Thursday 16 May 2013

సుర్య సిద్ధాంత గ్రంధ ఆధారముగా వార క్రమము ఏర్పడు విధానము

సుర్య సిద్ధాంత గ్రంధ ఆధారముగా వార క్రమము ఏర్పడు విధానము

శ్లొ|| మందమారేజ్య భూపుత్ర సూర్య శుక్రేందుజేందవ్:

మదాదధ: క్రమేణస్యు: చతుర్థా దివసాధిపా:||

అన్ని కక్ష్యలకంటే పైన నక్షత్ర కక్ష్య దానితరువాత శని కక్ష్య.

ఆ శని కక్ష్య నుండి నాల్గవ కక్ష్య సుర్య కక్ష్య కాబట్టి మొదటి వారం సుర్య(ఆది)వారము, సుర్యునికి నాల్గవ కక్ష్య 

చంద్ర కక్ష్య కాబట్టి రెండవ వారం చంద్ర(సోమ)వారము, చంద్రునికి నాల్గవ కక్ష్య కుజ కక్ష్య కాబట్టి మూడవ వారం 

కుజ(మంగళ)వారము, కుజునికి నాల్గవ కక్ష్య బుధ కక్ష్య కాబట్టి నాల్గవ వారం బుధవారము, బుధునికి నాల్గవ 

కక్ష్య గురు కక్ష్య కాబట్టి ఐదవ వారం గురువారము, గురునికి నాల్గవ కక్ష్య షుక్ర కక్ష్య కాబట్టి ఆరవ వారం 

శుక్ర(భృగు)వారము, శుకృనికినికి నాల్గవ కక్ష్య శని కక్ష్య కాబట్టి ఏడవ వారం శని(మంద)వారము.


ఈ క్రమముగా వారములు ఏర్పడినవి. కాబట్టి శాస్త్రాధారము వలన ఏడు గ్రహములే అని తెలుస్తున్నది


రాహు కేతువులను స్మర్త(స్మార్త)మందు గణము(శకలముగా), పురాణములయందు అసురులుగా చెప్పబడినది.

భుమి సూర్యుని చుట్టు దీర్ఘవృత్త కక్ష్యలో, చంద్రుడు భుమిచుట్టు వృత్త కక్ష్యలొ తిరుగుతూ ఉంటాడు, చంద్ర కక్ష్య 

భూకక్ష్య రెండు సార్లు ఖండన జరుగును. దక్షిణము నుండి ఉత్తరము వైపు దాటే ఖండన 

స్తానమును(బిందువును) రాహువుగా, ఉత్తరము నుండి దక్షిణము వైపు దాటే ఖండన 

స్తానమును(బిందువును) కేతువుగా (చంద్ర ఛాయ రాహువుగా భూ ఛాయ కేతువుగా) సిద్ధాంత శాస్త్రమున 

పరిగణించుదురు

.
నిద్రనుండి మేల్కొనగానే ఏలాగైతే పరిపూర్ణ ఉత్తేజులముకామో అదే విధముగా ఛాయ గ్రహముల ప్రభావము


 ఉన్నప్పుడు నిమీలిన స్థితిగా పరిగణించవలయును, అందుకే రాహు కేతు ప్రభావము ఉన్నప్పుడు మనస్సు 

నిలకడ లేకపోవుట, నిర్ణయములు తీసుకొనుటలో ఆలస్యము(బద్ధకము) ఎర్పడుట జరుగును ఇలా 


వివరించుకుంటూ వెళ్తే చాల సమయం పడుతుందని ఇక్కడితో స్వస్తి చెపుతున్నాను