద్వాపరయుగం ఇప్పటికి 27సార్లు ఆవృత్తమైంది. (7X4 = 28) మనం ఇప్పుడున్న వైవస్వత మన్వంతరంలో ఈ కలియుగానికిముందు యుగమైన ద్వాపరంలో వ్యాసపీఠిని అలంకరించిన వాడు - సత్యవతీ పుత్రుడు, సూత పౌరాణికుడి గురువు, కృష్ణ ద్వైపాయన మహర్షి అనే వ్యాసుడు. ద్వాపర యుగంలోనే, వ్యాసపీఠి నలంకరించే మహనీయులకు ఈ కలియుగం ఏ రీతిన ఉంటుందనే చింత - చింతన దివ్యదృష్టి వలన అవగతమవుతుంది. ఇది అన్ని మన్వంతరాలలోనూ, అందరు వ్యాసమహర్షులకు జరిగినదే!

కలియుగంలో మానవులకు ఆయుఃప్రమాణమూ అల్పమే! బుద్ధీ అల్పమే! పైగా బ్రాహ్మణేతరులకు - స్త్రీలకు వేదధ్యాయనాధికారం కాలగతిననుసరించి పరిహరించడమైనది. మరి వేదోక్త ధర్మాలు వీరికి అందేదెట్లా? అందువల్ల వేదాల్లోని ధర్మాలను ఎరుకపరచడానికే విస్తృత కథన గాథాత్మకంగా పురాణ సృజన జరిగింది. అంటే....ఒక విధంగా చెప్పాల్సివస్తే, వేద వ్యాఖ్యానమే పురాణ వాజ్మయం అంతా విస్తరించి ఉంది. దీనికో ఉదాహరణ : సకల ధర్మాల సారం అనదగ్గ మహా భారతాన్ని 'పంచమ వేదం' అనడమే!

ఈ (మనం ఉంటున్న) కలియుగనికి కృష్ణద్వైపాయన మహర్షి అందజేసిన పురాణవాజ్మయం ఉంది. అలాగే గడచిన 27 ద్వాపరయుగాలలోను 'వేద విభజన - పురాణ సృజన' అనే బృహత్కార్య భారం నిర్వహించిన వ్యాస భగవానులు 27 గురినీ ఇక్కడ స్మరించడం సముచితమే !

మొట్టమొదటగా 'స్వయం భువము' లయిన వేదాలకు ప్రచోదన కర్త 'బ్రహ్మ' తొలి వ్యాసుడు. తదుపరి వాటిని విభజించి విస్తృత పరచిన వ్యాస భగవానుల క్రమం ఇదీ : - 2. ప్రజాపతి, 3. ఉశనుడు, 4. బృహస్పతి, 5. సవితా దేవ, 6. మృత్యువు, 7. మఘవాన్‌, 8. వశిష్ఠ, 9. సారస్వతుడు, 10. త్రిధాముడు, 11. త్రివృషుడు, 12. భరద్వాజుడు, 13. అంతరిక్షుడు, 14. ధర్ముడు, 15. త్రయారుణి, 16. ధనుంజయుడు, 17. మేధాతిథి, 18. వ్రతి, 19. అత్రి, 20. గౌతమ, 21. ఉత్తమ, 22. హర్యాత్మ, 23. వేన, 24. సామ, 25. తృణబిందు, 26. భార్గవుడు, 27. జాతుకర్ణుడు, 28.(ప్రస్తుతం) కృష్ణద్వైపాయనుడు.

రాబోయే ద్వాపరయుగంలో ద్రోణుని పుత్రుడైన అశ్వత్థామ 29వ వ్యాసుడు".

అని చెప్పి సూతమహర్షి అర్ధనిమీలిత నేత్రుడై, తమ గురుదేవులవారి ప్రసక్తి వచ్చినందున మనసులోనే ఆ సాత్యవతేయుని స్మరించి, దేవీ భాగవత పురాణాన్ని ఏ ఉపాఖ్యానంతో ప్రారంభించాలా అని ఆలోచిస్తూండగా, శౌనకాది మహర్షులు సవినయంగా తమ సందేహాన్ని ఆయన ముందుంచారు.

"రోమహర్షణాత్మక పురాణ ప్రవక్తలైన తాము ఈ దేవీ భాగవత బృహత్‌ పురాణాన్ని, సాక్షాత్‌ సృజనకర్త వ్యాసమౌని ముఖనిర్గతం కాగా విని ధన్యులయ్యారు. మీతో పాటు ఈ పురాణాన్ని వ్యాసపుత్రులు - పుంభావ సరస్వతి, అరణి సంభవుడు అయిన శుకమహర్షి కూడ విని ఉన్నట్లు తాము వచించారు కదా! వ్యాసుల వారికి పుత్రజననం జరిగినది మొదలు సవిస్తరమయిన గాథగా మాకీ పురాణం వినిపించవలసిందిగా కోరుతున్నాము" అని శౌనకాదులు అడిగారు.

"కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నది నానుడి. ఈ బృహత్‌ పురాణాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించాలా అని యోచిస్తుండగా " మీరు మంచి ప్రశ్నేవేశారు. సాక్షాత్‌ మా గురుదేవుల ప్రియపుత్రుని జన్మగాథతోనే దేవీ భాగవత పురాణశ్రవణానికి నాంది పలుకుతాను" అంటూ సూత మహర్షి సుకోత్పత్తి ఉపాఖ్యానం చెప్పసాగాడు.
భక్తి సమాచారం
గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

Monday, 29 July 2013

నీతిశాస్త్రము

శ్లోll శకటం పంచహస్తేషు దశహస్తేషువాజినమ్ l

గజం హస్త సహస్రేషు దుర్జనం దూరత స్త్యజేత్ ll


తాత్పర్యము:- బండి ఎదురుగా వచ్చుట, చూచినవారు ఐదుమూరలు తొలగిపోవలెను.గుఱ్ఱము 


ఎదురుగావచ్చుట చూచినవారు పదిమూరలు తొలిగి పోవలెను.మదించిన ఏనుగు ఎదురుగావచ్చిన

 వెయ్యిమూరలు దూరముతొలగవలెను. దుర్జనుని చూచిన మిక్కిలి సాథ్యమైనంతఎక్కువ దూరముతొలగి 

పోవలెను.
శ్లో || సత్యం బ్రూయా త్ప్రియం బ్రూయా

న్న బ్రూయా త్సత్య మ ప్రియం

ప్రియంచ నావృతం బ్రూయా

దేష ధర్మో ఘటో ద్బవ! (స్కందః )

తా || 

పెద్దలు వచ్చినపుడు లేచి తన పీటమును వారి కియ్యవలెను . పెద్దల ముందు కాళ్ళు చాపి కూర్చుండుట , 


పరుండుట పనికి రాదు . పెద్దలను ప్రత్యక్షముగా గాని పరోక్షమున గాని నిందింప రాదు . ఎదుటి వారిని 

స్తుతించుట ,ఆత్మ నింద పనికి రావు.


శ్లో || శ్రద్దయా ప్రతి గృహ్ణా తి శ్రద్ధ యాయః ప్రయచ్ఛతి


స్వర్గి ణౌ తావు భౌస్యాతాం పతతో శ్రద్దయా త్వదః ||

తా || 


దానము ఇచ్చువాడును ,పుచ్చుకొనువాడును శ్రద్ధ గల వారైనపుడు ఇద్దరికి స్వర్గ సుఖము గలుగును. శ్రద్ధ 


లేనిచో పతనము చెందుదురు.

వేద విద్యను శిష్యులకు దానము చేయుట వలన బ్రాహ్మణుడు బ్రహ్మ లోకమును బొందును.


అసత్య మాడినచో .చేసిన పూజల ఫలము నశించును. గర్వము వల్ల తపము నాశన మగును. పదిసార్లు 


పొగడుకొనుట వలన తానిచ్చిన దానము వలని ఫలము నశించును. బ్రాహ్మణుని దూషించినచో ఆయుర్దాయము 

నశించును .

