Monday 21 October 2013

ఏకాదశ రుద్రులు.....

Aditya Srirambhatla


ఏకాదశ రుద్రులు.....


పరమశివుడు నిరాకారుడు అయినప్పటికీ ఆయనను లింగరూపంలోనూ ...
ఏకాదశ రుద్రరూపాల లోనూ పూజించడం జరుగుతోంది.
1) శంభుడు
2) పినాకి
3) గిరీషుడు
4) స్థాణువు
5) భర్గుడు
6) సదాశివుడు
7) శివుడు
8 ) హరుడు
9) శర్వుడు
10) కపాలి
11)భవుడు
ఏకాదశ రుద్రులుగా
పిలవబడుతున్నారు.
'శంభుడు'కి ఆదిభౌతిక
రూపమైన 'పృథ్వీ లింగం'
ఏకామ్రనాథుడు అనే పేరుతో తమిళనాడు లోని శివకంచిలో
దర్శనమిస్తోంది.'పినాకి' యొక్క ఆదిభౌతిక రూపమైన 'జలలింగం'
జంబుకేశ్వర లింగంగా
అలరారుతోంది. 'గిరీషుడు'
ఆదిభౌతిక రూపమైన 'తేజో లింగం'
అరుణాచలంలో
విరాజిల్లుతోంది. 'స్థాణువు' యొక్క ఆదిభౌతిక రూపం 'వాయు లింగం'గా శ్రీ
కాళహస్తిలో పూజలు అందుకుంటోంది.
ఇక 'భర్గుడు' ఆదిభౌతిక రూపం 'ఆకాశలింగం'గా
చిదంబరంలో దర్శనమిస్తోంది.
'సదాశివుడు' ఆదిభౌతిక
రూపం 'సూర్యుడు'గా ...
'శివుడు' ఆది భౌతిక
రూపం 'చంద్రుడు'గా
సాక్షాత్కరించారు. ఇక
రుద్రులలో ఎనిమిదవ వాడైన 'హరుడు' ఆదిభౌతిక రూపం 'పశుపతి నాథుడు' నేపాల్ రాజధాని ఖాట్మండులో
దర్శనమిస్తాడు.
'శర్వుడు' ఆది భౌతిక
రూపం 'పవమానుడు' కాగా. 'కపాలి' ఆదిభౌతిక రూపం 'పావకుడు'గా
పూజలందుకుంటున్నాడు. ఏకాదశ రుద్రులలో చివరివాడైన 'భవుడు' సకల శుభాలను, జీవన్ముక్తిని కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి......