Monday 27 January 2014

షట్ తిలా ఏకాదశి '

హిందూ ధర్మ చక్రం
ఈ రోజు ' షట్ తిలా ఏకాదశి '. ఈ రోజు మహా విష్ణువును ప్రదోష సమయంలో అర్చించండి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి. లేదా కనీసం ' అష్టాక్షరీ మంత్రం ' పారాయణం చేయండి.
' అష్టాక్షరీ మంత్రం ' విశిష్టత !
న - కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
ర - కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
య - కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
ణ - కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే

'న' అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి.
'ర' అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి.
'య' అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు.
'ణ' అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.