Wednesday 12 June 2013

శక్తి మంత్రము

శుక్ల యజుర్వేదము, 19.9

ఓం తేజో సి తేజో మయి దేహిl వీర్యంసి వీర్యం మయి దేహిl
బలమసి బలం మయి దేహిl ఓ జోసి ఓజో మయి దేహిl
మన్యురసి మన్యుం మయి దేహిl సహో సి సహా మయి దేహిl ఓంll

మన ప్రాచీన మహా ఋషులు తమ దివ్య మైన తపో బలముచేత సమస్త మానవాళికి ఉపయుక్తమగు మంత్రాలను ధ్నానావస్తలో దర్శించి ప్రకటించినవి.

మనుష్యుడు తన ఆత్మ శక్తిని ధృఢపరచుకొను విధము, భగవంతుని ప్రతి చిన్న విషయానికి ప్రయాస పడకుండా అన్ని విధములైన అనుగ్రహములు లభింప చేయగల శక్తి మంత్రమును ప్రశాదించినారు.

''శరీరానికి, మనస్సుకు సంబంధించిన అన్ని క్లేశములు మానసిక బలహీనతనుండే పుట్టుకొస్తాయి. బలహీనతే మరణం అంటారు స్వామి వివేకానంద.
అలా మరణం బారిన పడకుండా ఉండగోరితే ప్రతి మానవునికి దివ్యమైన శక్తి అత్యంత ఆవశ్యకమైయున్నది.
దేహశక్తి, మానసిక శక్తి, ఆత్మ శక్తి.
ఈ విధమైన ధివ్య శక్తి ప్రాప్తి కొరకు ఈ మంత్రం.
భగవంతుడా! నువ్వు ఆత్మ శక్తిగా ఉంటున్నావు.నాకు ఆత్మ శక్తిని ప్రసాదించు.నీవు నాయందు
సంయమ శక్తిని అనుగ్రహించు.
సమస్త భౌతిక కార్య నిర్వహణ కొరు శరీర శక్తిని ప్రసాదించు.
నువ్వు దివ్య శక్తిగా భాసిచుచున్నావు, ఉన్నతధ్యేయముతో జీవించుటకు దివ్య శక్తిని ఒనగూర్చుము దేవా! నీవు సర్వదా ధైర్య శక్తిగా భాసిల్లుచున్నావు నాకు ధైర్య శక్తిని ప్రసాదిచుము.
కాల స్వరూపుడైన ఓ పరమాత్మా! కాలానుగుణముగా ఉప లబ్ధులకొరకు వేచియుండగల సహనతను ప్రసాదించు దేవా!

ఇచ్చట విశేషము - కార్య సాధనకొరకు సహనత ఓర్పు కూడా పరమాత్మ ప్రసాదించవలసిన శక్తి.''సాధనచేత పనులు సమకూరు ధరలోన''
ఆశీర్వాదములతో
మీ నం.పూ.సి.