Saturday 30 November 2013

మంత్రమంటే ఏమిటి?

అసలు మంత్రమంటే ఏమిటి? ప్రతి మంత్రంలో బీజాక్షరాలుంటాయ? మంత్రాలు ఎన్ని రకాలుగా వుంటాయి?

మననం (జపం) చేసే వ్యక్తిని కాపాడేదే మంత్రం. మంత్రాలలో కొన్ని బీజాక్షరాలు వుంటాయి. బీజాక్షరాలనూ, కొన్ని పదాలనూ కూర్చడమే సంపుటీకరణం. దేవతల అనుగ్రహాన్ని సంపాదించటానికి మంత్రాలను జపించడం అనాదిగా వస్తున్న వైదిక సంప్రదాయం. మంత్రానుష్ఠానానికి గూరూపదేశం తప్పకుండా కావాలి. మంత్రాలు ఎన్నో రకాలుగా వున్నాయి. మంత్రశాస్త్రం అనంతమయినది... అపారమయింది. ఆరు అక్షరాలున్న మంత్రాన్ని 'బాల" అని ... పన్నెండు అక్షరాలున్న మంత్రాన్ని "కౌమారి" అని ... పదిహేను అక్షారాలున్న మంత్రాన్ని "యౌవని" అని... ఇరవై నాలుగు అక్శారాల మంత్రాన్ని "వ్రుద్ధ" అని వ్యవహరిస్తారు. అపరిమితంగా అక్షరాలుంటే "మాలా" మంత్రం అంటారు. విధిగా శ్రద్ధగా జపించకపోతే మంత్రాలు ఆయా దేవతలకి ఆగ్రహం తెప్పించే అవకాశం వుంది.

శ్రీశైలప్రభ, నవంబరు.