Sunday, 18 September 2011

jyothishya methods

సాయన విధానం. దీనినే సూర్యమానం అని కూడా అంటారు.ఇది పాశ్చాత్యులు ఎక్కువగా వాడుతారు. ఇందులో ఋతువులు, సూర్య గమనం, రాశులు, గ్రహగతులు, ముఖ్యంగా చూస్తారు. వీరికి దశావిధానం లేదు. Primary and secondary directions వాడతారు. Primary directions లో ఒక డిగ్రీ ఒక సంవత్సరానికి సమానం. Secondary directions లో ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. ఇప్పుడు Tertiary directions కూడా వచ్చింది.యురేనస్,నెప్ట్యూన్,ప్లూటో మొదలైన గ్రహాలను లెక్కిస్తారు.
నిరయన విధానం దీనిని చాంద్రమానం అనీ నక్షత్రమానం అనీ అంటారు.ఇది మన భారతీయ విధానం.ఇందులో నవగ్రహాలను లెక్కిస్తారు. ఉపగ్రహాలున్నప్పటికీ వాటిని పెద్దగా వాడటం లేదు.నక్షత్ర దశలు, గ్రహములకు గల ప్రత్యేక దృష్టులు,యోగములు,గ్రహావస్థలు మొదలైనవి ప్రధానమైన విషయాలు.మన విధానంలో ముఖ్యంగా పరాశర, జైమిని, తాజక,నాడీ విధానాలున్నాయి. భృగు,గర్గ,కశ్యపాదుల పద్దతులున్నాయి. ఇవి కాక అనేక ఇతర విధానాలున్నాయి.
పరాశర విధానం ఇందులో వర్గ చక్రాలు,వివిధ దశావిధానాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. షడ్వరులు, సప్త వర్గులు, దశవర్గులు,షోడశ వర్గులు ముఖ్యమైనవి.గ్రహ యోగాలనూ, దశలనూ,గోచారాన్నీ, అష్టక వర్గులనూ కలిపి ఫలితాలను ఊహించడం జరుగుతుంది. పరాశర మహర్షి ఇంకా ఎన్నో విషయాలను చర్చించినప్పటికీ ముఖ్యంగా వీటినే పరిగణనలోకి తీసుకుంటున్నాము.
జైమిని విధానం ఇందులో కారకాంశ, రాశి దృష్టులు,రాశి దశలు, ఆరూఢ లగ్నాలు,శూల దశ,చరదశ వంటి ప్రత్యేక దశలు ఉంటాయి. ఆయుర్గణనలో విభిన్న పద్దతులు ఈయన ప్రత్యేకత. ఈ విధానాని పరాశర మహర్షి చర్చించినప్పటికీ దీనిని ఒక ప్రత్యేక విధానంగా జైమిని మహర్షి తయారుచేయటం తో ఆయన పేరుమీద చలామణీలోకి వచ్చింది. దీనిని వాడేవారు తక్కువగా ఉంటారు.
తాజక విధానం ఇది సాయన పద్దతికి దగ్గరగా ఉంటుంది. సహమములు, పాత్యాయనీ దశ, ముద్ద దశ, వర్ష ప్రవేశం, ముంధా బిందువు, ఇతశల, ముతశిల యోగం ఇత్యాది ప్రత్యేకతలుంటాయి.ఇందులోని యోగాలన్నీ పాశ్చాత్యుల విధానపు దృష్టులే. దీనిని ఎక్కువగా ప్రశ్న శాస్త్రంలో ఉపయోగిస్తారు.
