Tuesday, 10 April 2012

‎1)ధనుర్మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఆ విశేషాలేమిటి?

ఇంటిముందు ముగ్గులువేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు.

లక్ష్మీ రూపంలో నున్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులువేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.
...
2)పూర్వకాలంలో తుఫానువంటి ఉపద్రవాలొస్తున్నాయని ఎలా కనిపెట్టారు?

తేనెపట్టులోని తేనెటీగలు బయటికొచ్చి ఝంకారనాదాలు పెడుతుంటాయి.

పావురాళ్ళు గమ్యం లేకుండా తిరుగుతూ అలజడిగా అరుస్తూంటాయి.

కుక్కలు చెవులు విప్పార్చి ఒకింత భయంతో తుఫాన్ దిశగా చూస్తాయి.

అడవిలోని ఏనుగులు గుంపులు గుంపులుగా అటూ ఇటూ పరిగెడుతాయి.
కొన్ని జంతువులు ఆహారం కోసం బయటికి రాకుండా లోపలే ఉండిపోతాయి.

ఆవులు, మేకలు వర్షపు రాకను పసిగట్టి ఎప్పటిలా కాక విరుద్ధంగా అరుస్తాయి.


3) భార్య ఏయే సేవలు చేస్తుంది?

ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకొస్తుంది.
మీ వంశాన్ని నిలబెడుతుంది.
సంసారాన్ని చక్కదిద్దుతుంది.
గృహన్ని సైనికులా కాపాడుతుంది.
భర్త కీర్తిప్రతిష్ఠల్ని పెంచేలా ప్రవర్తిస్తుంది.
ఆఖరున వృద్ధాప్యంలో కూడా చేతనయినంత సేవచేస్తుంది.

భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టే పరమశివుడు
మొదటి భార్యకు అర్ధశరీరాన్ని -
రెండవ భార్యను శిరస్సు నందు, అలాగే

శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని వక్ష:స్థలమందూ -

బ్రహ్మదేవుడు చదువుల తల్లి సరస్వతి దేవికి
ముఖమునందు స్థానమేర్పరచి తమయొక్క ప్రేమను చాటుకున్నారు.

4) మంగళసూత్రాల్లో గుబ్బ ఎందుకుంటుంది?

ఆ ప్రదేశంలో వాయువు చేరుతుంది. ఊపిరి తిత్తులూ, గర్భకోశము కలిసే నరాలవద్ద ఆ మంగళసూత్రాలు తాకుతాయి.

అలా బంగారు సూత్రాలు తాకినప్పుడు గుబ్బలోని వాయువులు ఆమెకి పుట్టబోయే బిడ్డలకు మంచి చేస్తాయని శాస్త్రము చెపుతుంది.

5) తల్లీ,తండ్రీ గొప్పతనం గురించి శాస్త్రాలలో ఏమి చెబుతుంది?

ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి.
ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించిన, గోవును దానం చేసిన ఫలము దక్కును.

సత్యం తల్లి...జ్ఞానము తండ్రి.

పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.
వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.

ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది.

ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా అశ్వమేధయాగాలు చేసినా పోదు.

తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు.