Monday 26 March 2012

కోతిభార: సమర్థానాం | కిందూరం వ్యవసాయినాం ||
కోవిదేశ: సవిద్యానాం | క: పర: ప్రియవాదినాం ||

తాత్పర్యమ్: సమర్థుడైనవాడికి యే పని భారంగా ఉండదు... పరిశ్రమించేవాడికి దూరదేశం యేదీ కాదు... విద్వాంసులకు యేదీ విదేశం కాదు.... మృదుమధురంగా మాట్లాడేవాడికి ఎవడూ శత్రువులు కారు....!!
 
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను
వ్యాళం బాలమ్ర్ణాళతస్తుభిరసౌ రోద్దుం సముజ్జృమ్భతే
భేత్తుం వజ్రమణిం శిరీషకుసుమప్రాన్తేన సన్నహ్యతి,
మాధుర్యం మధుబిన్దునా రచయితుం క్షారామ్బుధేరీహతే
మూర్ఖాన్యః ప్రతినేతుమిచ్ఛతి బలాత్సూక్తైః సుధాస్మన్దిభిః!!

భావము:
మదపుటేనుఁగును తామరతూటి దారముతో బంధింపఁ జూచువాఁడును, దిరిసెన పువ్వు కొనచేత వజ్రమును గోయఁజూచువాఁడును, లవణసముద్రౌనందలి నీరును తియ్యగాఁ జేయుటకు అందు ఒక తేనెబొట్టును విడుచువాఁడును, మంచిమాటలతో మూర్ఖులను సమాధానపెట్టఁదలచువాఁడును సమానులు.

Saturday 24 March 2012

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద?
రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో!!!

(ఈ స్తోత్రం పఠించడం వలన తలపెట్టిన కార్యములు నిర్విఘ్నంగా నెరవేరుతాయి అని పెద్దల ఉవాచ!)

Friday 23 March 2012





1. శ్రీ ఆది శంకర భగవత్పాద
2. శ్రీ సురేశ్వరాచార్య
3. శ్రీ సర్వజ్ఞాత్మన్
4. శ్రీ సత్య బోధేంద్ర సరస్వతి
5. శ్రీ జ్ఞానానందేంద్ర సరస్వతి
6. శ్రీ శుద్ధానందేంద్ర సరస్వతి
7. శ్రీ ఆనంద ఘనేంద్ర సరస్వతి
8. శ్రీ కైవల్యానంద యోగేంద్ర సరస్వతి
9. శ్రీ కృప శంకరేంద్రసరస్వతి
10. శ్రీ సురేశ్వర
11. శ్రీ శివానంద చిద్ఘనేంద్ర సరస్వతి
12. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (మూక శంకర)
13. శ్రీ సచ్చిద్ ఘనేంద్ర సరస్వతి
14. శ్రీ విద్యా ఘనేంద్ర సరస్వతి
15. శ్రీ గంగాధరేంద్ర సరస్వతి
16. శ్రీ ఉజ్జ్వల శంకరేంద్ర సరస్వతి
17. శ్రీ సదాశివేంద్ర సరస్వతి
18. శ్రీ శంకరానంద సరస్వతి
19. శ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి
20. శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి
21. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి II
22. శ్రీ బోధేంద్ర సరస్వతి
23. శ్రీ సచ్చిసుఖేంద్ర సరస్వతి
24. శ్రీ చిత్ సుఖేంద్ర సరస్వతి
25. శ్రీ సచ్చిదానంద ఘనేంద్ర సరస్వతి
26. శ్రీ ప్రజ్ఞా ఘనేంద్ర సరస్వతి
27. శ్రీ చిద్విలాసేంద్ర సరస్వతి
28. శ్రీ మహాదేవేంద్ర సరస్వతి
29. శ్రీ పూర్ణ బోధేంద్ర సరస్వతి
30. శ్రీ బోధేంద్ర సరస్వతి II
31. శ్రీ బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి
32. స్రేఎ చిదానంద ఘనేంద్ర సరస్వతి
33. శ్రీ సచ్చిదానంద సరస్వతి
34. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి III
35. శ్రీ చిత్ సుఖేంద్ర సరస్వతి
36. శ్రీ చిత్ సుఖానందేంద్ర సరస్వతి
37. శ్రీ విద్యా ఘనేంద్ర సరస్వతి III
38. శ్రీ అభినవ శంకరేంద్ర సరస్వతి
39. శ్రీ సత్చిద్విలాసేంద్ర సరస్వతి
40. శ్రీ మహా దేవేంద్ర సరస్వతి II
41. శ్రీ గంగాధరేంద్ర సరస్వతి II
42. శ్రీ బ్రహ్మానంద ఘనేంద్ర సరస్వతి
43. శ్రీ ఆనంద ఘనేంద్ర సరస్వతి
44. శ్రీ పూర్ణ బోధేంద్ర సరస్వతి II
45. శ్రీ పరమ శివేంద్ర సరస్వతి I
46. శ్రీ సంద్రానందభోదేంద్ర సరస్వతి
47. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి IV
48. శ్రీ అద్వైతానంద బోధేంద్ర సరస్వతి
49. శ్రీ మహాదేవేంద్ర సరస్వతి III
50. శ్రీ చంద్ర చూడేంద్ర సరస్వతి I
51. శ్రీ కామ చూడేంద్ర సరస్వతి
52. శ్రీ విద్యా తీర్ధేంద్ర సరస్వతి (1297–1370)
53. శ్రీ శంకరానందేంద్ర సరస్వతి (1370–1417)
54. శ్రీ పూర్ణానంద సదాశివేంద్ర సరస్వతి (1417–1498)
55. శ్రీ వ్యాసాచల మహాదేవేంద్ర సరస్వతి (1498–1507)
56. శ్రీ చంద్ర చూడేంద్ర సరస్వతి II (1507–1524)
57. శ్రీ సర్వజ్ఞ సదాశివ భోదేంద్ర సరస్వతి (1524–1539)
58. శ్రీ పరమ శివేంద్ర సరస్వతి II (1539–1586)
59. శ్రీ ఆత్మ బోధేంద్ర సరస్వతి (1586–1638)
60. శ్రీ బోధేంద్ర సరస్వతి (1638–1692)
61. శ్రీ అద్వైతాత్మ ప్రకాశేంద్ర సరస్వతి (1692–1704)
62. శ్రీ మహాదేవేంద్ర సరస్వతి IV (1704–1746)
63. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి V (1746–1783)
64. శ్రీ మహాదేవేంద్ర సరస్వతి V (1783–1813)
65. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VI (1813–1851)
66. శ్రీ సుదర్శన మహాదేవేంద్ర సరస్వతి (1851–1891)
67. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి VII (1891 - February 7, 1907)
68. శ్రీ శ్రీ మహాదేవేంద్ర సరస్వతి V (February 7, 1907 - February 13, 1907)
69. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగళ్ (February 13, 1907 - January 3, 1994)
70. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్
71. శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామిగళ్
     

Thursday 22 March 2012

ఉగాది


ఆరోగ్యం నయతీతి ‘నింబః’ - అనగా వేప
గుడతి రక్షతీతి ‘గుడం’ - అంటే బెల్లం
లునాతివాతం జాడ్యంవా ‘లవణం’ - అంటే ఉప్పు
సహస్రరోగాన్ విధ్యతే ఇతి ‘సహస్రవేధి’ - అంటే చింతపండు
జీర్యతే అన్నమనే నేతి ‘జీరకః’ - అంటే జీలకర్ర
... సహకారయతి మేళయతిస్ర్తి ‘సహకారః’ - అంటే మామిడి.
ఇలా... వేప ఆరోగ్యాన్ని, బెల్లం రక్షణను, ఉప్పు వాత, మాంద్యాల హరణను, చింతపండు పలు రోగ నాశకంగానూ, జీలకర్ర అజీర్ణం పోగొట్టేదిగానూ, ఇక మామిడి స్త్రీ పురుషుల కలయికకు ఉపయోగపడేదిగాను భాసిస్తూ ఉన్నాయి. గర్భిణి పుల్ల మామిడి ముక్కలు తినాలని కోరుకోవడంలోని ఆంతర్యమూ అదే!
శాస్త్రాలలో వేప పూత పచ్చడిని ‘నింబకుసుమ భక్షణం’ అని చెప్పారు. లేత మామిడి చిగురు, అశోక వృక్షం చిగుళ్లు, వేప పూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి, చెరుకు ముక్కలు కలిపి ఉగాది పచ్చడి చేస్తూంటారు. అలా ఉగాది పచ్చడిని సేవించి పంచాంగ శ్రవణం చేయాలనేది సంప్రదాయం.


ఉగాది పచ్చడి చేయడం కూడా నేర్పుతారా మీరు..అని తిట్టకండి..
పూర్తి శాస్త్రీయంగా చేయడం కోసం ఉపయోగపడుతుందని..అంతే...:)

శ్రీ కల్యాణ గుణావహం
రిపుహరం దుస్స్వప్న దోషాపహం
గంగాస్నాన విశేష పుణ్యఫలదం
గోదాన తుల్యం నృణామ్
ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం
... సంతాన సంపత్ప్రదమ్
నానాకర్మ సుసాధనం సముచితం
పంచాంగమాకర్ణ్యతామ్’ - అని చెప్పబడింది.
పంచాంగం’ సిరిసంపదలు కలిగిస్తుంది. శత్రువులను నశింపజేస్తుంది. చెడు స్వప్న దోషాలను పోగొడుతుంది. గంగాస్నానం చేసిన పుణ్యాన్ని, గోదానంతో సరితూగే పుణ్యాన్ని కూడా ఇవ్వగలదు. ఆయుష్షును వృద్ధి చేస్తుంది. మంచి శుభాలనూ, సంతానాది భోగభాగ్యాలను కలిగిస్తుంది. అనేక పనులను సులభసాధ్యాలుగా చేస్తుంది. కాబట్టే ‘పంచాంగ శ్రవణానికి’ ఎంతో ప్రాధాన్యం ఉంది.


Wednesday 21 March 2012

దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః |
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః || 



పై శ్లోకమునకు అర్ధము ;
దాదదః =శ్రీ కృష్ణుడు ,దుద్దరుత=వరముల నన్నిటిని,దాదీ=ఇచ్చువాడు,
దాదదః=పాపములను దహించు వాడు,దదోః=దుష్టులను ,దూదదీ = శి క్షిం చు వా డు 
దుద్దాదం = మం చి వారిని ,దుద్దే = కాపాడుట యందు ,దదదే = దీక్ష గలవాడు 
దదోదదః = ధర్మాధర్మములను ,దాదా = మిక్కిలిగా ,ద ద = ధరించువాడు 
అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడు .
------ 
విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్
విద్య యశస్సు భొగకరి విద్య గురుండు విదేశ బంధుడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాల పూజితము విద్య నెఱుంగని వాడు మర్త్యుడే ... 
నిండా నూరేళ్ళు బ్రతికి సర్వవిధాల ఉన్నతిని సాధింపదగిన మనుష్యుడు అల్పాయుష్కుడై అకాల మరణం వాత పడుతున్నాడు. మరణమైనా కొంతమేలేగాని కొందరు జీవించినంత కాలం రోగ పీడితులై తమకు, తోటి వారికి కూడా భరింపరాని రీతిలో జీవింపగల్గుతున్నారు. "ఎప్పుడు ప్రాణం పోతుందా" అని ఎదురు చూచే స్థితికి కూడా వస్తున్నాడు. ఇహమునకు, పరమునకు కొరగాని పాడుజన్మను నిందించుకొనుట తప్ప అట్టి వారు చేయగలదిలేదు. సదాచార సంపద సాధిస్తే వారికీదురవస్థ ఏపడదు. చతుర్విధ పురుషర్థ సాధనే జీవిత లక్ష్యం. "ధర్మార్థ కామ మోక్షాణాం మూలముక్తం కళేబరం" అని అన్నిటికీ ఈ దేహమే మూలం కాబట్టి దీని రక్షణను సత్త్వ మార్గంలో జ్ఞాన మోక్షములకు అర్హమగునట్లు చూచుకొనాలి. ఇది ఐహిక భోగాన్నికోరుకొనేవారికే కాదు శరీరాన్ని అశాశ్వతంగా తలచే వేదాంతులకైనా తప్పదు. అందుకే "సర్వ మన్యత్ పరిత్యజ్య శరీర మనుపాలయేత్" అని అగ్నివేశముని అన్నిటినీ వదలి ముందు శరీరాన్ని రక్షించుకోమన్నాడు. "బలవర్ధకాహారాలు, కావలసినన్ని మందులతో శరీరాన్ని కాపాడుకోవచ్చుకదా!" అని ప్రశ్నింపవచ్చు. అలా కాపాడుకొనే దేహం ఇహానికే తప్ప పరానికి పనికి రాదు. సార్థక జన్మ కాదు. అలా జన్మ సార్థకత సాధించుకొనటానికి ఏకైక మార్గం సదాచారం. ఆ మార్గంలో నడచిన శరీరం మాత్రమే పురుషార్థ సాధకమైన హైందవ పవిత్ర శరీరం కాగలదు. సదాచారం వలన సమస్తము చేకూరుతాయి. మను ధర్మ శాస్త్రం "ఆచారా ల్లభతే హ్యాయు: - ఆచారా దీప్సితా: ప్రజా:| ఆచారా ద్ధన మక్షయ్యం - ఆచారో హం త్యలక్షణం|| అని సదాచారం వలన ఆయుర్ధాయం పెరుగుతుందని, సత్సంతానం లభిస్తుందని, తరగని సంపద చేకూరుతుందని, దుర్లక్షణాలన్నీ తొలగిపోతాయని చెప్తోంది. అది నిజం. సదాచార పరుడు అకాల మృత్యువు వాత పడడు. "అకాల రతి క్రియల వల్ల దుర్జనులు పుడతా"రని శాస్త్రం చెప్పింది. ఆ విషయం "సంధ్యా సమయంలో సంభోగం చేసినందువల్ల విశ్వవో బ్రహ్మ సంతానం రావణ కుంభకర్ణాదులు రాక్షసులయ్యా"రని పురాణం నిరూపిస్తోంది. అలా కాక సదాచార పరులైతే వారికి తప్పక సత్సంతానమే కలుగుతుంది. లోకంలో పుట్టే దుర్మార్గుల జన్మలకి ఇలాటి సదాచార లోపమే మూలం. "ఆరోగ్యమే మహాభాగ్య"మన్నట్లు సదాచారం చే దుర్వ్యయాలు లేక సంపద నిలచి ఉంటుంది. ఇక్కడ ఆచారమంటే అనర్థదాయకమైన మూడాచారం కాదు. ఆ మూడాచారం దు:ఖ హేతువు. సదాచార ధర్మాలు ఎప్పుడూ మానవులకు సుఖశాంతులనే ప్రసాదిస్తాయి. అందుకే "సుఖార్థా: సర్వభూతానాం - మతాః సర్వాః ప్రవృత్తయః | సుఖం చ న వినా ధర్మః - తస్మాత్ ధర్మ పరో భవ |" అని ప్రాణులకు సుఖ సంపాదకములుగానే మన మత ధర్మాలు ఏర్పడ్డాయి. మూఢాచారంతో స్నాన, అన్న, పానములు అక్రమంగా చేసి ధర్మాన్ని నిందించడం తగదు. ఒక డాక్టరు గారు స్వయంగా చెప్పిన సంఘటన ఇది. ఒకామె వ్యాధి గ్రస్తురాలైంది. శిరస్నానం తగదని చెప్పినా వినక అలాగే చేస్తూ దేవుళ్ళకు మ్రొక్కేది. వ్యాధి నయం కాలా. కొన్నాళ్ళకు బొట్టు లేకుండా కనబడి "క్రైస్తవమతం తీసుకున్నాక జబ్బు తగ్గిందండి" అంది. డాక్టరుగారు "ఇప్పుడు శిరఃస్నానం చేస్తున్నావా? అనడిగితే లేదంది. నేను చెప్పినట్లుగా చేసి ఉంటే మతం మారకపోయినా జబ్బు తగ్గి ఉండేది. నీ రోగం తగ్గడానికి కారణం మతం మార్పు కాదు. ఆచరణలో మార్పు అన్నారట ఆ డాక్టరు గారు. అలా మూఢాచారాలు కూడా మన ధర్మానికెంతో అపకారం చేస్తున్నాయి. హేతుబద్ధంగా సుఖశాంతులను కలిగించేదే మన సదాచారం అంతా. అలాకాని దశలో అన్నీ మూఢాచారాలుగానే పరిగణింపబడతాయి. కాబట్టి యోగ్యమగు ఆచారమే నిల్పి ధర్మాన్ని రక్షించాలి, శ్రౌత, స్మార్త కర్మలు చేయలేని వారికి సదాచారమే ఆ లోటు తీర్చగలది. 

