Sunday, 18 September 2011

మంత్ర జపాలు చేయలేని వారు యంత్రాల ద్వారా కార్యాన్ని సాధించ వచ్చు

సకల వాస్తు దోషాలు పోగొట్టుకోవాలంటే గోడలు పగలగొట్టుకుని, ఇల్లు మళ్ళి కట్టుకోనక్కర్లేదు, మత్స్య యంత్రం ఒకటి పూజించి ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు నివారించ బడతాయి. కూర్మ యంత్రం స్థిరత్వానికి చిహ్నం. నరఘోష యంత్రం కొంత దృష్టిదోషాన్ని నిర్మూలిస్తుంది. ప్రతి యంత్రంలోను రాయబడిన బీజక్షరాలు, త్రికోణ, వర్తుల, చతురస్ర నిర్మాణాలు ఆయా శక్తులని, దిక్పాలకులని, విశ్వంలో ఆ మూల ప్రకృతికి చెందిన ఆది శక్తిని ప్రేరేపించి మంచి ఆలొచనలని, ఆనందకరమైన వాతావరణాన్ని కలగ చేస్తాయి. కొన్ని యంత్రాలని ధరిస్తారు కూడా. మరీ ఫొటో ఫ్రేం అంత కాకుండా, చిన్న తాయెత్తుల్లో యంత్రాలని ధరించ వచ్చు. దీర్ఘకాల వ్యాధులకి ఇవి బాగా పనిచేస్తాయి. మంత్ర జపాలు చేయలేని వారు యంత్రాల ద్వారా కార్యాన్ని సాధించ వచ్చు. మంచి యంత్రాన్ని అర్చించి శక్తివంతం చేసుకుని ఫలితాన్ని పొందవచ్చునని మేరుతంత్రం లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి.