Saturday, 24 August 2013

తులసి:

తులసి:

శ్రవణే చ, వ్యతీపాతే, భౌమ భార్గవ భానుషు,

పక్షద్వయాంతే, సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,

తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!

ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా


నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః కుర్యాత్ 

హరిహరార్చనం!

నం సత గర్భ గృహం మాతి ముక్తిభాగీ భవేన్నరః!!

తులసీ దళాలతో హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.


ప్రతి రోజూ తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం


 అవుతాయి. ప్రతి రోజూ రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే 

కాకుండా వాక్శుద్ధి విశేషంగా కలుగుతాయి.

Friday, 23 August 2013

సంకట చతుర్ధి పూజ గురించి

http://www.dhrishticreations.com/files/ganeshapooja1.htm

http://www.drikpanchang.com/festivals/sakat-chauth/sakat-chauth-date-time.html
కోరిన వరాలు ఇచ్చే కొంగు బంగారం గణేశుడు
ganeshaమనం సాధారణంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజకి అయినా ముందుగా ఎలాంటి విఘ్నాలు రాకూడదని పూజించే దైవము విఘ్నేశ్వరుడే! పిల్లలకి చదువు సంధ్యలు... పెద్దలకి వృత్తి ఉద్యోగాలు... లభించాలన్నా; భారతదేశం అప్పులు తీర్చటానికైనా మనం తప్పక పఠించేది గణేశ శ్లోకాలే అంటే అతిశయోక్తి కాదు. ఏ పూజలోనైనా ముందుగా పసుపు వినాయకుని చేసి మండపారాధన కావించి సంకల్పం చెప్పుకొని అపుడు మిగిలిన పూజ కార్య్రకమాలు నిర్వహిస్తాము. ఇది అంతా ఎందుకు? వినాయకుని ప్రార్ధిస్తే అంతా విజయమని... అలాగే విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నములు తొలగించి ముందుకు నడిపే వాడని! వినాయక చవితిని కూడా చిన్నా, పెద్దా, ఆడ, మగా అందరూ ఎంతో ఇష్టంగా చేయటం పరిపాటి. వినాయకుని ప్రార్ధిస్తే సకల శుభాలు జరుగుతాయని బలమైన నమ్మం!
అసలు నమ్మకం అనే కాదు అది నూటికి నూరు పాళ్ళు నిజం! అలాంటి వినాయకునికి సంబంధించి నదే ఈ సంకష్ట హర చతుర్ధి!
సంకష్ట హర చతుర్ధి౎ లేక సంకష్ట చతుర్ధి౎ లేక సంకట్‌ గణేశ్‌ చతుర్ధి౎ అనేది ప్రతి మాసం కృష్ణ పక్షం లో నాలుగవ రోజు వచ్చే చవితి. సంకట హర చతుర్ధి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్ట చతుర్ధి అంటారు.

వినాయకుని ఆరాధకులు సంకట వినాయక వ్రతం అనేది అత్యంత ప్రాముఖ్యమైన వ్రతంగా భావిస్తారు. ఆ రోజు అంతా ఉపవాసం వుండి సంకట గణేశ పూజ సాయంకాలం జరిపి, చంద్రదర్శనం అయినాక వారి ఉపవాసం ఆపి ఏదన్నా తింటారు.
అసలు ఈ సంకట చతుర్ధి౎ ప్రాముఖ్యత, ఉనికి అనేవి భవిష్య పురాణంలోనూ నరసింహ పురాణం లోనూ చెప్పబడింది. ఈ సంకట చతుర్ధి మహత్యం శ్రీ కృష్ణుడుచే యుధిష్టరునికి చెప్పబడింది. సంకట౎ అంటే కష్టములు/ఇబ్బందులు/ సమస్యలు హర౎ అంటే హరించటం/రూపుమాపటం మోచనమన్న అర్థంగా చెప్పవచ్చు.

అంటే సంకట హర అనగా ఎలాంటి కష్టములైనా హరించే అనచ్చు.
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు... ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.

వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
మనం ఇప్పుడు ఖర నామ సం వచ్చే సంకష్ట హర చతుర్ధి గురించి, సంకట నాశన గణేశ్‌ స్త్రోత్రం, షోడశోపచార పూజ విధానం అంటే ఏమిటి? వినాయకునికి పూజ చేసేపుడు పాటించాల్సిన నియమాలు/ పూజలో తెలుసుకోవల్సిన అంశాలు... వివరంగా చూద్దాం!
హిందువులలో ఉన్న ఒక సంపూర్ణ విశ్వాసం ఏంటంటే ఏ వ్యక్తి అయినా స్ర్తీ/ పురుషులలో మోక్షం పొందటానికి ముందు 7 జన్మలు ఎత్తుతారు. ఆ ఏడు జన్మల అనంతరం మోక్షం పొందుతారు. కానీ ఎవరైతే సంకష్టహర చవితి చేస్తారో వారు గణేష లోకానికి వెడతారు. వారికిక పునర్జన్మ అనేది ఉండదు అని!

ఖర నామ సంవత్సరంలో వచ్చే సంకష్ట హర చతుర్ధిలు
మే నెలలో : 20-5-11...   శుక్రవారం
జూన్‌ : 19-06-11... ఆదివారం
జులై : 19-07-11... మంగళవారం
ఆగస్ట్‌ : 17-08-11... బుధవారం
సెప్టెంబర్‌ : 16-09-11... శుక్రవారం
అక్టోబర్‌ : 16-10-11... ఆదివారం
నవంబర్‌ : 14-11-11... సోమవారం
డిసెంబర్‌ : 14-12-11... బుధవారం
జనవరి : 13-01-12... శుక్రవారం
ఫిబ్రవరి : 11-02-12... శనివారం
మార్చి : 12-03-12... ఆదివారం

ఇందులో మళ్ళీ మంగళవారంతో కూడిన సంకష్ట చతుర్ధిని మనం ‘అంగారక సంకష్ట చతుర్ధి’ అని వ్యవహరిస్తాం. అది జులై 19 నాడు వస్తున్నది.

ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకునికి పూజ చేయాలి. పూజలో కూడా ‘సంకట నాశన గణేశ స్తోత్రమ్‌’ ప్రత్యేకంగా 3సార్లు పఠించాలి. 

ఎవరెవరు ఏ విధమైన కోరికలు కోరుకుంటారో అవి అన్నీ తీరుతాయి. విద్యార్ధులకు విద్య, సంతానార్ధులకు సంతానం, ధనాన్ని కాంక్షించే వారికి ధనం.. ఇలా ఎవరెవరికి కావలసిన విధంగా వారు మనసారా వినాయకుని పూజించి, వేడుకొని వినాయకునికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. 
ఈ వ్రతాన్ని కేవలం దక్షిణ భారతీయులే కాక ఉత్తర భారతీయులు కూడా అమితంగా పాటిస్తారు.

ఈ క్రమంలో షోడశోపచార పూజా విధానం... అర్థం క్లుప్తంగా..
ఎవరైనా పెద్దవారు మనింటికి వస్తే ఆదరంగా ఆహ్వానించి సాదరంగా ఎలా మర్యాదలు చేస్తామో, అదే రకంగా మన ఇష్టదైవాన్ని 16 రకాల ఉపచారాలు చేసి సేవించటమే షోడశోపచార పూజా విధానం. ఇది మన సత్సంప్రదాయం.

1. ఆవాహనం - వారిని మన ఇంటిలోకి మనస్ఫూర్తిగా రమ్మని ఆహ్వానించుట.
2. అర్ఘ్యం - కాళ్ళు, చేతులు కడుగుకోవటానికి నీళ్ళని వినయంగా అందించుట
3. పాద్యం- ’’
4. ఆసనం - వచ్చిన పెద్దలు కూర్చోవటానికి తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయుట
5. ఆచమనీయం - మంచినీళ్ళు (దాహం) ఇవ్వడం
6. స్నానం- వారి ప్రయాణ అలసట తొలగేందుకు స్నానం వగైరా ఏర్పాట్లు
7. వస్త్రం - స్నానానంతరం ధరించేందుకు మడి లేక పొడి బట్టలు ఇవ్వడం
8. యజ్ఞోపవీతం- మార్గమధ్యలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9. గంధం - శరీరానికి సుగంధం, చల్లదనానికి గంధాన్నివ్వడం
10. పుష్పం - సుగంధాన్ని ఆస్వాదించేలా అలంకరణకి
11. ధూపం - సుగంధ వాతావరణం కల్పించటానికి
12.. దీపం - వెలుతురు కోసం, చీకటిలో ఉండకూడదు కనుక అనుకూలతకై
13. నైవేద్యం - తన తాహతు రీత్యా, తనకి అనుకున్న దానిని ముందుగా ఆ దైవానికి సమర్పించటం 
14. తాంబూలం- ముఖ సుగంధార్ధంగా, భుక్త పదార్ధాలలోని లోపాలు తొలగింపుకు
15. నమస్కారం - మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించ మని కోరడం
16. ప్రదక్షణం - ఆ దైవం యొక్క గొప్పతనాన్ని త్రికరణ శుద్ధిగా 
అంగీకరించటం. 

ఏది ఏమైనా సంవత్సరంలో ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్షంలో నాలుగవ రోజైన ఈ చవితికి అత్యంత మహిమగల చవితిగా పేరున్నందున వినాయకుని సంపూర్ణ విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఆనాడు ఉపవాసం రాత్రి వరకూ ఉండి తర్పక్రియుడైన వినాయకునికి ఆయనకి ప్రియమైన వస్తువులతో పూజ చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా ఆ లంబోదరుడు మనల్ని దాటిస్తాడు.

సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి కాక సంవత్సరంలో నెలనెలా వచ్చే ఈ సంకష్ట చతుర్ధిని కూడా ఆప్యాయంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులైనా దూరం అవుతాయన్నది అతిశయోక్తి కాదు.
విద్య, ధనం, సంతానం, మోక్షం అన్నిటికీ కూడా ఆయన్ని పూజించి వేడుకుంటే నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ‘అయినవిల్లి’ (తూర్పుగోదావరి జిల్లా) అమలాపురం దగ్గర వినాయకుని దేవాలయాలలో ప్రత్యేకమైంది. 

చిత్తూరు జిల్లా ‘కాణిపాకం’ వరసిద్ధి వినాయకుని దేవాలయం తెలియనిది కాదు.
రాజధాని అయిన భాగ్యనగరంలో ‘లక్ష్మీ గణపతి దేవాలయం, విజయ గణపతి దేవాలయం’ ఎంతో అద్భుతమైనవి. 

ఎవరికి ఎలాంటి కష్టాలు వచ్చినా మనసా వాచా కర్మణ వినాయకుని నమ్మి ఈ సంకష్ట చతుర్ధి వ్రతాన్ని ఆచరిస్తే మేలు కలుగుతుందని జను ల విశ్వాసం. అన్ని గణపతి దేవాలయాలు ఈ చతుర్ధి నాడు సాయం కాలం చంద్రోదయ సమయానికి కిటకిటలాడిపోతాయి భక్తులతో. 

పూజలో తెలుసుకోవలసిన ముఖ్యాంశాలు
1. గణపతికి 21 ఉండ్రాళ్ళతో పూజ చేయాలి.
2. గరికతో పూజి చేస్తే ఆటంకాలు తొలుగును
3. నీటితో పూజ చేస్తే సంతోషం కలుగుతుంది
4. 21 ప్రదక్షణలు చెయ్యటం మంచిది.
5. పావుకిలో ఉలవలు దానం చేయాలి
6. బుధవారం ప్రీతికరమైన రోజు.
7. బుధవారం, హస్త, చవితి కలసి వచ్చిన రోజున 
వినాయకునికి అష్టోత్తరం చేయిస్తే అన్ని కార్యాలు శ్రీఘ్రంగా 
నెరవేరును.

సంకట నాశన గణేశ స్త్రోత్రమ్‌
నారద ఉవాచ:
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం 
భక్తావాసం స్మరే న్నిత్యమాయుః కామార్థ సిద్ధయే ‚
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్‌
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకమ్‌ 
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్‌ 
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకమ్‌ 
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్‌ 
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యఃపఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో 
విద్యార్ధి లభతే విద్యాం ధనార్ధీ లభతే ధనమ్‌
పుత్రార్ధీ లభతే పుత్రాన్‌ మోక్షార్ధి లభతే గతిమ్‌ 
జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్‌
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః 
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్‌
తస్య విద్యా భవే త్సర్వా గణేశస్య ప్రసాదతః 
ఈ సంకటనాశ గణేశ స్తోత్రాన్ని 3 కనీసం పఠించటం చాలా మేలు. 

డా. ఈడుపుగంటి పద్మజారాణి

Wednesday, 21 August 2013

తిరుమలకు మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:


Telugu Lo Temples Infomation shared Tirumala's photo.
తిరుమలకు మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:
నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి. మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు. నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.
http://rajachandraphotos.blogspot.in/2012/10/tirumala-tirupati.html
తిరుమలకు మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి. మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు. నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.

Tuesday, 20 August 2013

శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి.

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి.
On 21st August 2013

భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.

భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.

దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.

ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!

బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.

Sunday, 18 August 2013

మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు.

మట్టి గణపతి మోరియా

మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం.

-కొత్త మట్టితో వినాయకున్నితయారు చేయడం 
-ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం
-నవరావూతుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.
శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణవూపతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మార్తున్నా మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారుంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వవూపాణులు సమానమనే అర్ధం చెబుతోంది. హారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

మట్టి వినాయకుడు-అసలు రహస్యం
వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

పత్రిపూజ-రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం
నవరావూతుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

Saturday, 17 August 2013

మనస్సుని ఎట్లా సిద్ధం చేసుకోవాలో తెలుపడానికే భగవద్గీత

Jaji Sarma
మనస్సుని ఎట్లా సిద్ధం చేసుకోవాలో తెలుపడానికే భగవద్గీత
వానలు కురవటం లేదు, పంటలు పండటం లేదు, అనావృష్టి ఏర్పడుతుంది అంటే వాటికి కారణం మనలో ఉండే లోపమే తప్ప ప్రకృతిలో లోపం కాదు. ఇవి మాత్రమే కాదు ఏ రకమైన ప్రాకృతిక ఇబ్బందులైనా మనం చేసుకున్నదే తప్ప ప్రకృతికి మన మీద కోపమే ఉంటే ఈ భూమి మీది నుండి ఎప్పుడో ఏరి పారవేసేది. లేదా మనల్ని కబళించాలి అంటే భూమికి ఎంత సేపు పట్టేది. అరక్షణం చాలు భూమికి మనల్ని పీల్చిపారవేయడానికి కావాలనుకుంటే. కానీ ప్రకృతికి మన మీద కోపం లేదు, ఎప్పుడూ ప్రేమే. తప్పులు చేయడం మన వంతు అయితే, వాటిని దిద్దుబాటు చేయడం తన వంతు అన్నట్టుగా ప్రకృతి మాత మనల్ని కరుణిస్తుంది. ఎన్నెన్ని దోషాలు చేస్తాం మనం. లేవగానే కాళ్ళు పెడతాం, మలమూత్ర విసర్జనలాంటివి చేస్తుంటాం. సరే, అవసరం కోసం తప్పక చేసేవి కొన్నైతే, ఆశ తో చేసేవి ఎన్నెన్నో. బ్రతకడానికి జీవించాలని చేసేవి ఏకొన్నో, కానీ బడాయి కోసం చేసే ఘనకార్యాలు ఎన్నెన్నో. ప్రొద్దున లేచాక చేసే ధంత ధావనకు వాడే వస్తువులు మొదలుకొని రాత్రి సుకుమారంగా పడుకునేందుకు వేసుకొనే పరుపుల దాకా, వాటిలో అవసరం ఇంత ఆశలు అంతంత. ఇలాంటి కొత్త కొత్త వస్తువులు లేని నాడు మన పూర్వులు హాయిగా బ్రతికే వాళ్ళు. ఆధునిక రీతుల్లోకి వెళ్తున్నాం అనుకుంటూ ఎంతెంత ఎంతెంత ఆధునికం అనుకుంటూ పోతూ అంతంత కృత్రిమ ప్రవృత్తుల్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ నాడు ఆధునికతకు నిర్వచనం కృత్రిమం, నాగరికతకు నిర్వచనం ప్రకృతిని పాడు చేయుట. ఇది వరకు సురాపానం చేయడం ఒక పాపంలా భావించేవారు, కానీ ఈ నాడు అది చేయక పోతే పాపం అన్నట్టు చేస్తున్నారు. దీనికి మనం అందమైన పేరు పెట్టుకున్నాం, నాగరికత అని. అందుకే ప్రకృతి మనకు అందించాల్సిన సౌఖ్యాలని అందించలేక పోతుంది, మన జీవనం కూడా తలక్రిందలు అయిపోతుంది.
మనిషి జీవించడానికి ప్రకృతిలోంచి కొంత వరకు స్వీకరించాల్సి ఉంటుంది అంత వరకు తప్పదు, అతిగా తీసుకోవడం తప్పు. మనకు సవ్యంగా ఉండి, ప్రకృతి మనకు ఇవ్వల్సినది ఇవ్వకపోతే ప్రకృతిని దండించే అధికారం ఉంది. మనం ఉన్న భూమికి ఒక పేరు ఉంది, పృథ్వీ అని. ఈ పృథ్వి వల్ల ఏర్పడ్డ శరీరాలు కనుకనే మనవి పార్థివ శరీరాలు అని అంటుంటారు. ఎందుకొచ్చింది ఈ పేరు, అంతకు ముందు వేరే పేరు ఉండేది. అజనాభము అని పేరు. దీనిని పృథు అనే చక్రవర్తి పాలించాక ఆపేరు వచ్చింది. చాలా కాలం కావల్సినవి ఇచ్చింది, కానీ ఈ పృథు అనే చక్రవర్తి పాలించే సమయం నాటికి వానలు లేవు, పంటలు లేవు, అందరూ ఇక్కట్లను పొందే స్థితి దాపురించింది. ఆవేళ ఆ పృథు చక్రవర్తికి కోపం వచ్చి, అందరినీ ఆదరించాల్సిన ఈ భూమి, తన బాధ్యతని విస్మరించింది అని భూమిని గోవుగా మార్చి వేటాడటం ప్రారంభించాడు. దాన్ని సంహరిస్తాను అని బాణం తీస్తే, నేను గోవును పైగా స్త్రీని వధించడం తప్పు అని తెలియదా నీకు అని గోవు అడిగిందట. పృథు చక్రవర్తి అన్నాడట, నీ బాధ్యత నీవు తెలుసుకుని ఉంటే అది సరైన మాట. పిల్లలని కని, వారి పోషించక పోతే దండనకు అర్హులే, కనుక దండించినా దోషం లేదు అన్నాడట. భూమి అంగీకరించింది, కానీ నా పిల్లలు నాపిల్లల లాగ ఉండండి, మీరు అలా ఉండగలిగితే నేను ఇవ్వల్సినది ఇస్తా, మీరు మిమ్మల్ని మరచిపోతే నేను మిమ్మల్ని మరచిపోవాల్సి వస్తుంది. ఎవరెవరు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తే నేను ఎట్లా ఉండాలో అట్లా ఉంటా. గోవు క్షీరాన్ని ప్రసాదించాలంటే, ఒక దూడ కావాలి, పితుక్కోవడానికి పాత్ర కావాలి అవి సిద్ధం చేసుకో అని చెప్పిందట. అంటే అప్పుడు ఆ గోవుని సంహరించడం మాని, మనుష్యుల తరపున ఒకరిని దూడగా మార్చి ఒక పాత్రలో మానవ జాతి బ్రతకడానికి కావల్సిన వన్నింటిని క్షీరముగా పితికాడట. మనుష్యుల తరపున మనువుని దూడగ చేసాడట, పాత్రగా మనస్సుని వాడారట, అప్పుడు మనుష్యులకి కావల్సిన వాటిని సంమృద్ధిగా ఇచ్చిందట. కేవలం మనుష్యులే కాదు దేవతలు, రాక్షసులు, యక్షులు, జంతువులు, పక్షులు మొదలైన జీవ జాతులన్నీ బ్రతకడానికి ఈ భూమి ఇవ్వగలిగేట్టుగా "ధుదోహ ధరిత్రి" ఈ ధరిత్రిని పితికెను అని చెబుతారు. ఇది సాదు జంతువులు ఉండాల్సిన స్థానం, ఇది కౄర మృగాలు ఉండాల్సిన స్థానం, ఇది పల్లె, ఇది పట్టణం అని ఇలా ఆయన ఏయే జీవరాశి అట్లా బ్రతకాలి అనే హద్దును ఏర్పాటు చేసాడట. అంటే భూమి ఎవరికి కావల్సిన వాటిని వారికి ఇవ్వగలదు. ఇదీ భూమికి లక్షణం.
ఈ నాడు మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయంటే, బహుశ: మనల్ని మనం మరచిపోయి ఉంటాం. మనిషికి మనస్సు అనేది పాత్ర వంటిది, ఆ పాత్ర సిద్ధంగా లేకుంటే పితికే పాలు నేలపాలు కావూ!. మనిషి సవ్యంగా అనుభవించగలిగేది మనస్సు వల్ల. ముందర సంస్కరించబడవల్సినది మనస్సు. ఇది ఈ నాడు పూర్తిగా నియంత్రన లేకుండా పోయింది. మన మనస్సులు సంకుచించుకు పోయాయి. మనం పాత్రలు సిద్ధం చేసుకోలేదు. గిన్నెని తిప్పి పెట్టాం, పాలు ఇవ్వగల గోవు ఉన్నా, మనం సిద్ధంగా లేము. సంకుచించుకుపోయిన మనస్సులని భగవంతుడికేసి తిప్పితే కదా అసలు మనం సంమృద్ధిగా జీవనం కొనసాగించగలిగేది. మనిషి తన మనస్సుని ఎట్లా సిద్ధం చేసుకోవాలో తెలుపడానికే భగవద్గీత.

శ్రీ హనుమంతుని వేదాంతం కధ

Jaji Sarma
శ్రీ హనుమంతుని వేదాంతం కధ

ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా !వేదాంత రహస్యము తెలిసిన తరు వాత కూడా ఈ దేహం ఉన్నంత వరకు దేహాన్ని ,జీవుణ్ణి ,పరమాత్మ ను వేరు వేరు గా నే భావించాలి .దేహ దృష్టి తో పరమేశ్వరుని ధ్యానిస్తూ ,సేవించాలి .అన్ని భావాలను త్యజించి ,శరణా గతి పొందాలి .ఇతరులకు ఉపకారం చేస్తూ ,వారు కూడా భగవంతుని స్వరూపం గా భావించి ,సేవించాలి .ఇలాంటి దానినే భక్తి లక్షణం అంటారు .ఇదే విశిష్టాద్వైత సిద్ధాంతం .జీవుడు వేరు ,పరమాత్మ వేరు అని భావిస్తూ ,భగవంతుని స్మరిస్తూ , ,భగవంతుని పూజలు చేస్తూ ,భగ వంతుని మూర్తులను చూసి ఆనందిస్తూఉండటానికి ద్వైతం అంటారు .జీవుడు ,పరమాత్మ ఒక్కరే .ఎందు లోను భేదం అనేది లేదు అని భావన లో ,ఆచరణ లో చూపించటం జ్ఞాన లేక ,విజ్ఞాన లక్షణం అంటారు .ఇదే అద్వైత భావన .–”దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః –ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ ” –రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .

”యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః –యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః –శ్రీ మారుతిత్సేవన తత్పరాణాం –భోగశ్చ ,మోక్షశ్చ ,కరస్త యేవ ”–అంటే ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు .ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశమే లేదు .కాని శ్రీ హనుమ సేవా తత్పరు లైన వారికి భోగమూ ,మోక్షమూ రెండు తప్పక లభిస్తాయి అని శ్రీ రాముడు ”వరం ”అను గ్రహించాడు .దానికి వెంటనే ఆంజనేయుడు ”నువ్వు శివుడవు .నేను భద్రుడను .నీకూ నాకు భేదమే లేదు ”అని చెప్పాడు

Monday, 12 August 2013

శ్రీ లక్ష్మీ కుబేరపూజ:శ్రీ లక్ష్మీ కుబేరపూజ:

ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతోపాటు ఆయురారోగ్యభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారంనాడు శ్రీ లక్ష్మీ కుబేరపూజ చేస్తే మంచిది. అష్టమి, నవమి తిధులు లేని శుక్రవారమైతే మరీ మంచిది.

శుక్రవారంనాడు శ్రీ లక్ష్మీ కుబేరపూజ చేయాలనుకున్నవారు ముందురోజు పసుపుకుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, ఫలపుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపండ్లను సేకరించుకోవాలి. శుక్రవారంనాడు ఉదయాన్నే తలంటిస్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి. 

