సిరులిచ్చే సుబ్రహ్మణ్యేశ్వరుడు
లయకారుడైన శివుని ఆభరణాలుగా సర్పాలను చూస్తాం. వినాయకుని యజ్ఞోపవీతంగాను, మహావిష్ణువు తల్పంగా గూడా నాగులే దర్శనమిస్తాయ. తారకాసుర సంహారానికి దేవతల కోరికపై శివ వీర్యం వలన జన్మించిన సుబ్రహ్మణ్యశే్వరుడే నాగదేవతగానే ఆరాధిస్తారు.
ఒక్క హైందవ సంప్రదాయంలోనే గాక బౌద్దజైన సంప్రదాయాల్లోనూ నాగారాధన కనిపిస్తుంది. సర్పాన్ని జాతీయ చిహ్నంగా గల ప్రాచీనులు కూడా ఉండేవారని చరిత్ర చెప్తోంది.
ఇలా సర్పపూజ ప్రపంచం మొత్తంమీద చాలాచోట్ల కనిపిస్తుంది. ఇలాంటి సర్పపూజ సింగరాయపాలెంలో ప్రత్యేకతను సంతరించుకొంది. 1954 సంవత్సరంలో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం, సింగరాయపాలెం, మరియు చేవూరు పాలెం, గుళ్ల సింగరాయపాలెంగా ప్రసిద్ధి చెందిన శింగరాయపాలెం గ్రామంలో ఒక దేవతా సర్పరాజము శ్రీ బాబాజీ మఠములోనుండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తటాకంలోకి వచ్చి స్నానం చేసి తిరిగి వెళ్లు సందర్భంలో చేవూరుపాలెంకు చెందిన ఇద్దరు రైతు సోదరులు అయిన అనందాసు వెంకటేశ్వరరావు (వెంకన్న), కీ.శే. ఇసుకపల్లి సుబ్బారావులు ఆ దేవతా సర్పరాజంపై రాళ్లు విసిరారు. ఆ సర్పరాజం తల నేల బాదుకుని మరణించింది. ఆ సర్పమును గ్రామస్తులు చేవూరుపాలెం కాలువగట్టుపై పాతిపెట్టారు. అంతే ఆ రైతు సోదరులకు చూపు పోయింది, వారు తమ తప్పు తెలుసుకొన్నారు. తమ తప్పును క్షమించమని వేడుకొన్నారు. అపరాధాలు మన్నించమని పరిపరివిధాలా ప్రార్థించారు.
ఇలా ప్రార్ధించిన తర్వాత భక్త దయాళువైన సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి చూపును ప్రసాదించాడు. ఆ రైతు సోదరులు ఆనందానికి అవధి లేకుండా పోయంది.
ఆ రోజు రాత్రి గ్రామ పెద్దకు శ్రీ స్వామివారు కలలో కనిపించి తనకు ఆలయం నిర్మించాల్సిందిగా ఆదేశించారు. పాతిపెట్టబడిన సర్పమును వెలుపలకు తీసి ఊరేగించి దహన సంస్కారములు చేయడానికి చూస్తున్నారు. పవిత్రమైన ప్రదేశము కోసం పెద్దలు పండితులు చేవూరు పాలెం శింగరాయపాలెం సమావేశమై చర్చిస్తున్న సమయంలో దారినపోయే ఆవుల మందలోనుండి ఒక కపిల గోవు (నల్లని ఆవు) అంబా అని అరుస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన తటాకంలో దిగి స్నానమాచరించి చెరువుగట్టుపైకి వచ్చి చుట్టూ ప్రదక్షిణం చేసి మలమూత్రాలు విసర్జించింది.
కాలి గిట్టలతో త్రవ్వుతూ అంబా అంబా అను అరుస్తున్న ఆవును చూసి పెద్దలకు, పండితులకు వారి కర్తవ్యం అర్థం అయంది. అపుడు సుబ్రహ్మణేశ్వరునకు పెద్దలు ఇక్కడనే గుడి కడతామన్న సంగతిని నివేదించారు. అంతే ఆ మాటలు విన్న వెంటనే అక్కడ్నుంచి ఆ ఆవు సంతోషంగా వెళ్లిపోయంది. దాన్ని చూసి ప్రదేశంలోనే గుడి నిర్మించాలన్నది స్వామి ఆదేశం అని పండితులు, గ్రామ పెద్దలునిర్ణయానికి వచ్చారు.
గుడి నిర్మాణము చేయుట ఆ దైవప్రేరకమని వారందరూ భావించారు. అప్పట్నుంచి ఇక్కడి సుబ్రహ్మణ్యేశ్వరునికి మొక్కిన మొక్కులు తృటిలో తీరేవి. కోరిన కోర్కెలు తీర్చేస్వామిగా ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు వినితి కెక్కాడు. అపుత్రులకు పుత్రులను, సుమంగళులకు నిత్యసౌభాగ్యాలను ఇచ్చే థేవునిగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సారతులందుకుంటున్నాడు.
అపుడు శ్రీకారం చుట్టిన ఈ దేవాలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ప్రతిష్టచేసారు. ఈ దేవాలయాన్ని శిధిల మవుతున్నందని భావించిన భక్తులు 2001లో 20 లక్షల ఖర్చుతో పునన్మిరాణం చేయించారు. పునప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఆనాటినుండి ఈనాటి వరకు దినదినాభివృద్ధి చెందుతు శ్రీస్వామివారు భక్తుల కోర్కెలను నెరవేర్చుకున్న సంగతి లోకవిదితమే