శ్రీ స్కంద పురాణము

Monday, 22 July 2013

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

ఈ పర్వం యతులకు అతిముఖ్యమైనది. వారీనాడు మహా భారతం మొదలైన సంహితా గ్రంథాలకు రచయిత అయిన వ్యాసుని పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారు.
పూజా విధానం

కొత్త అంగవస్త్రం భూమి మీద పరుస్తారు. దాని మీద బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మ కాయలు ఉంచుతారు. ఇది శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకొంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తలా ఒక పిడికెడు తీసుకుకెళ్లి తమ తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం లక్ష్మీ చిహ్నం. శుభసందర్భాల్లో బియ్యం యథాశక్తిని రాసి పోసి లక్ష్మిని ఆహ్వానించటం హిందూ సాంప్రదాయం. నిమ్మపళ్లు కానుకగా ఇచ్చుపళ్లు.అవి కార్యసిద్ధిని సూచిస్తాయి. బియ్యం, నిమ్మపళ్లు ఉంచడం లక్ష్మీ కటాక్షం కోసమే. దక్షిణాదిని కుంభకోణంలో, శృంగేరిలో శంకర పీఠాలు ఉన్నాయి. వ్యాస పూర్ణిమ అక్కడ ఎంతో వైభవంతో జరుపబడుతుంది. ఆ పర్వసందర్భంలో అక్కడికి వేల కొలది తైర్థికులు వస్తారు. వ్యాసపూర్ణిమ గురుపూజా రోజుగా పాంచజన్యం పత్రిక (28.7.34) ఇట్లా అంటూ ఉంది.
''ఇందులో వ్యాసపదం గురుపరము. ఇప్పుడు ప్రతి చోటా తమతమ గురువుల నారాధించుకొని తరింప వలయునని శాస్త్రాదేశం. స్వస్వరూపాను సంధానమున కన్న భిన్నమగు అన్యారాధనను తెలియని యతిశేఖరులచే ఈ నాగాచార్య పీఠార్చనల నాచరింపవలసినగా శాస్త్ర మాదేశించినది. గుర్వారాశనం విశేష ప్రయోజనకారియు, అనుల్లంఘ్యమనియు చెప్పుటకు రెండు ప్రబల ప్రమాణ ములు కలవు. యస్యదేవే పరాభక్తి: యధా దేవేయతాథా గురౌ' అని శ్వేతాశ్వతరోపనిషతు నందు పేర్కొన్నారు. ఇందు వేదమాత, ఈశ్వరారాధన తోటి తుల్య గౌరవం, సమాన ప్రాధాన్యతను ఇస్తుంది. గురుపూజకు, కాని స్మృతికర్తలింకొక మెట్టెక్కుడధిష్టింప చూశారు. గురువును ''దైవేఋష్టే గురుస్తాతా,
గురౌ ఋష్టేనకశ్చన'' యని దైవానుగ్రహమునకు గురువనుగ్రహం అనివార్యం. గనుక సాధనమపేక్షించి వ్యాస పూర్ణిమలో వ్యాస పదమాధికారిక పదపరముగాని వ్యక్తి పరం కాదనునదొకటి, ఆనాడొ నర్చు గురు పీఠార్చనలలో ఇప్పుడు దేశమందములు లోనున్న యతి కర్తృక పూజ మాత్రములు ఉప లక్షకములు మాత్రమే. ఆనాడు సర్వులు సర్వవిధములు తమ తమ గుర్వర్చనజేసి గురుభక్తిని వెల్లడించి పెంపొందింప జేశారు. ఎంతో మంది ఋషులు ఉండగా ఒక్కవ్యాసుని పేరున ఈ పూజ జరుప బడుటకు ఏమిటి కారణం! ఈ పూజలో ప్రత్యేక పూజలు అందే ఆదిశంకరులు వ్యాసభగవానుని అపరావతారమని చెబుతారు. కాగా ఇది వ్యాస పూజకు ఉద్దిష్టమైనది. వ్యాస పూజ అనగా ఆదిశంకరుల పూజ. సన్యాసులందరూ ఆది శంకరులు తమ గురువుని ఎంచుకుంటారు. నేడు సన్యాసులందరూ వ్యాసుని రూపంలో తమ గురువును కొలుస్తున్నారన్నమాట అందుచేత ఇది వ్యాస పూజారోజు. శంకరాచార్యుల వారి జయంతికి వేరే ఒక రోజు ఉద్దిష్టమై ఉన్నది. కాగా దీనిని గురుపూజా దినోత్సవగా భావింపవలసి ఉంది.
మహాషాఢ వ్యాస పూజ

ఈ రోజు అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాస మహర్షిని పూజించాలి.
శ్లో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం

సూత్ర భాష్యకృతౌ వందే భగవంతా పున:పున:
అని పూజించిన బ్రహ్మత్వసిద్ధి లభిస్తుందంటారు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.
వైష్ణవ పురాణమును ఆషాఢ పూర్ణిమకు దానమిస్తే విష్ణు లోకం కలుగును. వ్యాస భగవానుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను ఎత్తుకు పోయినపుడు అవి ఒకదానితో ఒకటి కలిసి పోయాయి. కొంతకాలానికి శ్రీమహావిష్ణువే వ్యాసావతారం ఎత్తి ఆ వేదాలను విభజించి చక్క పరచాడు. చిక్కుపడిన వేదములను విభాగించిన విద్యావేత్తయేకాక అతడు శస్త్ర చికిత్సావేది కూడ. గాంధారి ఈసుపూని దిగజార్చుకొన్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి ఆపిండంలో నూట ఒక్క శిశువులు ఉండడం గుర్తించి ఆ విధంగా ఆ పిండాన్ని నేర్పుతో విభాగించి నేతి కుండలో నిక్షిప్త మొనర్చి పోషించేటట్లు చేసిన వైద్యవరుడు, వైద్యవిద్యానిధి, మేధానిధి, ఆత్మవిద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించడానికి ఉద్దిష్టమైన పర్వమిది. ఆషాఢ శుద్ధ పూర్ణిమ రుద్ర సావర్ణి మన్వంతరాది రోజు. రుద్ర పావర్ణి పన్నెండో మనువు. అతడు రుద్రపుత్రుడు ఈ మన్వంతరంలో ఋతధాముడు ఇంద్రుడు, తపస్వి, సుతపస్వి మున్నగువారు సప్తర్షులు.

Thursday, 18 July 2013

తొలి ఏకాదశి/ ఆషాఢ ఏకాదశి / శయన ఏకాదశి

బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వర రావు గారు సేకరణ : సుకన్య

తొలి ఏకాదశి/ ఆషాఢ ఏకాదశి / శయన ఏకాదశి on 19 07 2013

1. ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో , ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.

ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.

అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.

ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుని పునీతులౌదాము
----------------------------------------------------------------------------------
2.ఆషాఢ శుక్ల ఏకాదశి/శయన ఏకాదశి :

ఒక సంవత్సరములో మనకు 24 ఎకాదశులు వచ్చును అందులో ముఖ్యమైనది శయన ఏకాదశి, పరివర్తన ఏకాదశి మరియు ఉత్థాన ఏకాదశి బహు విశిష్టమైనది మిగత యెకాదశులలో ఉపవాసము ఉండలేక పోయినా ఈ మూడు ఎకాదశులలో ఉపవాసము వుంది మహాలక్ష్మీ సహిత మహావిష్ణుని పూజించిన 24 ఏకాదశులలో ఉపవాసము ఉన్న ఫలితము దక్కును
శయన ఏకాదశి రోజు దంపతులు ప్రొద్దున ఉపవాసము ఉండి సాయంకాలము సూర్య అస్తమనం అయిన తర్వాత సంధ్యావందనం కానిచ్చి పూజ మందిరములో పట్టు వస్త్రము పరచి దానిపైన మహాలక్ష్మీ సమేత మహావిష్ణు పటమును వుంచి మల్లెలు తామార పువ్వులతో అష్టోత్తర శతనామములతో పూజించి పాల అన్నము నివేదన చేసి నమస్కరించి విష్ణు సహస్ర నామము జపించి రాత్రి ఈ క్రింది స్లోకముతో నమస్కరించ వలెను

