Monday 15 August 2011

లగ్నము అనగా ఏమిటి ?

లగ్నము అనగా ఏమిటి ?------------------------సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు.ప్రతి రోజూ సూర్యోదయ సమయములో ఆ రాశి నుండి ప్రయాణము సాగించి ఆ రోజు పూర్తయ్యేసరికి ౧౨ రాశులు చుట్టి వస్తాడు. (నిజానికి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము స్థిరముగా ఉన్నట్లు, సూర్యుడే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది). విధంగారోజుకు ఒక డిగ్రీ చొప్పున ముందుకు నడుస్తూ నెల రోజుల తరువాత రాశిని వదిలి తరువాత రాశిలోకి ప్రవేశిస్తాడు. విధంగా ప్రతి రోజు ౧౨ రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక సమయములో ఒక వ్యక్తి జననం అయితే సమయానికి సూర్యుడు రాశిలో సంచరిస్తూ ఉంటాడో రాశి లగ్నం అవుతుంది.
జాతక చక్ర నిర్మాణానికి కావలసినవి - దిగ్దేశకాలమనములు, అనగా --జాతకుని యొక్క () పుట్టిన తేది () పుట్టిన సమయము () పుట్టిన స్థలము

భారత ప్రామాణిక కాలమానము (IST) 82 1/2 (82.30) తూర్పు రేఖాంశము (East Longitude) గా నిర్ణయించబడినది. జాతకుడు పుట్టిన ప్రదేశములోని సమయమును "స్థానిక కాలమానము" (Local Mean Time, LMT) అందురు. LMT యొక్క అక్షాంశ, రేఖాంశములు (Latitude, Longitude) లను గుర్తించ వలెను. (అక్షాంశ, రేఖాంశముల పట్టిక Tables of Ascendants పుస్తకములోని ౧౦౦వ పేజి నుండి చూడవచ్చును). తరువాత IST మరియు LMT ల మధ్య గల వ్యత్యాసమును లెక్కించవలెను. IST మరియు LMT మధ్య గల వ్యత్యాసమును నాలుగుచే (౩౬౦ డిగ్రీలు గల భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ౨౪ గంటలు పడితే, ఒక డిగ్రీ తిరుగుటకు పట్టే సమయము నాలుగు నిమిషాలు) గుణించగా వచ్చిన లబ్ధమును జాతకుడు పుట్టిన సమయమునకు కలుపుట లేదా తీసివేయుట ద్వారా LMT ని సవరించవలెను.
ఉదా: ఒక జాతకుడు హైదరాబాదులో సా.గం.౫-౩౦ ని.లకు పుట్టాడని అనుకుంటే,82.30 IST East Longitude78.27 LMT of Hyd. East Longitude---------------04.03 IST(-)LMTx(-) 4---------------(-)16.12---------------5-30-00 జాతకుడు పుట్టిన సమయము, గం-ని-సె(-) 0-16-12---------------5-13-48 స్థానిక కాలమానమునకు సవరించిన తరువాత, జాతకుడు పుట్టిన వాస్తవ సమయము---------------
నక్షత్ర కాలమానము (Sidereal Time)-------------------------------------సూర్యుడు ఒక నక్షత్రము నుండి బయలుదేరి తిరిగి అదే నక్షత్రమును చేరుటకు పట్టే కాలమును నక్షత్రకాలమానము అందురు. ఇది గం.౨౩.౫౭ ని. ఉంటుంది. జాతకుడు పుట్టిన తేదికిTables of Ascendants పుస్తకములోనిSidereal Time (Table-1) ప్రకారము నక్షత్ర కాలమానము గుర్తించ వలెను.
జాతకుడు పుట్టిన సంవత్సరమును సవరణ చేసుకొనవలెను (Tables of Ascendants, Table-2)
తరువాత .గం. ౧౨ నుండి జాతకుడు పుట్టిన సమయానికి ఉన్న కాలము యొక్క వ్యత్యాసము (Time interval) ను కూడా సవరణ చేయవలెను. (Tables of Ascendants, Table-4)
భారతీయ నక్షత్ర కాలమాన సవరణ కూడా చేయవలెను (Tables of Ascendants, from Page 100). ఇది ని. లకు ఒక సెకను చొప్పున సరిచేయవలెను.
భారతీయ జ్యోతిషం నిరయన (అయనము లేనిది) పద్దతిని అనుసరించుచున్నది. కావున అయనాంశవ్యత్యాసమును కూడా సవరణ చేయవలెను. (Tables of Ascendants, Page 100)