Thursday 26 September 2013

జ్యోతిష పరంగా దీని సంకేతం ఏమిటంటే కుంభ రాశి సృష్టి యొక్క పుట్టుక స్థానం. ఏమీ లేనట్లు కనిపిస్తూ అన్నీ ఉన్న పరాతత్త్వం నిక్షిప్తముగా కుంభ రాశి నుండి వెలువడి సృష్టి ఆవిర్భావం జరిగిందని వేదము తెలిసిన పెద్దలు చెప్తారు. అది దివ్యత్వమునకు ప్రతీక. సృష్టి మొదట అంతటా జలములే ఉన్నవి వాని నుండి బ్రహ్మ ఉద్భవించి ఆయన నుండి సకల దేవతలూ సమస్త సృష్టి విచ్చుకున్నది / దిగివచ్చినది . అటువంటి శుభ పరిణామాలు జరగాలి అని కుంభంలో కలశ జలములను ఉంచి దేవతా ఆహ్వానము చేసి దానిని స్వాగతముగా చెప్తారు. కుంభ రాశికి ఎదురుగా ఉండేది సింహ రాశి, కాబట్టి స్వాగతం పొందుతున్న వారు సింహంవంటి వారు అని చెప్పకనే చెప్పినట్లు. ఇంకొక ఆంతర్యం - దేవతలే స్వాగతము చెప్పాలంటే వచ్చేవారు నడిచే బ్రహ్మమే అయి వుండాలి. అందుకే పైన వేరొక సోదరులు చెప్పినట్లుగా, ఇది సామాన్యులకు ఇవ్వరు, బ్రహ్మవిదులైన మహాత్ములకు తప్ప. ఇంకొక అర్థం ఏమిటంటే - మీ ద్వారా ఇంత శుభంకరమైన విషయము (బ్రహ్మ గారు చేసిన సృష్టి వంటిది) సకల శ్రేయోదాయకముగా భావములు, మాటలు, పనుల యందు ఇక్కడ ఆవిష్కరింపబడుగాక అని అట్టి స్వాగతమునకు భావము. అట్టి స్వాగతము పొందుతున్న వారు కూడా తదేక దృష్టితో బ్రహ్మమునే సర్వత్ర దర్శనము చేస్తూ ఉండటం చేత వారి ద్వారా కూడా ఆ బ్రహ్మమే వ్యక్తమై అక్కడి వారికి శ్రేయస్సు జరుగుతుంది. ఇది వేదసాంప్రదాయము !