Thursday, 5 April 2012

శ్రీ కళ్యాణరామ సుప్రభాతం

శ్రీ కళ్యాణరామ సుప్రభాతం

భాన్విందు భూజ బుధ గీష్పతి శుక్రమందా:
స్వర్భాను కేతు సహితా శ్శుభటమంటపే ద్య!
తిష్ఠంతి శ్రీచరణయుగ్మముపాసింతుతే
... కళ్యాణరామ! భవతాత్తవ సుప్రభాతం!!

తా!! సూర్య,చంద్ర,అంగారక, బుధ,గురు,శుక్ర,శని,రాహు,కేతువులు (నవగ్రహములు) నీ పవిత్ర పాదసేవ చేయుటకై మంటపమున కేతెంచి యెదురుచూచు చున్నారు. కళ్యాణ రామా!నీ కిదే సుప్రభాతము.

శ్రీ మత్స్య,కఛ్ఛప,వరాహ,నృసింహ,వర్ణిన్,
శ్రీ జామదగ్న్య, రఘురామ, హలాంకరామ,
శ్రీ రుక్మిణీ హృదయ వల్లభ,కల్కిరూప,
కళ్యాణరామ! భవతాత్తవ సుప్రభాతం!!

తా!! మత్స్య,కూర్మ,వరాహ,నృసింహ,వామన,పరశురామ,దాశరధిరామ (నాగలి ధరించిన) బలరామ (రుక్మిణీ హృదయేశుడైన) శ్రీకృష్ణ కల్కి రూపములైన దశావతారములు ధరించిన కళ్యానరామా! నీకిదే సుప్రభాతం )

శ్రీకేశవాచ్యుత,ముకుంద,కపీశసేవ్యా!
నారాయణాశ్రిత జనార్తి హరప్రభావ!
గోవింద,మాధవ,త్రివిక్రమ,రావణారే!
కళ్యాణ రామ,భవతాత్తవ సుప్రభాతం!!

కేశవ, నాశనము లేనివాడా, మోక్షమునిచ్చువాడా; హనుమంతుడు సుగ్రీవుడు మున్నగు వానర రాజులచే పూజింపబడువాడా; నారాయణా, శరణు జేరినవారి బాధలు మాంపగల ప్రభావము గలవాడా; గోవిందా, లక్ష్మీవల్లభా, వామనా, రావణశత్రువైన రామా! నీకిదే సుప్రభాతం!!