Tuesday 10 April 2012

) దేవాలయ వాతావరణంలో నూతన శక్తి మనలొ ఎందుకొస్తుంది?

గుడిగంటలూ,శంఖనినాదాలూ, మంత్రాలూ, మనిషిలోని వినికిడిశక్తిని ఉధృతం చేస్తాయి. భగవంతునికి అర్పించే పుష్పాల్లోని సువాసనలు ఘ్రాణశక్తిని తట్టిలేపుతాయి.

స్వామి ప్రసాదంలో రోజూవారీ మనం వాడనివి ఉదాహరణకు పచ్చకర్పూరం వంటివి వేస్తారు. మనిషి అలోచనల్ని ధర్మమార్గం వైపు తీసుకెళ్ళే శక్తి ప్రసాదంలో ఉంది.
...
నుదుటున పెట్టుకునే చందనపు బొట్టూ, చెవిలో పెట్టుకొనే తులసివల్ల రక్తప్రసరణ పెరిగి శరీరం ఆరోగ్యవంతమవుతుంది.

2) నవరత్నాల ఉంగరాన్ని ధరించమని శాస్త్రాలు ఎందుకు చెప్పాయి?

మనిషి శరీరంలో తొమ్మిది ధాతువులు ఉన్నాయి. వాటి పరమార్ధాన్ని చెప్పేవే నవరత్నాలు. రక్తం పగడానికీ, ఎముకలు ముత్యానికీ, పుష్యరాగము మాంసానికీ, శిరోజాలు నీలానికీ, వైడూర్యానికి క్రొవ్వూ, గోమేధానికి బలమూ, కెంపునకు వీర్యమూ, వజ్రానికి వెన్నుపూసా, పచ్చకు గోళ్ళు సూచికలు.

అసలైనసిసలైన నవరత్నాలు దొరకటము, ధరించటం చాలా కష్టమే.


3) ప్రొద్దున లేవగానే ఎవరి మొహం చూశావు అని అంటారు గదా? అందులో ఉన్నటువంటి అంతరార్ధమేమిటి?

మనిషి శరీరం ఓ విద్యుత్ కేంద్రం. రాత్రంతా నిద్రపోయి మెలకువ రాగానే కనులు తెరచినప్పుడు దేహంలోని విద్యుత్ శక్తి కనులద్వారా బయటికి వస్తుంది.
మనకు ఎదురైన మనిషిలో దేహశక్తి ఎక్కువైతే ఆ ప్రభావం మనమీద పడుతుంది. అదే వారి దేహశక్తి తక్కువైతే మన ప్రభావం వారిమీద పడుతుంది.

శరీరమూ, మనస్సూ, బ్యాలెన్సు తప్పి చేయకూడని కార్యాలు చేసి ఊహించని సమస్యను తెచ్చుకుంటారు. అలా కాకూడదని లేవగానే అరచేతులు రుద్దుకొని కళ్ళకద్దుకుని ఆపై లేచి భగవంతుని పటాన్ని చూడమంటారు.