Monday, 19 September 2011

కుజదోష నివారణకు

కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామాళి రోజు 9సార్లు 12 రోజులు పారాయణ చేసి వల్లీ, దేవసేనా అష్టోత్తర శతనామాలు ఒకసారి చదవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యమాలా మంత్రము రోజుకొకసారి 40 రోజులు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

అదీ కుదరకపోతే సుబ్రహ్మణ్య కవమ్ రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం 27 రోజులు పారాయణ చేయగలరు. అలాగే సుబ్రహ్మణ్య కరవలాంబ స్తోత్రం రోజుకు 80 సార్లు చొప్పు న 11 రోజులు పారాయణ చేయడం ఉత్తమం.

ఇకపోతే.. ఏడు మంగళవారములు ఉదయం ఆరు గంటల నుంచి ఏడుగంటల లోపున శివాలయంలో ఏకరుద్రాభిషేకం చేయించడం కుజదోషాన్ని నివారించవచ్చు. ఏడు మంగళవారములు కుమార స్వామికి గానీ, నాగేంద్రస్వామి పుట్టకుగాని 70 ప్రదక్షిణలు చేయగలరు.

అలాగాకుంటే ఆదివారం ఖచ్చితముగా రాహుకాలములో సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటలోపుగా నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేసి సుబ్రహ్మణ్యష్టకం పారాయణం చేయండి. నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు పుట్టమన్ను చెవికి కచ్చితముగా పెట్టుకోవాలి. పాలుపోయాలి. కొబ్బరికాయ కొట్టి రావాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అలాగే శనివారం ఉదయం 9-30 నుంచి 11 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4-30 నుంచి ఆరు గంటల వరకు, సోమవారం ఉదయం 7-30 నుంచి 9-00 గంటల వరకు.. రాహుకాలములో అష్టమూలికా తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన ఎర్రటి వత్తులతో చేసినట్లైతే చాలా మంచిది