ముందుగా శ్రీ లక్ష్మీ కుబేరస్వామివార్ల చిత్ర పటాన్ని పీటపై పెట్టి, దానిని పసుపుకుంకుమలతో అలంకరించాలి. ఆ పటానికి ముందు అరటిఆకును పరచి, దానిపై నవధాన్యాలను పోసి, పలచగా సర్ది, దానిమధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరు పోయాలి. ఆ నీటిలో కాస్తంత పసుపు కలపాలి. తర్వాత చెంబులో మామిడాకులను నిలిపి, వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి. అనంతరం పూజాద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి. అనంతరం పసుపుముద్దతో వినాయక ప్రతిమలా చేసుకుని, అరటి ఆకుపై కుడిప్రక్కన అమర్చాలి. పసుపుముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమను పెట్టి దీపారాధన చేసి, వినాయక ప్రార్ధన చేయాలి. ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి.

సరసిజ నిలయే, సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి, హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్

అని స్తోత్రం చేసిన తర్వాత,

ఓం దనద సౌభాగ్య లక్ష్మీకుబేర
వైశ్రవణాయ మమకార్య సిద్ధిం కురుస్వాహా

అనే మంత్రాన్నిస్తోత్రం చేయాలి.

ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాణి వెలిగించి, ధూపం వేసి, ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపజేయాలి. పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప, కర్పూరహారతిని ఇస్తూ గంట మ్రోగించాలి. అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను, తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి.

ఐశ్వర్యసిద్ధి ప్రాప్తిరస్తు..

నాగ పంచమి, నాగులచవితి ఎందుకు ఆచరిస్తారు ?

నందిరాజు పుర్ణయ్య సిద్ధాంతి శర్మ
నాగ పంచమి, నాగులచవితి ఎందుకు ఆచరిస్తారు ?
వైజ్ఞానిక విశ్లేషణ, మన సాంప్రదాయంలోని, విశిష్ట సద్భావన.

సనాతన మన భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దక్షిణ భారత దేశంలో
ఆషాఢం తో గ్రీష్మం సమాప్తమై, శ్రావణంతో వర్ష ఋతువు ప్రారంభమౌతుంది.
వర్షాలు విస్తారంగా పడతాయి. కృషీవలుల వ్యవసాయ కార్య క్రమములు,
తీవ్ర తరమౌతాయి. అంతవరకు,చల్లదనముకొరకు, పుట్టలలో దాగున్న సర్పసంతతి,తమ ఆహారాన్వేషణకొరకు బయటకువచ్చి, పొలాలలో, సంచరించు
ఎలుకలు, కప్పలకొరకు విచచచలవిడిగా సంచరించ ప్రారం భిస్తాయి.
అర్ధరాత్రి, అపరాత్రి, పొలాలలో సంచరించు, కృషీవలులకు వానివలన ప్రాణ హాని కలుగవచ్చును. ఇటువంటి ప్రమాదములనప ను నివారిచుటకొరకు,
విజ్ఞులై మనపెద్దలు, ఈ శ్రావణ మాసంలో నువ్వులు, బెల్లం, చలిమిడి (బియ్యంపిండితోచేసిన తీపి పదార్థం) పాలతో కలిపి చేలగట్టులయందున్న పుట్టలలో సమర్పించమని చెప్పినారు.ఈ కార్య క్రమములో ఆధ్యాత్మికతనుకూడా
జోడించుటవలన,జనులకు భక్తి, భయము ఏర్పడినాయి.
పాములు పాలుతాగవనునది జగమెరిగినసత్యము. మరి పుట్టలలో పాలు, ఇతరపదార్థములు ఎందుకువేయుచున్నారనగా ఆపిండిపదార్థములు, నూవులు, బెల్లం ఇత్యాదులను తినుటకు, చిన్నక్రిములు, చీమలు, వాటిని తినుటకు, కప్పలుమరియు ఎలుకలు ఆపుట్టల బొరియలలో ప్రవేసించునుగదా, సర్ప సంతతికి బొరియలనుండి బయటికిరాకుండగనే, వాటిస్థానమందు, తమ ఆహారము
లభించుటవలన,ప్రశాంతముగా తమ ఆహారమునారగించున వగుచున్నవి.
ఇందువలన వాటికి ప్రాణహాని, వాటివలన జనుల ప్రాణ హాని, రెండూ నివారింప
బడినవి.ఎలుకలను సర్పములారగించుటవలన, రైతులకు పంట హానికూడా కొంత
తగ్గును.
అందువలన నిజమై న పుట్టలయందు పాలుపోయుటవలన ప్రయోజనమున్నదికాని, రాతి ప్రతిమలకు పాలుపోయుటవలన కేవలంసాంకేతికమే కాని ప్రయోజనము నెరవేరదు. దేవస్థాములందు ఇట్టుల చేయుటవలన, క్రిమి కీటకాదుల కొరకు, కప్పలు, ఎలుకలు, వాటి నారగించుటకు.సర్ప సంతతి ఆలయములలో ప్రవేసించవచ్చును.
సర్పములవలన మనుష్యులకు జరుగు హానికన్నా, మనుష్యలవలన సర్ప సంతతికి ఎక్కువ కీడు జరుగుచున్నది.మనిషికి కరుస్తుందని భయము, మరి వాటికో మనుష్యులనుండి తప్పించుకొని పారిపోవుటయే ప్రాణ సంకటము.
సమస్త సర్ప సంతతి తమ నెలవులందు, నిర్భయముగా జీవిచుగాక.
అందుకే ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
'' తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో"
యజుర్వేద మంత్రం.
'' ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను,
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు
మరలా మరలా నమస్కారము.
'' ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll
శుభంభవతు.

Sunday, 11 August 2013

అరటి చెట్టు ప్రాముఖ్యత

Brahmasri Chaganti Koteswara Rao Garu.

అరటి చెట్టు ప్రాముఖ్యత

మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం నిర్వహించబడినా అరటిచెట్టు, అరటి ఆకు, అరటి పండు అనేవి లేకుండా ఉండవు. అరటిని ‘కదళీ’, ‘రంభా’ అనే పేర్లతో కూడా పిలుస్తారు. రామాయణంలో అరటి ప్రాముఖ్యత వివరించబడితే, భాగవతంలో అరటి ఆవిర్భావమును గురించి వివరించబడింది.
అరటి జన్మ వృత్తాంతం

సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, దుర్గ, వాణి, సావిత్రి, అనే పంచ శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించడం విరాట్ మూర్తి ఆమెను “బీజం లేని చెట్టు” గా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదళీ (రంభ) పేరుతో అరటిచెట్టుగా జన్మించింది. తన శాపవిముక్తి కోసం ఐదువేల సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర చేసింది. కదళీ తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై, ఆమెకు పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా అం అంశ రూపమైన కదళిని మానవ, మాధవసేవ నిమిత్తం భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్థశి. దీనినే అరటి చతుర్థశి అని కూడా అంటారు.

అరటి చెట్టు ప్రాముఖ్యత

రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉండి. మాఘ చతుర్థశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, పెరటిలోనున్న అరటినిగానీ, లేదా అరటి పిలకనుగానీ పూజ చేయవచ్చు. పసుపుకుంకుమలతో, పుష్పాలతో చక్కగా అరటికాండాన్ని అలంకరించి, దీపారాధన చేయాలి. దూపానంతరం పెసరపప్పు బెల్లం, 14 తులసీ దళాలు (నాలుగు ఆకులు ఉండాలి) నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో ఐదుగురు ముత్తైదువులకు భోజనం పెట్టి, వారికఇ అరటిదవ్వ, ఐదు అరటి పండ్లను దానమివ్వాలి. ఈ పూజను చేసినవారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి. ఈ అరటి పూజ చేసిన వారికి చక్కని సంతానము కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత కలుగుతుంది. రామాయణంలో అరటిపూజను సీతారాములు చేసినట్లు తెలియుచున్నది. రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తరువాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతుని పంపాడు. హనుమంతుడు ఆ వార్తను భరతునికి చెప్పి, తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటిఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పదనాన్ని అక్కడివారికి తెలియ జేయడానికి, తన కుడివైపున మారుతిని కూర్చోమని ఒక సైగ చేసాడు. భరద్వాజ మహర్షి చేసేదిలేక ఆ అరటి ఆకులోనే ఒక ప్రక్కన హనుమంతునికి వడ్డన చేసాడు. భోజన కార్యక్రమం ముగిసిన తరువాత అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈవిధంగా వివరించి చెప్పాడు.

“శ్రీరాముని పూజలోగాని, మారుతిపూజలోని గానీ ఎవరైతే మాకు అరటిఆకులో అరటిపండ్లను అర్పిస్తారో, వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి అంతేకాకుండా, జ్యేష్ఠమాసం శుక్ల తదియనాడు ఎవరైతే పైవిధంగా ఇద్దరికీ సేవ చేస్తారో, వారి తరతరాలకు సంతానలేమి ఉండదు. గృహస్థులు అతిథిసేవల్లో అరటి ఆకును వినియోగించితే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి”.

పూజార్హమైన ఫలాలు ఎన్ని ఉన్నా అరటిపండును పూర్ణఫలం అనంటారు. ఎందుకు?

భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే అగ్ర తాంబూలం లభిస్తుంది. కాబట్టి, భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి. అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంట శ్రేష్ఠం కాడు. కాని, అరటిపండులో సావిత్రి విరాట్ మూర్తి శాపం వల్ల బీజంలేని చెట్టుగా ‘భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక, పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాలలోనూ అరటి పండ్లును ఇస్తాయి. అలా అరటిపండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది.

జంట అరటిపళ్ళు తినవచ్చా? తినకూదడా? దేవునికి సమర్పించ వచ్చా?

దేవునికి ఫలాలను సమర్పించుకుంటుంటాం, సాధారణంగా ఫలం అంటే అరటిపండో, మామిడి పండో, ఏదో ఓక పండును సమర్పించడమనే అర్థాన్ని తీసుకొంటారు కొందరు. కాని, ఫలం అంటే, దేవుని తలచుకొంటూ ఎంతోకొంత జపం చేస్తూ ఈరోజు జపానికి ఎంతెంత ఫలం అంటే తపః ఫలము వచ్చిందో? దానిని భగవంతునికి సమర్పించడమే. అలాంటి తపః ఫలాన్ని దేవునికి సమర్పించాలని శాస్త్రం చెబుతోంది. జంట అరటిపండ్లను దేవునికి అర్పించడం తప్పు అనే విషయం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి జంటగా కలిసిన అరటిపండ్లు ఇచ్చినా దోషం లేదన్నది మనకు అవగతమవుతోంది.

Friday, 9 August 2013

లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు

లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలు

1,ఏనుగు యొక్క కుంభస్థలం, 
2,గోపృష్ఠం,
3,తామరపువ్వు, 
4,బిల్వదళం,
5,స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము )

ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.

సద్విషయ సంగ్రహము

నందిరాజు పుర్ణయ్య  శర్మ
సద్విషయ సంగ్రహము

పురాణ, ఇతిహాస,శ్రీమహా భారత, రామాయణాదులలో వివరింపబడిన
ప్రసిధ్ధ పుణ్యక్షేత్రములు.దైవశక్తి ప్రసరించు దివ్య స్థలములు.

1.అమరనాథ్ హిమాలయపర్వతములలో- దేవత అమరనాథుడు.(గుహలో ప్రతిసంవత్సరము ఏర్పడు మంచులింగము)
2.కేదారనాథ్ ఇదికూడా హిమాలయములలో --- కేదారేశ్వరుడు.మందాకిని నది.
3.బదరీనాథ్.ఇదికూడా హిమాలయములలో-దేవత.నరనాయణులు.అలక్ నందా.
4.హరిద్వారం. హిమాలయాల ముఖద్వారం.-- దేవత. గంగాదేవి (నది)
5.హృషీకేశ్ . హిమాలయాలప్రారంభము.--- శుధ్ధగంగా (నది)
6.జాలంధరపీఠం.-విశ్వముఖీదేవి. 7.జ్వాలాముఖిక్షేత్రం. -దేవత జ్వాలాముఖిదేవి
8.కురుక్షేత్రం(మహాభారతసమరంజరిగినచోటు)
దేవత-స్యమంతపంచకతీర్థం(తటాకం) సూర్యగ్రహణ మందు ప్రాముఖ్యత.
9.మథురా - దేవత. ద్వారకానాధుడు(శ్రీకృష్షుడు) వసించిన ప్రదేశము.
10.బృందావనము.దేవత- రాధాలోలుడు రమ్య రాసకేళీ విహార ప్రదేశం.
11.నైమిశారణ్యము.దేవత-సుదీర్ఘ సత్రయాగము, సూతపౌరాణికునిచే,భారత, భాగవత,అష్టాదశ పురాణ ప్రవచనంజరిపినస్థలం. అరణ్య తీర్థములు, నది.
12.ప్రయాగ.గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమము.శ్రీ లలితా శక్తి పీఠం.
13.చిత్రకూటం.ఒక పర్వతం. దేవత- అరణ్యవాసమునకేగుచున్న రాముని భరతుడు కలుసుకొని, రాముని,రాజ్యము స్వీకరించమని ప్రాధేయ పడిన స్థలము.
14. కాశి (వారణాశి) వరుణ, అస్సీ నదుల మధ్యనున్న అవిమక్త క్షేత్రము, శివుడ
శాశ్వతముగా నివసించెదనని వాగ్ధానముచేసి,నివసిచుచున్న దివ్య క్షేత్రము
దేవతలు- విశ్వనాథుడు (జ్యోతిర్లింగము) అన్నపూర్ణావిశాలాక్షి,డుండివినాయకుడు
క్షేత్ర పాలకుడైన కాలబైరవుడు. కాశివాసుల పాప శోధకుడు,భుక్తి,ముక్తి ప్రదుడు.
15. వాధ్యాచలం. (మీర్జాపూర్)దేవత - వింద్యవాసిని దుర్గా పరమేశ్వరిమాత.
16. అయోధ్య. దశరథమహారాజు రాజధాని.శ్రీరాముని(అవతారం) జన్మక్షేత్రం.
17. మిథిలా(నగరం) జనకుని రాజధాని. సీతాదేవి పుట్టినిల్లు.శివధనుస్సును విరిచి సీతాదేవిని స్వయంవరంలో స్వీకరించి,మనువాడిన పుణ్య క్షేత్రం.
18. గయా. (గయాసురసంహారమైనప్రదేశం) దేవత- విష్ణుపదం. సమస్త వైదిక సాంప్రదాయులు, తమ పితృ దేవతలకు, శాశ్వత పుణ్యలోక ప్రాప్తికోకు, పిండ ప్రదానము చేయు పుణ్యక్షేత్రము. అక్షయవటము. ఫల్గుణినది.
19. వైద్యనాథ ధామ్. ( దేవఘర్) వైద్యనాథ జ్యోతిర్లింగము. ( ఆరోగ్యప్రదము)
20.కాళీఘటము ( కలకత్తా) దేవత - కాళికాదేవి.గంగానది.(తాంత్రిక పూజాక్షేత్రం)
ఇంకావుంది.

