ధర్మసందేహాలు

ధర్మ సూక్ష్మాలు 4వ. భాగము

కర్తరి లో (కత్తెర అని వాడుకలో పిలుస్తారు) నూతన గృహారమ్భములు, ఇంటి ఫై కప్పు వేయుట, చెరువులు భావులు తవ్వుట, గర్భాదానము, పచ్చని మొక్కలు కొట్టుట, చెట్లు నరుకుట, తొలిసారిగా తీర్చుకునే పుట్టువెంట్రుకలు మొక్కు , ఈ పేర్కొన్న విషయములు ఏవియును చేయుట పనికిరాదు.

రోహిణి కార్తెలో మంచినీటి పంపులు, భావులు తవ్వుట మంచిది.


వివాహ పొంతనలు గణన చేయునపుడు ముందుగా వధువు నక్షత్రం నుండే గణన చేయాలి.అన్ని గణనలకు ప్రధమతః వధువు నుండే చేయాలి.


వివాహముహూర్తం బలమైనది అయినప్పుడు వధువు కు జన్మతార అయినను శుభమే. ఆలగ్నం అన్గీకరించవచ్చును.


ఎంతోకొంత దోషం లేని ముహూర్తం నిర్ణయించుట బ్రహ్మ కైనా సాధ్యం కాదు.