Friday 21 March 2014

సకాలంలో అయినా అకాలంలో అయినాసంధ్యావందనం శ్రద్ధగా చేస్తే అతడు

శ్లో|| కాలేవాప్యథవాకాలే సంధ్యావందన తత్పరః| 
అవిద్యో వా సవిద్యో వా బ్రాహ్మణో మామకీ తనుః|| 

విద్యావంతుడైనా విద్యాహీనుడైనా బ్రాహ్మణుడు సకాలంలో అయినా అకాలంలో అయినాసంధ్యావందనం శ్రద్ధగా చేస్తే అతడు నా ( మహావిష్ణువు ) దేహమే!

తన కనీస కర్తవ్యమైన సంధ్యావందనాన్ని వదలక చేసే బ్రాహ్మణుడు భూమిమీద చరిస్తూ - సాక్షాత్తూ మహావిష్ణువు ఉనికిని వ్యక్తపరుస్తున్నాడనడం లో అతి శయోక్తి లేదు. సంధ్యావందనం తనకు అంతటి పవిత్రతను ఇస్తున్నదని నమ్మిన బ్రాహ్మణుడు దానిని ఎన్నటికీ వదలడు.