Monday 19 March 2012

స్నానం చేసేటప్పుడు పటించవలసిన శ్లోకములు

స్నానం చేసేటప్పుడు పటించవలసిన శ్లోకములు:

గంగే మంగళ తరంగిణి:

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి!
... ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!

అంబుత్వర దర్శనాన్ముక్తిహి నజానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపనే మహా పుణ్య తరంగిణి!!

యో2సౌ సర్వగతో విష్ణుః చిత్‍స్వరూపీ నిరంజనః!
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!

త్వం రాజా సర్వ తీర్దానాం త్వమేవ జగతః పితా!
యాచితో దేహి మే తీర్ధం సర్వ పాపాపనుత్తయే!!

నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతాం గంగా త్రిపధగామినీ!!

భాగీరధీ భాగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ!
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నాన కాలే పటేన్నిత్యం మహాపాతక నాశనం!!

మణికర్ణిక! మణికర్ణిక! మణికర్ణిక!

స్నానానికి నదీ జలం (నిలవ నీరు కాదు కాబట్టి) శ్రేష్టం. కానీ అన్ని వేళలా నదీ స్నానం కుదరకపోవచ్చును. కాబట్టి స్నానం చేస్తున్న నీటిని నదీ జలాల వలె భావించి చేయమనే ప్రార్థన ఇది

జగద్గురువిరచిత స్తోత్రములు

జగద్గురు ఆదిశంకరాచార్య భగవత్పాద విరచిత స్తోత్రములు
ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాతమతత్వం!
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్!
యత్స్వప్నజా...గర సుషుప్తమవైతి నిత్యం!
తత్బ్రహ్మ నిష్కల్మహం న చభూతసంఘః!!

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం!
వాచోవిభాన్తి నిఖిలా యదనుగ్రహేణ!
యం నేతి నేతి వచనైహ్ నిగమా అవోచు!
స్తం దేవ దేవమజ మచ్యుతమాహురగ్ర్యం!!
మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం!
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యాం!
యస్మిన్నిదం జగదశేషమశేష మూర్తౌ!
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై!!
అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయ విభూషణం!
ప్రాతః కాలే పటేద్యస్తు సగత్సేత్పరమం పదం!!
మూడూ లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పటించునో వారు మోక్షమును పొందును.
See More
 

Friday 16 March 2012

తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి, బ్రహ్మానందం పొందేవాడు. ఆయనే కాదు, ఆ గానామృతానికి పరవశించిపోయిన అనేకమంది, తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకుని, నిరంతరం శ్రీరాముని స్మరిస్తూ ఆనందంలో ఓలలాడేవారు. కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మతగురువులకు ఆగ్రహం తెప్పించింది. మతచాందసవాదులు కొందరు, కబీరు మా మతాన్ని కించపరచి, మతమార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి నేరారోపణ పత్రాలు సమర్పించారు. ఆపరిస్థితులలోనే ఒక సంఘటన జరిగింది.
ఒకరికొకరుగా జీవించే చిలకాగోరింకల్లాంటి జంట ఒకటి ఉంది. అతను హఠాత్తుగా కన్నుమూశాడు. అతని భార్య దుఃఖం వర్ణనాతీతం. కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, శోకమూర్తిలా ఉన్న ఆమెను చూసి అందరికీ మనసు అర్ద్రమైంది. కానీ ఎవరు మాత్రం ఏం చేయగలరు! పోయిన ప్రాణం తెప్పించే శక్తి ఎవరికి ఉంది!
అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. కానీ, కొద్దిసేపటికే ఆ అమ్మాయి పట్టుకున్న వారిని వదిలించుకొని పరుగుపరుగున శవయాత్రసాగే ప్రదేశానికి చేరుకుంది. అప్పటికి ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమము చూడగానే, ఆమెకు ఏమనిపించిందో! తన భర్తని బ్రతికించగల మహానుభావుడు అక్కడ ఉన్నాడనుకుందేమో! ఆ ఆశ్రమములోని భక్తుడు శ్రీరామచంద్రుని అనుగ్రహమువల్ల తన శోకం రూపుమాపగలడనుకున్నదేమో! ఏమనుకుందో ఏమోగాని, ఆ అమ్మాయి హఠాత్తుగా ఆ ఆశ్రమములోనికి వెళ్ళి, తులసీదాస్‌ పాదాలమీద వాలి శోకించింది.
నుదుటబొట్టు, చేతులకు గాజులు మొదలైన సౌభాగ్య చిహ్నాలతో ఉన్న ఆమెను చూసిన తులసిదాస్‌, దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. ఆ దేవెనకి ఆమె మరింతగా శోకించింది. సౌభాగ్యవతీ! ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. కారణం చెప్పమ్మా! అని అనునయంగా పలికాడు తులసిదాస్‌‌. నాబోటి నిర్భాగ్యురాలిని - దీర్ఘసుమంగళీభవ అని దీవించారు స్వామీ! మీబోటి మహానుభావుల దేవెన నిష్పలమైంది కదా! అంటూ కుమిలి పోయింది ఆ ఇల్లాలు. శ్రీరామచంద్రుడు నానోట అసత్యం పలికించడమ్మాఅ! ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు తులసీదాస్‌. మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యమునకు అర్థమేముంది అంటూ భోరుమంది ఆ అమ్మాయి. తులసిదాసు హృదయము జాలితో నిండిపోయింది. ఆయన వెంటనే ఆ శవయాత్ర దగ్గరకు వెళ్ళి, శవవాహకులను ఆగమన్నాడు. వారు ఆగిపోయారు. ఆ శవం కట్లు విప్పి, ఆ రామభక్తుడు రామనామాన్ని జపించి, తన కమండలములోని జలాన్ని శవంమీద జల్లాడు.
అంతే! అద్భుతం జరిగింది. శవంలో జీవం వచ్చింది. అటూ ఇటూ కదిలి కళ్ళు తెరిచాడు. చైతన్యవంతమైన అతనిని చూసిన ఆతని భార్య ఆనందబాష్పాలు రాలుస్తూ, తులసీదాసు పాదాలపై వాలిపోయింది. బంధుమిత్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు డిల్లీ పాదుషావారి దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించడానికై తులసీదాసుని పిలిపించాడు పాదుషా. వారి మధ్య జరిగిన సంఘటనలో, రామనామం ఎంతో శక్తివంతమైనదని, రామనామస్మరణ ద్వారా దేనినైనా సాధించవచ్చని చెప్పాడు తులసీదాసు. మరణించినవారిని బ్రతికించగలదా మీ రామనామం అని అడిగాడు పాదుషా. తప్పకుండా అని జవాబిచ్చాడు తులసీదాసు. మేము ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాము. మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా. రామనామం చాలా మహిమ కలది. చనిపోయిన వ్యక్తిని బతికించగలదు. కానీ జననమరణాలు వ్యక్తి కర్మలమీద, దైవనిర్ణయం మీద ఆధారపడి ఉంటాయు. వాటి విషయం మానవమాత్రులమైన మనం కలిగించుకోవడం తప్పు కదా! అన్నాడు తులసీదాసు. ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు. అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా.
రామచంద్రా! ఇదేమి పరీక్ష! రాజు కన్నెర్ర చేస్తున్నాడు. అంత మాత్రాన ఇతను చెప్పిన పని చేయలేను కదా! రామా! ఈ విపత్తు నుండి నీవే నన్ను రక్షించాలి రామా! అని మనసులోనే వేడుకుంటూ కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడైయ్యాడు తులసీదాసు. సమాధానం చెప్పకపోవడం, కళ్ళు మూసుకుని ఉండటం, కనీసం తన తప్పు కాయమనుకోవకపోవడం, శరణు వేడకపోవడం, ఇవన్నీ పాదుషాకి కోపం తెప్పించాయి. తులసీదాస్‌ని బంధించమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు వైపు సైనికులు కదిలారు. మనసా, వాచా, కర్మణా - త్రికరణశుద్ధిగా తననే నమ్మే ఆ భక్తునికి , ప్రతిక్షణం రామనామస్మరణ చేసే తన సేవకునికి, ప్రాణపాయసమయంలో కూడా తన మీదే భారం వేసిన ఆ మహానుభావునికి అపాయం చుట్టుముడుతుంటే రామభద్రుడు ఊరుకుంటాడా! తక్షణమే తన సైన్యాన్ని పంపించాడు.

ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ, వందలు, వేలుగా కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను గుంజుకుని వారిమీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా, ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో సభికులు భయాందోళనలకు గురయ్యారు. సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చొని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడయి, ఆ భక్తుని అనుగ్రహించాడు. నాయనా! నీస్తుతితో మరింత ప్రసన్నం చేసుకున్నావు. బిడ్డా! ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి.
చేతులు జోడించి భక్తిగా తలవాల్చాడు తులసీదాసు. స్వామీ! ఇప్పటికే ప్రాణాలరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన. ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడ వవు స్వామీ! నాకు ఈ వరాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడయ్యాడు. తథాస్తు అని అనుగ్రహించాడు.

నాటి నుంచి హనుమాన్‌ చాలీసా చదివిన వారికి స్వామి ప్రసన్నుడయి అనుగ్రహిస్తున్నాడు. 

|| జయ హనుమాన్ ||  నా స్నేహితుడు నూకల హరికృష్ణ సంకలనం .


Thursday 15 March 2012

బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,
మరణకాలమునందు మఱతునేమో?
యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ
... గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ
బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?
తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ
దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను!
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర
ఏకశ్లోకీ భాగవతం:

ఆదౌ దేవకి దేవి గర్భ జననం గోపీగృహే వర్ధనం!
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం!
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీ సుతాం పాలనం!
ఏతద్భాగవతం పురాణకధితం శ్రీకృష్ణ లీలామృతం!!
శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం!
న చే దేవం దేవో నఖలు కుశలః స్పందితు మాపి!
అతస్త్వా మారాధ్యం హరిహర విరించా దిభి రపి!
ప్రణంతు స్తోతుం వా కథ మకృత పుణ్యః ప్రభావతి!!

... భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొందే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?

ఈ శ్లోకంలో శ్రీ చక్రం ఉంది. ఈ శ్లోక చదవడం వలన దంపతుల మధ్య అన్యోన్యత సిద్ధిస్తుంది. దినమునకు 100సార్లు చొప్పున 12 దినాలు జపించి త్రిమధురము (బెల్లము+నేయి+కొబ్బరి) లేదా మధురమైన అపూపము నైవేధ్యంగా పెడితే ఇష్ట సిద్ధి, అభ్యుదయము, సకల విఘ్ననివారణ కలుగుతాయి

Monday 12 March 2012

మాతృపంచక శ్లోకములు:

౧. ముక్తామణిస్త్వం నయనం నమేతి రాజేతి జీవేతి చిరం సుత త్వం!ఇతి ఉక్తవత్యాః తవవాచి మాతః దదామ్యాహం తండులమేవ శుష్కమ్!!'నువ్వు నా ముత్యానివి, నా రత్నానివి, నా కంటి వేలుగువు, కుమారా! నువ్వు చిరంజీవివై వర్ధిల్లాలి' అని ప్రేమగా నన్ను పిలిచినా నీ నోటిలో అమ్మా, ఈనాడు కేవలం ఇన్ని ముడి బియ్యపు గింజలను వేస్తున్నాను.

