Friday 7 February 2014

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 4

Jaji Sarma
భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 4
1. రామావతార సారం మొత్తం పెద్దల మాట వినుట. గురోర్నిదేశే తిష్ఠన్: దేవతలు కోరితే అవతరించాడు. విశ్వామిత్రుడి మాట మేరకే ఆయనతో వెళ్ళాడు. విస్వామిత్రుని మాటమేరకే తాటకిని సంహరించాడు. ఆయన మాట మేరకే యజ్ఞాన్ని కాపాడాడు, ఆయన ఆజ్ఞ ను అనుసరించి మిథిలా నగరానికి బలయలు దేరి, అహల్యను శాపవిమోచనం గావించి, ఆయన మాటమేరకే శివ ధనుర్భంగం చేసాడు, దశరధుడు చెప్తే సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. తండ్రి మరియు కైక ఆజ్ఞతో అరణ్యానికి బయలుదేరాడు. భరద్వాజుని ఆజ్ఞతో చిత్రకూటంలో నివాసం ఏర్పరుచుకున్నాడు, చిత్రకూటంలో కులపతి ఆజ్ఞతో అక్కడినుంచి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళాడు . దండకారణ్యంలో సుతీక్షుని ఆజ్ఞతో అక్కడ ఋషుల ఆశ్రమాలు దర్శించాడు, అగస్త్య ముని ఆజ్ఞతో పంచవటికి బయలుదేరాడు, పంచవటిలో జటాయువు నిర్దేశంతో ఆశ్రమం నిర్మించుకున్నాడు. కబంధ్ని, శబరి ఆజ్ఞతో సుగ్రీవుడితో స్నేహం చేసి. సుగ్రీవుని మాటతో వాలిని చంపాడు, సుగ్రీవుని మాటతోనే హనుమంతాదులను సర్వదిక్కులకూ పంపాడు. హనుమంతుడు చెప్పినదాన్ని బట్టి, సుగ్రీవుని సలహామేరకూ యుద్ధానికీ బయలుదేరాడు, విభీషణుని సలహా మేరకూ సముద్రున్ని శరణు వేడాడు, సముద్రుని మాటమేరకూ సముద్రానికి వారధి కట్టాడు. రామ రావణ యుద్ధంలో కూడా మాతలి చెబితే రావణున్ని చంపాడు. అగ్నిహోత్రుడు చెబితే సీతమ్మవారిని స్వీకరించాడు, భరద్వాజుడు చెబితే అయోధ్యకు మళ్ళీ వెళ్ళాడు, యమధర్మరాజు చెబితే అవతారాన్ని చాలించుకున్నాడు.