Wednesday, 7 August 2013

శ్రీశైల స్థల పురాణము

భక్తి సమాచారం
శ్రీశైల స్థల పురాణము

పురాణాలలో శ్రీ శైలం శ్రీశైల చాలా పురాతన మైన మహాక్షేత్రము. ఇందు పర్వతుడను నైష్టిక బ్రహ్మచారి యొకడు పరార్థ ప్రవణు డై కారణ జన్ముడ వ దాగిన వాడు. కృత యుగ మున బహుకాలము త పమొనర్చినాడు. అతడు లోకమునుద్ద రింప సంకల్పి౦ఛి నాడు. తను పరార్ధ ప్రవణత చె బర మేశ్వరుని సైతము విస్మయంపడ జే సినాడు. తన తప: ఫలముగా సర్వ తీర్ధ ములలో సర్వదేవతలతో సర్వపర్వతములతో స్వర్గ మర్త్య పాతాళ స్దిత ములగు నిఖిలదివ్య పదార్ద ములతో సకల మహో ష ధులతో సదాశివుని, పరా శక్తి యగు పార్వతితో పాటు నిత్య ము తన యందు సంనిహితుడ గునట్లు తానే నాడో చేయగలిగి నాడు. శ్రీ శైల క్షేత్ర మహిమలు విప్పు చెప్పు స్కంద మందలి శ్రీ శైల ఖండము నాది యుగమందు పార్వతికి బరమేశ్వరుడి చ్చటనే చాల కాలము నాడు పంచిచి నాడు. ఈ శ్రీ శైల ఖండము నుండి రస వంతమగు మహా గ్రంథము గా ప్రవచించి, వ్యాస మహర్షి దీని సు పాయసముగా శ్రీ మల్లి కార్జున మహా దేవునికి సమర్పించుట, యాతని వలన వరములు వడయుట జరిగి బహు కాలమైనది. అవతార పురుషుడ గు శ్రీరామచంద్ర మూర్తి సీతామదేవితో నిటకు వచ్చి యిచ్చట గిరి ప్రదక్షిణ మొనర్చి తన బ్రహ్మ హత్యను దొలగించుకొనుట జరిగి యెంత కాలమో మైనది. ఇందు దాహరింపబడిన ప్రదక్షిణ విధ లో రామప్రదక్షిణ మొకటి. శ్రీరాముడు రావణ వదానంతరము తనకు దాపరించిన బ్రహ్మహత్యను బాపుకోనుట కై సేతువుకడ రామ లింగేశ్వర ప్రతిష్ట మొనర్చి నాడు. కాని, నిశ్శే షముగా దాని నిండి విముక్తుడు గాలేదు. అతడు వశిష్టాదులు నియోగింప నిటకు వచ్చి యీ గిరి ప్రదక్షణ మొనర్చి దానిని దొలగించు కొనినాడు. స్పష్టముగా శ్రీ శైల ఖ౦డ ము దీ నిని వచి౦ చు చున్నది. ఈత ని యీ గిరి ప్రదక్షిణ ఉత్తర ద్వార మగును మాహేశ్వర ము నుండి యారంభ మైనది. అ సమయమున రాముడి ట సీతా సహితు డై ఒనర్చిన ప్రతిష్టలు గూడ జాలగాలవు. త్రిపురాంత కాదుల యందలి రామేశ్వరాల యా దు లప్పుడు వెలసిన వియే! మల్లి కార్జునాలయమున నే సీతారాములు ప్రతిష్ట కు జెందిన సహస్ర లింగేశ్వరాలయములు రెండు ప్రత్యేక ముగా భిన్న భిన్న స్ధలము లందున్నవి. అవి యిందులకు నిదర్శనము. ఇవిగాక, శ్రీశైలద్వారా ములుగా ఎన్నబడుచున్న త్రిపురాంత కాదులయందు రామప్రతిష్ట త ములగు రామేశ్వరాలయాదులు తత్తి ర్ధాదులు ఎన్ని యో స్కా౦దమున వీ నితొ పాటు వర్ణింపబడుచున్నవి. ఇది గాక, రాముడింత కు ముందే సీతా న్వేషణార్ధ ముదండ కారణ్యమున సంచరించుచు ఇటకు నచ్చినట్లు హరి వంశాంతర్గముగు నాశ్చర్య పర్వము 'శే షెధర్మ' మను పేరు ధీ నిని విశ దీ కరించినది. బ్రహ్మ ఇచ్చట తప మొనర్చి మల్లికార్జునునిని ప్రసన్నునిగా జే సుకొని యాత ని వలన దన యిచ్చా మాత్ర మున సృష్టి యంత ము జరుగునట్లు వరము వడ సి, సృష్టి యంత యు నిటనుండి జరిపినట్లు స్ధల నిర్దేశముతో శ్రీ శైలఖిండ ము మనకు జూటి చెప్పచున్నది.

ధర్మరాజునకి యక్షుడు వేసిన ప్రశ్న!

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
ధర్మరాజునకి యక్షుడు వేసిన ప్రశ్న!
ఏదైనా గొప్ప ఆశ్చర్యకర విషయం చెప్పు! అందరికి తెలిసుండాలి! కానీ ఆశ్చర్యపోవాలి!
ప్రపంచం అనే మూకుట్లో సూర్యుడు చంద్రుడు అనే సెగ పెట్టి కాలం వండుతుంది! ఆశ ఋతు అనే గరిటెతో తిప్పుతూ నిత్యం వండుతుంది! ఇందులో వండేది ఎవరిని అంటే భూతల ప్రాణికోటిని! అంటే మనం అంతా ఎక్కడ వున్నాం అంటే బానంలో ఉన్నాం! ఎందుకు ఎలా వేగుతున్నాం అంటే ఒక తేనెటీగ తేనెకోసం ఒక గిన్నె అంచున నిలబడి కొద్ది కొద్దిగా లోపలకి వస్తుంటే ఆ తేనే తన ఆకర్షణతో లోపలి లాగి మింగినట్టు ప్రాణికోటి అంతా మోహం మొహం అనే తేనే కోసం ఆరాటపడుతూ వేగిపోతున్నారు! ఇందులో బాగా వేగిన అంటే సర్వం మాయ అని తెలుసుకున్నవాడిని ఆ గరిటె తీసి బయట పడేస్తుంది! అంటే ఇంకా చావు పుట్టుకలు లేకుండా మోక్షపదం చేరుస్తుంది! ఎవరైతే జ్ఞానమనే సంపదతో మాయ అనే ప్రపంచం నుండి బయట పడతారో వారినే కాలం అనే గరిటె బయట పడేస్తుంది! ఇది నిత్యం, ఇది సత్యం, ప్రతిరోజూ ఇదే కొత్త విషయం.. ఇంతకుమించి కొత్త విషయం ఇంకొకటి లేదు! ఉండదు ... అందరికి తెలిసిన విషయం, తెలియని విషయం, అర్ధంకాని విషయం!ఆశ్చర్యకర విషయం!

శ్రావణ మాసంలో మన విధులు

శ్రావణ మాసంలో మన విధులు 

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.

స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.

ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు మేఘాలు వర్షాధారలతో దేశమును చల్లపరుచునపుడు కృష్యాడి కార్యములు నిర్విఘ్నంగా సాగాగాలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుంది.
By: Bramhasri Samavedam Shanmukha Sarma

"బ్రతికేయొచ్చు.." "బ్రతికించొచ్చు..."

తెలుగు మాటలు
60 సంవస్తరాల నిరు పేద వృద్దుడు.. పెద్ద వయస్సులో కష్ట పడలేక..
జైలులో ఉన్న తన కొడుకుకు ఒక లేఖ వ్రాసాడు..

" నాన్నా.. నువ్వు నిరాదార కేసులో ఇరుక్కుని జైలులో ఉన్నావు.. ఇక్కడ నా పరిస్దితి ఎం బాగోలేదు.. ఒళ్ళు కూడా సహకరించడం లేదు.. మన తోటలో కూరగాయలు సాగు చేద్దాం అంటే.. పోలం చాలా గట్టిగా ఉంది రా.. మనుషులని పెట్టి సాగు చేయిద్దాం అన్నా.. చేతిలో అంత డబ్బు లేదు.. నాకు సహాయంగా ఉండే నువ్వు కూడా జైలులో ఉండి పొయావు.. నాకు సహాయం చేసే వారు లేరు.. చాలా భాదల్లో ఉన్నాను.. త్వరగా వస్తే బాగుంటుది"

ఇది లేఖ సారాంశం...

ఆ లేఖను తన కొడుకుకి.. రాష్ట్రపతికి (క్షమాబిక్ష కోసం) పొష్ట్ చేసాడు..

మరుసటి రోజు తన కొడుకు దగ్గర నుంచి లేఖ అందుకున్నాడు...

" నాన్నగారు మీరు ఆ పొలం తవ్వోద్దు.. ఎందుకంటే.. నేను హత్య కేసులొ ఇరుక్కున్న శవాలు ఆ భూమిలోనే ఉన్నయి -- నేను త్వరలోనే వచ్చేస్తా... వచ్చాకా ఆ పని చూస్తా..."

అది చదివిన ముసలాయాకి ఎమి అర్దం కాలేదు...

పక్క రోజు ఇంటికి సి.బి.ఐ వాళ్ళు వచ్చారు... " ఇళ్ళంతా సోదాలు చేసి.. పోలం అంతా తవ్వి తవ్వి అలసి పోయి ఏటువంటి ఆదారం దొరకక పొయేసరికి.. వీ ఆర్ రియల్లీ సారి.. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.."

అదే రోజు తన కొడుకు దగ్గర నుంచి ఇంకోక లేఖ అందుకున్నాడు ముసలాయన...

" నాన్నా పొలంలో ఇప్పుడు.. నువ్వు ఎం కావలంటే అవి వేసుకో... నేను లేని లోటు సి.బి.ఐ. వాళ్ళు తీర్చారు... అరోగ్యం జాగ్రత్త నాన్నా"

అలా మన సి.బి.ఐ వాళ్ళ సహాయంతో ఆ పెద్దాయన హ్యపీగా పొలం పండించుకున్నడు..