***వాసుదేవ జగద్యోనే ప్రాప్తేయం ద్వాదశి తవ భుజంగ సయనేబ్దౌ చ సుఖం స్వపిహి మాధవ
ఇయం తు ద్వాదశి దేవా శయనార్థం వినిర్మితా అస్యాం సుప్తే జగన్నాథ జగత్ సుప్తం భవేదిడం విబుద్దే త్వయి భుధ్యేత్ సర్వమేతత్ చరాచరం

ఫలితం : దీనివల్ల మనము శయనిన్చుటకు మంచి గృహము మంచి పడుకయు మరియు పండుకోనగానే సుఖమైన నిద్ర లభించును
----------------------------------------------------------------------------------
3.
లక్ష్యమును నిరవేర్చు లక్ష ప్రదక్షిణ వ్రతము 19 07 2013 to 13.11.2013
దైవారాధన విధానములో బహు సులభమైన మార్గము దేవతలను ప్రదక్షిణము చేయుటయే ఆషాఢ సుద్ద ద్వాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి అనగా 13.11.2013 వరకు ఆలయములలోనో లేక అశ్వథ వ్రుక్షమునో లేక పశువునో లక్ష మారులు ప్రదక్షిణము చేయవలెను వీలుకాని యెడల తక్కువ పక్షము వేయి మార్లైనను తప్పకుండ ప్రదక్షిణము చేయవలెను అప్పుడు చెప్పవలసిన శ్లోకములు

**విష్ణువునకు: అనంత మవ్యయం విష్ణుం లక్షిమి నారాయణం హరిం జగదీశా నమస్తుభ్యం ప్రదక్షిణ పదే పదే

**హనుమకు: రామదూత మహావీర రుద్ర బీజ సముద్భవ అంజనా గర్భ సంభూత వాయుపుత్ర నమోస్తుతే

**గోవుకు : గవాం అన్గేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ ఇహ లోకే పరత్రచ

ఈ ప్రదక్షిణముల వలన మన పాప రాశి అంతయు దగ్ధమై మన జీవితం ప్రశాంతముగా ఉండును.

పసుపుగౌరి నోము కథ

భక్తి సమాచారం
పసుపుగౌరి నోము కథ
పూర్వము ఒక గ్రామములో ఒక పుణ్య స్త్రీ వుండేది. పతి భక్తి కలిగిన ఇల్లాలు నిరంతరం పతిసేవాలు చేస్తూ అతనీ పాదాలను కళ్ళకు అద్దుకుంటూ సంసారమును సాగిస్తుండేది. ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, మాట్లాడడానికి కూడా ఎంతో కష్టంగా వుండేది. ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు. తగ్గు ముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పది మగ్గుతుండేవాడు. తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో అధైర్యంగా అంటూ ఉండేవాడు. ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధ పడుతున్న భర్తకు ధైర్యవచానాలను చెప్పి ఒడార్చుతుండేది. రాను రాను అతనికి మరణ భయం పెరిగింది. యమభటులు తనను తీసుకుపోవడానికి వస్తున్నారని తాను చని పోతున్నానని పలవరించే వాడు ఎంతో ధైర్యంగా వున్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి. పార్వతీ దేవిని తలచుకుని తను సుమంగళిగా తనువూ చాలించాలని అనుగ్రహించమని వేడుకునేది.

ఒకనాడు భర్త భయాందోళనలతో సొమ్మసిల్లి పడిపోయాడు. కదలికలేని భర్తపై బడి తల్లీ! మహేశ్వరీ నీకిది తగునా స్త్రీకి వైద్యమెంతో దుర్భరం ఈ వైద్యము నాకు కలుగజేయుట నీకు ధర్మమా అని పరిపరివిధాల రోదిన్చిండ్. అందుకా పరమేశ్వరి బిడ్డా! లే ఎందుకలా కుమిలి పోతావు నీ కొంచ్చిన బాధభయం ఏమీలేవు. నీవు పసుపు గౌరీ నోము నోచుకో నీ అయిదవతనానికి కొరతరాదు . ఈ నోమును నోచిన కులకాంతకు నిత్యసోవ్భాగ్యం పసుపు కుంకుమ కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కలుగుతుంది. లేచి కృతనిశ్చయురాలివై గౌరీదేవిని ఆరాధించు ఇందుకు సమయం సందర్భం అక్కరలేదు. తోచినదే తడవుగా ఇలా ఈ పసుపు గౌరినోమును ఏడాదిపాటు నోచుకోవాలి. అట్టి వారు పుణ్య స్త్రీగా తనువూ చాలిస్తుంది నీ భర్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్య వంతుడు అవుతాడు . అని పలికి ఆశీర్వదించి అంతర్దానమైనది. నిత్య సుమంగళిగా ఆమె నోము నోచుకున్నది. ఆమె భర్త పూర్ణ ఆరోగ్య వంతునిగా చిరకాలం జీవించి తరించారు.
ఉద్యాపన: కథలో చెప్పబడిన మాటలు ప్రతి రోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకుని సంవత్సరాంతమున సోలడు పసుపు వెదురు బుట్టలలో వుంచి అందులో నల్లపూసలు లక్క జోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు వుంచి ఒక పుణ్య స్త్రీ కి వాయనం ఇవ్వాలి. ఒక ముదుసలి పెరంతాలికి భోజనం పెట్టాలి.
 —