నాడీ విధానం లేక భృగు సంహితా పద్దతి ఇది చాలా ప్రత్యేకమైన పద్దతి. ఒక రాశిని 150 భాగాలుగా విడగొట్టి దానిని బట్టి సూక్ష్మమైన ఫలితాలను చెప్పేదే నాడీ విధానం. దీనిలో చాలా రకాలైన నాడీ గ్రంధాలున్నాయి. ఫలితాలు కూడా చాలా విచిత్రంగా సరిపోతాయి. ఇందులో రాశి తుల్య నవాంశ పద్దతి, నాడీ అంశలపైన గ్రహాల సంచారం మొదలైనవాటిని బట్టి ఫలితాలు ఊహిస్తారు.ఇవిగాక K.P system ఇంకొక విధానం. భారతీయ పాశ్చాత్య పద్దతులను కలిపి సబ్ లార్డ్ థియరీతో రంగరించి దీన్ని ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు తయారు చేశారు.దీనిలో ఒక్కొక్క నక్షత్రాన్ని వింశోత్తరీ పద్దతిలో విభజించి సబ్ అనబడే సూక్ష్మ విభాగాన్ని తెచ్చారు. దీనిని మళ్లీ ఇదే పద్దతిలో విడగోట్టి సబ్ సబ్ అనే ఇంకా సూక్ష్మ విభాగాన్నితెచ్చారు. పాశ్చాత్యులు వాడే ప్లాసిడస్ హౌస్ సిస్టం ను ఈయన ఉపయోగించారు. హౌస్ కస్ప్ లు, సబ్ లార్డ్స్, సబ్ సబ్ లార్డ్స్, రూలింగ్ ప్లానెట్స్, హౌస్ రెలేషన్ షిప్ మొదలైన విభిన్న పద్ధతులతో ఆశ్చర్య కరమైన ఫలితాలు చెప్పవచ్చు. మిగిలినదంతా పరాశర విధానం వలెనే ఉంటుంది. ఇది ప్రాధమికంగా ప్రశ్న శాస్త్రం. కాని జనన జాతకానికి కూడా బాగా పనిచేస్తుంది.
ఏలినాటి శని వివరము
:జన్మరాశికి,నామరాసికి,ద్వాదాశము నందు, లగ్నమునందు, ద్వితియమందు, శని ఉన్నచో ఏలినాటి శని అందురు. శని గ్రహము ఒకొక్క రాశి యందు 2 1/2 సంవత్సరములు కాలసంచారము, మొత్తము కలిపి ఏడున్నర సంవత్సరకాలము ఎల్నాటి శని .ఫలితము: ద్వాదశమున వున్న ధన వ్యయము ,మానసికభాద, కుటుంబ సమస్యలు, వ్యాపార ఉద్యోగ వ్యతిరేకతలు కలుగును .జన్మరాశి యందు ఉన్నప్పుడు, బందుమిత్రవిద్వేషములు, ధన నష్టము, కుటుంబ స్తితి తారుమారుగా ఉండును, కొన్ని సుభగ్రహ వీక్షణచే ప్రయత్నపూర్వక ధన ఆదాయము, మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు ,కలత పీడ, మతి భ్రమణము, దీర్గవ్యాదులు కలుగవచ్చును.ద్వితియమునవున్నప్పుడు, ఆశాజివి అగును,నిందలు పడుట, నిత్య దుఖము కలుగును,మానసికముగా కృంగదీయును.
ముఖమునందు 0 3 10 సరిరపడ ధననష్టము
దక్షిణభుజము 1 1 00 ఉద్యోగావ్రుత్తులయండు లాభము
పాదములయందు 1 8 10 అశాంతి,దిగులు, అవమానములు
హృదయస్థానము 1 4 20 ధన ప్రాప్తి,గౌరవము, కీర్తి
వామభుజము 1 1 10 వ్యాధిపీడ, ధనవ్యయము
శిరోభాగము 0 10 00 సంతోషము, ధనదాయము
కన్నులు 0 6 20 మన్నన, కుటుంబ సంతోషం
గుదము 0 6 20 ప్రమాదబరితములు, కీర్తి ధననష్టము
* శని బాధా పరిహారము * శని కి జపము 19000 [వేలు] తర్పణము 1900 [వందలు] హోమము 190 చేసి నువ్వులు బెల్లము నల్లగుడ్డ ఒక నల్లని బ్రాహ్ననునికి దానముఇచ్చట శని త్రయోదసి నాడు శనికి తిలభిషేకము చేయుట వలన కొంత ఉపశాంతి జరుగును పిదతోలగును.
నవగ్రహ గోచారఫలము
[జన్మ రాసి నుండి గ్రహము ఉన్న రాసివరకులేక్క చూడవలెను]
[1] రవి :- 3-6-10-11 రాసులలో ,ఉన్న ఉద్యోగలాభం,అదికార ప్రసంసలు, జివనవ్రుద్ది, ఆరోగ్యం, దైర్యం
[2] చంద్ర :- 1-3-6-7-10-11 లలో మంచివార్తలు, వస్తలాభం, గౌరవము,శాంతి
[3] కుజ :- 3-6-10-11 లలో భూ,గృహమూలక, లాభం,శత్రుభయం,శత్రునాసనము,అన్యస్త్రి సుఖములు,సంతోషం
[4] భుదుడు :- 2-6-7-8-10-11 లలొ గౌరవము,మంచి ఆలోచన, సహాయం, క్రయవిక్రయములవల్ల లాభం,నూతనవ్యాపారము
[5] గురుడు :- 2-5-7-9-11 రాసులలో కుటుబ మరియు సంతాన సంతోషములు,లాభం,వివాహాది సుభ కార్యక్రమములు స్నేహలాభములు
[6] శుక్రుడు :- 1-2-3-4-5-8-9-10-12 లలో స్త్రీ సౌఖ్యం, వస్తులాభం, ఆనందం,ఆభరణ లాభం
[7] శని :- 3-6-11 లలో జీవన సౌఖ్యం, వ్యవహారజయలాభం,బందువ్రుద్ది,ఆరోగ్యం
[8] రాహువు [9] కేతువు :- 3-6-11 శత్రుజయం,కార్యసిద్ధి అగుట, పుణ్యక్షేత్ర దర్శనము, గౌరవము,వినోదం.
పరిహారాలకై సంప్రదించండి: 9885 9848 00

గ్రహముల వల్ల వచ్చు వ్యాదులు రవి-గుండె,జఠరము,లాలాజలము,తాపము,తలనెప్పి,కడుపుమంట,నేత్రములు,రక్త పోటు, మొదలగు వ్యాది.

చంద్రుడు - స్తనములు,రుతుక్రమ సంబిదిత,మానసిక,పిచ్చి మొదలగు వ్యాదులు.
కుజుడు-కోపముగుదము[మర్మస్థాన]కందరములు,ఎర్రకణములుపోవుట[పాడగుట],పేలుడు[మందుగుండు]
సంబదిత,శస్త్ర చికిశ్చ మొదలగు వ్యాదులు.
భుదుడు - శ్వాస,మెడ గొంతు,ఫిట్స్,వెన్నెముక,నోరు మొదలగు వ్యాదులు.
గురుడు - క్రొవ్వు,కాలేయము,మూత్రము,లివర్ సంబందిత వ్యాదులు.
శుక్రుడు - మర్మము,మధుమేహము,సుఖ వ్యాదులు,గడవ బిళ్ళలు మొదలగు వ్యాదులు.
శని - మూలవ్యాది,చాల రోజులు నిలిచే వ్యాదులు,పిసాచ బాధలు ,ఎముకలకు సంబందితవ్యాదులు.
రాహువు - క్షయ,అపరేషన్,కుష్టు,ప్రేగులు మొదలగు వ్యాదులు.
కేతువు - తెలియని జబ్బులు,నత్తి,నరముల పోటు మొదలగు జబ్బులు.
సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ.
.సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు, కుజుడు ఋతువుకు, బుధుడు మాసముకు, గురువు పక్షముకు, శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
సూర్యుడు మొట్ట మొదటి గ్రహం. సూర్యుడు పురుష గ్రహం.స్వభావమ్ పాప స్వభావం.రాశి చక్రంలో స్థితి లో సింహంలో రాజ్యాధికారంలోను, మేషంలో ఉచ్ఛ స్థితిలోను, తులలో నీచ స్థితిలోనూ ఉంటాడు.సూర్యుని జాతి క్షత్రియ, తత్వం అగ్ని,వర్ణం రక్తవర్ణం, గుణం రజోగుణం, స్వభావం పాప స్వభాభావం, స్థిర స్వభావం, కారకత్వం రుచి కారం, స్థానం దేవాలయం, కారకత్వం వహించే జీవులు పక్షులు,గ్రహోదయం :- పృష్టోదయం,ఆధిపత్య దిక్కు :_ తూర్పు,జలభాగం :- నిర్జల,లోహం :- రాగి,పాలనా :- శక్తి రాజు,ఆత్మాధికారం :- ఆత్మ, శరీర ధాతువు :- ఎముక,కుటుంభ సభ్యుడు :- తండ్రి,గ్రహవర్ణం :- శ్యాల వర్ణం,గ్రహ పీడ :- శిరోవేదన, శరీర తాపం,గృహంలో భాగములు :- ముఖ ద్వారం, పూజా మందిరం,గ్రహ వర్గం :- గురువు,కాల బలం :- పగటి సమయం,దిక్బలం :- దశమ స్థానం,ఆధిపత్య కాలం :- ఆయనం,శత్రు క్షేత్రం :- మకరం, కుంభం,విషమ క్షేత్రం :- వృశ్చికం, ధనస్సు, మకరం,మిత్రక్షేత్రం :- మీనము.,సమ క్షేత్రం :- మిధునం, కన్య,శత్రు గ్రహాలు :- శుక్రుడు, శని,సమ గ్రహం :- బుధుడు,నైసర్గిక బల గ్రహం :- శుక్రుడు,వ్యధా గ్రహం, :- శుక్రుడు,దిన చలనం :- 1 డిగ్రీ.ఒక్కొక్క రాశిలో ఉండే సమయం :- 30 రోజులు,రాశిలో ఫలమిచ్చే భాగం :- మొదటి భాగం,ఋతువు :- గ్రీష్మ ఋతువు,గ్రహ ప్రకృతి :- పిత్తము.దిక్బలం :- దక్షిణ దిక్కు.,పరిమాణం :- పొడుగు.
చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మద్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఏడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మద్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు.
అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి.పురుష గ్రహం,రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. గుణం తమో గుణం, ప్రదేశం కృష్ణా నది మొదలు లంక వరకు. అంగారకుడు మృగశిర, చిత్త, ధనిష్ఠ నక్షత్రాలకు అధిపతి. శరీరావయావలో ఎముకలో మజ్జ, కండరాలు, బాహ్యంలో జ్ఞానేంద్రియాలు. అంగారకునికి సూర్యుడు, చంద్రుడు, గురువు మిత్రులు, శత్రువు బుధుడు, సములు శుక్రుడు, శని.
బుధుడు నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన
వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు.
బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు.
గురువు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము, అవతారం వామనుడు.
శుక్రుడు ఇతడు రాక్షస గురువు, భృగుపుత్రుడు, విష్ణుద్వేషి. స్త్రీగ్రహం. రుచులలో పులుపుకు ప్రతీక, తెలుపు వర్ణాన్ని సూచిస్తాడు. జాతి -బ్రాహణ, అధి దేవత - ఇంద్రాణి. ఏడు సంవత్సరాల వయసును సూచిస్తాడు. మనోహర శరీరం, నల్లని జుట్టు, సౌందర్యవంతులకు ప్రతీక. శ్లేష్మ, వాత ప్రకృతిని సూచిస్తాడు. తత్వము -జలతత్వం, దిక్కు -ఆగ్నేయము, రత్నము -వజ్రము, లోహము -వెండి, ఋతువు -వసంతం, దిక్బలం చతుర్ధ స్థానం, గుణము -రజోగుణము, ప్రదేశం -కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం. శుక్రుడు భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ నక్షత్రాలకు అధిపతి. శరీరంలో సంతానోత్పత్తి వ్యవస్థ. వృషభం, తులా రాశులకు ఆధిపత్యం వహిస్తాడు. రవి, చంద్రులు శత్రువులు. శని, బుధులు మిత్రులు. కుజుడు, గురువులు సములు. శుక్ర దశా కాలం ఇరవై సంవత్సరాలు. శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిని, కన్య రాశిలో నీచ స్థితిని పొందుతాడు.
శని నపుంసక గ్రహం. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభద్ర నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. మిత్రులు బుధుడు, శుక్రుడు, శత్రువులు రవి, చంద్ర, కుజులు, సముడు గురువు. ముసలి వారిని, సన్నని పొడగరులను సూచిస్తాడు. తత్వం వాయుతత్వం, దిక్కు పడమర, ఋతువు శిశిరం, జాతి శూద్ర, లోహము ఇనుము, ఉక్కు, రత్నములలో నీలం, గ్రహసంఖ్య ఎనిమిది, దిక్బలం సప్తమ స్థానం, గుణము తమోగుణము, ప్రదేశము హిమాలయాలలోని గంగా పరివాహక ప్రాంతాన్ని సూచిస్తాడు. శరీర అవయవములలో ఎముకలు, క్లోమము, విసర్జకావయములను సూచిస్తాడు.
రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంధాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.
కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగుణం, దిక్కు వాయవ్యము, ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. ఆత్మాధికారం మోక్షం, పాలనా శక్తి భటుడు, లోహము ఇనుము, కుటుంబ సభ్యుడు తాత, వర్ణం ధూమ్ర వర్ణం, గ్రహ పీడ అతి తెలివి, గ్రహ వర్గం గురువు, గృహంలోని ఖాళీ ప్రదేశాలను సూచిస్తాడు, కాల బలము పగలు, కాల బలం పగలు, శత్రు క్షేత్రం కటకం, సమ క్షేత్రం మీనము, ఉచ్ఛ క్షేత్రము వృశ్చికము, నీచ క్షేత్రము వృషభము, మిత్రులు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శత్రువులు శని, శుక్రుడు, సములు గురువు, బుధుడు. వయసు ముసలి వయసు, చెట్లు ముళ్ళ చెట్లు, ధాన్యం ఉలవలు, పండ్లు సీతా ఫల, ప్రదేశములు గుహలు, బిలములు. దేశంలో కేతువు ఆధిక్యత ఉన్న ప్రదేశం అంతర్వేధి.ధాన్యము ఉలవలు, పక్షులు రాబందు, గద్ద, కోడి. జంతువులు కుక్క, పంది, గాడిద. మూలికలు తెల్ల జిల్లేడు, పున్నేరు వేరు, సమిధలు దర్భ. దైవ వర్గం వైష్ణవ, గోత్రము పైఠీనస. అవతారం మీనావతారం. గ్రహారూఢ వాహనం గ్రద్ద, రత్నము వైఢూర్యం, రుద్రాక్ష నవ ముఖ రుద్రాక్ష, లోహము కంచు, శుభ సమయం ఉదయ కాలం. వారము ఆదివారం. స్వభావం చంచల స్వభావం. దృష్టి అధోదృష్టి.
----------------------------------------------------------------------


మీరు చేస్తున్నప్రయత్నములు అన్ని విఫలమగుట,కార్యములందు ఆలస్యము,అనుకోని చిక్కులు ,వివాహ ప్రయత్నములు ముందుకు సాగక వివాహము ఆలస్యము ,ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలలో సమస్యల కు జ్యోతిష్యపరమైన పరిష్కార మార్గములకై,పుట్టినతేదీ, పుట్టిన నెల,పుట్టిన సంవత్సరము,
పుట్టిన సమయము, పుట్టిన స్థలము మొదలైన వివరములతో సంప్రదించండి