Thursday, 28 April 2011

ధర్మ సూక్ష్మాలు ౩వ. భాగముసూర్యోదయమునకు  ఏ తిధి వుండునో ఆ  రోజు చేయు  స్నాన , దాన, జప, వ్రత  , పూజా కార్యక్రమములన్నిటికి సంకల్పములో ఆ తిధే చెప్పవలెను.సంక్రమణ కాలమందు , శ్రాద్ధదినములందు , జన్మదినములందు,  అశ్ర్పుస్య స్పర్స లందు ,  వేడినీటి స్నానం  చేయరాదు.భోజనము చేయు కంచము పట్టుకుని ,ఒళ్ళోపెట్టుకుని ,  కంచము పట్టుకుని తిరుగుతూ, మంచములమీద కూర్చుని భుజించరాదు.నీటిని త్రాగునప్పుడు  చిన్న పాత్రలోనికి తీసుకుని కూర్చుని  మాత్రమే త్రాగవలెను.జపము  పూజాది కార్యక్రమములలో నోటిలో ఏ పదార్దములునములుతూ క్రతువు చేయరాదు.అలా చేసినచో అది ఉచ్చిస్టము అగును.అనుస్టానపరులు మంచినీరు  నోటిలో  ఎత్తి పోసుకుని తాగరాదు, పెదవులకి తగిలించుకొని (కరుచుకుని) తాగవలెను.


Tuesday, 26 April 2011

ధర్మ సూక్ష్మాలు 2వ. భాగము
భోజనమునకు  తూర్పు , పశ్చిమ , దక్షిణ  దిక్కులు  ఉత్తమమైనవి.భోజనము చేయునపుడు నేయి అభిఘారించకుండా భుజించరాదు.భోజనమునకు  ముందు  ఉప్పు వడ్డిమ్చినచో కీర్తి ,తేజస్సు హరించును.


ప్రతి మానవుడు త్రిపుండములు(విభూతి) ధరించవలెను.దానివలన  భూత  ,ప్రేత,పిశాచ భాదలు వుండవు.


దేవాలయాలలో , పడవలలో ,  తీర్ధములలో, పెళ్ళిళ్ళలో , సభలలో , యగ్జ్న యాగాదులలో   ఇతరులును  తగిలినా దోషములేదు,.


భార్య గర్భవతి అయినపుడు  భర్త సముద్ర స్నానము , క్షవరము, పర్వతారోహణము , కుమారునికి ఉపనయనము , చావులుకు వెళ్ళుట, నూతులు తవ్వుట, చెట్లు కొట్టుట , ఇల్లు కట్టుట , కొబ్బరికాయ కొట్టుట  పనికిరాదు. 

ధర్మ సూక్ష్మాలు మొదటి భాగము


84 లక్షల జీవరాసులలో మనవ జన్మ చాలా ఉత్కృష్టమైనది.ఎన్నో  జన్మల పుణ్య ఫలం వలన ఈ జన్మ లభించినది.దీన్ని సార్ధకం చేసుకోండి.


ఉదయంనిద్రలేవగానే  కుడి అరచేతిని చూసి నమస్కారం చేసుకోండి.


ఏ మానవుడు  కూడా జనసంచారం లేని పాడుపడ్డ ఇళ్ళలో, స్మశానానికి దగ్గరలో, నాలుగువీధుల నడుమ, చీకటి ప్రదేశంలో ,పాముపుట్టల దగ్గర , తల్లిదగ్గర,అక్క చెల్లల దగ్గర ,పరస్త్రీల దగ్గర నిద్రించకూడదు.


ఇద్దరు బ్రాహ్మణుల మధ్య ,బ్రాహ్మణునికి అగ్నికి  మధ్య ,భార్య భర్తల  మధ్య, గురుశిష్యుల మధ్య , నందిశంకరుల మధ్య,  ఆవు దూడ ల మధ్య దాటుట వలన,నడవడం వలన పూర్వపుణ్యం నశించును.


సహపంక్తి  భోజనం చేయుచుండగా  మధ్యలో లేచి వెళ్ళినచో బ్రహ్మ హత్యాపాతకం  సంభవించును.


భోజనం చేయుటకు  ముందుగా,   భోజనం అయిన తర్వాత  పాదప్రక్షాళన చేయనిచో  దరిద్రం సంభవించును. 


దీపం లేకుండా రాత్రిపూట భుజిన్చరాదు.


సంధ్యాకాలంలో   భోజనం,   నిద్ర, చదువు   ,దానము,    భార్యా సంగమము  ,ప్రయాణం చేయరాదు.ఒకవేళ చేసినచో  దరిద్రం,  వ్యాధి,      మరణం   సంభవిస్తాయి. 

Thursday, 21 April 2011

గృహా ప్రవేశము


             గృహా ప్రవేశం జరుగు రోజున ప్రాతః కాలములో  అభ్యంగ స్నానం కావించి శుచిఅయిన  వస్త్రాలు ధరించి తొలుత  వినాయక ప్రార్ధన చేసుకుని అన్ని వస్తువులు ఏర్పాటు  చేసుకోవలెను.

గృహా ప్రవేశం కు    పగలు ,రాత్రి  రెండు వేళలు మంచివి.అయినను అపార్ట్మెంట్లకు  పగలైనా  రాత్రయినా మంచిదే .

కాని స్వంతంగా  నిర్మించు గృహములకు  పగలు శంఖు స్తాపన  ,  రాత్రి గృహ్జాప్రవేసము ప్రసస్తము.

గృహా ప్రవేశ రోజున ముందుగా గోవు ను గృహ`ఆవరణలో కి తిసుకురావలెను.గోమాతకు సంతుష్టిగా మేతమేపి గృహము చుట్టూ ముమ్మారు అనగా మూడుసార్లు ప్రదక్షిణలు గావిన్చావలెను.

మగవారు అనగా ఇంటి యజమాని దేవునిపటము,పూజా సామగ్రిని పట్టుకోవలెను.ఆయన  ధర్మపత్ని నిప్పులతో కూడిన పాత్ర పట్టుకుని దంపతులు ఇద్దరు కలిసి (మగవారికి ఎడమపక్క ఆడవారువుండవలెను)మూడుసార్లు ప్రదక్షిణ చేయవలెను.

వారి వెనుక మిగిలినవారు వరుసగా  ధాన్యపుబస్తా, అరటికాయల గెల,జోడు బిందెల  నీరూ ,పాలు,పెరుగు,నవధాన్యాలు, రాళ్లఉప్పు,పాలమండ,,చల్లగుంజ, ఆవిరి కుడుములు,చల్లకవ్వం,ధాన్యం  తీస్కుని , ప్రదక్షిణ  చేసి  నూతన గృహ  సింహద్వారం వద్ద నిలబడవలెను.

ముహూర్తసమయానికి  రెండు నిమిషాలముంద్ర  మంచి గుమ్మడికాయ మీద కర్పూరం వుంచి  వెలిగించి దర్వాజా  కి హారతి ఇచ్చి  ఒక్కసారిగా  పగిలిపోయేట్ట్లుగా ఒక్కదెబ్బతో గట్టిగా దర్వాజా కు కొట్టవలెను.

తదుపరి కొబ్బరికాయ కొట్టి కుడికాలు ముందుగా లోపలి పెట్టి ప్రవేసించ్వలెను.ప్రతి గుమ్మం వద్ద ,కిటికీలు వద్ద కొబ్బరికాయ తప్పనిసరిగా కొత్తవలెను,.

ఆడపడుచులు  ఆగ్నేయాన వంటగదిలో  కొత్త ఇటుకరాళ్ళతో జంటపోయ్యి ఏర్పాటు చేసి  పాలపొంగాలి పెట్టవలెను. పాలు పొంగే సమయాన  గృహ యజమాని  పాలుపొంగ్టం చూచి  అగ్నిదేవునికి నమస్కారం చేసి ఆడపడుచులకి నూతన వస్త్రాలు బహుకరించవలెను.

పురోహితులవారు యజమానులచేత విఘ్నేశ్వరపూజ ,పుణ్యాహవచనం,నవగ్రహ మంట పారధన,వాస్తు కలశ ఆరాధన  గావించి నైవేద్యం ఒనరించి....అఖండదీపారాధన ఈసాన్యములో చేఇంచవలెను వెంటనే కొబ్బరికాయ కొట్టవలెను..యజమానులకి వారి అత్తవారి చేత నూతన వస్త్రాలు యజమానులకి ఇప్పించవలెను.. తదనంతరం నూతనగ్రుహములొ అందరూ ఆనందంగా సంతుష్టిగా భోజనం తప్పనిసరిగా చేయవలేను.

నూతన గృహములో గ్రుహాప్రవేశం అయిన రోజున నిదురించకుండా భగవన్నామ స్మరణ చేయవలెను.

సింహద్వారంవద్ద బూడిదగుమ్మడికాయను కట్టవలెను.

తెల్లవారిన తర్వాతమరల దీపారధన చేసుకొని పాలుకాయవలెను.                   గృహప్రవేశానికి కావలసిన పూజాద్రవ్యములు

పసుపు                                                కొత్త ఇటుకలు                                     

కుంకుమ                                                           పాలపొంగలి గిన్నె

తోమలపాకులు                                                            అత్తవారి బట్టలు

వక్కలు                                                             చల్లగుంజ

అరటిపండులు                                                   అఖండ దీపారాధనకు మూకుడు   వత్తి నూనే

ఖర్జూరకాయలు                                                  దేవునిపటములు, దీపారధన  కుందులు,వత్తులు

పసుపుకొమ్ములు                                               కొబ్బరికాయలు

బియ్యము                                                         మంచి గుమ్మడి కాయ

పూలు                                                               బూడిద గుమ్మడి కాయ

అగరవత్తులు                                                     వుట్టెలు

కర్పూరం                                                            తుండ్లు             

అగ్గిపెట్టె                                                             రవికగుడ్డలు

చిల్లర                                                                బొగ్గునిప్పు

మామిడిమండలు                                                ఆవిరి కుడుములు

కలశపాత్ర                                                          పంచే కండువా

చలిమిడి ,వడపప్పు పానకం                                 బెల్లము

గ్లాసులు రాగివి----------------------

Thursday, 14 April 2011

Lord Vighneswara pradhana

ఇది చాలా మహిమాన్విత స్తోత్ర్రం .మీ ఇంట జరిగే శుభ కార్యక్రమాలు లో ఇది తప్పక
పట్టిన్చండి.
బుధవారం రోజున పారాయణ చేసి కుడుములు నివేదన చేసిన అలా * వారములు చేసినచో ఇష్ట
కార్య సిద్ధి


Wednesday, 13 April 2011

Sree Rama Mantra

*శ్రీరామరామ రామేతి రమేరామేమనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే*