Monday 4 November 2013

కార్తిక వ్రతాన్ని పాటించటం ఎలా?

భక్తి సమాచారం
కార్తిక వ్రతాన్ని పాటించటం ఎలా?

కార్తిక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటే చిత్తశుద్దితో స్నానమాచరించి దానము, పితృశ్రాధ్దము, దేవతార్చనలు చెయ్యటం ద్వారా అనంత పుణ్యఫలములు చేకూరుతాయి. సూర్యుడు తులలో ప్రవేశించిన నాటినుంచి గానీ, కార్తిక శుద్ద పాడ్యమి నుంచి వ్రతాన్ని ఆచరించాలి.

విష్ణువు ఈ మాసంలో గోమాత కాలిడిన చోటులో ఉంటాడని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అంతేగాక నూతులు, చెరువుల్లో మహావిష్ణువు వేంచేసియుంటాడని ప్రతీతి. ఈ సమయంలో శుచిగా స్నానమాచరించి కాలభైరవున్నిధ్యానించటం చేస్తే మంచి పుణ్య ఫలితాలు లభిస్తాయి. 

దీనితో పాటు నడుము లోతు నీటితో స్నానమాచరించి బొటన వ్రేలితో పితృదేవతలకు అర్ఘ్యం విడవటం చేస్తే పితృదేవతలను తృప్తి పరచిన ప్రాప్తి లభిస్తుంది. సంధ్యావందనమునకు అనంతరం గ్రాయత్రి మంత్రమును పఠించటం చెయ్యాలి. అంతేగాక హోమం వీలైతే చెయొచ్చు. పుష్పాలతో భక్తి భావములతో పూజించి భుజించాలి.

సాయంకాలం శివ,విష్ణు ఆలయాల్లో దీపం పెట్టండటం చేయాలి. వీలైన వారు విష్ణుసోత్రమును గానీ, శివ సోత్రమునుగానీ చదివి ధ్యానించటం చెయొచ్చు. ఈ విధంగా కార్తికమాసంలో భక్తిపరంగా స్నానమాచరించే వారికి మరుజన్మ లేదని మోక్షం లభిస్తుందని మహర్షుల వాక్కు.

ఈ జన్మలో మాత్రమే కాకుండా పూర్వపు జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి. బ్రాహ్మణులు, క్షత్రి.యులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు , పురుషులు, అందరూ వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తిక వ్రతాన్ని ఆచరించిన వారిని చూసినట్టయితే ఆరోజు చేసిన పాపాలు తొలగిపోతాయి. కార్తిక వ్రతాన్ని చేపట్టిన వారికి ఫుణ్య ఫలాలు లభిస్తాయని విష్ణులోక వాసులవుతారని ప్రతీతి.

ఈ మాసంలో కావేరీ నదిలో స్నానమాచరించటంతో పుణ్యఫలాలు లభిస్తాయన్నదని శాస్త్రపరమైన అంశం. కార్తిక మాసంలో వచ్చే సోమవారంలో వ్రతం ఆచరిస్తే కైలాసివాసులవుతారు. కార్తిక సోమవారం నాడు చేసే స్నాన దాన జపాదుల వల్ల వేలకొలది అశ్వమేధయాగాలు చేసినంత ఫలం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.