2. కాళీయమర్దన ఘట్టం: దూడలు ఆవులూ కొందరు గోపబాలులతో కలిసి స్వామి వెళ్తుండగా, కొందరు ఆ నదిలో నీరు త్రాగారు. ఆ నీరు త్రాగి మరణించిన వారిని పరమాత్మ తన అనుగ్రహ దృష్టితో బ్రతికించాడు. మరునాడు పొద్దున్న కొందరు పిల్లలను తీసుకొని బలరాముడి కూడా చెప్పకుండా వచ్చాడు. వచ్చి చెట్టు ఎక్కి దూకాడు. ఈ కాళీయ హ్రదమంటే మన సంసారమే. మనలో విషాలను తొలగించడానికే స్వామి వస్తాడు. కాళీయుడు గరుడునితో విరోధం పెట్టుకుని వచ్చాడు. గరుడుడు అంటే పక్షి, అంటే ఆచర్యుడు. భాగవతులతో విరోధం పెట్టుకుంటే విషమయమైన సంసారంలో పడతాము. మళ్ళీ స్వామి కరుణించి ఆ భవతోత్తముల ఆగ్రహాన్ని శమింపచేసి, సంసారం నుంచి విడుదల చేసి నిత్య విభూతికి పంపుతాడు. అలాగే కాళీయ్డుఇని హ్రదం నుండి సముద్రానికి పంపాడు. జీవున్ని పరమాత్మ వైకుంఠానికి ఎలా పంపుతాడో చెప్పే అధ్యాయం. అలాగే పూతన స్తనంలో విషము పెట్టుకుంది. ఈ విషము అంటే విషయములు. అహంకార మమకారాలు స్తనములైతే , అందులో ఉండే శబ్దాది విషయాలు విషములు. విషము తాగితే ప్రమాదం. విషయం ఆలోచిస్తేనే ప్రమాదం. అందుకే కృష్ణుడి లీలల్లో దావాగ్నీ విషమూ పెక్కు సార్లు వస్తాయి. ఆ రాత్రి గోపాలురందరూ అక్కడ విశ్రమించగా దావాగ్ని వచ్చింది. ఆ అగ్నిని కృష్ణుడు తాగేసాడు. మన కామములే అగ్ని. అంతకు ముందు ఆ మడుగులో ఉన్నది అహంకారం అనే విషము. కాళీయుడు ఏ విధంగా ప్రాణ రక్షణ కోసం ఆ హ్రదంలోకి వచ్చి మిగతా జీవులు జేరకుండా హింసించాడో, మనం కూడా సంసారములో కర్మ అనుభవించడానికి వచ్చాము. అది అనుభవించడం చాలక, మరి కాస్త కర్మను మూటగట్టుకుని పోతున్నాము. బృహధారణ్యక ఉపనిషత్సారం ఈ కాళీయ మధన వృత్తాంతం.
ఆ కాళీయ హ్రదంలో స్వామి విహరించాడు. ఆ కాళీయున్ని బయటకు వెళ్ళగొట్టాడు (ఉచ్చాటయిష్యదురగం )

అందరూ ఆనందముతో ఆ రోజు అక్కడ పడుకుంటే దావాగ్ని వచ్చింది. అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు, తాను కూడా మూసుకున్నాడు. అందరినీ తెరవమన్నప్పుడు చూచేసరికి అగ్నిలేదు. (నొట్లోకి ఏ పదార్థం పోతున్నా చూడకూడదని శాస్త్రం. లోపటికి వేడి వెళ్తున్నప్పుడు, కళ్ళలో జ్యోతికూడా మూసుకోవాలని శాస్త్రం). ఒక్క బలరాముడు మాత్రం మూసుకోలేదు. నైవేద్యం పెట్టేప్పుడు అర్చకునికి మాత్రమే మినహాయింపు చూడటానికి. అర్చకుడు కూడా స్వామికి నైవేద్యం పెట్టేప్పుడు ప్రసాదం చూడకూడదు.

3. ఈ శ్లోకానికి అపవర్గప్రదం అని పేరు. పరమాత్మ స్వరూపం, పరమాత్మ సన్నిధి కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. పంచభూతాలు గాని,కాలము గానీ దేశం కానీ, వ్యక్తి కానీ, అవస్థలు కానీ, నిరంతరం మన ప్రయత్నం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసలు తీసుకుంటామో మనం ఈ శ్లోకాన్ని అలా అనుసంధానం చేసుకోవాలి
శశ్వత్ప్రశాన్తమభయం ప్రతిబోధమాత్రం
శుద్ధం సమం సదసతః పరమాత్మతత్త్వమ్
శబ్దో న యత్ర పురుకారకవాన్క్రియార్థో
మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా

పరమాత్మ తత్వాన్ని నూటికి నూరుపాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా చేస్తే మనకు సందేహాలే కలగవు. సర్వదా, అన్నిసమయాలలో (శశ్వత్) ప్రశాంతంగా ఉండి (గుణాలన్నీ అణగారిపోయి), ప్రకృతికంటే అతీతుడైనవాడు అయిన పరమాత్మకు గుణాలు ఎలా ఉంటాయి? అందుకే ఆయన ప్రశాంతాత్మ. ఆయనకెప్పుడు భయం ఉండదు (భయం అంటే ప్రమాదం కలుగుతుందేమో అని ఉండే శంక), సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, ఆయన శుద్దుడు (నిర్వికారుడు), సమం (ద్వేషం అసూయ లాంటివి లేని వాడు,) ఆయన సత్ అసత్ రెండిటికీ సమం (ఉన్నవాళ్ళకి ఉన్నట్లుగా కనపడతాడు, దేవుడు లేడు అనే వారికి లేనట్లుగా కనపడతాడు)
పరమాత్మ విషయంలో వేదం కూడా చేసే పని ఏమీ ఉండదు ( పురుకారకవాన్). వేద వాక్కు కూడా అక్కడిదాకా వెళ్ళి వెనక్కు వస్తాయి. వేదము కూడా పరమాత్మ స్వరూపాన్ని చెప్పలేదు. అది కూడా పనికి రాదు (నక్రియార్థో). మాయ కూడా పరమాత్మ ఎదురుగా వస్తే సిగ్గుపడి మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది.

4. ఈ శరీరం ఉన్నంత వరకూ మనం "చాలా సౌందర్యంగా ఉంది" అని చెప్పుకుంటాం. చాలా కాలం బ్రతుకుతాము అని అనుకున్నా ఆ కాలం దాటిన తరువాత ఉండము అని అందులోనే ఉంది. కనుకూ క్షీర్యతే ఇతి శరీరం, క్షీణించే దాన్ని శరీరం అంటాం, వృద్ధి చెందే దాన్ని దేహం అంటాం. 38 ఏళ్ళ దాక ఇది దేహం, అది దాటగానే అది శరీరం అవుతుంది.

5. మగవారికన్నా ఆడవారికి తెలివి 32 పాళ్ళు, 8 పాళ్ళు కామం, 16 రెట్లు బుద్ధి, 32 రెట్లు ఆకలి, 64 రెట్లు కార్యదక్షత, లెక్కలేనన్ని రెట్లు అసూయా ఉంటుంది

6. నిత్య ప్రళయం: ప్రపంచంలోనూ మన శరీరములోనూ ప్రతీక్షణం కలిగే మార్పు. శిశువు గర్భంలో పడినప్పటినుంచీ ప్రతీక్షణం కలిగే అన్ని అవస్థలూ శరీరానికి వస్తూనే ఉంటాయి. ఈ మార్పులే నిత్య ప్రళయం.
నైమిత్తిక ప్రళయం: బ్రహ్మకు ఒక పగలు అయితే వచ్చేది
ప్రాకృతిక ప్రళయం: బ్రహ్మకు నూరేళ్ళు వస్తే వచ్చేది
ఆత్యంతిక ప్రళయం: ఇది మోక్షం

7. ఇష్టములనీ పూర్తములనీ రెండు రకాల కర్మలు: ఇష్టములని (యజ్ఞ యాగాదులు) పూర్తములనే (నదులూ బావులూ దేవాలయాలు తోటలు చెరువులూ ఏర్పాటు చేయడం) కర్మలు

8. విదురుడు యముని అంశ. పరమాత్మ మాయను తెలిసిన పన్నెండు మంది భాగవతోత్తములలో ఆయన ఒకడు. మొత్తం పదునాలుగు లోకాలలో ఆయన మాయను తెలిసిన వారిలో యముడు నాలగవ వాడు. మనకు భారతంలో 9 మంది కృష్ణులు అయిదుగురు యముళ్ళు, నలుగురు సూర్యులు, ముగ్గురు చంద్రులు, నలుగురు రుద్రులు, శ్రీమన్నారాయణ పరిపూర్ణ తత్వంగా ఒక ముగ్గురూ. ఇలా 27 మంది ఉంటారు. దిక్పాలకులు నారాయ్ణుడు, సూర్యుడు చంద్రుడు. ఉదాహరణకు సాత్యకి, సాంబుడు సైంధవుడు అశ్వద్ధామ రుద్రాంశలు, తొమ్మండుగురు కృష్ణులు, ఐదుగురు యముళ్ళు, ముగ్గురు సూర్యులు. వీరందరూ రాయబారంలో కలిసారు. ఇలాంటి మహాజ్ఞాని అయిన విదురుడు మైత్రేయుని చిన్న విషయాలగురించి అడిగి ఉండడు. చిన్న ప్రయోజనం ఆశించేవారు కాదు.
మైత్రేయుడు వ్యాసుని సహాధ్యాయి. అటువంటి ఉత్తముడైన మైత్రేయునితో అడిగిన ప్రశ్న, పరమాత్మ అయిన భగవంతుని చర్చకు సంబంధించినది అయి ఉంటుంది. పరమాత్మ ఎవరికోసం అవతరిస్తాడో (పరిత్రాణాయ సాధూనాం) వారికోసం మాట్లాడుకున్న మాటలే అవుతాయి గానీ మామూలు కబుర్లు కావు (మనలాగ ఆయుష్షును వృధా చేసే చర్చలు కావు)

9. హస్తిన నుంచి లక్క ఇంటికి వెళ్ళేలోపు మూడు సార్లు పాండవులపై హత్యా యత్నం జరిగింది. బిదికృత్ అనే రాక్షసుడు ఒకసారి, కల్పించబడిన దావాగ్నితో ఒక సారి, విషప్రయోగంతో ఒకసారి. ఈ మూడు ప్రయత్నాలను విదురుడు వారించాడు. తద్వారా కౌరవులకు నరకం రాకుండా చేసాడు. యుద్ధంలో మరణిస్తే పాపం పోతుంది. ఇలాంటి పని చేయడంవలన పాపం వస్తుంది. దారిలో ప్రయత్నం చేయొద్దని వారించాడు. పాండవులు ఒక స్థానం ఏర్పరుచుకునే వరకూ వారినేమీ చేయొద్దని చెప్పాడు. అలాగే ధర్మరాజు హస్తిన నుంచి వెళ్ళేప్పుడు ఒక చిన్న ఎలుకని ఇస్తాడు. ధర్మరాజదులు లక్క ఇంటిలోకి వెళ్ళినపుడు ఆ ఎలుక ఒక కన్నంలోకి వెళ్తుంది. ఇది చూసిన ధర్మరాజుకు మనం కూడా ఒక సొరంగం ఏర్పరచుకోవాలన్న ఉపాయం వస్తుంది

10. ఓర్పు అనేది తల్లి, ధర్మం అనేది తండ్రి. పాండవులకు కుంతి ఉంది. అంటే ఓర్పు ఉంది. వారికే ఓర్పులేకపోతే అంతవరకూ సహించి ఉండి ఉండేవారు కాదు. పాండవులు ధర్మం ఆచరించుట వలన తండ్రి ఉన్నవారే అయినారు.

11. స్త్రీ కన్నీరు వక్షస్థలం మీద పడరాదు. అవి సకల జీవకోటికీ ప్రాణం జ్ఞ్యానం ఇచ్చేవి. యుద్ధములో కూడా రాజు ఓడిపోతే మహారాణిని గౌరవంగా చూచి ఆ రాణి బయటకు వెళ్ళదలచుకుంటే వారిని సమర్యాదగా పంపిస్తారు.

12. దృతరాష్ట్రుడు మంత్రాంగం కోసం మంత్రులందరిలో వరీయుడైన (గొప్పవాడైన, పరమశ్రేష్టుడైన) విదురుడు చెప్పిన విషయాలని మిగిలిన మంత్రులందరూ విదురనీతి అన్నారు. ఒక మంత్రి రాజ్యసభలో మాట్లాడిన మాటలను ఇంతకాలం పాటు భద్రపరచి పెట్టుకున్నాము. మంత్రి అయిన వాడు కర్తవ్యం గూర్చి రాజు అడిగితే రాజకీయ స్వభావాన్నే చెప్పకూడదు. లోకస్వభావాన్ని, ధర్మస్వభావాన్నీ, రాజ్యకృత్యాన్ని చెప్పాలి. ఇలాంటి విషయాలలో లోకం ఏం చేస్తుంది, ధర్మం ఏం చెబుతుంది, రాజు ఏమి చేయాలి. ఒక్క రాముని దెబ్బ తగలగానే తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రావణుడు. తాను పలికినవన్నీ ప్రగల్భాలు అని తెలుసుకున్నాడు. విభీషణుడు, మాల్యవంతుడు, అకంపనుడు, విద్యున్మాలి చెప్పినపుడు, యమ వజ్రములతో సాటి వచ్చే నా బాణపు దెబ్బ రాముడు చూడలేదు కాబట్టి నా మీదకు వస్తున్నాడు అని.