పరిహారక్రియలు
జాతకంలో దోషాలు వున్నవారు, పూర్వజన్మల దోషాలు,ప్రారభ్ద ఖర్మలు తొలగి అనుకూల పరిస్థితులు కలగాలి అంటే సత్కర్మలు చేయాలి.
అయినా అందరూ బాగా గుర్తు వుంచుకోవలసిన విషయం....ఎవ్వరిజాతకంలోని ఫలితాలను ఎవ్వరూ మార్చలేరు.రుపాంతరం మాత్రమే చేయగలరు.
౧౦౦ రుపాయల ఖర్చు వుంటే ఆ ఖర్చ్చు ని సద్వినియోగం చేయటం కోసం,,లేక ఆ ఖర్చు ఒక విలువైన వస్తువు ఏర్పాటుకు మాత్రమే జరుగుతుంది.అంతెకాని ఖర్చు ఆపటం మాత్రం సాధ్యం కాదు.
చాలా కాలం క్రితం మన ఋషులు,మునులు,గురువులు,యోగులు మనుష్యుల జాతక భాధలననుండి విముక్తి పొందటానికి కొన్ని ముఖ్య పద్దతులు మనకి ప్రసాదించారు.అందు ముఖ్యంగా స్వచ్ఛమైన, కల్మషం లేని మంత్రశక్తి.
రెంమ్డు ఓషధులు.
మూడు లోహాలు రత్నాలు.
మననాత్త్రాయతే ఇతి మంత్రః మనలను రక్షినుచునది మంత్రము.మననము చేయగా మనలను రక్షించునది మంత్రము.
శరీరం లోని డేభైరెండువేల నాడులను నవరంధ్రాల ద్వారా చైతన్య పరిచి నాదముతో మనలను శక్తి వంతులన్ను మంత్రములు చేస్తాయి.మంత్రానుష్టానానికి సద్గురువు,నిష్ఠ ,నియమాలు అత్యన్తావస్యకం.ఇష్టమగు రీతిలో పుస్తక జ్జ్ఞానం తొం చేయటం నిషిద్ధం అనే చెప్పాలి .బీజాక్షరమంత్రాలు ఎవరు పడితే వారు..ఎప్పుడుపడితే అప్పుడు ,అందులోను గురుఉపదేశం లేనిది చేయకుడదు..