ఆషాఢమాసము ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైనది.

హైందవ సంస్కృతి మాస పత్రిక
ఆషాఢమాసము ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైనది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తోలి ఏకాదశి అని అంటారు. దీనినే "శయన ఏకాదశి " అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజున శేషశాయి అయిన నారాయణుడు శయనించి మరల కార్తిక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు అందుకు దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తోలి ఏకాదశిని ఒక పండుగగా జరుపుకుంటారు. ఇది అయిన వెంటనే పండగలు మొదలవుతాయి. అన్నమాట ఉదాహరణకు మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు మెదలయినవి. ఈ తోలి ఏకాదశి రోజున విష్ణు మూర్తిని అర్చించి, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసి, ఉపవాసము చేసి, మరు రోజున అంటే ద్వాదశి నాడు పారణ చేయాలి. అంటే విష్ణు నివేదిత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.

ఈ మాసములో వచ్చే పున్నమిని గురుపూర్ణిమ అంటారు. యతులు అయినవారు ఈ రోజున చాతుర్మాస్య దీక్ష ప్రారంభిస్తారు. విష్ణు మూర్తి శయనించిన ఈ నాలుగు నెలలను చాతుర్మాస్య దీక్ష ప్రారంభము అవుతుంది. ఒకే చోట స్తిరంగా ఈ నాలుగు మాసాలు ఉండాలి. సన్యాసి ఈ నాలుగు మాసాలు తప్పకుండా ఈ దీక్ష పాటించాలి .నాలుగు మాసాలు కుదరనపుడు రెండు మాసాలైనా ఒకే చోట నివసించాలి.

చాతుర్మాసం ద్విమాసం వా
సదైకత్రైవ సంవసెత్ \\

అని ధర్మ శాస్త్రం చెపుతోంది. పూర్తీ అహింసా వ్రతావలంబకులైన ఆ యతులు యధావిధిగా అర్చనాదులు చేస్తారు. వర్షా కాలంలో అనేక కొత్త జీవాలు, అంకురాలు భూమి పై ఏర్పడతాయి. తమ నడకవల్ల వాటికి భాద కలుగ కూడదని యతుల సంకల్పము. అందుకే ఈ నాలుగు నెలలు ఒకే చోట నుండి పూజలు చేస్తారు
హైందవ సంస్కృతి మాస పత్రిక'సౌజన్యంతో....

Saturday, 13 July 2013

Jaji Sarma
శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనే తపన నిరతిశయ ఆనందాన్ని కలిగించేది