౨.అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతికాలే కియదవోచ ఉచ్చైహ్!క్రిష్ణేతి గోవిందేతి హరే ముకుందేతి అహో జనన్యై రచితోయమంజలిహ్!!'అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!' అంటూ పంటి బిగువున ప్రసవ వేదనను భరించి నాకు జన్మనిచ్చిన తల్లీ! నీకు నమస్కరిస్తున్నాను.

౩.ఆస్తాం తావడియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యధా!నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యా చ సాంవత్సరీ!ఏకస్యాపి న్ గర్భభార భరణ క్లేశస్య యస్స్యాక్షమో!దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః!!అమ్మా! నన్ను కన్నా సమయంలో నువ్వు ఎంతటి శూల వ్యధను అనుభించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి, శయ్య మలినమైనా - సం!! కాలం ఆ క్లేశాన్ని ఎలా భరించావో కదా! ఎవరైనా అలాంటి బాధను సహించగలరా? ఎంత ఉన్నతుడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగాలడా? నీకు అంజలి ఘటిస్తున్నాను.

౪.గురు కులముపసృత్య స్వప్న కాలేపి తు దృష్ట్వా!యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైహ్!గురుకులముపసృత్య సర్వం ప్రరుదత్తే సమక్షం!సదపి చరణయోస్తే మాతురస్తు ప్రణామః!!స్వప్నంలో నన్ను సన్యాసి వేషంలో చూసి, కలతపడి, గురుకులానికి వచ్చి బిగ్గరగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఖేదం కలిగించింది. అంతటి ప్రేమమయివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నానమ్మా!

౫.న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా!స్వ గావా నో దత్తా మరనదివసే శ్రాద్ధవిధినా!న దత్తో మాతస్తే మరణ సమయే తారక మనురకాలే!సంప్రాప్తే మయి కురు దయం మాతరతులాం!!అమ్మా! సమయం మించి పోయాక వచ్చినందువల్ల మరణ సమయంలో గుక్కెడు నీళ్ళు కూడా నేను నీ గొంత్లో పోయలేదు. శ్రాద్ధ విధిగా గోదానమైనా చేయలేదు. ప్రాణోత్క్రమణ సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని ఉచ్ఛరించలేదు. నన్ను క్షమించి, నా యందు తులలేని దయ చూపించు తల్లీ!

ఈ ఐదు స్లోకాశ్రు కణాల్లోనూ 'మాతృదేవో భవ' అనే గంభీర ఉపనిషద్వాణి ప్రతిష్టితమై ఉంది. మహిత వేదాంత ప్రవచానానికే కాదు - మహనీయ మాతృ భక్తి ప్రకటనకు కూడా ఆచార్యకం ఆదిశంకరుల వాణి.

Wednesday 7 March 2012

శీఘ్ర వివాహానికి seegra vivaha mantram.

కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరీ!
నంద గోప సుతం దేవి పతిం మే కురు తే నమః!
ఇతి మంత్రం జపంత్యస్తాః పూజాం చక్రుహ్ కుమారికాః!!

ఓ దేవీ! నీవు కళ్యాణమునకు నిధానమవు మహా మాయావు, గొప్ప యోగినివి, సర్వేశ్వరివి. నాకు నంద గోపుని పుత్రుడగు శ్రీకృష్ణుని భర్తగా చేయుము, నీకు నమస్కారము, అనే మంత్రమును జపిస్తూ ఆ కన్యను పూజ చేసిరి (శ్రీ మద్భాగవతం - దశమ స్కందం)

ఎవరైతే ఈ శ్లోకమును భక్తి తో చదువుతారో వారికి త్వరగా వివాహం అగును