మోరల్ ఆఫ్ దా స్టొరీ.... : విన్నవన్నీ నిజాలు కాదు.. చూసేవన్ని సత్యాలు కావు... తెలివనేది బుర్రలోనే ఉంటే.. కష్టకాలంలో కూడా.. "బ్రతికేయొచ్చు.." "బ్రతికించొచ్చు..."

Monday, 5 August 2013

Brahmasri Chaganti Koteswara Rao Garu.
శివుని 8 పేర్లు - అష్టపుష్ప మానస పూజ
మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము

అట్టి శ్రీ సదాశివమూర్తికున్న ఎనిమిది పేర్లనూ అర్ధసహితంగా వివరిస్తున్నాను...

1. శివాయనమః = అన్నటికీ శుభము కలిగించువాడా! నీకు ఇదే నా నమస్కారం!

2. మహేశ్వరాయనమః = సంధాన - తిరోధాన కర్తవైన నీకు నమస్కరించుచున్నాను.

3. రుద్రాయనమః = సర్వ ఆపదలను నివారించువాడవైన నీకు అంజలి.

4. విష్ణవేనమః = సర్వే సర్వత్రా వ్యాపించియున్న వాడవైన నీకు నా కైమోడ్పులివియే!

5. పితామహాయనమః = అన్నిటికీ మూలకారకుడైనవాడా! నీకు ఇదే నా నమస్కారం!

6. సంసార భిషజేనమః = సమస్త ప్రాపంచిక రుగ్మతలనూ దూరం చేసే వైద్యుడైన వాడా! అంజలి.

7. సర్వజ్ఞాయనమః = అన్నీ తెల్సినట్టి మహా విద్వన్మూర్తీ! నమస్కృతులు. నా నమస్సుమాంజలి!

8. పరమాత్మాయనమః = అన్నిటికీ అతీతుడైనట్టి భగవంతుడా! ఇదే నా నమస్సుంజాలి!

పైన చెప్పిన మొదటి ఐదు నామాలూ ఇహసాధనకు - ఆ పిదప మూడు నామాలూ పరసాధనకు తారక మంత్రాలవంటివి.

ఇక...మానస పూజారాధకులకు అష్టపుష్పపూజ అనేది ఉన్నది.

అష్టపుష్ప మానస పూజ:

శ్లో. అహింసా ప్రథమం పుష్పం - పుష్పమింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత ||
శాంతి పుష్పం, తపః పుష్పం - ధ్యాన పుష్పం తథైవచ
సత్య మష్టవిధం పుష్పం - శివ ప్రీతికరం భవేత్‌ ||

(శివా! ఈ పుష్పాష్టకంతో నీవు సంతృప్తుడవయ్యెదవు గాక! అహింస, ఇంద్రియచాపల్యరాహిత్యం, అన్ని ప్రాణుల పట్ల దయ, కష్ట నష్టాలను భరించగలిగే ఓర్పు, అన్నిటినీ సమానంగా చూసే నిర్మల శాంత గుణం, నిరంతర తపం, నిత్య ధ్యానం, నిజం చెప్పే గుణం...వీటితో నిన్ను మానసికారాధన చేయుదును.)

అనగా - ఈ గుణాలు ఎవరిలో వుంటాయో వారు వేరే పూజలేవీ చేయనక్కర్లేదు. తమ గుణాలద్వారానే, శివపూజ వారు చేస్తున్నట్లేనని భావం!

ద్యాన రీతులు :

సర్వకాల సర్వావస్థలయందునూ శివ ధ్యానం చేస్తూండాలి. శివమూర్తులు ధ్యానపరంగా మూడు విధాలు -

1. ఘోరమూర్తి

2. మిశ్రమూర్తి

3. ప్రశాంతమూర్తి

ఘోరమూర్తి ఆరాధన = తక్షణ ఫలప్రదం

మిశ్రమూర్తి ఆరాధన = కొద్దికాలంలో ఫలవంతం

ప్రశాంతమూర్తి ఆరాధన = అంత్యమున మోక్షప్రాప్తి.

ఇక.. ధ్యానం 2 రకాలు. అవే సవిషయ నిర్విషయ పూర్వకాలు.

సవిషయం = సాకారోపాసన

నిర్విషయం = నిరాకారోపాసన

రెండూ సక్రమ యోగ మార్గాలే.

మన పురాణాలలో కుజ గ్రహం

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు( Indian Culture)
మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.

వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది

అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.

శ్రీ గాయత్రీ మాత మంత్రార్ధం మహత్వం వివిధ పురాణాల్లో,

హైందవ సంస్కృతి మాస పత్రిక
గాయత్రీం చింతయేద్యస్తు హృత్మద్మే సముపస్థితామ్
ధర్మాధర్మ వినిర్ముక్త స్పయాతి పరమాం గతిం

సర్వవేదాత్మ స్వరూపమైన శ్రీ గాయత్రీ మాత మంత్రార్ధం మహత్వం వివిధ పురాణాల్లో, పలువురు ఋషుల చేత వర్ణించబడింది.

1. స్కాంధ పురాణం: మన బుద్ధిని అంతర్యామి రూపంలో కర్మలయందు ప్రేరేపించు వానిని ధ్యానించెదము. అంటే సర్వజీవులందు ప్రత్యక్షాత్మ రూపంలో ఉన్న, విభిన్న నామాలు కల సూర్యస్వరూపుడైన, ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నాము.

2. బ్రహ్మ పురాణం: భూ, స్వర్గ, అంతరిక్ష లోకముల నుండి వెలువడు తేజస్వరూపుడైన ఆదిత్యుడే, సర్వదేవాత్మక పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపుడైన సూర్యుని ఉపాసించుచున్నాము.

3. సాయణాచార్య వివరణ: సర్వాంతర్యామి అయిన ‘సవిత’ తేజస్వరూపుడై, జగత్ స్ర్సష్టయై, పరమేశ్వరుని ఆత్మభూతుడై, అవిద్యను, కాలకార్యాలను భర్జించువాడై, భర్గుడై, స్వయం జ్యోతి స్వరూపుడై, పరమాత్మ యొక్క తేజస్సై, సర్వులకూ ప్రత్యక్ష దైవమై, అందరి బుద్ధిని కర్మకై ప్రేరేపించి, పాపాలను భస్మం చేయు, తేజోమండలాతర్గతుడైన సవితృనిధారణ చేస్తున్నాము.

4. ఆదిశంకరుల వివరణ : సమస్తాన్ని ప్రకాశించ చేయునది, చిర్రూపమైనది, సర్వాధిక ప్రధికతమైన సుఖరూపమై, సర్వసాక్షియై, అంతఃకరణ ప్రకాశితమైనది ప్రత్యగాత్మ, ఆత్మస్వరూపమై, నిరతిశయానందరుపమై, అవిద్యను నశింపచేయు జ్ఞానదీప్తియై, రసస్వరూపమైన, శుద్ధ చైతన్య స్వయం ప్రకాశరూపమైన, అందరి బుద్ధులను సత్కర్మాచరణకై ప్రేరేపించు ప్రత్యగాత్మను ధ్యానిస్తున్నాను.

5. భరద్వాజ వివరణ: సమస్త ప్రాణులను సృష్టిమ్చగల, సూర్యమండల స్థితమైన, అనుపమ తేజస్సు ప్రార్ధించదగినది, ఉపాసించదగినది. ఆదిత్యుని యందలి హిరణ్మయ పురుషుని, అతని తేజస్సును, మా బుద్ధిని శ్రేయస్కర కార్యాచరణకై ప్రేరేపించుటకు ప్రార్ధిస్తున్నాము.

6. ఉద్బట వేదాచార్యులు: ఏ సవితృ భగవానుడు, మాక్రియా బుద్ధులను, వాక్కులను, శుభ, ధర్మ, కర్మాదులందు ప్రేరేపించునో, ఆ దేవత యొక్క తేజస్సును ధ్యానము చేయుచున్నాము.

7. గోపథ బ్రాహ్మణము : ఏ సూర్యుడు, మమ్ము ఉదయాన మేలుకొలిపి, కర్మలయందు ప్రేరేపించి, నడిపించుచున్నాడో, ఆ దేవుడు మాకు ఆధారమగుటకై ప్రార్ధించుచున్నాము.

8. శథపథ బ్రాహ్మణము : శతపథ బ్రాహ్మణంలో గాయత్రీ మంత్ర వైశిష్ట్యం భోగ మోక్ష విద్యగా వర్ణించబడింది. ప్రజాపతి అంటే కాలంలో సంవత్సర స్వరూపుడు. 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు కలిసి 24 అక్షరాలుగా మంత్రం ఏర్పడింది. మనకు కాలాలు మూడు. వేసవి, వర్ష, శీతాకాలాలు. దీనిని అనుసరించి పాదానికి ఎనిమిది అక్షరాల చొప్పున 24 అక్షరాల త్రిపాద గాయత్రి కూర్చబడిందని వర్ణన చేయబడింది. ఆదిత్య మండలాంతర్గతుడైన ‘సవిత్’ అన్నిలోకాలపై ఆధిపత్యం వహిస్తూ లోకత్రయాత్మక ప్రాణబ్రహ్మ అయి, మా బుద్ధులను ప్రేరేపించు పరంబ్రహ్మమును ఉపాసించుచున్నాము.

9. మైత్రావరుణ్యుపనిషత్తు : చైతన్యస్వరూపుడైన సవితృదేవుడు, కార్యప్రవర్తకుడై, మా యందు మంచి బుద్ధులను ప్రేరేపించుగాక.

10. అనంత భట్టు భాష్యం : ఏ పరమేశ్వరుడు అంతర్యామియై, మా జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మంచి పనులు చేయుటకై ప్రేరేపించి, సర్వ సంసార కష్టములను భర్జించు సామర్ధ్యము కల తేజః స్వరూపుడైన సవితృని ధ్యానించుచున్నాము.

11. భట్టోజీ దీక్షిత్ భాష్యం : మా యొక్క బుద్ధులను మంచిపనులను చేయుటకై ప్రేరేపించువాడు, ప్రకాశించెడి ఆదిత్య తేజమే నేనని, అట్టి దానికి దాసుదనని భావించుచూ ఇపాసించుచున్నాను.

12. బహ్వృచ సంధ్యా పద్ధతి భాషం : సూర్యమండలమందు సవితృ అను నామముతో ఉండి, సేవించు వారి కష్టములు దహింపచేయు, భర్గుడనిపించుకొను నారాయణుడే మా బుద్ధులను కార్యాచరణకై ప్రేరేపించును కనుక ఆ సవితృ దేవుని పూజించుచున్నాము.

శ్రీ గాయత్రీ మంత్ర విశిష్టతను గురించి మహాఋషులు, యోగులు, మహాత్ములు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వారిలో కొందరి అభిప్రాయాలను తెలుసుకుందాం.

1. విశ్వామితృడు - గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం నాలుగు వేదాలలో లేదు.
2. యాజ్ఞవల్కుడు - గాయత్రీ మంత్రం సర్వశ్రేష్టం. సర్వోపనిషత్ సారం.
3. పరాశరులు - సమస్త జప, సూక్త, వేదమంత్రాలలో అత్యున్నతమైనది గాయత్రీ మంత్రం.
4. శౌనకుడు - ఎన్ని ఉపవాసాలు చేసినా, బంధ విముక్తి చేయగల శక్తి కలది గాయత్రీ మంత్రం మాత్రమే.
5. వశిష్టులు - ఎంతటి దుర్మార్గుడైనా, మపలచిత్తుడైనా, గాయత్రీ మంత్రోపాసన ఫలితంగా, సర్వోన్నత పదవిని పొందగలడు.
6. వేదవ్యాసులు - సకల వేదసారం గాయత్రీ మంత్రం, సిద్ధగాయత్రీ కామధేనువు వంటిది. గాయత్రీ రూపమైన బ్రహ్మగంగ ఆత్మప్రక్శాళన చేస్తుంది.
7. అత్రి - ఆత్మను శోధించు పరమమంత్రం గాయత్రీ మంత్రం. గాయత్రీతత్వాన్ని గ్రహించువారు సర్వసుఖాలు పొందగలరు.
8. భరద్వాజ - త్రిమూర్తులు కూడా తరించటానికి గాయత్రిని ఉపాసిస్తారు. గాయత్రీ మంత్ర జపం వల్ల పరంబ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది.
9. నారద మహర్షి - భక్తి స్వరూపమే గాయత్రి. ఎక్కడ గాయత్రి ఉపాసించబడునో అక్కడ శ్రీమన్నారయణుడు ఉంటాడు.
10. రామకృష్ణ పరమహంస - మంత్రం చిన్నదైనా శక్తి మహత్తరం. అనేక సాధనలు విడిచి గాయత్రిని ఉపాసించండి, సిద్ధుల్ని పొందగలరు.
11. స్వామి రామతీర్ధ - గాయత్రి మనిషిని కామరుచి నుండి మరలించి, రామరుచిలో లగ్నం చేస్తుంది. ప్రవిత్రాంతఃకరణతో అనుష్టించిన రాముని పొందగలరు.
12. స్వామి వివేకానంద - గాయత్రీ మంత్రం సమృద్ధి మంత్రం. అందుకే మకుటమంత్రమన్నారు.
13. శ్రీ రమణ మహర్షి - గాయత్రీ మంత్రశక్తి వలన అద్భుత ఫలాలు చేకూరతాయి. ఐహిక, లౌకిక, పారమార్ధిక ఫలాలు లభిస్తాయి.
14. స్వామి శివానంద - బ్రహ్మ ముహూర్తంలో గాయత్రీ మంత్రోపాసన వల్ల హృదయనైర్మల్యం, చిత్తశుద్ధి, శారీరక ఆరోగ్యం లభిస్తాయి. నమ్రత్వం, దూరదృష్టి, స్మరణశక్తి లభిస్తాయి.
15. దయానంద సరస్వతి - గాయత్రీ మంత్రం సర్వోత్కృష్ట శ్రేష్ట మంత్రం. చతుర్వేదాలకు మూలమైన మంత్రం.
16. శ్రీ అరవిందులు - గాయత్రిలో నిక్షిప్తమైన శక్తి, మహత్వపూర్ణకార్యాన్ని సాధిస్తుమ్ది.
17. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ - మనలో పునః జీవన స్రోతస్సును ప్రభావింపచేయగల సార్వభౌమిక ప్రార్ధనే గాయత్రీ మంత్రం.

అనేక ధార్మిక గ్రంథాలు గాయత్రీ మహిమను ప్రస్తుతించాయి. ఎందరో మహానుభావులు, ఈ మహత్తర మంత్రంలోని గుప్తమైన శక్తులను, గూఢరహస్యాలను గుర్తించి, ఉపాసించి ఫలసిద్ధి పొందారు... హైందవ సంస్కృతి మాస పత్రిక సౌజన్యంతో....

Friday, 2 August 2013

నందిరాజు పుర్ణయ్య సిద్ధాంతి శర్మ
సద్విషయ సంగ్రహము

భారతీయ సనాతన వేద విద్యాస్థానములు (14)
ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధ్వవేదము శిక్షా వ్యాకరణం
ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పః మీమాంస న్యాయవిస్తారః
పురాణం ధర్మశాస్త్రం
పైన చెప్పిన 14 వేద విద్యా స్థానములు కాక
ఆయుర్వేదం 15. ధనుర్వేదం 16. గాంధర్వవేదం 17 అర్ధశాస్త్రం 18. విభాగాలుగా ఉన్నాయి.
ప్రమాణములు (3)
శృతి స్మృతి పురాణం.
భారతీయ సనాతన వేద ధర్మనికి చెందిన ఆధ్యాత్మిక సాధనకొరకు త్రిమతాచార్యులు స్వీకరించినవి.
ప్రస్థానత్రయము
ఉపనిషత్తులు భగవద్గీతా బ్రహ్మసూత్రములు .
సూత్రకారులు
ఋగ్వేదులకు:- అశ్వలాయన, కాషీతకః
సామవేదులకు :- ద్రాహ్యాయణ, జైమిని.
శుక్లయజుర్వేదులకు:- కాత్యయన.
కృష్ణయజుర్వేదులకు :- ఆపస్తంబః భారద్వాజః సత్యాషాఢ (హిరణ్యకేశి)
వైఖానసః అగ్నివేశ్యః బౌధాయనః.
దర్శనములు (6)
న్యాయదర్శనం, వైశేషికదర్శనం, సాంఖ్యదర్శనం,యోగదర్శనం, మీమాంసాదర్శనం, వేదాన్తదర్శనం.
ఛందస్సులు (7)
గాయత్రీ ,ఉష్ణిక్ , అనుష్టుప్ , బృహతీ , పంక్తిః, త్రి,ష్టుప్, జగతీ.
వ్యాహృతుల ఋషులు (7)
అత్రిః , భృగుః,కుత్సః , వసిష్టః ,గౌతమః ,కాశ్యపః ,అంగీరసః
ఇంకావుంది.