ఏ గ్రంథాన్ని అనుసంధానం చేయాలన్నా గ్రంథాన్ని, గ్రంథ ఉపదేష్ట అయిన గురువుని ఆ గ్రంథం ప్రతిపాదించే అధిష్టాన దేవతనీ మూడింటినీ సమ మైన విశ్వాసంతో ఉపాసించగలిగితే అది మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. గ్రంథమే కాదు ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలన్నా ఈ మూడు విషయాలపై ఉపాసన చేయాలి. గురువు ఉపాసన అన్నప్పుడు కేవలం గురువే కాదు ఆ గురుపరంపరను మొత్తం స్మరించాల్సి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కొంత మంది గురువులు తామంతట తామే తెలిసేసుకున్నాం అంటూ స్వయంభువాచార్యులు ఉంటారు. అలాంటి వారిని వైదికులు ఎప్పటికీ అంగీకరించరు. ఎందుకంటే మనకు జ్ఞానం అనేది పూర్వ కాలం నుండి వస్తుంది, ఒక గురు పరంపర ఉంది. ఏ జ్ఞానం అయితే పెద్దలు స్వీకరించి ఉపాసించారో అదే మనకు అందాలి తప్ప ఈవేళ ఎవడో స్వతంత్రంగా తయారు చేసి ఇస్తాను అంటే అందులో వాడి యొక్క స్వంత పైత్యం ఉంటుందని అర్థం. అట్లాంటిది పెద్దల చేత అనాదరించబడుతుంది. అందుకనే వేదం కూడా నేను చెబుతున్నాను అని అనలేదు. "ఇతి శుశృమ పూర్వేశాం ఏనత్ తత్ వ్యాద చక్షిరే" మేం కూడా ఇలా విన్నాం అని అంటుంది వేదం. మేం ఇది చెబుతున్నాం అని అనలేదు. అట్లా అంటే అది కూడా ప్రమాణం అయ్యేదే కాదు. ఎప్పడిదీ విజ్ఞానం, అప్పటి నుండి అందుతోంది, తెలియదు మనకి. ఇది ఒక జ్ఞాన ధార. మన దాకా ప్రవహిస్తుంది.

మునయః సాధు ప్రృష్టోహమ్ భవద్భిర్ లోకమంగళం |
యత్ కృతః కృష్ణ సంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి ||

"మునయః సాధు ప్రృష్టోహమ్ భవద్భిర్" హే మునుల్లారా! నేను ధన్యుణ్ణి. మీలాంటి మాహానుభావులచేత ఒక మంచి విషయాన్ని చెప్పేలా అడగబడాను, నాకూ నాల్కని బాగుచేసుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్నారు. మూరు ఆపాదించిన ఈ యోగ్యతకి చాలా సంతోషం. "లోకమంగళం యత్ కృతః కృష్ణ సంప్రశ్నః", లోకాలన్నింటికి మంగళాన్ని కలిగించే శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని అందించే ప్రశ్నను వేసారు. అఖిల దురితాలని తొలగిస్తుంది. సాక్షాత్ ధర్మమైన పరమాత్మని మనలో నింపుతుంది. తద్వారా మన జన్మకి ఒక సార్థకతని ఏర్పరుస్తుంది. అంతే కాదు "యేనాత్మా సుప్రసీదతి", దేనివల్ల అయితే ఈ జీవుడికి ఉండే దోషాలు తొలగుతాయో, వాడు శాంతిని పొందుతాడో, నిరతిశయ ఆనందాన్ని పొందుతాడో అలాంటి దాన్ని మీరు ప్రశ్న వేసారు.

మంచి విషయాలని తెలుసుకోవాలని కోరిక కలగటమే చాలా కష్టం. కలిగిన కోరిక తీరే విధానం లభించడం మరీ కష్టం. శౌనకాది ఋషులు తత్వాన్ని గురించి తెలుసుకోవాలన్న ప్రశ్నని సూతుల వారు మొదట విని వారిని పోత్సహించారు. మీరు వేసిన ప్రశ్న లోకానికంతటికీ క్షేమం కలిగించేటటువంటిది. ఆత్మని సంతృప్తి పరిచే ప్రశ్న వేసారు. సాక్షాత్తు భగవంతుని గురించి ప్రశ్న వేసారు అంటూ వారిని ప్రోత్సహించాడు. కఠోపనిషత్తులో నచికేతుడు ప్రశ్న వేస్తే యమధర్మ రాజు ఇంతటి ప్రశ్న వేసిన వాడు లోకంలో మరొకడు లేడు సుమా అంటూ పొగడుతాడు. అట్లా వారు వేసినది ఉత్తమమైన ప్రశ్న అని వారిని ఉత్తేజపరిచి మొదట వారు ధర్మం గురించి చెప్పడం ప్రారంభించారు.